Bookmark and Share

బ్లాగింగ్ ఎందుకు?

మీరు బ్లాగింగ్ ఎందుకు చెయ్యాలనేదానికి అసంఖ్యాకమైన కారణాలు చెప్పవచ్చు. అన్ని కారణాల జాబితా తయారు చెయ్యడం దరిదాపు దుస్సాధ్యమైన పనే. మచ్చుక్కి కొన్ని కారణాలు - సరదాకోసం, మీ జీవితాన్ని వర్ణ రంజితం చేసుకోవడానికి, మీ జీవితం మీద అదుపు తెచ్చుకోవడానికి, ఆదాయం గడించడానికి, బిగ్గరగా అరవడానికి, మీ భావ వ్యక్తీకరణ కొరకు, , మీకు మీరు ఉపశమనం కలుగ చేసుకోవడానికి, మీ గుండె చప్పుళ్ళు వినిపింపచెయ్యడానికి, యితరులను వ్యాఖ్యానింపచెయ్యడానికి, యితరులను పంచుకునేటట్లు చెయ్యడానికి, ఉత్తెజపరచడానికి, నిజం చెప్పడానికి, వార్తను ప్రసరింపచెయ్యడానికి, సంపర్కించడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి, ఆలోచనలను భావోద్వేగాలను, అభిప్రాయాలను, పంచుకోవడానికి, యితరులను నవ్వించడానికి, ఏడిపించడానికి, జాగృతపరచడానికి, ... ... ... ఆ కారణంగా, ఈ కారణంగా.

ఇవన్నీ మీకు తగ్గ కారణాలనిపించకపోతే ... ఎటువంటి కారణం లేకుండానే ఎటువంటి కారణం లేకుండానే బ్లాగింగ్ చెయ్యండి. మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి బ్లాగింగ్ చెయ్యండి, మీకు ఎవ్వరి అనుమతి అవసరం లేదు.

బ్లాగింగ్ ప్రపంచం మొత్తంతో సంభాషిస్తున్నంత విశాలమైనది మరియు మీతోనే మీరు ముచ్చటించుకుంటున్నంత అంతరంగికమైనది. మీలో వున్న ఆనేక కోణాలకు ప్రతిరూపం మీ బ్లాగ్. వెనుకబడిపోకండి, నేడే బ్లాగింగ్ మొదలు పెట్టండి. ఎలాగో తెలియదంటారా !! ....

నేర్చుకోవడం మొదలు పెట్టండి. చాలా తేలిక ... సరదాగా వుంటుంది. ... ఉచితం

మీ సొంత వీడియోల కూర్పును సృష్ఠించుకోండి

This is a Flickr badge showing public photos from Flickr tagged with blog. Make your own badge here.
ప్రతిమలను చేర్చడం నేర్చుకోండి వీడియోలను చేర్చడం నేర్చుకోండి
వ్రాయడంలో ప్రావీణ్యత లేదా!! ఏం ఫర్వాలేదు, ఇంటర్నేట్ ద్వారా అందుబాటులో వున్న కోటాను కోట్ల ప్రతిమలు, వీడియోలలో నుండి మీకు నచ్చిన వాటిని పోగు చేయడంతో మొదలు పెట్టండి. మీ కూర్పును బహిర్గతం చెయ్యవచ్చు, లేదా మీ అంతరంగికమైనదిగా వుంచుకోవచ్చు.

మీ వ్రాతలకు ఊతమివ్వడానికిగాను అక్షర పాఠంలో భాగంగా కూడా ప్రతిమలను, వీడియోలను చేర్చవచ్చు. కొన్ని పంక్తుల అక్షర పాఠం, సంబంధిత ప్రతిమలు, వీడియోలతో కలిపితే మంచి రచనే అవుతుంది.

బ్లాగ్ ద్వారా ఆదాయం » యిది అందరి $ కలే

వెబ్ (ఇంటర్నెట్) సృష్ఠించే ఒక అద్భుతమైన అవకాశం, ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని గడించే మార్గాన్ని సశక్త పరచడం అవును ఇంటర్నెట్‌కు అందుబాటు వున్న ప్రతి ఒక్కరు డాలర్లు సంపాదించే కల కనవచ్చు. అవును వెబ్ (ఇంటర్నెట్) ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని గడించే అవకాశాన్ని కలుగ చేస్తుంది. మీకు తెలియవలసిందల్లా ఒక మంచి బ్లాగ్‌ను సృష్ఠించడం (దీనికి మీకు అయ్యె ఖర్చు దరిదాపు శూన్యం), మరియు దానిలో ఆన్‌లైన్ ప్రకటనలు చేర్చడం ఎట్లా అనేది (యిది చాలా తేలిక).

బ్లాగ్ సృష్ఠించడంతో మొదలుపెట్టి మీ సొంత వెబ్ సైట్‌లు సృష్ఠించుకోవడానికి సన్నద్దులవడంద్వారా, నెట్ ద్వారా ఆదాయాన్ని గడించే అవకాశాలను వృద్ధి చేసుకోవచ్చు.

పిల్లలు, యుక్త వయస్కులు, మధ్య వయస్కులు, పెద్ద వారు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, అందరికీ సాధ్యమే

నేర్చుకోవలసిందే కాబట్టి నేర్చుకోండి

ఆధునిక విధ్యా విధానంలో, ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో, నేర్చుకునే ప్రక్రియ మొదలు, అంతం రెండూ తరగతి గదుల బయటే జరుగుతున్నాయి. కంప్యూటింగ్‌ను ప్రధాన స్రవంతిగా ఎంచుకున్న విధ్యార్ధి, తన పరిఙ్ఞాన హద్దులను తరగతి గదుల బయటకు విస్తరింపచేసి, చుట్టుపక్కల జరుగుతున్న సరికొత్త పరిణామాలకు అలవాటుపడే, విధంగా సన్నద్దుడయివుండాలి

అన్ని విద్యా క్షేత్రాలు (రంగాలు) ఏదో ఒక విధంగా, కంప్యూటర్లతో ముడిపడిపోయి వున్నాయి. అందువలన అది అందరు పరిఙ్ఞానం గడించవలసిన రంగమయిపోయింది. ప్రతి ఒక్కరు, కంప్యూటర్‌ను, వారు చేసే పనిని సాకారం చేసేందుకు వుపయోగపడే ఒక పరికరంగా వుపయోగించుకునే పరిఙ్ఞానం గడించడం అవసరం. అదనంగా కంప్యూటర్ రంగాన్నే వృత్తిగా ఎంచుకున్నవారు మాత్రం కంప్యూటర్‌లు చేసే పనులకు సంబంధంగా ఎందుకు, ఎలా తెలుసుకోవలసి వుంటుంది.

ఈ అవసరం కోసం, దరిదాపు అన్ని సరికొత్త పరిఙ్ఞానాల మేళవింపైన బ్లాగ్ కాక విధ్యార్ధి, యింకేమి సాధనం కలిగి వుండాలి. బ్లాగ్ వుపయోగించడంలో నుండి నేర్చుకోగలిగింది చాలా వుంది. అందులోని పరిఙ్ఞానం, సంపర్క నైపుణ్యం, వ్యక్తపరచే సమర్ధత మొదలగునవి.

వెబ్‌కు సంబంధిత సాంకేతిక పరిఙ్ఞానంలో ఎంత పట్టు వుంటే, అంత బాగా వెబ్‌ను మీ పనులను సాకారం చేసుకోవడానికి ఒక పరికరంగా/సాధనంగా వుపయోగించుకోగలుగుతారు, తద్వారా మీ అందమైన భవిష్యత్తుకు అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు. మీరు ఒక బ్లాగ్‌తో మొదలు పెట్టి, ఒక పరిపూర్ణ వెబ్ సైట్ సృష్ఠించడం వరకు చేరవచ్చు. ఎవరికి తెలుసు, హాట్‌మయిల్, గూగుల్, యాహూ, యూట్యూబ్ .... వంటి తదుపరి వెబ్ సైట్ సృష్ఠికర్తలవుతారేమో!!

కఠినమైనవి చేధించడానికి పరికరాలు

అర్ధం కాకుండా నేర్చుకోవడంలో అపరిమితమైన ఒత్తిడి వుటుందని మేము భావిస్తాము. ఈ సైట్‌లో వున్న పాఠ్యాంశాలను వీలయినంత సంగ్రహంగా సమర్పించడం ద్వారా, నేర్చుకోవడం మొదలుపెట్టడానికి మీకు అవసరమైన ప్రేరణ కలుగ చేసే ప్రయత్నం చేసాము.

మీ నేర్చుకునే ప్రక్రియలో మేము ఎల్లప్పుడూ సహాయకారిగా వుండే ప్రయత్నం చేస్తూనే వుంటాము. ఈ వెబ్ సైట్‌లోని చర్చా వేదిక మీద యితరులతో చర్చించడం ద్వారా కూడా మీ పరిఙ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు.

ఎట్టెట్టా!!, నిజంగా!! - యివి ఉచ్చరించాల్సిన స్థితిలో వుండకండి.

నేర్చుకోవడానికి సమయం వెచ్చించండి/తీసుకోండి. ఎప్పుడూ కూడా మీకు సంబంధించిన విషయంలో, నాకు తెలియదు, నాకు అర్ధం కాలేదు అనే స్థితిలో వుండడాన్ని ఆమోదించకండి. నేర్చుకోవడానికి అనేకమైన మార్గాలున్నాయి, ఖర్చుతో కూడుకున్నవి కూడా కాదు. దరిదాపు ఉచితమే. మీరు చేయవలసిందల్లా, నేర్చుకోవడానికి కొంచెం శ్రమ పడటమే!

మీ జీవితంలో మీరు గడించగలిగిన అత్యంత విలువైన ఆస్థులలో పరిఙ్ఞానం ఒకటి. పరిఙ్ఞానం గడించడానికి ఎటువంటి ప్రయాస పడక్కర్లేదు అనే భావాన్ని ఆమోదించకండి.

గణితంలో సాధారణ పరిఙ్ఞానం వుందని నమ్మే వారందరు తెలుసుకోవలసిన నిజమేమంటే! కంప్యూటర్ పరిఙ్ఞానం గడించడం గణితంతో పోలిస్తే 10% కష్ఠం కూడా కాదు. వున్న సమస్యల్లా మీరు పరిఙ్ఞానాన్ని సరైన విధానంలో గడించడం. సక్రమంగా గడించిన పరిఙ్ఞానాన్ని మన అవసరాలకు అనువర్తించగలుగుతాము

♣ Copyright Krishbhavara. All rights reserved
♣ Site optimized for Internet Explorer 5.5 and above