ముందు పుట ... ౧౨ (12) |
సైట్ ఫీడ్ అంటే ఏమిటి? | |
వెబ్ సైట్‌లు వారి సైట్లలో చేర్చబడిన తాజా సమాచారం గురించి, వారి సైట్లను వినియోగించుకునే వారికి తెలియచేయడానికి సైట్ ఫీడ్ అనే సాధనం వుపయోగిస్తాయి. ఒక వెబ్ సైట్ యొక్క ఫీడ్ అంటే ఆ సైట్‌లో క్రొత్తగా చేర్చబడ్డవి ఏమిటి అని తెలియచేసే శీర్షికలు, వర్ణనలు కలిగిన ఒక చిన్న దత్తమూలముగా భావించవచ్చు.
అది సాధారణంగా సరికొత్తగా చేర్చబడ్డ సమాచారమునకు సంక్షిప్త వర్ణన, ఫీడ్ ఆ సమాచారము కలిగిన వెబ్ పుటకు లంకె కూడా కలిగి వుంటుంది. కొన్ని సార్లు, ఎక్కువగా వ్యక్తిగత వెబ్ లాగ్‌ల విషయంలో, ఫీడ్, బ్లాగ్ పోస్ట్ యొక్క మొత్తం సమాచారం/పాఠం కలిగి వుండవచ్చు. ఫీడ్స్ అనే ఆలోచన వెబ్ వినియోగదారులు సరికొత్త సమాచారము కొరకు వెబ్ పుటలను తరుచుగా సందర్శించాల్సిన అవసరం లేకుండా చెయ్యడానికి వుపయోగపడుతుంది. వెబ్ వినియోగదారులు కేవలం ఫీడ్‌లను పరికించడం ద్వారా వెబ్ సైట్‌లలో ఏమన్నా తాజా సమాచారము చేర్చబడి వుందేమో తెలుసుకొని, ఆ తాజా సమాచారం వాళ్ళకు ఆశక్తికరంగా అనిపిస్తేనే వెబ్ పుటలను సందర్శిస్తారు. వెబ్ సైట్‌ల నిర్వాహకులు, ఆ సైట్ వినియోగదారులు తమతో సంబంధం కొనసాగించేటట్లు చెయ్యడానికి యిది సరళమైన మార్గం కాబట్టి, వారి సైట్ ఫీడ్‌ను సమకూరుస్తారు. వెబ్ సైట్ వినియోగదారులేమో సరికొత్త సమాచారం కొరకు సైట్లను సందర్శించే ప్రతిబంధకం తొలగిపోతుంది కాబట్టి ఫీడ్‌కు ప్రాధాన్యమిస్తారు. • సిండికేషన్ (Syndication)
ఫీడ్‌లను ఉత్పన్నం చెయ్యడం అనే ప్రక్రియను సిండికేషన్ అంటారు. ఒక వెబ్ సైట్‌కు సంబంధించిన ఫీడ్ పుటను మామూలుగా యితర వెబ్ పుటలలాగానే సృష్ఠించవచ్చు. వెబ్ పుటల వలే ఫీడ్ పుటకు కూడా రూపలావణ్యం చేకూర్చవచ్చు.
ఒక వెబ్ వినియోగదారుడు అనేక వెబ్ సైట్లకు సంబంధించిన ఫీడ్‌లను వుపయోగించి వాటిలో వున్న సరికొత్త సమాచారము గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు, ఆ పుటలకున్న రకరకాల రూపాలు ఆ వినియోగదారునికి మళ్ళీ సంపూర్తిగా వెబ్ పుటలను చూస్తున్నటువంటి భావన కలుగచేస్తాయి. ఈ యిబ్బందిని అధిగమించడానికి, వెబ్ సైట్ యొక్క ఫీడ్‌గా ఏర్పరచే పాఠానికి ప్రమాణాలు ఆవిర్భవించాయి. ప్రమాణీకరించబడ్డ ఫీడ్‌లు, అన్ని వెబ్ సైట్‌ల యొక్క ఫీడ్‌లు, ఒకే రకంగా కనపడేటట్లు చేస్తాయి. దీని వలన వినియోగదారుడు రూపలావణ్యానికి సంబంధించిన విషయాలను పక్కన పెట్టి ఫీడ్‌లో వున్న పాఠం మీద దృష్టి పెట్టగలుగుతాడు. ప్రమాణీకరించబడ్డ ఫీడ్‌ల వలన, ఫీడ్‌లను సెల్ ఫోన్‌లు, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్లు, email tickets, voice update లాంటి సాధనాలు కూడా సంభాళించగలుగుతున్నాయి. అనుబంధ అల్లికలు (నెట్‌వర్క్‌లు) మరియు ఒకే ఆలోచనా విధానం కలిగిన భాగస్వామ్య వెబ్ సైట్‌లు పరస్పరం ఫీడ్‌లను అందిపుచ్చుకుని, అల్లికలో వున్న యితర సైట్ల నుండి వున్న తాజా సమాచారాన్ని స్వయంచాలకంగా వారి వారి వెబ్ సైట్ల మీద ప్రదర్శించి, తద్వారా ఒకరి కొకరు వినియోగదారులను మళ్ళించడం అనే సహాయము చేసుకుంటారు. • RSS మరియు Atom
ఫీడ్‌లకు సంబంధంగా రెండు ప్రమాణాలు వినియోగంలో వున్నాయి. RSS [Really Simple Syndication] మరియు Atom. బ్లాగర్, బ్లాగ్ ఫీడ్‌లను స్వయంచాలకంగా ఉత్పన్నం చేయడానికి Atom ప్రమాణాన్ని వినియోగిస్తుంది.
RSS, Atom రెండూ కూడా ఫీడ్ పాఠాన్ని క్రమంలో ఏర్పరచడానికి XML వినియోగిస్తాయి. |
ఫీడ్ రీడర్లు | |
ఫీడ్‌లు XMLలో ఏర్పరచబడి వుంటాయి కాబట్టి, ఫీడ్‌లను చూడదలుచుకున్న వెబ్ వినియోగదారుడు XML శశక్తిపరచబడ్డ ఫీడ్ రీడర్లు వుపయోగించాలి. పాత బ్రౌసర్‌లు XML పాఠాన్ని సంభాళించగల/వివరించగల సత్తా కలిగి వుండవు. మీ వద్ద సరికొత్త బ్రౌసర్ వున్నట్లయితే, మీరు ఫీడ్‌లు బ్రౌసర్‌లోనే చూడగలుగుతారు. లేని పక్షంలో మీరు ఫీడ్‌లను సంభాళించగల/వివరించగల సత్తా వున్న ప్రోగ్రామ్‌లను వుపయోగించవలసి వుంటుంది. (ఉచిత సాఫ్ట్వేర్లు చాలా వున్నాయి).
• గూగుల్ ఆన్‌లైన్ ఫీడ్ రీడర్
ఫీడ్‌లను చదవాడానికి చాలా వెబ్ సైట్‌లు ఇంటర్నెట్‌ద్వారా అందుబాటులో వుంచిన ఫీడ్ నిర్వహణ సౌకర్యాలు కూడా వుపయోగించుకోవచ్చు. గూగుల్ రీడర్ ఇటువంటి ఒక సౌకర్యం.
|
మీ బ్లాగ్‌కు ఫీడ్ సృష్టించబడటాన్ని సశక్త/నిరర్ద పరుచుట | |
ఫీడ్‌లను ప్రామాణీకరించడం, వెబ్ సైట్‌లో సరికొత్తగా చేర్చిన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఫీడ్ పాఠాన్ని స్వయంచాలకంగా ఉత్పన్నం చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల సృష్టిని, సశక్త పరచాయి.
బ్లాగర్ వుపయోగించే యిటువంటి ప్రోగ్రామ్ మీ బ్లాగ్‌కు మీరు ఫీడ్‌ను సృష్టించడానికి వుపకరిస్తుంది. మీరు మీ బ్లాగ్‌లో ఒక పోస్ట్‌ను ప్రచురించినప్పుడల్లా, బ్లాగర్ ప్రోగ్రామ్ స్వయంచాలకంగా మీ ఫీడ్ పుటలో సమాచారాన్ని చేరుస్తుంది. మీ బ్లాగ్‌కు ఫీడ్‌ను సశక్త/నిరర్ధ పరచడానికి సంబంధించిన ఐచ్ఛికలు Settings విభాగములోని, Site feed ఉప విభాగపు పుటలో వుంటాయి.
మీ బ్లాగ్‌ను ప్రచురించినప్పుడు, బ్లాగర్ స్వయంచాలకంగా మీ బ్లాగ్‌కు కంప్యూటర్లు, ఇతర సాధనాలు యాంత్రికంగా చదవదగ్గ రూపం ఉత్పన్నం చేస్తుంది. ఈ రూపంలో వున్న మీ బ్లాగ్‌ను (ఫీడ్‌ను) యితర వెబ్ సైట్ల మీద సమాచారాన్ని సంధానపరచే సాధనాల మీద ప్రదర్శించవచ్చు. |
బ్లాగర్ బ్లాగ్ ఫీడ్‌లకు లంకెలు ఎక్కడ వుంటాయి | |
మీ బ్లాగ్‌ను వారి ఫీడ్ రీడర్‌లో చేర్చదలుచుకున్నవారు ఎవ్వరయినా, ఈ లంకెలను వారి ఫీడ్ రీడర్ ప్రోగ్రామ్‌లో చేర్చవలసి వుంటుంది.
• RSS ఫీడ్‌లు
బ్లాగర్ ఉత్పన్నం చేసే అన్ని ఫీడ్‌లు సాధారణంగా atom ప్రమాణాలతో ప్రచురించబడతాయి. మీకు ఫీడ్ RSS ప్రమాణాలతో కావాలంటే, ఫీడ్ URL చివరలో ?alt = rss చేర్చడం ద్వారా పొందవచ్చు.
• వ్యాఖ్యల ఫీడ్‌లు
మీ బ్లాగ్ పాఠకులు, కేవలం మీ బ్లాగ్‌లో పోస్ట్‌ల మీద చేయబడ్డ వ్యాఖ్యలను మాత్రమే అనుసరించదలుచుకోవచ్చు. అటువంటి వారు, ప్రత్యేకంగా మీ బ్లాగ్ పోస్ట్‌ల మీద చేయబడ్డ వ్యాఖ్యలు మాత్రమే కలిగిన ఫీడ్‌లను వుపయోగించవచ్చు.
ఈ URL మీ బ్లాగ్ పాఠకులకు నేరుగా అందుబాటులో వుండదు. ఈ URLను పాఠకుల కోసం, ప్రక్క పట్టిలో (sidebar) లంకె ద్వారా అందుబాటులో వుంచవచ్చు. • ప్రతి పోస్ట్‌కు చేయబడ్డ వ్యాఖ్యల ఫీడ్
మీ బ్లాగ్ పాఠకులు ఒక నిర్ధిష్టమైన పోస్ట్‌కు సంబంధంగా చేయబడ్డ వ్యాఖ్యలను మాత్రమే అనుసరించదలుచుకోవచ్చు. అటువంటి వారు, కేవలం ఒక పోస్ట్‌కు సంబంధంగా వున్న వ్యాఖ్యల ఫీడ్‌ను వుపయోగించవచ్చు.
ఈ ఫీడ్ URLలో పోస్ట్ గుర్తింపు భాగమయి వుంటుంది.
• నిర్ధేశించబడ్డ గుర్తులు కలిగిన పోస్ట్లకై వ్యాఖ్యల ఫీడ్
మీ బ్లాగ్ పాఠకులు కొన్ని నిర్ధిష్టమైన గుర్తులు కలిగిన పోస్ట్‌లను మాత్రమే అనుసరించదలుచుకోవచ్చు. అటువంటి వారు, ప్రత్యేకంగా ఆ గుర్తులు కలిగిన పోస్ట్‌లకు ఫీడ్‌ను వుపయోగించవచ్చు.
ఈ ఫీడ్ URLలో గుర్తులు భాగంగా వుంటాయి. ఒకే URLతో ఒకటి కంటే ఎక్కువ గుర్తులను చేర్చవచ్చు. ఇది పోస్ట్‌లకు సంబంధించిన సౌకర్యము, వ్యాఖ్యలకు కాదు. URLలో చేర్చే గుర్తులు, ఏ భాషలో ఏర్పరచబడ్డ గుర్తులైనా అవ్వొచ్చు. |
ఎంత పాఠాన్ని ఫీడ్‌గా సంధానపరచాలి | |
బ్లాగర్ ప్రోగ్రామ్ మీ పోస్ట్ పాఠంలో, వ్యాఖ్యల పాఠంలో ఎంత పరిమాణాన్ని ఫీడ్‌గా సంధానపరచాలి అనే విషయాన్ని మీరు ఎంచుకోవచ్చు. పోస్ట్‌లకు, వ్యాఖ్యలకు కొద్దిపాటి వర్ణన మాత్రమే ఫీడ్‌లో చేర్చడాన్ని మీరు ఎంచుకుంటే, బ్లాగర్ ప్రోగ్రామ్ ఆ పాఠం మొదలు నుండి కొద్దిపాటి పంక్తులను (గరిష్టంగా 255 చిహ్నాల వరకు) ఫీడ్‌లో చేరుస్తుంది.
ఉన్నతస్థాయి విధానంలో, మొదటి ఐచ్ఛికము బ్లాగ్ పోస్ట్‌లకు సంబంధించినది. తదుపరి వున్న ఐచ్ఛికలు వ్యాఖ్య ఫీడ్‌లకు సంబంధించినవి. రెండవ ఐచ్ఛికము అన్ని పోస్ట్‌లకు సంబంధంగా చేయబడ్డ వ్యాఖ్యల ఫీడ్‌కు సంబంధించింది. మూడవ ఐచ్ఛికము, ఒక్కొక్క పోస్ట్‌కు సంబంధంగా చేయబడ్డ వ్యాఖ్యల ఫీడ్‌కు సంబంధించింది. అన్ని ఐచ్ఛికలలోనూ మూడే ఎంపికలుంటాయి. పూర్తి పాఠం (Full), కొద్దిపాటి భాగం (short), అసలు లేదు (None). |
బ్లాగ్ పుటలో ప్రదర్శించబడే పోస్ట్‌ల సంఖ్య | |
ప్రతి బ్లాగ్ ఒక వెబ్ పుట. మీ బ్లాగ్‌లో పోస్ట్‌లను చేరుస్తున్న కొలది, మీ బ్లాగ్ పుటలో పోస్ట్‌లు పేరుకుంటూ వుంటాయి. మీ బ్లాగ్ పుటలో వున్న పోస్ట్‌ల సంఖ్య పెరుగుతూ వున్న కొలది మీ బ్లాగ్ పుట బ్రౌసర్ గవాక్షములో ప్రదర్శించబడటానికి పట్టే సమయం పెరుగుతూ వుంటుంది.
మీ బ్లాగ్ పుటలో ఒకసారి ప్రదర్శించవలసిన పోస్ట్‌ల గరిష్ట సంఖ్యను అమర్చవచ్చు. ఈ గరిష్ట సంఖ్యను ప్రదర్శించవలసిన పోస్ట్‌ల సంఖ్య రూపంలో నిర్ధేశించవచ్చు లేదా ఎన్ని రోజులకు సంబంధించిన పోస్ట్‌లను ప్రదర్శించవచ్చో నిర్ధేశించవచ్చు. ఎటువంటి పరిస్థితులలో కూడా ఒక పుటలో 999 పోస్ట్‌లకు మించి ప్రదర్శించబడవు. |
పోస్ట్ పుటలు :: ప్రతి పోస్ట్‌కు ఒక పుట | |
ఒక బ్లాగ్‌లోని ప్రతి పోస్ట్ ఒక నిర్ధిష్టమైన గుర్తింపు (ID) కలిగి వుంటుంది. పోస్ట్ పాఠాన్ని బ్లాగర్ ఒక దత్తమూలంలో నిక్షిప్తపరుస్తుంది. ఆ దత్తమూలం నుండి ఆ పోస్ట్ పాఠాన్ని ఆ బ్లాగ్‌కు సంబంధించిన పోస్ట్ పుటల అమరికలను మరియు ప్రాచీనీకరించడానికి సంబంధించిన అమరికలను బట్టి, అనేక బ్లాగ్ పుటలలో రాస్తుంది.
• పోస్ట్ పుటలను సశక్త/నిరర్ధ పరచడం
పోస్ట్ పుటలను సశక్త/నిరర్ధ పరచడానికి సంబంధించిన అమరికలు, settings విభాగములోని archiving ఉపవిభాగపు పుటలో వుంటాయి. పోస్ట్‌లను ప్రాచీనీకరించడాన్ని నిరర్ధ పరచి, పోస్ట్ పుటలను నిరర్ధ పరచినట్లయితే అన్ని పోస్ట్‌లు, బ్లాగ్ మూల పుట index.html ఫైలులోకి వ్రాయబడతాయి. నిర్ధిష్ట పోస్ట్‌లను కూడా ఆ ఫైలు నుండే పొందవలసి వుంటుంది.
పోస్ట్‌లను ప్రాచీనీకరించడాన్ని సశక్త పరచి, పోస్ట్ పుటలను నిరర్ధ పరచినట్లయితే నిర్ధిష్ట పోస్ట్‌లను ప్రాచీన భాంఢాగారము నుండి పొందవలసి వుంటుంది. పోస్ట్‌లను ప్రాచీనీకరించడాన్ని మరియు పోస్ట్ పుటలను, రెండింటిని, సశక్త పరచినట్లయితే నిర్ధిష్ట పోస్ట్‌లను పోస్ట్ పుటలను దాచే ఫోల్డర్ల నుండి పొందుతాము.
పోస్ట్ పుటలను సశక్త పరచినట్లయితే బ్లాగర్ ప్రోగ్రామ్ ప్రతి పోస్ట్‌కు నిర్ధిష్టమైన ఫైల్‌ను సృష్టిస్తుంది. పోస్ట్ శీర్షిక, ముఖ్యభాగంలోని కొంత అక్షర పాఠాన్ని ఫైలు పేరులో భాగంగా వుపయోగిస్తుంది. ఫైళ్ళను భధ్రపరచడానికి ప్రతి సంవత్సరానికి ఒక ఫోల్డర్‌ను సృష్టిస్తుంది. దాని లోపల ప్రతి నెలకు ఒక ఫోల్డర్‌ను సృష్టిస్తుంది. ఒక నెలలో ప్రచురించబడ్డ పోస్ట్‌ల పుటలన్నింటిని సంబంధిత ఫోల్డర్‌లో పెడుతుంది. పోస్ట్ పుటల ఫైళ్ళకు ప్రాచీన భాంఢాగారములో సృష్టించబడే ఫైళ్ళకు సంబంధం లేదు. పోస్ట్‌లను ఎంత తరచుగా ప్రాచీనీకరించాలి అనే అమరిక ఎలా ఎంచుకున్నప్పటికి, ఈ పోస్ట్ పుటల ఫైళ్ళు ఒకే రకంగా సృష్టించబడతాయి. |
ప్రాచీనీకరించడం » ప్రాచీన భాంఢాగారము | |
ప్రాచీన భాంఢాగారము, ప్రాచీనీకరించబడ్డ చారిత్రక పత్రాలు, దస్తావేజులు దాచిపెట్టబడే ప్రదేశం.
బ్లాగ్‌లను చదివే వారు ఎక్కువగా సరికొత్త సమాచారం కొరకు వెదుకుతూ వుంటారు. కాబట్టి పాత పోస్ట్‌లను ప్రక్కన పెట్టడం సమంజసంగా వుంటుంది. మీ పాత పోస్ట్‌లను తొలగించకుండా/తుడిసివెయ్యకుండా ప్రక్కన పెట్టడం అనే ప్రక్రియను ప్రాచీనీకరించడం అంటారు. ప్రాచీనీకరించడానికి సంబంధించిన ఐచ్చికలను ఎంచుకునేటప్పుడు, మీరు పోస్ట్‌లు ఎంత తరచుగా ప్రాచీనీకరించబడాలి అనేది ఎంచుకోవాల్సి వుంటుంది. ఇది ఎంత కాలం తర్వాత ఒక పోస్ట్ ప్రాచీనీకరించబడుతుంది అనే విషయాన్ని నిర్దేశిస్తుంది. పోస్ట్‌లు ఎంత తరచుగా ప్రాచీనీకరించబడాలి అనేది ఎంచుకున్నదాన్ని బట్టి, బ్లాగర్ ప్రాచీన భాంఢాగార జాబితాగా పిలువబడే కాలక్రమానుసారంగా ఏర్పరచబడ్డ జాబితాను, రోజువారీగా, వారాలవారీగా, నెలలవారీగా తయారు చేస్తుంది.
• ప్రాచీనీకరించబడ్డ పోస్ట్‌ల జాబితా
ప్రాచీనీకరించబడ్డ పోస్ట్‌ల జాబితా, ఒక తూటాల జాబితానే. ఆ జాబితాలోని ప్రతి జాబితా అంశము ఒక నిర్ధిష్ట కాలమునందు ప్రచురించబడ్డ పోస్ట్‌లను సూచిస్తుంది. ఆ కాలము ఎంత తరచుగా ప్రాచీనీకరించబడాలని మీరెంచుకున్నారనే దాని మీద ఆధారపడి వుంటుంది.
జాబితా అంశాలలో వున్న లంకెలకు సంబంధించిన ప్రదర్శిత అక్షర పాఠం, ఆ కాలాన్ని సూచిస్తుంది. |
ప్రాచీన భాంఢాగార అమరికలు | |
• తేదీ రూపం, భాష.
ప్రాచీన భాంఢాగార జాబితాలో ప్రదర్శించబడే తేదీలకు రూపాన్నిsettings విభాగములోని formating ఉపవిభాగపు పుట నుండి కాని, ప్రాచీన భాంఢాగార అమరిక పుట నుండి కాని, అక్కడ అందుబాటులో వున్న అనేక రూపాలలో ఏదో ఒకటి ఎంచుకోవడం ద్వారా నిర్దేశించవచ్చు.
తేదీలు ప్రదర్శించబడే భాష, settings విభాగములోని formating ఉపవిభాగపు పుటలో, తేదీలు ప్రదర్శించబడటానికి సంబంధించిన అమరికను ఎలా ఎంచుకున్నారనేదాని మీద ఆధారపడి వుంటుంది.
ఆధునిక మాదిరిని వినియోగిస్తున్నట్లయితే, పోస్ట్ శీర్షికను ప్రాచీన భాంఢాగార జాబితాలో, జాబితా అంశంగా ప్రదర్శించబడేటట్లు చెయ్యవచ్చు.
• ప్రాచీనీకరించడాన్ని నిరర్ధ పరచడం
మీరు ప్రచురించిన లేక చిత్తు ప్రతిగా దాచిన పోస్ట్లన్నీ ఒక దత్తమూలంలో నిర్ధిష్టమైన గుర్తింపులతో దాచిపెట్టబడతాయి. మీరు ఎంచుకున్న ఐచ్చికలు ఏమయినప్పటికి, దత్తమూలంలో వున్న పోస్ట్ పాఠం తొలగించబడదు (మీరు పోస్ట్‌ను నిర్ధిష్టంగా తొలగిస్తే తప్పితే.
ప్రాచీన భాంఢాగారానికి సంబంధించిన అమరికలు ఎంచుకోవడంలో మీరు చేస్తున్న సవరణలు, ప్రాచీన భాంఢాగార జాబితా మీద మాత్రమే ప్రభావం చూపుతాయి. దత్తమూలంలో వున్న పోస్ట్ పాఠం మీద, మీరు చేసిన మార్పులు చేర్పుల ప్రభావం వుండదు. ప్రాచీనీకరించడాన్ని నిరర్ధ పరచడం ద్వారా మీ బ్లాగ్‌ను చదివేవారు వారికి ఆసక్తికరంగా వున్న పోస్ట్‌లను ఎంచుకోవడానికి మీ బ్లాగ్‌లో ప్రచురించబడ్డ అన్ని పోస్ట్‌ల మధ్య సంచరించాల్సిన అవసరాన్ని కలుగచేస్తున్నట్లే. ప్రాచీనీకరించడం వలన మీ బ్లాగ్‌ను చదివే వారికి పాత పోస్ట్‌ల జాబితాను అందుబాటులో వుంచి, అది వుపయోగించి, వారికి ఆసక్తి కలిగించే యితర పోస్ట్‌లకు తేలికగా వెళ్ళే ఏర్పాటు చేసినట్లవుతుంది. |
పింగ్ » మీ పోస్ట్‌లను ప్రకటించడం | |
పాఠకులకు సరికొత్త సమాచారాన్ని అందించడం కోసం, బ్లాగ్‌లలో సరికొత్త సమాచారాన్ని ఎల్లప్పుడు చేరుస్తూనే వుంటారు.
పాఠకులు ఇటీవల సరికొత్త సమాచారం చేర్చబడ్డ బ్లాగ్‌లకు ఎక్కువ విలువ యిస్తారు.
కొన్ని వెబ్ సైట్‌లు ఇటీవల సరికొత్త సమాచారం చేర్చబడ్డ బ్లాగ్‌లకు సంబంధించిన సమాచారం అందించే పనిని చేస్తాయి. ఇది పింగింగ్ అనే ప్రక్రియ ద్వారా చేయబడుతుంది. ఒక బ్లాగ్‌కు సంబంధించినంతవరకు పింగింగ్ అంటే బ్లాగ్‌లో తాజా సమాచారం చేర్చబడ్డ విషయాన్ని అటువంటి సమాచారం పోగు చేసే వేరే వెబ్ సైట్‌కు తెలియ చేయడం. • Weblog.com
మీరు మీ బ్లాగ్‌లో ఏదయినా పోస్ట్ ప్రచురించినప్పుడల్లా, బ్లాగర్, వెబ్‌లాగ్.కామ్ వెబ్ సైట్‌కు, ఈ బ్లాగ్‌లో సరికొత్త సమాచారం చేర్చబడింది అని తెలియచేసే సందేశం పంపిస్తుంది.
ఇది మీ సరికొత్త సమాచారం చేర్చబడింది అనే విషయాన్ని, సరికొత్త సమాచారం చేర్చబడ్డ బ్లాగ్‌లను వెతుక్కునే కోట్లాది వెబ్ వినియోగదారులకు అందుబాటులోకి దానికి వుపయోగపడుతుంది.
ఈ ప్రక్రియను మీరు కోట్లాది మందికి మీ బ్లాగ్‌ను ప్రచారం చెయ్యడంలాగా భావించొద్దు. ఈ ప్రక్రియ ద్వారా మీరు పోస్ట్ చేసిన అంశానికి సంబంధించిన సమాచారం కోసం వెతుక్కునే వారు మీ బ్లాగ్‌ను కనుగొనడానికి అవకాశం వుంటుంది తప్పితే, ఖచ్చితంగా కనుగొనగలుగుతారని చెప్పలేము.
మీది వ్యక్తిగత/ఆంతరంగిక బ్లాగ్ అయినట్లయితే మీరు మీ బ్లాగ్ పింగ్ చేయబడాలని కోరుకోకపోవచ్చు. అటువంటి పరిస్ధితులలో మీ బ్లాగ్ పింగ్ చేయబడకూడదు అని ఎంచుకోవచ్చు. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౧౪(14) |