ముందు పుట ... ౨౧ (21) |
కంప్యూటర్‌లో ఫైళ్ళ స్థానం/స్థావరం | |
• డిస్క్‌లు : భద్రపరచే స్థావరాలుకంప్యూటర్లో ఫైళ్ళను భద్రపరచడానికి వుపయోగించే విభాగాన్ని డిస్క్ అంటాము. హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, కాంపాక్ట్ డిస్క్, డిజిటల్ వర్సటైల్ డిస్క్ (DVD) కొన్నింటికి డిస్క్ అనే మాట వుపయోగించబడదు. మెమొరీ స్టిక్, మ్యాగ్నటిక్ టేప్ మొదలగునవి.
భద్రపరచడానికి వుపయోగించబడే ప్రదేశాలన్నీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. • స్థిర భద్రపరచే స్థావరాలు
హార్డ్ డిస్క్, పెద్ద పెద్ద సర్వర్‌లలో భద్రపరచడానికి వుపయోగించే అరలు వీటికి ఉదాహరణలు.
• తొలగించగలిగిన భద్రపరచే స్థావరాలుఫ్లాపీ డిస్క్‌లు, కంపాక్ట్ డిస్క్‌లు, డిజిటల్ వర్సటైల్ డిస్క్‌లు (DVD) మెమొరీ స్టిక్, మ్యాగ్నటిక్ టేపు మొదలగునవి వీటికి ఉదాహరణలు.
• హార్డ్‌వేర్ : సాఫ్ట్వేర్• డ్రైవ్ [హార్డ్‌వేర్]
భద్రపరచడానికి వుపయోగించే డిస్క్‌లను మనం వుపయోగించుకోవడాన్ని సశక్త పరచే యంత్ర పరికరాలను డ్రైవ్‌లు అంటాము. హార్డ్ డిస్క్ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్ డ్రైవ్, CD డ్రైవ్, DVD డ్రైవ్, పెన్ డ్రైవ్, మ్యాగ్నటిక్ టేపు డ్రైవ్ మొదలగునవి.
• డ్రైవర్ [సాఫ్ట్వేర్]డ్రైవ్‌లను వుపయోగించి, వాటితో వుపయోగించే డిస్క్‌లలో ఫైళ్ళను భద్రపరచడం వెనక్కు తెచ్చుకోవడం వంటి ప్రక్రియలను చెయ్యడాన్ని సశక్త పరచే సాఫ్ట్‌వేర్‌ను డ్రైవర్ అంటాము.
మనం కంప్యూటర్‌కు ఏదన్నా కొత్త సాధనాన్ని జోడించేటప్పుడు డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌ను స్థాపించడం చూస్తాము. [ఉదా:- కొత్త ప్రింటర్‌ను వుపయోగించడానికి స్థాపించే ప్రింటర్ డ్రైవర్ సాఫ్ట్వేర్].
డ్రైవర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ వినియోగానికి ఎంత మౌలికమైనదంటే, చాలా హార్డ్‌వేర్ విభాగాలకు సంబంధించిన సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే పొందుపరచబడి వుంటుంది. అందువలనే మనం హార్డ్ డిస్క్ డ్రైవర్ సాఫ్ట్వేర్, ఫ్లాపీ డ్రైవర్ సాఫ్ట్వేర్ వంటివి చూడము. • సంపుటి (Volume)డిస్క్ అనేది ఫైళ్ళు భద్రపరచే ప్రదేశము యొక్క భౌతిక రూపం. డిస్క్ మీద వున్న భౌతిక జాగాను వాస్తవికంగా అనేక చిన్న భాగాలుగా విభజించి ఏర్పాటు చేసుకుంటాము. వీటిలో ఫైళ్ళలో వున్న దత్త/సమాచారము భద్రపరచబడుతుంది. మొత్తం జాగా క్షేత్రిక వృత్తాలలో (Concentric Circles) అనేక వలయ మార్గాలుగా (tracks), వలయ మార్గాలు అనేక సెక్టార్లుగా, సెక్టార్లు అనేక గుత్తులుగా (cluster) విభజింపబడతాయి.
భౌతిక జాగాను, కంప్యూటర్ నిర్వహించుకోగలిగిన గుత్తుల రూపంలోకి ఏర్పాటు చేసుకొనే తార్కిక ప్రక్రియనే డిస్క్‌కు రూపకల్పన చెయ్యడం (formating) అంటారు. డిస్క్ రూపకల్పన చేయబడనట్లయితే, దాంట్లో సమాచారం భద్రపరచడం కుదరదు. భద్రపరచడానికి అందుబాటులో వున్న ఒక నిర్ధిష్టమైన ప్రదేశాన్ని ఒక సంపుటి (volume) అంటాము. ప్రతి సంపుటికి ఒక నిర్ధిష్టమైన గుర్తింపు వుంటుంది. సంపుటులను, ప్రక్కన కోలన్ గుర్తు వున్న ఇంగ్లీషు భాషలోని పెద్ద అక్షరంతో సూచిస్తాము. సంపుటిని సూచించడానికి ఎక్కువగా డ్రైవ్ అనే పదం కూడా వుపయోగిస్తాము. అందువలననే మనం సంపుటులను సూచించే C: D: E లను C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్‌లని పిలుస్తాము. సాధారణంగా తొలగించగలిగిన భద్రపరచే స్థావరాలలో, ఒక్కొక్క డిస్క్ ఒక సంపుటిగా రూపకల్పన చెయ్యబడి వుంటుంది. ఉదా:- ప్రతి ఫ్లాపీ డిస్క్ ఒక సంపుటి ప్రతి CD డిస్క్ ఒక సంపుటి. • హార్డ్ డిస్క్
• విభజన/విభాగాలుహార్డ్ డిస్క్‌లో వున్న భద్రపరచడానికి వుపయోగించగలిగే మొత్తం జాగాను అనేక చిన్న విభాగాలుగా విభజిస్తాము. ప్రతి విభాగాన్ని ఒక డ్రైవ్ అని అంటారు.
• సంపుటిఫైళ్ళు భద్రపరచడానికి అనువుగా రూపకల్పన చెయ్యబడ్డ డ్రైవ్‌ను, ఒక సంపుటి అంటాము. C:, D:, E: వీటికి గుర్తింపులు. వీటినే C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ అని కూడా సంభోధిస్తాము. C డ్రైవ్‌లో భద్రపరచబడ్డ ఫైళ్ళు D డ్రైవ్‌లో భద్రపరచబడ్డ ఫైళ్ళు అంటాము.
• ఫోల్డర్లు/డైరెక్టరీలుఒక సంపుటిలో భద్రపరచబడ్డ ఫైళ్ళను ఏర్పాటు చేసుకోవడానికి మనం వుపయోగించే సూచిని ఫోల్డర్/డైరెక్టరీ అంటాము. ఒక సూచి (ఫోల్డర్) లోపల యితర సూచీలు (ఫోల్డర్లు) మరియు ఫైళ్ళు వుండవచ్చు.
ప్రతి సంపుటిలోను కనీసం ఒక్క ఫోల్డరు/సూచి వుంటుంది. ఆ సంపుటిలో వున్న ఫైళ్ళన్నీ ఆ సూచిలో/ఫోల్డర్‌లో వున్నట్లే. • మూలసూచి/(రూట్ ఫోల్డర్)ప్రతి సంపుటి ఫైళ్ళు, ఫోల్డర్లు భద్రపరచదగ్గ ఒక పెద్ద సూచి (ఫోల్డర్) అవుతుంది. దానిని విండోస్‌లో అయితే "\" linux/unix లలో అయితే "/" గుర్తుతో సూచిస్తాము. ఈ గుర్తును మూలము (root) అంటాము.
"C:" సంపుటిని(డ్రైవ్‌ను) సూచిస్తుంది. "c:\" ఆ డ్రైవ్‌లో వున్న మూల సూచి (ఫోల్డర్‌ను) సూచిస్తుంది. • స్థాన మార్గం » ఫైళ్ళు, ఫోల్డర్లు స్థానంఒక కంప్యూటర్లో నిక్షిప్త పరచబడి వున్న ఫైల్/ఫోల్డర్‌ను సంబోధించేటప్పుడు, రెండు లక్షణాలను ప్రస్తుతించవలసి వుంటుంది. ఒకటి దాని పేరు, రెండు దాని స్థాన మార్గం (ఇది ఎక్కడ వుంది అని తెలియచేసే సమాచారం).
» ఉదాహరణ
సాధారణంగా ఫైల్ పేరు, పేరు పొడిగింపుతో అంతమవుతుంది. ఫోల్డర్ పేరు చివర ఎటువంటి పొడిగింపు వుండదు. ఒక ఫోల్డర్ పేరును స్థానంతో సహా వర్ణించేటప్పుడు, అది ఫోల్డర్ అని సూచించడానికి చివరలో అదే కంప్యూటర్ లో వున్న ఫోల్డర్‌ను సంబోధిస్తున్నట్లయితే "/" గుర్తును (LINUX/UNIX లలో "\"), వేరే కంప్యూటర్‌లో వున్న ఫోల్డర్‌ను సంబోధిస్తున్నట్లయితే "\" గుర్తును పెడతాము. ఒక పేరు చివర పొడిగింపు లేనట్లయితే కంప్యూటర్ దానిని ఫోల్డర్‌గానే పరిగణిస్తుంది. • పేర్లు » పెద్ద/చిన్న అక్షరాల మధ్య బేధంUNIX/LINUX ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దక్షరాలు/చిన్నక్షరాల మధ్య భేదం చూపటంలో సున్నితంగా వుంటుంది. అందువలన ఫైల్ ఫోల్డర్ పేర్లు వాడేటప్పుడు పేరులో వాడిన అక్షరాలు చిన్నవా/పెద్దవా అనే విషయాన్ని కూడా పరిగణంలోకి తీసుకోవాలి.
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్/ఫోల్డర్ పేర్లకు సంబంధించినంతవరకు, ఈ బేధం చూడదు.
కాబట్టి D:\My Files\Office\ లేదా D:\My Files\OFFice\ ఈ రెండూ విండోస్‌లో అయితే ఒకటే ఫోల్డర్‌ను సూచిస్తాయి గాని LINUX/UNIX లలో మాత్రం ఈ రెండు వేరు వేరు వాటి కింద పరిగణించబడతాయి |
అల్లికలో (Network) భాగమైన కంప్యూటర్లకు గుర్తింపు : పేరు, IP చిరునామా | |
రెండు అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు అనుసంధించబడి వుంటే అది కంప్యూటర్ల యొక్క అల్లిక (Network) అవుతుంది. చిన్న కంప్యూటర్ల అల్లికలు (Networks) మనం ఇళ్ళల్లో, ఆఫీసుల్లో, కొన్ని కంప్యూటర్లు వైర్ల సహాయంతోనో, వైర్‌లెస్ రేడియో విధానాలు వుపయోగించి కలిపి వుండటం చూస్తాము. పెద్ద కంప్యూటర్ అల్లికలు (Networks) మనం రైల్వే రిజర్వేషన్ కోసం వాడే కంప్యూటర్లు, బ్యాంకులలో వుపయోగించే (ATM)లు మొదలగునవి.
ఇంటర్నెట్ అతి పెద్ద కంప్యూటర్ల అల్లిక. ఇంటర్నెట్‌ను అల్లికల అల్లిక (Network of Networks) అంటారు. ఇంటర్నెట్‌కు లక్షల కంప్యూటర్లు పరోక్షంగా ఒకదానికొకొటి అనుసంధించబడి వుంటాయి. • IP చిరునామా
ఒక కంప్యూటర్‌ల అల్లికలో (Network) వున్న ప్రతి కంప్యూటర్ గుర్తింపుగా ఒక నిర్ధిష్టమైన IP చిరునామా కలిగి వుంటుంది. ఈ చిరునామాను కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఒడంబడికను (Protocol) అనుసరించి ] పరస్పరం గుర్తించుకోవడానికి, సంభాషించుకోవడానికి, సంపర్కించుకోవడానికి (సమాచారం యిచ్చి పుచ్చుకోవడానికి) వుపయోగిస్తాయి.
పై ఉదాహరణ మీరు విండోస్ XP ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగిస్తున్నట్లయితే, మీ కంప్యూటర్ యొక్క IP చిరునామాను తెలుసుకోవడం ఎట్లా అని తెలియచేస్తుంది. • కంప్యూటర్ పేరుప్రతి కంప్యూటర్‌కు పేరు కూడా అమర్చబడి వుంటుంది. ఈ పేరు, కంప్యూటర్ యొక్క IP చిరునామాకు గుర్తు (మారు పేరు) లాంటిది.
ఒక కంప్యూటర్‌ల అల్లికలో వున్న కంప్యూటర్, అది ప్రత్యక్షంగా అనుసంధించబడి వున్న అల్లికలో వున్న కంప్యూటర్లన్నింటికి తన IP చిరునామా మరియు పేరు చాటిస్తుంది.
మన కంప్యూటర్ అనుసంధించబడి వున్న అల్లికలో ప్రత్యక్షంగా భాగమయిన కంప్యూటర్లను మనం పేరు లేక IP చిరునామాతో సంభోధించవచ్చు.
మీ కంప్యూటర్ అనుసంధించబడి వున్న అల్లికకు,
|
కంప్యూటర్లో వనరులను పంచుకోవడం | |
ఒక కంప్యూటర్ ఏదైనా అల్లికలో భాగమయినప్పుడు, అదే అల్లికలో భాగమయిన యితర కంప్యూటర్లు, అవి అనుమతించబడి వుంటే, ఆ కంప్యూటర్లో వున్న ఫైళ్ళను, డ్రైవ్‌లను దానికి అనుసంధించబడి వున్న ప్రింటర్ యితర సాధనాలను, దాని పనిచేసే సత్తాను అందుకోవచ్చు/వినియోగించుకోవచ్చు.
ఒక కంప్యూటర్‌లో వున్న వనరులను యితర కంప్యూటర్‌లో నుండి అందుకునే అవకాశం యివ్వడాన్ని ఆ వనరును పంచడం అంటాము. అల్లికలో అందుబాటులో వుండేటట్లు పంచబడ్డ వనరులపై కొన్ని పరిమితులు నిర్దేశించవచ్చు. • పంచబడ్డ ఫోల్డరుఒక కంప్యూటర్లో వున్న ఫోల్డరు పంచబడ్డట్లయితే, ఎవరికైతే దానిని అందుకునే అనుమతి యిచ్చారో వారు ఆ ఫోల్డరులోను, దాని క్రింద అన్ని స్ధాయిలలోను వున్న ఫైళ్ళు, ఫోల్డర్లు అన్నీ అందుకోగలుగుతారు.
• ఫోల్డరును పంచుకోవడం
• పంపక నామంఫోల్డర్లను పంచేటప్పుడు, అల్లికలో వాటి గుర్తింపుగా ఒక పేరు అమరుస్తారు. దీనినే పంపక నామం అంటారు. ఈ నామం ఫోల్డరు పంపకం సశక్త పరచబడేటప్పుడు అమర్చబడుతుంది.
|
అల్లికలోని యితర కంప్యూటర్లలో వున్న ఫైళ్ళు/ఫోల్డర్ల స్ధాన మార్గం | |
ఒక కంప్యూటర్‌లో వున్న పంచబడ్డ ఫోల్డర్‌ను అందుకోవాలంటే, ముందు, ఆ కంప్యూటర్‌ను దాని IP చిరునామా లేక పేరు నుపయోగించి అందుకోవాల్సివుంటుంది.
ఒక కంప్యూటర్‌లో వున్న పంచబడ్డ ఫోల్డర్లన్నీ, వేరే కంప్యూటర్ నుండి అందుకుని చూసినప్పుడు, అవి భద్రపరచబడ్డ కంప్యూటర్లో వాటి స్ధానం (స్థానమార్గం) ఏమయినప్పటికి, ఒకే స్ధాయిలో వున్నట్లు కనపడతాయి. పంచబడ్డ ఫోల్డర్లు, పంచబడేటప్పుడు పెట్టబడ్డ పంపక నామంతో గుర్తించబడతాయి. పంచబడ్డ ఫోల్డర్ యొక్క స్థానమార్గం (చిరునామా) [ఉదా: \\Marketing\php_mysql లేదా \\192.168.0.1\php_mysql] \\ తో మొదలవుతుంది. \\ గుర్తు మీరు ఏ కంప్యూటర్‌లోనయితే ఈ చిరునామా వాడుతున్నారో, ఆ కంప్యూటర్ అనుసంధించబడి వున్న అల్లికకు ప్రత్యక్షంగా అనుసంధించబడి వున్న యింకొక కంప్యూటర్‌లో వున్న వనరులకు సూచిక. దాని తరువాత వున్న పేరు/IP చిరునామా, ఆ పంచబడ్డ ఫోల్డర్ వున్న కంప్యూటర్‌కు గుర్తింపు. ఆ తదుపరి వున్న పేరు పంచబడ్డ ఫోల్డర్ యొక్క పంపక నామం. • పంచబడ్డ ఫోల్టర్‌ను అందుకోవడం : విండోస్ ఎక్స్ప్లోరర్విండోస్ ఎక్స్‌ప్లోరర్ మన కంప్యూటర్‌లో వున్న ఫైళ్ళు, ఫోల్డర్ల జాబితాను తిరగెయ్యడానికి వుపయోగపడే ప్రోగ్రాము. ఇదే ప్రోగ్రామ్‌ను మన కంప్యూటర్ అనుసంధించబడ్డ అల్లికకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని అనుసంధించబడ్డ యితర కంప్యూటర్లలో వున్న పంచబడ్డ ఫోల్డర్ల జాబితాను తిరగెయ్యడానికి కూడా వాడతాము.
ఒకసారి పంచబడ్డ ఫోల్డర్‌ను అందుకున్న తరువాత, అది మీ కంప్యూటర్‌లో వున్న యితర ఫోల్డర్ల లాంటిదే అని గమనించాలి. తేడా అల్లా, పంచబడ్డ ఫోల్డర్‌లో వున్న ఫైళ్ళు, ఫోల్డర్లు, భౌతికంగా వేరే కంప్యూటర్లో వుంటాయి. • సమానుల అల్లిక (Peer to Peer [p2p] Network)peer: ఒక గుంపులో యితరులతో పోలిస్తే సమానమయిన స్థాయి కలిగిన వ్యక్తి
ఒక అల్లికలో వున్న కంప్యూటర్లన్నీ సమాన/ఒకే రకమయిన సత్తా కలిగి వున్నటువంటివయినట్లైతే, ఆ అల్లికను సమానుల అల్లిక(Peer to Peer [p2p] Network) అంటారు. ఈ అల్లిక దానిలో వున్న కంప్యూటర్లు పరస్పరం ఫైళ్ళు పంచుకోవడానికి మాత్రమే వుద్దేశించబడి వుంటుంది. ఒక దానిలో వున్న ప్రోగ్రాములు వేరే కంప్యూటర్ వుపయోగించుకోవడం కనపడదు. |
వెబ్ సైట్ : ఒక పంచబడ్డ ఫోల్డర్ | |
ఇంటర్నెట్ అనేది లక్షల కొద్దీ కంప్యూటర్లు కలిగిన ఒక పెద్ద కంప్యూటర్ల అల్లిక. ఒక వెబ్ సైట్ అనేది అనుక్షణం ఇంటర్నెట్‌కు అనుసంధించబడ్డ ఒక కంప్యూటర్‌లో నిక్షిప్తపరచబడి వున్న పంచబడ్డ ఫోల్డర్.
మనం ఒక వెబ్ సైట్‌ను ఇంటర్నెట్‌కు అనుసంధించబడివున్న ఒక కంప్యూటర్ నుండి అందుకుంటాము/చూస్తాము/తెరుస్తాము. కాబట్టి మనం వుపయోగించే కంప్యూటర్ ఇంటర్నెట్ అని పిలువబడే అతి పెద్ద కంప్యూటర్ల అల్లికలో భాగమే. మన ఒక వెబ్ సైట్‌ను తెరుస్తున్నామంటే, ఇంటర్నెట్‌కు అనుసంధించబడి వున్న కంప్యూటర్లో నిక్షిప్తపరచబడి వున్న ఒక పంచబడ్డ ఫోల్డర్‌ను అందుకుంటున్నట్లే. • వెబ్ సైట్ : ఒక ప్రత్యక తరహా పంచబడ్డ ఫోల్డర్
సాధారణంగా ఒక ఫోల్డర్‌ను, దానిలో వున్న ఫైళ్ళు, ఫోల్డర్ల జాబితాను తిరగవెయ్యడానికి అందుకుంటాము. అలాగే ఒక పంచబడ్డ ఫోల్డర్‌ను కూడా విండోస్ ఎక్స్‌ప్లోరర్ వుపయోగించి, దానిలో వున్న ఫైళ్ళు, ఫోల్డర్ల జాబితా తిరగెయ్యడానికి అందుకుంటాము.
వెబ్ సైట్ కూడా ఒక ఫోల్డరే. మిగిలిన ఫోల్డర్ల వలెనే అది కూడా ఫైళ్ళు, ఫోల్డర్లు కలిగి వుండగలదు.
అయినప్పటికి అది ఒక ప్రత్యేక తరహా పంచబడ్డ ఫోల్డర్ అని గుర్తించాలి. అందువలననే మనం దానిని విండోస్ ఎక్స్‌ప్లోరర్‌తో కాకుండా ఒక బ్రౌసర్‌తో అందుకుంటాము. • వెబ్‌సైట్ పేరు : ప్రత్యేక పంపకనామం
వెబ్‌సైట్ పంచబడ్డ ఫోల్డరు కాబట్టి, ఒక పంపక నామం కలిగి వుంటుంది. ఒక వెబ్ సైట్‌ను సూచిస్తున్న పంచబడ్డ ఫోల్డరు యొక్క పంపక నామం ఫైళ్ళ పేర్లలాగానే ఒక పేరు పొడిగింపు కలిగి వుంటుంది. [ఉదా : theedifier.com, google.co.jp, krishbahvara.org మొదలైనవి].
|
వెబ్ సైట్ (పంచబడ్డ ఫోల్డర్‌ను) అందుకోవడం/తెరవడం | |
• బ్రౌసర్‌ను వుపయోగించిమనం ఒక వెబ్ సైట్‌ను (ఒక పంచబడ్డ ఫోల్డర్) బ్రౌసర్ ప్రోగ్రామ్‌ను వుపయోగించి (విండోస్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌పాక్స్ మొదలగునవి) వాటిలో వున్న వెబ్ పుటలని పిలవబడే ప్రత్యేక తరహా ఫైళ్ళను చూడటానికి/అందుకుంటాము.
వెబ్ పుటలను తిరగెయ్యడమనే పనిని మనం బ్రౌసింగ్ అంటాము.
ఈ అవసరం కోసం వాడబడే సంపర్క ఒడంబడిక (communication protocol) http [hyper text transfer protocol] (ఉన్నతస్ధాయి అక్షర పాఠ బదిలీ ఒడంబడిక). • విండోస్ ఎక్స్‌ప్లోరర్ వుపయోగించి (ftp) ప్రవేశంవెబ్ మాస్టర్లు అనగా వెబ్ సైట్లను సృష్టించి, నిర్వహించే వారు, వాటిలోకి (వెబ్‌సైట్‌ను సూచించే పంచబడ్డ ఫోల్డర్‌లోకి) విండోస్ ఎక్స్‌ప్లోరర్ వుపయోగించి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించడంలో వారి వుద్దేశ్యం. ఆ పంచబడ్డ ఫోల్డర్‌లో వున్న ఫైళ్ళు, ఫోల్డర్ల జాబితాను తిరగెయ్యడం, వెబ్ పుటలను తిరగెయ్యడం కాదు.
ఈ అవసరం కోసం పాటించే సంపర్క ఒడంబడిక (communication protocol) ftp (ఫైళ్ళ బదిలీ ఒడంబడిక) (file transfer protocol). విండోస్ ఎక్స్‌ప్లోరర్ వుపయోగించి ఫైళ్ళు, ఫోల్డర్ల జాబితాను తిరగేసేటప్పుడు కూడా మనం ఫైళ్ళ కోసమే వెతుక్కుంటాము. అయితే ఈ పద్దతిలో మనం ఫోల్డర్లను తిరగెయ్యడం ద్వారా మనకు కావల్సిన ఫైళ్ళను కనుగొని, వాటి నకలు తీయడం, తొలగించడం, వాటిస్థానంలో కొత్తవాటిని పెట్టడం, వంటి పనులు చేస్తాము. బ్రౌసర్ వుపయోగించి మాత్రం వెబ్ సైట్‌లో (పంచబడ్డ ఫోల్డర్‌లో) ఫైళ్ళను (వెబ్ పుటలను) చదవడానికి/చూడటానికి నేరుగా తెరుస్తాము. • వెబ్ చిరునామావెబ్ సైట్‌ను సూచిస్తున్న పంచబడ్డ ఫోల్డర్ భౌతికంగా కలిగివున్న కంప్యూటర్ మీరు దానిని అందుకుంటున్న కంప్యూటర్‌కు పరోక్షంగా ఇంటర్నెట్ ద్వారా అనుసంధించబడి వుండటం వలన, మీరు ఆ కంప్యూటర్‌ను అందుకోవడానికి, ఆ కంప్యూటర్ యొక్క IP చిరునామాను (పేరును కాదు) మాత్రమే వుపయోగించగలుగుతారు.
కంప్యూటర్ల అల్లికలో భాగమయిన కంప్యూటర్‌లో వున్న పంచబడ్డ ఫోల్డర్‌ను అందుకోవడానికి వుపయోగించే చిరునామా "IP చిరునామా/పంపక నామం/ రూపంలో వుంటుంది. కాబట్టి 202.54.32.124 IP చిరునామా కలిగివున్న కంప్యూటర్‌లో నిక్షిప్తపరచబడి వున్న theedifier.com (పంచబడ్డ ఫోల్డరు యొక్క పంపక నామం) వెబ్ సైట్‌ను అందుకోవడానికి మనం //202.54.32.124/theedifier.com/ చిరునామాను వుపయోగించాల్సి వుంటుంది.
ఏ అవసరంకోసం ఆ పంచబడ్డ ఫోల్డర్‌ను అందుకుంటున్నామో తెలియచెయ్యడానికి, ఆ చిరునామాకు ఉపసర్గగా (ముందుగా వుంచుట) సంపర్క ఒడంబడికను సూచించే సంకేతం (http) చేరుస్తాము. తద్వారా ఆ వెబ్ చిరునామా http://202.54.32.124/theedifier.com/ అవుతుంది. [: ఒడంబడిక సంకేతానికి, చిరునామాకు మద్య విభజన గుర్తు]
• వెబ్ సైట్‌కు ఆతిధ్యమిస్తున్న కంప్యూటర్ IP చిరునామా కనుక్కోవడం
|
వెబ్ సైట్లకు ఆతిధ్య సేవలు రకాలు DNS | |
• పంచబడ్డ ఆతిధ్య సేవ (లేదా) వాస్తవమనిపించే ఆతిధ్య సేవవెబ్ సైట్ ఒక పంచబడ్డ ఫోల్డర్ కాబట్టి ఒకే కంప్యూటర్ ఒక్కొక్క పంచబడ్డ ఫోల్డర్‌కు ఒక్కొక్క వెబ్ సైట్ పేరును పంపక నామం క్రింద వాడుతూ అనేకమైన వెబ్ సైట్లకు ఆతిధ్యమివ్వవచ్చు. ఇలా ఒకే కంప్యూటర్ అనేక వెబ్ సైట్లకు ఆతిధ్యమివ్వడాన్ని పంచబడ్డ ఆతిధ్యం అంటారు.
పంచబడ్డ ఆతిధ్యం రెండు రకాలుగా వుంటుంది. » నామమాధారితఒకే IP చిరునామా కలిగిన ఒక కంప్యూటర్ అనేక వెబ్ సైట్లకు ఆతిధ్యమిస్తుంది. బ్రౌసర్ ఆ కంప్యూటర్‌లో పని చేస్తున్న వెబ్ సర్వర్ సాఫ్ట్‌వేర్‌కు ఏదయినా వనరున కోసం వినతిని పంపేటప్పుడు, ఆ వినతిలో భాగంగా, ఆ వెబ్ సైట్ యొక్క పేరును IP చిరునామాతో జోడించి పంపుతుంది. ఆ సర్వర్ ఈ సమాచారాన్ని వుపయోగింతి ఏ వెబ్ సైట్‌లో సమాచారాన్ని పంపాలో నిర్ణయించుకుంటుంది.
» IP ఆధారితఈ విధానంలో కూడా అనేకమైన వెబ్ సైట్లకు ఒకే కంప్యూటర్ ఆతిధ్యమిస్తుంది. అయితే ప్రతి వెబ్ సైట్‌కు ఒక నిర్ధిష్టమైన IP చిరునామా వుంటుంది. వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్, వనరుల కోసం చేసిన వినతిలో వెబ్‌సైట్ పేరు జోడించనప్పటికి, ఏ వెబ్ సైట్‌లో సమాచారాన్ని పంపాలో IP చిరునామా ఆధారంగా నిర్ణయించుకుంటుంది.
నామమాధారిత కృత్రిమమైన ఆతిధ్య సేవలకన్నా IP ఆధారిత ఆతిధ్య సేవలు ఎంచదగ్గవి • అంకితమైన సర్వర్ఒక వెబ్ సైట్‌కు ఏ యితర వెబ్ సైట్లు లేని సర్వర్ ఆతిధ్యమిస్తున్నట్లయితే, దానిని ఆ వెబ్ సైట్‌కు అంకితమైన సర్వర్‌గా పరిగణిస్తాము. ఒక కంప్యూటర్‌ను పూర్తిగా ఒక వెబ్‌సైట్ సేవలకు వినియోగిస్తాము కాబట్టి పంచబడ్డ ఆతిధ్య సేవకంటే ఈ సేవలు పొందాటానికి అయ్యే ఖర్చు ఎక్కువ.
• వాస్తవమనిపించే అంతరంగిక సర్వర్ఒక భౌతిక సర్వర్ కంప్యూటర్‌ను ప్రతి సర్వర్ పూర్తి స్థాయి సత్తా కలిగిన అంకితమైన కంప్యూటర్ మీద పనిచేస్తున్నట్లనిపించే అనేక సర్వర్‌లుగా విభజించినట్లయితే, ప్రతి సర్వర్ (విభాగాన్ని) ఒక వాస్తవమనిపించే అంతరంగిక/అంకితమైన సర్వర్ అంటాము. ప్రతి వాస్తవమనిపించే సర్వర్, పూర్తి ఆపరేటింగ్ సిస్టమ్‌ను నడిపే సత్తా కలిగి వుంటుంది, మరియు దేనికదే (సాఫ్ట్‌వేర్‌ను) స్వతంత్రంగా తొలగించి (boot) మళ్ళీ నింపి (reboot) పనిచేయించవచ్చు.
వాస్తవికత కల్పన రెండు రకాలుగా వుంటుంది. సాఫ్ట్వేర్ ఆధారిత. సాఫ్ట్వేర్ ఆధారిత వాస్తవికత కల్పనలో, వాస్తవ సర్వర్‌లు ఒకే ఆపరేటింగ్ సిస్టమ్‌ను వుపయోగించుకుంటూ వుంటాయి. వీటికి ఆ ముఖ్య కణుపు (ఆపరేటింగ్ సిస్టమ్) యొక్క వనరులు అవసరమవుతాయి. హార్డ్‌వేర్ ఆధారిత వాస్తవిక కల్పనలో వాస్తవికత కల్పన ప్రక్రియ హార్డ్‌వేర్ వనరులను భాగాలుగా విభజిస్తుంది. ఈ విధానాన్ని పంచబడ్డ ఆతిధ్య సేవలు, అంకితమైన సర్వర్ ఆతిధ్యసేవలకు మద్యస్తంగా వర్గీకరించవచ్చు. • డిఎన్యస్మనం ఒక వెబ్ సైట్‌ను అందుకోవడానికి/తెరవడానికి డూ, ఆ వెబ్ సైట్‌ను సూచించే పంచబడ్డ ఫోల్డర్‌కు ఆతిధ్యమిస్తున్న కంప్యూటర్ యొక్క IP చిరునామాను వుపయోగించము. కేవలం ఆ పంచబడ్డ ఫోల్డర్ యొక్క పంపక నామమైన వెబ్ సైట్ పేరునే వాడతాము. అయినప్పటికి మనం వెబ్ సైట్‌ను అందుకోగలుగుతున్నాము. ఎలా!
ఇంటర్నెట్ సేవలందించే ప్రతి సంస్థ DNS సర్వర్‌లుగా సంబోధించబడే ఒకటి అంతకంటే ఎక్కువ కంప్యూటర్లను నిర్వహిస్తాయి. ఈ కంప్యూటర్లు, బ్రౌసర్‌లకు, వెబ్ సైట్లకు ఆతిధ్యమిస్తున్న కంప్యూటర్ల యొక్క IP చిరునామా తెలియచేయడానికి వుపయోగపడతాయి. DNS సర్వర్లు వెబ్ సైట్ల పేర్లు, అవి నిక్షిప్తపరచబడివున్న కంప్యూటర్ల IP చిరునామాల దత్తాంశాన్ని కలిగి వుంటాయి. ఈ దత్తంశాన్ని ఎల్లప్పుడూ, ఇంటర్నెట్ చిరునామాలను (వెబ్ సైట్ పేర్లను) నమోదు చేసుకునే ఆతిధ్య సంస్థ ICANN (Internet Corporation for Assigned Names and Numbers) నుండి సమాచారాన్ని (ఇంటర్నెట్ ద్వారా) పొందడం ద్వారా నవీకరించుకుంటాయి. బ్రౌసర్ చిరునామా పట్టిలో ఒక వెబ్ సైట్ పేరును చేర్చి, ఆ వెబ్ సైట్‌లోని సమాచారాన్ని తెచ్చిపెట్టమన్నప్పుడల్లా బ్రౌసర్ మీకు ఇంటర్నెట్ సేవలందిస్తున్న సంస్థ నిర్వహించే DNS సర్వర్‌తో సంపర్కించి, మీరడిగిన వెబ్ సైట్‌కు సంబంధిత IP చిరునామాను కనుగొంటుంది. తదుపరి బ్రౌసర్ ఆ IP చిరునామా కలిగిన కంప్యూటర్‌తో (వెబ్‌సర్వర్‌తో) ప్రసార అదుపు ఒడంబడికనుగుణంగా TCP (transmission control protocol) సంబంధం ఏర్పరచుకుంటుంది. ఈ సంబంధం ఏర్పరచుకున్న తరువాత, బ్రౌసర్ వెబ్ సైట్‌లో వున్న వాటి కోసం ఆ కంప్యూటర్‌కు నివేదన పంపుతుంది. బ్రౌసర్ TCP సంబంధం ఏర్పరచుకున్న తరువాత వెబ్ సైట్‌కు సంబంధించిన నివేదన చేస్తుంది. కాబట్టి ఆ IP చిరునామా బ్రౌసర్ చిరునామా పట్టిలో చేర్చకుండానే బ్రౌసర్ వుపయోగించుకుంటున్నట్లే. • సర్వర్ - కక్షిదారుడు (server - client)సర్వర్ అనగా సేవచేసే/అందించే/యిచ్చేవాడు అని అర్ధం. కక్షిదారుడు అనగా వారి సేవలను పొందేవాడు.
ఒక కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్‌తో సంబంధం ఏర్పరచుకుని ఆ కంప్యూటర్లో వున్న వనరులను వినియోగించుకుని తన విధులను నిర్వర్తిస్తున్నట్లయితే ఆ కంప్యూటర్లు సర్వర్ - కక్షిదారుడు అనుబంధం కలిగి వున్నాయి అంటాము. కక్షిదారుడు సేవలను అడుగుతాడు, సర్వర్ సేవలను అందిస్తుంది. మీ బ్రౌసర్ అడుగుతుంది, వెబ్ సైట్ నిక్షిప్తపరచబడివున్న కంప్యూటర్ అందిస్తుంది. కాబట్టి మీ కంప్యూటర్ కక్షదారుడి కంప్యూటర్, వెబ్ సైట్‌కు ఆతిధ్యమిస్తున్న కంప్యూటర్ సర్వర్ కంప్యూటర్ అవుతుంది. |
బ్రౌసర్ : వెబ్‌సర్వర్‌ల వార్తాలాపం | |
ఒక కక్షిదారుని కంప్యూటర్ వీక్షించడానికి వెబ్ పుటలను తెచ్చుకోవడానికి, ఫైళ్ళను తెచ్చుకుని కంప్యూటర్‌లో భద్రపరుచుకోవడానికి, ఆడియో ప్రవాహం కోసం, వీడియో ఫైళ్ళను వాటికి సంగతమైన (compatible) ప్లేయర్లు (రియర్ ప్లయర్, విండోస్ మీడియా ప్లేయర్) వుపయోగించి వీక్షించడానికి, ఈ - టపాలు, అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్ ఈ-టపా కక్షిదారు ప్రోగ్రాములు వుపయోగించి తెచ్చుకోవడానికి మొదలగు అనేక అవసరాల కోసం సర్వర్ కంప్యూటర్‌ను సంప్రదిస్తుంది.
సర్వర్ - కక్షిదారు సంబంధాన్ని కంప్యూటర్ల మద్య కాక సాఫ్ట్వేర్ల మద్య కూడా చూడవచ్చు. మీ కంప్యూటర్లో పని చేస్తూ వెబ్ సైట్‌ను వీక్షించడానికి మీరు వుపయోగించే బ్రౌసర్ సాఫ్ట్వేర్ కక్షిదారు, మరియూ బ్రౌసర్ అడిగినదానిని అందించడం కొరకు (వెబ్ సైట్‌ను సూచించే పంచబడ్డ ఫోల్డర్ నిక్షిప్తపరచబడి వున్న) సర్వర్ కంప్యూటర్లో పనిచేసే వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ సర్వర్. మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్ (IIS), అపాచే Apache వెబ్ సర్వర్‌లకు ఉదాహరణలు. ఒకే సర్వర్ కంప్యూటర్ అనేక రకాల విధులను నిర్వర్తించేటట్లు చెయ్యవచ్చు.
• ఒడంబడిక (Protocol), ద్వారం సంఖ్య (Port number)సర్వర్ - కక్షిదారుకు మధ్య జరిగే వార్తాలాపం (సంభాషణ) లో అవి పాటించవలసిన ఒడంబడిక అక్కడ నిర్వర్తించబడుచున్న విధి మీద ఆధారపడి వుంటాయి. ఒక కక్షిదారు కంప్యూటర్, సర్వర్ కంప్యూటర్‌ను సంపర్కించినప్పుడు, వార్తాలాపానికి అది పాటించబోతున్న ఒడంబడికను గురించి తెలియచెయ్యాల్సి వుంటుంది. ఒడంబడికలు వెబ్ పుటలకోసం నివేదించేటప్పుడు వాడబడే http (hyper text transfer protocol) (ఉన్నత స్థాయి అక్షర పాఠ బదిలీ ఒడంబడిక), తెచ్చి భద్రపరుచుకోవడానికి ఫైళ్ళ కోసం నివేదించేటప్పుడు వాడబడేది, ftp (file transfer protocol) (ఫైళ్ళ బదిలీ ఒడంబడిక) లాంటి గుర్తులతో సూచించబడతాయి.
సర్వర్ కంప్యూటర్‌కు నిజమైనవిగా భావించదగ్గ అనేక ద్వారాలు (ports) వుంటాయి. ద్వారాలు సంఖ్యలను గుర్తులుగా కలిగి వుంటాయి. వెబ్ సర్వర్ కంప్యూటర్ ఈ ద్వారాలను, తను నిర్వర్తించబోయే అనేక విధులకు నిర్ధిష్టంగా కేటాయిస్తుంది. ఒక ఒడంబడిక పాటిస్తూ చేయబడే నివేదన ఒక నిర్ధష్ట ద్వారం గుండానే రావలసి వుంటుంది. ఎక్కువగా (తప్పని సరిగా కాదు) అన్ని సర్వర్ కంప్యూటర్లు 80 సంఖ్య వున్న ద్వారాన్ని http ఒడంబడిక కోసం, 21 సంఖ్య వున్న ద్వారాన్ని ftp ఒడంబడిక కోసం కేటాయిస్తాయి. కాబట్టి కక్షిదారు కంప్యూటర్ మీద పనిచేస్తున్న బ్రౌసర్, సర్వర్‌కు వెబ్ పుట కొరకై నివేదనను http ఒడంబడికను పాటిస్తూ 80 సంఖ్య గల ద్వారానికి మాత్రమే పంపాల్సి వుంటుంది. అలాగే విండోస్ ఎక్స్‌ప్లోరర్ లేక యితర ప్రత్యేకమైన ftp కక్షిదారు ప్రోగ్రాములు గాని సర్వర్ కంప్యూటర్‌కు ఒక ఫైల్ కోసం నివేదన పంపుతున్నట్లయితే, అవి ftp ఒడంబడికను పాటిస్తూ, 21 సంఖ్య గల ద్వారానికి మాత్రమే నివేదనను పంపవలసి వుంటుంది. బ్రౌసర్ ఈ విషయం గమనంలో వుంచుకుంటుంది కాబట్టి మీరు ఒక వెబ్ పుట కోసం నివేదిస్తూ బ్రౌసర్ చిరునామా పట్టిలో చేర్చిన వెబ్ చిరునామాకు ముందు httpగుర్తును (మీరు విస్మరించినట్లయితే) జోడిస్తుంది. అయితే బ్రౌసర్ వెబ్ చిరునామాలో ద్వారం సంఖ్యను మాత్రం చేర్చదు, కాని నివేదనను మాత్రం సంబంధిత ద్వారం వద్దకే పంపుతుంది. |
క్షేత్ర/ఉపక్షేత్ర నామాలు | |
ప్రాధమిక స్థాయిలో జరిగే వెబ్ సైట్ల పేర్ల విభజన, మనకు పాధమిక క్షేత్రాలను అందచేస్తుంది. ప్రాధమిక క్షేత్రాలు వెబ్‌సైట్ పేరులో చివరి అక్షరాలతో సూచించబడతాయి. రెండు అంతకంటే ఎక్కువ అక్షరాలు కలిగి వుంటాయి. (.in, .com, .info) విరామ చిహ్నం (fullstop, period) మిగతా వెబ్ సైట్ పేరుకు, ప్రాధమిక స్థాయి క్షేత్ర నామానికి విభజన గుర్తుగా వుంటుంది.
mail.yahoo.com లో, "com" ఒక్కటి పరిగణిస్తే అది ప్రాధమిక స్థాయి క్షేత్ర నామము అవుతుంది. ప్రాధమిక స్థాయి క్షేత్ర నామాలు ICANN (Internet Corporation for Assigned Names and Numbers, పేర్లు, సంఖ్యలు కేటాయించిన ఇంటర్నెట్ వ్యవస్థ) సృష్టిస్తుంది. ఇవి వేరే సంస్థలు/వ్యక్తులు సృష్టించడానికి వీలుపడదు.
ద్వితీయ స్థాయి క్షేత్రాలు రెండు భాగాలు కలిగి వుంటాయి. ప్రాధమిక స్థాయి క్షేత్రనామం, దానికి ఉపసర్గంగా ఎడమవైపున యింకొక పేరు (yahoo.com, google.com, krishbhavara.org) చేర్చడం ద్వారా సృష్టించబడుతుంది. సాధారణంగా ఎక్కువ భాగం వెబ్ సైట్ పేర్లు ద్వతీయ స్థాయి క్షేత్రనామాలే. తృతీయ స్థాయి క్షేత్ర నామాలు మూడు భాగాలు కలిగి వుంటాయి. అది ఒక ద్వితీయ స్థాయి క్షేత్ర నామానికి ఉపసర్గంగా ఎడమవైపున యింకొక పేరు చేర్చడం ద్వారా (mail.yahoo.com, adwords.google.com) సృష్టించబడుతుంది. ద్రితీయ స్థాయి అంతకంటే ఉన్నత స్థాయి క్షేత్రాలను ఉప క్షేత్రాలని కూడా అంటారు. ద్వతీయ స్థాయి క్షేత్రాలు, వీటి నామాలలో వున్న ప్రాధమిక స్థాయి క్షేత్రాలలో ఉప క్షేత్రాలవుతాయి. (ఉదా:- yahoo.com అనే ద్వితీయ స్థాయి క్షేత్రం, com ప్రాధమిక క్షేత్రంలోని ఉప క్షేత్రమవుతుంది. సాంకేతికంగా ఉపక్షేత్రమనే మాట ఏ స్థాయిలోని క్షేత్ర నామానికైనా వర్తిస్తుంది. ప్రాధమిక స్థాయి క్షేత్రం కూడా చుక్కతో సూచించబడే మూల క్షేత్రం (root domain) యొక్క ఉపక్షేత్రమవుతుంది. మూల క్షేత్రాన్ని శూన్య స్థాయి క్షేత్రమని కూడా అంటారు. • క్షేత్రనామాలు - పంచబడ్డ ఫోల్డర్‌కు సూచికలు
వెబ్ సైట్ పేర్లు ఇంటర్నెట్‌కు అనుసంధించబడి వున్న కంప్యూటర్లో నిక్షిప్తపరచబడి వున్న, పంచబడ్డ ఫోల్డర్ పంపక నామాలు. అదే సమయంలో ఒక వెబ్ సైట్ పేరు ద్వితీయ, అంతకంటే ఉన్నత స్థాయి క్షేత్ర నామం. అనగా ద్వితీయ స్థాయి అంతకంటే ఉన్నత స్థాయి క్షేత్ర నామాలన్నీ ఒక పంచబడ్డ ఫోల్డర్‌కు సూచికలే.
క్షేత్ర నామాలు
తృతీయ స్థాయి అంతకంటే ఉన్నత స్థాయి ఉప క్షేత్రాలు, ఒక నిర్దిష్ట వెబ్ సైట్ యొక్క పేరును సూచించడానికి వుపయోగించవచ్చు. లేదా క్షేత్రంలోని ఒక ఫోల్డర్‌ను సూచించడానికి పువయోగించవచ్చు. blogging.theedifier.com ఒక పూర్తి స్థాయి వెబ్ సైట్ పేరు అవ్వొచ్చు. లేదా అది వున్న క్షేత్రం సూచించే వెబ్ సైట్‌లో వున్న ఒక ఫోల్డర్‌కు (http://www.theedifier.com/blogging-blogger/) మారు పేరు అవ్వొచ్చు.
• బ్లాగ్‌స్పాట్ ఆతిధ్యమిచ్చే బ్లాగ్‌ల చిరునామాలు : బ్లాగ్‌స్పాట్.కామ్ ఉపక్షేత్రాలుమీ బ్లాగ్‌ను బ్లాగ్‌స్పాట్.కామ్ ఉచిత ఆతిధ్య సేవలు ఎంచుకునేటప్పుడు, మీరు ఎంచుకునే యూఆర్‌ఎల్ (వెబ్ చిరునామాలు) అన్నీ తృతీయ స్థాయి క్షేత్ర నామాలే. అవన్నీ బ్లాగ్‌స్పాట్.కామ్ యొక్క ఉపక్షేత్రాలే.
యిటువంటి ఒక్కొక్క తృతీయ స్థాయి క్షేత్ర నామం ఒక నిర్దిష్టమైన వెబ్ సైట్‌ను సూచిస్తుంది. మీరు బ్లాగ్‌స్పాట్.కామ్ ఆతిధ్య సేవలో పొందుపరచే బ్లాగ్ యొక్క యూఆర్‌ఎల్ ఎంచుకోవడంలో ఎడమ వైపు చివరకు వున్న నామం మాత్రమే ఎంచుకుంటారు. తద్వారా బ్లాగ్‌స్పాట్.కామ్‌లో ఉపక్షేత్రాన్ని సృష్టిస్తారు.
• www. ఉపక్షేత్రమవుతుందా!theedifier.com అనేది ద్వితీయ స్థాయి క్షేత్రనామం. www.theedifier.com అనేది theedifier.com యొక్క ఉప క్షేత్రమైన తృతీయ స్థాయి క్షేత్ర నామం.
వెబ్ సర్వర్‌లు, http ఒడంబడికను అనుసరించి వచ్చిన విఙప్తులకు పంపవలసిన పాఠం మొత్తాన్ని public_html (లినక్స్ సర్వర్ల మీద) లేదా www (విండోస్ సర్వర్ల మీద) అనే పేరుగల ఫోల్డర్లో నిక్షిప్తపరుస్తారు. ఈ ఫోల్డర్‌నే పంచి, పంపకనామం క్రింద వెబ్ సైట్ పేరు పెడతారు. వెబ్ సైట్‌ను వినియోగించేవారికి, theedifier.com మరియు www.theedifier.com రెండూ ఒకటే. అందువలన ఎలా అడిగిననా పాఠం పంపించబడేటట్లు నిర్ధారించుకోవడానికి, ఆ పంచబడ్డ ఫోల్డరుకు theedifier.com పంపక నామం క్రింద వినియోగిస్తూ, www.theedifier.comను అదే ఫోల్డర్‌కు మారు పేరు క్రింద పనిచేసేటట్లు చేస్తారు. మీకు మీ సొంత వెబ్ సైట్ వున్నట్లయితే, మీ వెబ్ సైట్, ఈ రెండు రూపాలలో వున్న వెబ్ చిరునామాతో అందుకోగలిగేటట్లు నిర్ధారించుకోండి. |
ఫోల్డర్/ఫైల్ యొక్క వెబ్ చిరునామా, మూల ఫోల్డర్ | |
వెబ్ సైట్ ఇంటర్నెట్‌కు అనుసంధించబడివున్న కంప్యూటర్లో నిక్షిప్తపరచబడి వున్న ఒక పంచబడ్డ ఫోల్డర్‌ను సూచిస్తుంది. ఒక కంప్యూటర్‌లో వున్న ఏ యితర ఫోల్డర్‌లో లాగానే దీనిలో కూడా ఫైళ్ళు ఫోల్డర్లు వుండవచ్చు. మీ బ్రౌసర్ చిరునామా పట్టిలో ఒక వెబ్ సైట్ పేరును చేర్చి, Enter కుంచిక నొక్కినట్లయితే, అది మీరు బ్రౌసర్‌ను ఆ వెబ్ సైట్ పేరును పంపక నామంగా కలిగిన పంచబడ్డ ఫోల్డర్‌లో వున్న పాఠాన్ని తెమ్మని అడిగినట్లే.
ఫైల్ పేరు, పేరు పొడిగింపుతో అంతమవుతుంది. సాధారణంగా పేరు పొడిగింపు 3/4 అక్షరాలు కలిగి వుంటుంది. ఫోల్డరు పేరుకు పొడిగింపు వుండదు. ఒక వెబ్ చిరునామాలో చివర పేరు పొడిగింపు వున్నట్లయితే అది ఫైల్‌ను సూచిస్తుందని, లేనట్లయితే అది ఫోల్డరును సూచిస్తుందని అనుకోవచ్చు. • మూలముభద్రపరచే స్థానం యొక్క మొదలును మూలముగా సంబోధిస్తాము.
» కంప్యూటర్ డ్రైవ్లలోఒక్కొక్క డ్రైవ్ సంపుటిగా పిలువబడే ఒక స్వతంత్ర నిక్షిప్త ప్రదేశము. మూలము అంటే ఒక డ్రైవ్‌లో వున్న మొత్తాన్ని కలిగి వుండే ముఖ్య ఫోల్డరు. ఇది విండోస్‌లో "\" తో యూనిక్స్/లినక్స్లలో "/" తో సూచించబడుతుంది.
ఉదా: విండోస్‌లో 'C':, 'E:' డ్రైవ్‌లకు సంబంధించిన మూల ఫోల్డర్‌లను c:\, E: లుగా గుర్తిస్తాము. » వెబ్ సైట్లలోప్రతీ వెబ్ సైట్ నిజమని భ్రమింపచేసే ఒక డ్రైవే. ఒక వెబ్ సైట్ యొక్క మూలము అనగా ఆ వెబ్ సైట్ సూచిస్తున్న పంచబడ్డ ఫోల్డరే. అది "/" గా గుర్తించబడుతుంది. ఒక వెబ్ సైట్‌లోని మూల ఫోల్డర్‌ను "/" పేరుతో/గుర్తుతో, ఆ వెబ్ సైట్‌లోని పుటలలో మాత్రమే సంబోధించగలుగుతాము
|
లంకెలలో చేర్చడానికి ఫైళ్ళు/ఫోల్డర్ల వెబ్ చిరునామా | |
ఫైళ్ళు/ఫోల్డర్ల వెబ్ చిరునామా అంటే అవి భద్రపరచబడి వున్న స్ధానంతో సహా వాటి పేరు.
ఒక వెబ్ సైట్ లోపల అంతర్గత సంచారాన్ని, హైపర్ లంకెల ద్వారా సాధిస్తాము. వెబ్ పుటలలో ఈ లంకెలు అనేక రకాలుగా ఏర్పాటుచేయబడి కనపడతాయి. ఉదా: అక్షర పాఠ లంకెలు, ప్రతిమ లంకెలు, బొత్తాలు, జాబితా అంశాలుగా, జారిపడే జాబితా పట్టీలోని జాబితా అంశాలుగా, మొదలగునవి. వీటన్నింటిలోను అవి సూచిస్తున్న ఫైలు/ఫోల్డర్ యొక్క యూఆర్‌ఎల్ వుపయోగించబడుతుంది. వీటిని వుపయోగించే పాఠకులను, ఆ ఫైలు/ఫోల్డరు వద్దకు నేరుగా తోడ్కొని పోబడతాయి. ఫైళ్లు/ఫోల్డర్ల వెబ్ చిరునామాను లంకెలలో భాగంగా రెండు రకాలుగా సంభోధించవచ్చు. • పరిపూర్ణ సంభోధనఫైల్/ఫోల్డర్ పేరు దాని స్థాన మార్గంతో సహా తెలియచేసే చిరునామా, మూలం నుండి వ్రాయబడినట్లయితే అది పరిపూర్ణ సంభోధన అవుతుంది.
» కంప్యూటర్ డ్రైవ్‌లలోC:\Documents and Settings\The Edifier\My Documents\My Pictures\website
→ ఇది website అనే పేరు కలిగిన ఫోల్డర్ యొక్క పరిపూర్ణ చిరునామా (స్థాన మార్గంతో సహా). » వెబ్ సైట్లలోhttp://www.futureaccountant.com/probability/problems-solutions/arranging-letters-word.php
→ ఇది "arranging-letters-word.php" అనే పేరు గల ఫైల్ యొక్క పరిపూర్ణ చిరునామా (స్థాన మార్గంతో సహా).. ఈ ఫైల్ పేరును, ఇదే వెబ్ సైట్‌లో వున్న ఏదయినా పుటలో నుండి సంభోధించబడేటట్లయితే, దాని పరిపూర్ణ చిరునామాను ఈ విధంగా కూడా వ్రాయవచ్చు.
• సంబంధంగా సంభోధనఫైల్/ఫోల్డర్ యొక్క పేరు దాని స్థాన మార్గంతో సహా తెలియచేసే చిరునామా, ప్రస్తుతపు స్ధానంతో పోల్చి వ్రాయబడినట్లయితే అది సంబంధంగా సంభోధన అవుతుంది.
• కంప్యూటర్ డ్రైవ్‌లలోMy Documents\My Pictures\website
..\..\My Documents\Notes\
• వెబ్ సైట్లలోproblems-solutions/arranging-letters-word.php
../../permutations-combinations/study-notes/
ఒక ఫైలు/ఫోల్డరు యొక్క వెబ్ చిరునామాను, అవి నిక్షిప్తపరచబడి వున్న వెబ్ సైట్‌లోని ఏ యితర పుటలోనుండయినా వాటికి లంకెలు సృష్టించడానికి వినియోగించేటట్లయితే సంబంధంగా సంభోధించవచ్చు. వేరే వెబ్ సైట్లలోని పుటలనుండి లంకెలు సృష్టించడం కొరకైతే పరిపూర్ణ సంభోధన చెయ్యాల్సిందే. |
క్లిష్ట రూపంలో వున్న యూఆర్‌ఎల్స్ : వాటికి మారు పేర్లు | |
ఒక వెబ్ పుటలో వున్న పత్రంలో సమాచారం నింపి, ఆ పత్రాన్ని వెబ్ సర్వర్‌కు సమర్పించినప్పుడు, ఆ సమాచారాన్ని బ్రౌసర్ ఒక అనుక్రమంలో ఏర్పరిచి వెబ్ సర్వర్‌కు పంపుతుంది.
• యూఆర్ఎల్‌కు మారుపేర్లుక్లిష్ట రూప యూఆర్‌ఎళ్ళకు మారుపేర్లు వాడటం ద్వారా అవి సాధాగా కనపడేటట్లు, గుర్తుంచుకోవడానికి తేలికగా వుండేటట్లు చెయ్యగలుగుతాము. శోధన యంత్రాలు
కాబట్టి వెబ్ మాస్టర్లు, URL కు సంబంధించిన మారు పేరు సృష్ఠించే ప్రక్రియ (aliasing) చేపడతారు. ఈ ప్రక్రియలో, అసలు యూఆర్‌ఎల్ స్ధానంలో సాధారణ పదాలతో సృష్టించబడ్డ సంబంధిత మారు పేరు వినియోగిస్తారు. వెబ్ సైట్ పేరు అలాగే వుండి, యూఆర్‌ఎల్‌లో మిగిలిన భాగంలో కొంత గాని మొత్తంగాని మార్చబడుతుంది. యూఆర్‌ఎల్ -
మారుపేర్లతో గుర్తించబడే యూఆర్‌ఎల్స్ వుండటం వలన, కుడి వైపు చివరన పేరు పొడిగింపు కనపడే/వుండే యూఅర్‌ఎళ్ళు ఫైల్ పేరును, పేరు పొడిగింపు లేనివి ఫోల్డర్లను సూచిస్తాయి అనుకోవడం తప్పవుతుంది. కొన్ని వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లు, యూఆర్‌ఎళ్ళకు మారు పేర్లు సృష్ఠించే సత్తా కలిగి వుంటాయి. అలా లేని వాటికి మారు పేర్లు సృష్ఠించడమనే పని వెబ్ సైట్ డిజైనర్లు సాధించే కొంచెం ఉన్నత స్ధాయి పని. |
ఫైళ్ళు/ఫోల్డర్ల జాబితా [డైరెక్టరీ లిస్టింగ్] | |
ఒక వెబ్ సైట్‌లోని ఏదయినా ఫోల్డరులో వున్న దాని కోసం నివేదించినప్పుడు ఆ ఫోల్డరులోని ఫైళ్ళు, ఫోల్డర్ల జాబితా ప్రదర్శించబడటాన్ని డైరెక్టరీ లిస్టింగ్ అంటాము.
బ్రౌసర్‌ను వెబ్ సైట్‌లోని ఫైళ్ళు చూడటానికి/తిరగెయ్యడానికి వుపయోగిస్తాము. అందులో వున్న ఫైళ్ళు, ఫోల్డర్ల జాబితాలను తిరగెయ్యడానికి కాదు. కాబట్టి డైరెక్టరీ లిస్టింగ్ సాధారణంగా నిరర్దపరచబడి వుంటుంది.
ఒక ఫోల్డరులో వున్న దాని కోసం నివేదించినప్పుడు, ఆ ఫోల్డరుకు సాధారణంగా పంపదగ్గ ఫైలు లేనప్పుడు ఆ ఫోల్డరుకు డైరెక్టరీ లిస్టింగ్ నిరర్దపరచబడి వున్నట్లయితే వెబ్ సర్వర్ బ్రౌసర్‌కు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఒక దోష సందేశం పంపుతుంది. డైరెక్టరీ లిస్టింగ్ సశక్త పరచడి వున్నట్లయితే వెబ్ సర్వర్, ఆ ఫోల్డరులోని ఫైళ్ళు/ఫోల్డర్ల జాబితా పంపుతుంది. డైరెక్టరీ లిస్టింగ్‌కు సంబంధించిన మొత్తం వెబ్ సైట్‌లోని అన్ని ఫోల్డర్లకు కలిపి అమర్చవచ్చు, లేదా విడివిడిగా ఫోల్డర్‌కు అమర్చవచ్చు. ఒక ఫోల్డరుకు డైరెక్టరీ లిస్టింగ్ నిరర్దపరచబడినట్లయితే దానిలోని అన్ని ఫోల్డర్లకు నిరర్దపరిచినట్లే, ఏదయినా ఫోల్డరుకు నిర్ధిష్టంగా సశక్త పరిస్తే తప్పితే. |
వెబ్ సైట్‌లోని ఫోల్డర్లకు సాధారణ ఫైళ్ళు | |
బ్రౌసర్ వెబ్ సైట్‌లోని ఫోల్డరులో వున్న దానిని పంపమని నివేదించినప్పుడు పంపడానికి వీలుగా, వెబ్ సైట్‌లోని ప్రతి ఫోల్డరులో ఒక సాధారణ ఫైలు వుండాలి.
అలవాటుగా ఈ అవసరం కోసం వాడే ఫైళ్ళకు default, index అనే పేర్లు వాడతారు. అయితే వెబ్ సర్వర్ అమరికలను మార్చడం ద్వారా, ఎటువంటి పేరు , పేరు పొడిగింపు కలిగిన ఫైల్‌నయినా, ఈ సాధారణ ఫైలుగా పనిచేసేటట్లు చెయ్యవచ్చు. ఈ పనిని వెబ్ మాస్టర్లు చేస్తారు. అనేక ఫైల్ పేర్లు సాధారణ ఫైలుగా పనిచేయదగ్గ వాటికింద అమర్చబడి వున్నట్లయితే, వెబ్ సర్వర్ వాటికోసం అవి ఏర్పరచబడిన క్రమంలో వెతుక్కుంటూ, తనకు తారసపడ్డ మొట్ట మొదటి ఫైలును సాధారణ ఫైలు క్రింద బ్రౌసర్‌కు పంపుతుంది. ఈ సాధారణ ఫైలు పేర్ల అమరిక ఒక వెబ్ సైట్‌లో వున్న అన్ని ఫోల్డర్లకు ఒకే రకంగా వుండేటట్లు అమర్చవచ్చు. కావాలనుకుంటే విడివిడిగా ప్రతి ఫోల్డరుకు వేరు వేరుగా వుండేటట్లు అమర్చవచ్చు. ఒక ఫోల్డరుకు అమర్చబడ్డ అమకరిక దానిలోని అన్ని ఫోల్డర్లకు వర్తిస్తుంది, ఏదయినా ఫోల్డరుకు నిర్ధిష్టంగా మార్చినట్లయితే తప్పితే.
బ్రౌసర్ ఫోల్డరులో వున్న దానికోసం నివేదించి, వెబ్ సర్వర్ ఆ ఫోల్డరుకు సంబంధించిన సాధారణ ఫైలును బ్రౌసర్‌కు పంపినట్లయితే, ఫైల్ పేరు బ్రౌసర్ చిరునామా పట్టిలో కనిపించదు. చిరునామా పట్టి ఫోల్డరు పేరు ప్రదర్శిస్తున్నప్పటికీ, మీరు వీక్షించేది ఆ ఫోల్డరుకు అమర్చిబడి వున్న సాధారణ ఫైలునే. |
బ్లాగర్ బ్లాగ్ » ఫైళ్ళు/ఫోల్డర్లు, సాధారణ ఫైలు | |
blogspot.com ఉచిత ఆతిధ్య సేవలను వుపయోగించుకుంటున్న మీ బ్లాగ్ యొక్క పూర్తి యూఆర్‌ఆర్‌ఎల్ (ఉదా:- http://learn-blogging.blogspot.com/), మీ వ్యక్తిగత వెబ్ సైట్ కలిగివున్న పంచబడ్డ ఫోల్డర్ యొక్క నామాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక ముఖ్య పుట మాత్రమే కలిగి వున్న ఒక వెబ్‌సైట్.
మీ బ్లాగ్ యూఆర్‌ఆర్‌ఎల్‌ను (http://learn-blogging.blogspot.com) వుపయోగించి మీ బ్లాగ్‌లో వున్న దానికోసం నివేదించడమంటే, మీ బ్లాగ్‌ను సూచిస్తున్న పంచబడ్డ ఫోల్డర్‌లో వున్నదానికోసం నివేదించడమే. ఆ ఫోల్డరుకు సాధారణ ఫైల్ (index.html) అమర్చబడివున్న కారణంగా, వెబ్ సర్వర్ ఆ ఫైలును మీ బ్రౌసర్‌కు పంపుతుంది. మీరు దీనిని మీ బ్లాగ్ చిరునామా చివలరలో index.html చేర్చి (ఉదా:- http://learn-blogging.blogspot.com/index.html) నిర్దారించుకోవచ్చు. ఫైల్ పేరు వాడినా వాడకున్నా అదే పుటలో పాఠం ప్రదర్శించబడటం గమనించవచ్చు. • మిగిలిన ఫోల్డర్లన్నీ స్వయంచాలకంగా సృష్టించబడతాయిమీ బ్లాగ్‌కు మీరు ఎంచుకున్న మాదిరి, పోస్ట్‌లు ప్రాచీనీకరించడానికి సంబంధించిన అమరిక (ఎంత తరచుగా ప్రాచీనీకరించబడాలని ఎంచుకోబడివుంది అనేది), పోస్ట్ పుటల అమరికలను బట్టి బ్లాగర్ ప్రోగ్రామ్ మీ బ్లాగ్ పాఠం మొత్తాన్ని ఏర్పాటు చేసి, దానిని మీ బ్లాగ్ పాఠకులకు అందుబాటులో వుంచడానికి మీ బ్లాగ్ యొక్క మూల ఫోల్డర్‌లో అనేక యితర ఫోల్డర్లను సృష్టిస్తుంది. మీ బ్లాగ్‌లో వున్న పాఠాన్ని తిరగేసేటప్పుడు మీరు ఈ ఫోల్డర్ల పేర్లను బ్రౌసర్ చిరునామా పట్టిలో గమనించవచ్చు.
బ్లాగర్ ప్రోగ్రామ్ వినియోగించుకునే వారెవ్వరికి కూడా ఈ ఫోల్డర్లను సృష్టించడం, వాటికి పేర్లు పెట్టడం అనే ప్రక్రియల మీద ఎటువంటి అదుపు వుండదు. మీ బ్లాగ్ మాదిరికి సంబంధించిన అమరికలను మార్చినప్పుడల్లా (పురాతన మాదిరి నుండి ఆధునిక మాదిరికి, ఆధునిక మాదిరి నుండి పురాతన మాదిరికి మారినప్పుడల్లా), మీ బ్లాగ్ ఎంత తరచుగా ప్రాచీనీకరించబడుతుంది అనే అమరిక, పోస్ట్ పుటలకు సంబంధించిన అమరికలను మార్చినప్పుడల్లా ఫోల్డర్లు, ఫైలు పేర్లు మొత్తం సరికొత్తగా సృష్టించబడి మీ బ్లాగ్‌కు (వెబ్ సైట్‌కు) తిరిగి వ్రాయబడతాయి. • బ్లాగర్‌కు మీరు ఎక్కించిన ప్రతిమలు మీ బ్లాగ్ ఫోల్డర్లో భద్రపరచబడవుబ్లాగర్కు మీరు ఎక్కించిన ప్రతిమలు మీ బ్లాగ్‌ను సూచిస్తున్న పంచబడ్డ ఫోల్డరులో నిక్షిప్తపరచబడవు. అవి blogger.com క్షేత్రంలో ఉప క్షేత్రాలుగా వున్న వెబ్ సైట్ పేర్లతో గుర్తించబడే (పంపక నామంగా కల) పంచబడ్డ ఫోల్డర్లలో నిక్షిప్తపరచబడతాయి. (ఉదా:- photos.blogspot.com. వీటిలో భద్రపరచబడ్డ ప్రతిమలు మీ బ్లాగ్ పుటలో తగ్గ అనుమతితో హాట్ లింక్ చెయ్యబడతాయి.
|
బ్లాగర్ బ్లాగ్‌కు మీ సొంత వెబ్‌సైట్‌లో ఆతిధ్య సేవలు | |
బ్లాగర్.కామ్ మీరు బ్లాగ్‌లు సృష్టించుకోవడానికి అవసరమైన ప్రోగ్రామ్ పుటలకు మాత్రమే ఆతిధ్యమిస్తుంది. బ్లాగర్ సేవలను వుపయోగించి సృష్టించిన బ్లాగ్‌ను ఏదో ఒక వెబ్ సైట్‌లో నిక్షిప్తపరచి ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి తేవలసి వుంటుంది.
బ్లాగ్‌ను సృష్టించేటప్పుడు మీ బ్లాగ్‌కు blogspot.comతో అంతమయ్యే యూఆర్‌ఎల్‌ను ఎంచుకున్నట్లయితే (http://truestories.blogspot.com) అది మీ బ్లాగ్‌కు బ్లాగ్‌స్పాట్.కామ్ అందచేస్తున్న ఉచిత ఆతిధ్య సేవలను వినియోగించుకుంటున్నట్లవుతుంది. మీ బ్లాగ్‌కు సంబంధించిన ఫైళ్ళన్నీ మీ బ్లాగ్‌ను సూచిస్తున్న పంచబడ్డ ఫోల్డరు truestories.blogspot.com లో భద్రపరచబడతాయి. • సొంత వెబ్‌సైట్ కలిగి వుండటంమీ సొంత వెబ్ సైట్ కలిగి వుండటానికి మీరు ఒక క్షేత్రాన్ని (సాధారణంగా ద్వితీయ శ్రేణిది) కొనుగోలు చేసి, అనుక్షణం ఇంటర్నెట్‌కు అనుసంధించబడి వుండే కంప్యూటర్లో కొంత జాగా కొనుగోలు చేయవలసి వుంటుంది (ఇటువంటి సేవలందించే సంస్థ నుండి). మీ సొంత వెబ్ సైట్ వుండటమంటే, అనుక్షణం ఇంటర్నెట్‌కు అనుసంధించబడి వున్న ఒక కంప్యూటర్లో, మీ యాజమాన్యంలో/అదుపులో (మీరు కొనుగోలు చేసిన క్షేత్ర నామాన్ని పంపక నామంగా గల) ఒక పంచబడ్డ ఫోల్డరు వుండటమే. దానిలో మీరు కొనుగోలు చేసిన జాగా పరిమితికి లోబడి ఎన్ని ఫైళ్ళు, ఫోల్డర్లయినా పెట్టుకోవచ్చు.
మీరు బ్లాగర్ సేవలనుపయోగించి సృష్టించిన బ్లాగ్‌లను బ్లాగ్‌స్పాట్.కామ్‌లో బదులు మీ వెబ్ సైట్‌లోని ఏ ఫోల్డరులోనయినా భద్రపరచుకోవచ్చు/పెట్టుకోవచ్చు. • విధానముబ్లాగర్ సేవలుపయోగించి సృష్టించబడ్డ బ్లాగ్‌ను, మీ సొంత వెబ్ సైట్‌లో భద్రపరచబడేటట్లు అమర్చడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించండి.
» మీ వెబ్ సైట్ లోని ఫోల్డర్‌కు ftp అందుబాటును సశక్త పరచండి.బ్లాగర్‌చే సృష్టించబడ్డ మీ బ్లాగ్‌కు సంబంధించిన ఫైళ్ళు మీ వెబ్ సైట్‌లో ఏ ఫోల్డర్‌లో భద్రపరచాలో నిర్ణయించుకోవాల్సి వుంటుంది. దీనికి మీరు అప్పటికే వున్న ఫోల్డర్ వుపయోగించుకోవచ్చు లేదా ఒక కొత్త ఫోల్డరు సృష్టించి అది ఉపయోగించవచ్చు. అయితే మీరు ఈ అవసరం కోసం వుపయోగిస్తున్న ఫోల్డరును యింక ఏ అవసరం కోసం వినియోగించకుండా వుంటే మంచిది.
తదుపరి మీరు ఆ ఫోల్డరుకు అందుబాటులో వున్న ఒక ftp ఖాతా సృష్టించవలసి వుంటుంది.
బ్లాగర్ ప్రోగ్రామ్ ఈ ఫోల్డర్‌ను మూలం క్రింద పరిగణిస్తూ బ్లాగ్‌కు సంబంధించిన అన్ని ఫైళ్ళు ఫోల్డర్లను ఇందులో భద్రపరుస్తుంది..
» సాధారణ ఫైల్‌ను అమర్చండిమీ బ్లాగ్‌ను మీ సొంత వెబ్ సైట్‌కు ప్రచురించడానికి అమరికలు settings విభాగములో వున్న publishing ఉపవిభాగపు పుటలో వుంటాయి.
అమరికలలో భాగంగా మీ బ్లాగ్‌కు సాధారణ ఫైల్ క్రింద వుపయోగించదలచిన ఫైలు పేరు (పొడిగింపుతో సహా) తెలియచేయవలసి వుంటుంది. బ్లాగర్ సాధారణంగా వుపయోగించే index.html బదులు యిది వుపయోగించబడుతుంది. మీరు యిక్కడ చేర్చిన ఫైల్ పేరు, మీరు బ్లాగ్‌కు వుపయోగిస్తున్న ఫోల్డరుకు అమర్చబడివున్న సాధారణ ఫైళ్ళ జాబితాలో వుండేటట్లు నిశ్చితపరచుకోండి. దీని వలన ఎవరన్నా మీ బ్లాగ్‌ను కేవలం ఫోల్డరు పేరుతో అందుకునే ప్రయత్నం చేసినట్లయితే (http://theedifier.com/blogging-blogger/myblog/) వెబ్ సర్వర్ అమర్చబడ్డ ఫైలు సాధారణ ఫైలు క్రింద పంపుతుంది. లేనట్లయితే మీరు అమర్చిన ఫైల్‌ను (blog.html అనుకోండి) నిర్దిష్టంగా అడిగినట్లయితేనే మీ బ్లాగ్ పుట ప్రదర్శించబడుతుంది. (http://theedifier.com/blogging-blogger/myblog/blog.html). అంత అవగాహన లేకపోతే ఈ ఫైల్ పేరు చేర్చే పేటికను ఖాళీగా వదిలేయండి. బ్లాగర్ index.html నే సాధారణ ఫైల్ పేరు క్రింద వాడుతుంది.
» బ్లాగ్‌ను తిరిగి ప్రచురించండిమీ బ్లాగ్ అమరికలలో ఏ మార్పులు చేసినా వాటిని అనువర్తింపచేయడానికి మీ బ్లాగ్‌ను తిరిగి ప్రచురించవలసి వుంటుంది. బ్లాగ్‌స్పాట్.కామ్ వద్ద కాక యితర వెబ్ సైట్లలో నిక్షిప్తపరచబడే బ్లాగ్‌లకు బ్లాగర్ ప్రోగ్రామ్ మీరు బ్లాగ్‌ను ప్రచురించినప్పుడల్లా అవసరమైన ఫైళ్ళు/ఫోల్డర్లను మొత్తంగా తిరిగి సృష్టిస్తుంది. బ్లాగ్‌లో పోస్టులు ఎక్కువ వున్నట్లయితే బ్లాగ్ తిరిగి ప్రచురించడానికి కొంత ఎక్కువ సమయము పట్టవచ్చు.
ప్రచురణ ప్రక్రియ కొనసాగుతున్నంతసేపు బ్లాగర్ ప్రోగ్రామ్ ఒక ప్రగతి సందేశం ప్రదర్శిస్తుంది. మీరు సమర్పించిన సమాచారములో ఏదన్నా దోషం వుంటే, దోష సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. మీ వెబ్ సైట్‌లో ఫోల్టరులో అన్ని ఫైళ్ళు భద్రపరచడం (ప్రచురణ ప్రక్రియ) పూర్తయిన తరువాత (భద్రపరచబడ్డ ఫైళ్ళ జాబితా కలిగిన) ఒక నిర్ధారణ సందేశం ప్రదర్శించబడుతుంది. » ఫైళ్ళు ప్రాచీనీకరించబడటానికి సంబంధించిన అదనపు ఐచ్చికలు
• పరిమితులుబ్లాగ్స్పాట్.కామ్‌లో కాకుండా యితర వెబ్‌సైట్లలో మీ బ్లాగ్‌ను భద్రపరచేటట్లయితే ఈ క్రింది పరిమితులను గమనించవలసి వుంటుంది.
» ప్రతిమ పరిమాణం మీద పరిమితిబ్లాగర్.కామ్‌కు ఎక్కించబడిన ప్రతిమలు, 40kb కంటే ఎక్కువ పరిమాణం వున్నవి బ్లాగ్ పుటలలో ప్రదర్శించబడవు.
ఈ పరిమితిని అధిగమించడానికి పరిమితికి మించిన పరిమాణమున్న ప్రతిమలను, ప్రతిమలకు ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్లకు (flickr.com, photobucket.com వంటివి) ఎక్కించి మీ బ్లాగ్‌లో వుపయోగించండి. » శాస్త్రీయ మాదిరులు మాత్రమేమీ బ్లాగ్‌కు శాస్త్రీయ మాదిరులను మాత్రమే వుపయోగించవచ్చు. ఆధునికి విడ్జెట్ ఆధారిత మాదిరులను వుపయోగించడం కుదరదు.
» బ్లాగ్ పాఠకులను అదుపు చేయడం కుదరదుమీ బ్లాగ్‌కు ఆధునిక మాదిరులను వుపయోగిస్తున్నట్లయితేనే మీ బ్లాగ్ పాఠకులను మీరు అదుపు చేయగలుగుతారు.
మీ వెబ్ సైట్‌లో బ్లాగ్‌ను నిక్షిప్తపరచే ఫోల్టరుకు అందుబాటును మీరు నిరోధించి వుంటే తప్పితే, మీ బ్లాగ్ యూఆర్‌ఎల్ తెలిసిన ఎవ్వరైనా మీ బ్లాగ్‌ను అందుకుని చదవగలుగుతారు.
• మీ వెబ్‌సైట్‌గా కేవలం బ్లాగర్ బ్లాగ్మీ వెబ్ సైట్‌గా కేవలం బ్లాగర్ బ్లాగ్‌నే వుపయోగించుకోవచ్చు. దీనికి మీరు చేయవలసింది మీ బ్లాగ్ అమరికలో బ్లాగర్ వుపయోగించవలసిన ఫోల్డర్‌గా మీ వెబ్ సైట్ యొక్క మూల ఫోల్డర్‌ను అమర్చడం. ఇటువంటప్పుడు మీ వెబ్ సైట్ యూఆర్‌ఎల్ మీ బ్లాగ్ యూఆర్‌ఎల్ అవుతుంది.
వెబ్ డిజైనింగి నేర్చుకునే మొదటి రోజులలో, మీరు మీ వెబ్ సైట్‌ను పూర్తి స్థాయిలో సృష్టించడం నేర్చుకునే వరకు, మీ వెబ్ సైట్‌గా మీ బ్లాగ్ వుపయోగపడుతుంది. |
మీ సొంత వెబ్‌సైట్‌ను సృష్టించడం మొదలు పెట్టండి |
క్షేత్ర నామం (వెబ్‌సైట్ పేరు) నమోదు చేసుకోవడానికి $6 to $10 (రూ. 250 నుండి రూ. 450) వరకు, మీరు ఎంచుకున్న ప్రాధమిక స్థాయి క్షేత్రనామం బట్టి వుంటుంది. వెబ్‌సైట్ కొరకు జాగా $20 (రూ. 800) - ఆపైన వుంటుంది.
బ్లాగ్‌స్పాట్ ఆతిధ్య సేవలు వుపయోగిస్తూ సొంత యూఆర్‌ఎల్ కలిగి వుండటం | |
మీరు మీ సొంత వెబ్ సైట్ జాగా కొనుగోలు చేయలేక పోయినా కూడా, మీ బ్లాగ్‌కు మీ సొంత క్షేత్రనామాన్ని యూఆర్‌ఎల్‌గా అమర్చుకోవచ్చు. దీనికి మీరు కేవలం క్షేత్ర నామాన్ని కొనుగోలు చేయవలసి వుంటుంది. మీకు సంవత్సరానికి షుమారుగా $2.5 నుండి $6 (రూ. 125 నుండి 300 వరకు) ఖర్చవుతుంది.
బ్లాగ్ పుటలన్నీ బ్లాగ్‌స్పాట్.కామ్‌లోనే భద్రపరచబడతాయి. మీరు మీ బ్లాగ్‌ను బ్లాగ్‌స్పాట్.కామ్ చిరునామాతో మరియు మీరు కొనుగోలు చేసిన క్షేత్రనామం వుపయోగించి రెండు రకాలుగా అందుకోవచ్చు. మీరు ఏ యూఆర్‌ఎల్ వుపయోగిస్తే అదే బ్రౌసర్ చిరునామా పట్టిలో కనబడుతుంది. అయితే వెబ్ పుటలో వున్న లంకెలన్నీ మాత్రం మీ క్షేత్ర నామాన్నే కలిగి వుంటాయి.
• ప్రయోజనం » ఆధునిక మాదిరి వుపయోగించవచ్చుఈ విధానంలో మీ బ్లాగ్‌కు ఆధునిక విడ్జెడ్ ఆధారిత మాదిరిని వుపయోగించవచ్చు. తద్వారా ఆధునిక మాదిరితోపాటు వచ్చే, గుర్తులు వుపయోగించడం, విడ్జెట్స్, సభ్యత్వం అమలు పరచడం మొదలగు వాటిని వుపయోగించవచ్చు.
• పరిమితులు
బ్లాగర్.కామ్‌కు ఎక్కించబడిన ప్రతిమలు, 40kb కంటే ఎక్కువ పరిమాణం వున్నవి బ్లాగ్ పుటలలో ప్రదర్శించబడవు.
ఈ పరిమితిని అధిగమించడానికి పరిమితికి మించిన పరిమాణమున్న ప్రతిమలను, ప్రతిమలకు ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్లకు (flickr.com, photobucket.com వంటివి) ఎక్కించి మీ బ్లాగ్‌లో వుపయోగించండి. |
బ్లాగ్‌స్పాట్ వద్ద ఆతిధ్యం, సొంత చిరునామా : DNS యాజమాన్య అమరికలు | |
మీరు ఒక క్షేత్రనామం కొనుగోలు చేసేటప్పుడు ఆ సేవను అందించే వెబ్ సైట్, మీకు ఒక ఖాతాను సృష్టించి యిస్తుంది. మీరు ఆ ఖాతాలోకి లాగిన్ అయినట్లయితే, మీ క్షేత్రనామానికి సంబంధించిన వివరాలున్న వెబ్ పుటలు అందుకోవచ్చు.
(ఈ పుటలలో ఎక్కువగా కనపడే వివరాలు - మీ క్షేత్రనామానికి సంబంధించిన నామ సర్వర్లు (Name servers)).
• DNS : వనరుల రికార్డులుక్షేత్ర నామ విధానము (DNS - Domain Name System) అనేక స్థాయిలలో ఏర్పాటు చేయబడ్డ క్షేత్ర నామాలకు రికార్డుల దత్తాంశము. క్షేత్ర నామాన్ని, IP చిరునామాతో సరిపోల్చడం దాని ముఖ్య ఉద్దేశ్యం. ఈ పాత్ర పోషించడం కోసం సర్వర్లలో resource రికార్డులని పిలవబడే రికార్డులుంటాయి. వీటి అక్షర పాఠం జోన్ ఫైళ్ళలో భద్రపరచబడి వుంటుంది.
ప్రతి క్షేత్ర నామము సంబంధిత రీసోర్స్ రికార్డులు కలిగి వుంటుంది. క్షేత్ర నామము, ఆ క్షేత్రనామము కలిగిన వెబ్ సైట్‌కు ఆతిధ్యమిస్తున్న కంప్యూటర్ యొక్క IP చిరునామా కాక ఈ రికార్డులలో మనం సాధారణంగా చూడని యితర సమాచారము చాలా వుంటుంది. • DNS రికార్డులను నిర్వహించడంమీరు క్షేత్రనామము కొనుగోలు చేసిన DNS రికార్డులకు అందుబాటును సాధారణంగా అందరికీ కల్పించొచ్చు/కల్పించక పోవచ్చు. ఆ సౌకర్యాన్ని కొంత అదనపు రుసుము చెల్లిస్తే యివ్వవచ్చు.
మీ క్షేత్రనామంతో బ్లాగ్‌స్పాట్.కామ్ ఆతిధ్యమిస్తున్న మీ బ్లాగ్ పని చేయాలంటే మీరు సరిచూసుకోవలసిన అమరికలు: • C Name:శాస్త్రానుజ్ఞాయి నామం (Canonical name) - (ఆతిధ్యమిచ్చే కంప్యూటర్‌కు మారుపేరు)
• A NameIPv4 చిరునామా రికార్డు (ఆతిధ్యమిచ్చే కంప్యూటర్ యొక్క చిరునామా)
ఈ రికార్డులు, www.adhemari.com రూపంలో వున్న క్షేత్ర నామాలకు, 66.249.81.121 వంటి IP చిరునామాలుగా (కంప్యూటర్లు అర్ధం చేసుకునే పరిభాష) మార్చడానికి వుపయోగపడతాయి. • Name serversమీరు సవరించిన C Name, A Name అందుబాటులోకి రావడానికి మీ క్షేత్రనామానికి సంబంధించిన Name servers సమాచారం కూడా మార్చవలసి రావచ్చు.
|
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౨౩(23) |