Bookmark and Share

బ్లాగ్ పోస్ట్ : సృష్టి/సవరణ/ప్రచురణ/చిత్తుప్రతి. పోస్ట్​ల జాబితా : శోధన/వడపోత

 
ముందు పుట ... ౫ (5)
బ్లాగ్ పోస్ట్ » పోస్ట్ చేయడం  
 
సాధారణంగా శీర్షిక, యూఆర్‌ఎల్​ను ఎంచుకోవడం అనేవి బ్లాగ్‌​ను సృష్టించడం అనే ప్రక్రియలో ఒక్కసారి మాత్రమే చేసే పని (శీర్షిక, యూఆర్‌ఎల్​ను తదుపరి మార్చుకోవచ్చు).

ఒక బ్లాగ్‌​కు సంబంధంగా మళ్ళీ, మళ్ళీ క్రమబద్దంగా చేసే పని పోస్ట్ చేయడం. పోస్టింగ్ అంటే బ్లాగ్​లో సమాచారాన్ని/పాఠాన్ని పొందుపరచడం అని అర్ధం చేసుకోవచ్చు. బ్లాగ్​లో మనం ఏదన్నా సమాచారాన్ని చేర్చినప్పుడల్లా మనం ఒక పోస్టింగ్ చేసినట్లు.

ఒక పోస్టులో సమాచారం అక్షర పాఠంతోడి వ్రాత, ప్రతిమలు/బొమ్మలు, ఆడియో, వీడియో రూపంలో వుండవచ్చు. ఒక పోస్ట్​ను కూర్చి తదుపరి ప్రచురిస్తాము (పోస్టింగ్ చేస్తాము). అక్షర పాఠంతో కూర్చబడిన ఒక పోస్ట్ పైన ఉదహరించబడినది.

పుట అంశాలు »  

క్రొత్త పోస్ట్​ను సృష్టించడం/కూర్చడం  
 
బ్లాగర్.కామ్ తన సేవలను (ప్రోగ్రామ్‌ను) అనేక వెబ్‌ పుటల ద్వారా అందిస్తుంది. మీ బ్లాగ్​లో పోస్ట్​ను కూర్చడానికి వుపయోగపడే పుట post-edit.g. మీరు మీ మొట్టమొదటి బ్లాగ్​లో మొట్టమొదటి పోస్టింగ్ చేయదలుచుకున్నా లేదా తదుపరి ఎప్పుడయినా పోస్టింగ్ చేయదలుచుకున్నా బ్లాగర్.కామ్ మీకు అందించే వెబ్ పుట ఇదే.

• సరికొత్త పోస్ట్ సృష్టి మొదలు పెట్టడం

మీ బ్లాగ్​లో సరికొత్త పోస్ట్​ను సృష్టించే ప్రక్రియను, మీ బ్లాగ్‌ యొక్క డ్యాష్ బోర్డ్ వద్ద నుండి, లేదా బ్లాగ్‌​కు సంబంధించిన ఏ అమరికల పుట నుండయినా మొదలు పెట్టవచ్చు.

• పోస్ట్​కు శీర్షికను ముఖ్య భాగాన్ని కూర్చడం

పోస్ట్​ను సృష్టించడానికి/సవరించడానికి వుపయోగించే వెబ్ పుటలో మీరు పోస్ట్ శీర్షికను పొందుపరచడానికి ఒక అక్షర పేటిక, శీర్షిక పాఠం లంకెగా పనిచేయడానికి దానికి జోడించబడే యూఆర్‌ఎల్ పొందుపరచడానికి ఒక అక్షర పేటిక, పోస్ట్ ముఖ్య భాగ పాఠం పొందుపరచడానికి అక్షర ప్రదేశము కనపడతాయి.

• మీ పోస్ట్​కు గుర్తులు జోడించడం

అక్షర ప్రదేశము క్రింది భాగంలో, కుడి వైపు చివరన, గుర్తులు పొందుపరచడానికి అక్షర పేటికను గమనించవచ్చు. ఈ పేటికలో గుర్తులను కుంచిక ఫలకం వుపయోగించి ముద్రించవచ్చు లేదా మీ బ్లాగ్​లోని యితర పోస్ట్​లకు జోడించిన గుర్తుల జాబితా ప్రదర్శించి, దానిలోనుండి గుర్తులను ఎంచుకుని, వాటిని ఈ పోస్ట్​కు కూడా జోడించవచ్చు.

• వ్యాఖ్యలు, వెనుకకు లంకెలకు ఐచ్ఛికలను ఎంచుకోవడం

అక్షర ప్రదేశము క్రింది భాగంలో ఎడమ వైపు చివరకు ఒక బాణం గుర్తు కనపడుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే అక్షర పేటిక క్రింద ఒక మడి ప్రదర్శించబడుతుంది. దానిలో మీరు ప్రస్తుత పోస్ట్​కు వ్యాఖ్యలు, వెనుక లంకెలు అనుమతించాలా, లేదా అని ఎంచుకోవడానికి ఐచ్ఛికలు కనపడతాయి. ఈ ఎంపిక ప్రస్తుత పోస్ట్​కు మాత్రమే వర్తిస్తుంది. మొత్తం బ్లాగ్‌​కు వ్యాఖ్యలు, వెనుక లంకెలు నిరర్దపరచబడి వున్నట్లయితే ఈ ఐచ్ఛికలు అసలు కనిపించవు.

• తేదీ, కాలం, అమర్చడం

వ్యాఖ్యలకు సంబంధించిన ఐచ్ఛికను ఎంచుకునే మడిలో కుడివైపు చివరన తేదీ, కాలం నింపడానికి అక్షర పేటికలను గమనించవచ్చు. పోస్ట్​ను ప్రచురించబోయే ముందు యిక్కడ ఖచ్ఛితమైన తేదీ, సమయం అమర్చి వుండేటట్లు నిర్ధారించుకోండి.

పుట అంశాలు »  

పోస్ట్ గుర్తింపు (Post ID)  
 
బ్లాగర్.కామ్‌​లో మీరు సృష్ఠించిన ప్రతి బ్లాగ్‌​కు ఒక నిర్దిష్టమైన గుర్తింపు వున్నట్లే, ఆ బ్లాగ్​లోని ప్రతి పోస్టింగ్‌​కు కూడా ఒక నిర్దిష్టమైన సంఖ్య గుర్తింపుగా వుంటుంది. బ్లాగర్ ప్రోగ్రామ్ మీ పోస్టులను ఈ సంఖ్యతోనే గుర్తిస్తుంది, మీరు పోస్ట్​లలో పొందుపరచే సమాచారము, పోస్ట్ శీర్షీకలను బట్టి కాదు.

మీరు ఒక కొత్త పోస్ట్​ను సృష్ఠించడానికి వుపయోగించే వెబ్ పుట Create-post.g. పోస్ట్​ను సృష్ఠించడం మొదలు పెట్టినప్పుడు, బ్రౌజర్ చిరునామా పట్టిలో ప్రదర్శించబడే వెబ్ చిరునామాలో కేవలం బ్లాగ్ గుర్తింపు మాత్రమే వుంటుంది. మీరు పోస్ట్ చిత్తుప్రతిని భధ్రపరచడం గాని, పోస్ట్​ను ప్రచురించడం గాని మొట్టమొదటి సారి చేసినప్పుడు, పోస్ట్ గుర్తింపు సృష్టించబడుతుంది. ఇంక అక్కడి నుండి మీరు పోస్ట్​ను సవరించడానికి ఎప్పుడు తెరిచినా, బ్రౌజర్ చిరునామా పట్టిలో, మీరు వుపయోగించే పుట (post-edit.g) పేరుతో పాటు బ్లాగ్ గుర్తింపు మరియు పోస్ట్ గుర్తింపు రెండూ కనపడతాయి.

∗ బ్లాగర్.కామ్ ఏంటి - బ్లాగ్​స్పాట్.కామ్ కదా!

అవును మీ బ్లాగ్ URL (వెబ్ చిరునామా) బ్లాగ్​స్పాట్.కామ్‌​తో అంతమవుతుంది. బ్లాగర్.కామ్​తో కాదు.

మీ బ్లాగ్​లను సృష్టించడానికి, బ్లాగ్​లో పోస్ట్​లను సృష్టించడానికి/సవరించడానికి, బ్లాగ్ అమరికలను మార్చడానికి వుపయోగపడే బ్లాగర్ ప్రోగ్రామ్ కలిగిన వెబ్ పుటలన్నింటికి బ్లాగర్.కామ్ ఆతిధ్యమిస్తుంది.

మీ బ్లాగ్/పోస్ట్​ను సృష్టించడం పూర్తి చేసిన తరువాత, బ్లాగర్.కామ్, మీ బ్లాగ్ పుటలను బ్లాగ్​స్పాట్.కామ్​లో, లేదా ఉన్నతస్ధాయి ఐచ్ఛికలతో మీరు నిర్ధేశించిన ఏ యితర వెబ్ సైట్​లోనయినా భధ్రపరుస్తుంది.

మీ బ్లాగ్‌​కు సంబంధంగా మార్పులు చేర్పులు చేస్తున్నంతసేపూ మీరు బ్లాగర్.కామ్‌​లో వున్నట్లే. మీ బ్లాగ్‌​ను చదువుతున్నప్పుడు మాత్రం మీరు బ్లాగ్ స్పాట్.కామ్​లో వున్నట్లు.

పోస్ట్​ను ప్రచురించడం  
 

బ్రౌజర్ చిరునామా పట్టిలో చూపబడే వెబ్ చిరునామా (URL) ఈ క్రింద విధంగా వుంటుంది.

http://beta.blogger.com/publish-confirmation.g?
blogID=2132555782912734125&
postID=5035939415025537987&
timestamp=1165750169086

పుట అంశాలు »  

పోస్ట్​ను చిత్తుప్రతిగా (Draft) భధ్రపరచడం  
 

మీ పోస్ట్​ను చిత్తుప్రతిగా భధ్రపరచినట్లయితే, బ్లాగర్ మీ పోస్ట్​ను భధ్రపరచే ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే, మీ బ్లాగ్​లోని పోస్ట్​ల జాబితా వున్న పుటను ప్రదర్శిస్తుంది. అలా చిత్తుప్రతాగా భధ్రపరచబడ్డ పోస్ట్ ఆ జాబితా మొదట్లో కనపడుతుంది.

చిత్తుప్రతిగా భధ్రపరచబడ్డ పోస్ట్​ను మీ బ్లాగ్​లో కనపడేటట్లు చేయడానికి, దానిని సవరించడానికి తెరిచి, ప్రచురించవలసి వుంటుంది.

బ్లాగ్​లోని పోస్ట్​ల జాబితా  
 
బ్లాగర్.కామ్‌​లో ప్రతి వినియోగ ఖాతాకు సంబంధంగా ఒక వున్న డ్యాష్​బోర్డ్​లో, ఆ ఖాతాతో పోస్ట్ చేయదగ్గ బ్లాగ్​ల జాబితా వుంటుంది ఈ డ్యాష్​బోర్డ్​లో ఒక బ్లాగ్‌​కు సంబంధించిన వివరాలలో భాగంగా, ఆ బ్లాగ్​లోని పొస్ట్​ల జాబితా ప్రదర్శించబడే పుటకు లంకె వుంటుంది.

బ్లాగ్​లోని పొస్ట్​ల - జాబితా posting విభాగములోని, Edit posts ఉపవిభాగపు వెబ్ పుటలో (posts.g), ప్రదర్శించబడుతుంది.

పుట అంశాలు »  

పొస్ట్​ల జాబితా శోధించుట/వడకట్టుట  
 

పోస్ట్​ల జాబీతాను వడకట్టి, మొత్తం జాబితాలో కొన్ని పోస్ట్​లు మాత్రమే జాబితాలో ప్రదర్శించబడేటట్లు చెయ్యవచ్చు. పోస్ట్​ల శీర్షిక, ముఖ్య భాగములోని పాఠంలో వున్న పదాల ఆధారంగా ఈ వడపోత చేపట్టవచ్చు.

పోస్ట్​లకు మీరు జోడించిన గుర్తుల ఆధారంగా కూడా ఈ వడపోత చేపట్టవచ్చు.

పోస్ట్​ను సవరించడానికి తెరవడం  
 
చిత్తుప్రతిగా భధ్రపరచబడ్డ పోస్ట్, మరియు ప్రచురించబడ్డ పోస్ట్, దేనినైనా సవరించడానికి తెరవవచ్చు. అలా సవరించడానికి తెరచిన పోస్ట్​ను చిత్తు ప్రతిగా భధ్రపరచవచ్చు లేదా ప్రచురించవచ్చు. సవరించడానికి తెరవబడ్డ, ప్రచురించబడ్డ పోస్ట్​ను చిత్తుప్రతిగా భధ్రపరిస్తే, అది అప్పటి నుండి బ్లాగ్​లో ప్రదర్శిచబడకుండా ఆపినట్లే.

ప్రచురించబడ్డ పోస్ట్​ను మీరు సవరణ కొరకు తెరచినట్లయితే, వ్యాఖ్యలు, వెనుకకు లంకెలకు సంబంధంగా మీరు ఎంచుకోవడానికి అదనపు ఐచ్ఛికలు ప్రదర్శించబడతాయి. మీరు యిక మీదట వ్యాఖ్యలు, వెనుకకు లంకెలు నిరర్ధ పరుస్తున్నట్లయితే, మీ పోస్ట్ మీద యిప్పటికే చెయ్యబడి వున్న వ్యాఖ్యలు, సృష్టించబడి వున్నవెనుకకు లంకెలు, చూపబడేటట్లు/దాచబడేటట్లు చెయ్యడానికి అదనపు ఐచ్ఛికలు వుపయోగపడతాయి.

మొదటి సారి సృష్టించబడుతున్న పోస్ట్​కు పోస్ట్ గుర్తింపు వుండదు మరియు దానికొరకు వుపయోగించబడుతున్న వెబ్ పుట post-create.g.

సవరించబడుతున్న పోస్ట్​కు పోస్ట్ గుర్తింపు వుంటుంది మరియు దాని కొరకు వుపయోగించబడుతున్న వెబ్ పుట post-edit.g. ఇవి తప్ప, మొదటి సారి సృష్టించబడుతున్న పోస్టుకు, సవరించబడుతున్న పోస్ట్​కు మధ్య బేధం కనపడదు.

అనువాదం :: నేర్పు జట్టు ఈ పుటకు ఆంగ్ల మూలం ... తరువాతి పుట ౭(7)

పుట అంశాలు »  
Bookmark and Share

© All rights reserved.

♣ Site optimized for ♣ Internet Explorer 7 ♣ Firefox 2.0 and above