ముందు పుట ... ౪ (4) |
మాదిరి (Template) అనగా ఏమి? | |
మీ బ్లాగ్‌కు మాదిరి అనగా, మీ బ్లాగ్ చూసేవారికి ప్రదర్శించబడే రూపాన్ని నిర్దేశించే ఒక ఫైల్. ప్రతి బ్లాగ్ ఒక వెబ్ పుటే కాబట్టి, మీ బ్లాగ్ యొక్క మాదిరిని, ఒక వెబ్ పుట యొక్క మాదిరి అని అర్ధం చేసుకోవచ్చు. బ్లాగ్ యొక్క మాదిరి, ఆ బ్లాగ్ ప్రదర్శించబడే వెబ్ పుట యొక్క ఆకృతిని నిర్దేశించే అనేక అంశాలకు నిర్వచనాలు, అమరికలు (settings) కలిగి వుండే ఒక ఫైలు. మీ బ్లాగ్‌కు మీరు ఒక మాదిరిని ఉపయోగిస్తే, ఆ మాదిరిలో వున్న నిర్వచనాలను బట్టి మీ బ్లాగ్ పుటలో అక్షరాల పరిమాణం, ఆకృతి, వర్ణం, ఆ పుటకు నేపధ్యం (background) మొదలగు అంశాలు నిర్దేశించబడతాయి. ఈ ఏర్పాటు వలన, బ్లాగర్లు వారి సమయాన్ని, శక్తిని, మేదస్సును వెబ్ పుటల రూపాన్ని ఏర్పరచడం కోసం కాకుండా, వారి బ్లాగ్‌లో సమాచారానికి సంబంధించిన అంశాల మీద కేంద్రీకరించడానికి వీలుంటుంది. ఎక్కువ భాగం బ్లాగర్లకు వెబ్ పుటలు సృష్టించడంలో/నిర్మించడంలో అవసరమైన సాంకేతిక/వృత్తిపరమైన నైపుణ్యం వుంటుందని అనుకోలేరు కాబట్టి, బ్లాగ్‌లను సృష్ఠించే అవకాశం కలుగ చేసే వెబ్ సైట్ (బ్లాగర్.కామ్) నిర్వాహకులు, వారి సేవలను వినియోగించుకునే వారి కోసం, కొన్ని మాదిరిలను సృష్టించి అందుబాటులో వుంచుతారు. మీకు HTML/CSS, తెలిసి వుంటే, కొత్త మాదిరిలను సృష్టించుకోవచ్చు మరియు వున్న మాదిరిలను సవరించవచ్చు. |
మాదిరిని ఎంచుకోవడం | |
బ్లాగర్.కామ్ వద్ద ఒక కొత్త బ్లాగ్‌ను సృష్ఠించే ప్రక్రియలో భాగంగా, మీ బ్లాగ్‌కు శీర్షిక, వెబ్ చిరునామా (Web address - URL) ఎంచుకుని, ఆ సమాచారాన్ని సర్వర్‌కు సమర్పించినట్లయితే, బ్లాగర్.కామ్, మీరు ఎంచుకున్న URL తో బ్లాగ్‌ను సృష్ఠించి, మీ బ్లాగ్‌కు మాదిరిని ఎంచుకోవడానికి అవసరమైన ఐచ్ఛికలున్నపుటను పంపుతుంది. ఈ ప్రయత్నం మీరు బ్లాగ్ సృష్టించడం అనే ప్రక్రియలో రెండవ అడుగుగా చూపబడుతుంది.
ఈ పుటలో కొన్ని మాదిరిలు ప్రదర్శింపబడి వుంటాయి. వాటిలో నుంచి మీ బ్లాగ్ కొరకు ఒక మాదిరిని ఎంచుకోండి. మీ బ్లాగ్‌కు మీరు జోడించిన మాదిరిని కూడ తరువాత మార్చుకోవచ్చు.
మీరు ఎంచుకోగలిగిన మాదిరిలన్నీ ఒక అదృశ్య వెబ్‌పత్రంలో వుంటాయి. మీకు మాదిరుల జాబితా మాత్రమే కనపడుతుంది. జాబితాలో ప్రతి అంశంలో (item) మాదిరి యొక్క స్క్రీన్ షాట్, దాని క్రింద ఒక చిన్న వృత్తము ఆ ప్రక్కన మాదిరికి బ్లాగర్.కామ్‌లో వాడే పేరు, తరువాతి వరుసలో ఆ మాదిరిని సృష్టించిన వారి పేరు వుంటాయి. మీ బ్లాగ్ కోసం ఒక మాదిరిని ఎంచుకుని, Continue లంకె మీద క్లిక్ చేయండి. |
రేడియో/ఎంపిక బొత్తాలు | |
మాదిరి పేరు ప్రక్కన వున్న చిన్న వృత్తాన్ని రేడియో/ఆప్షన్ బొత్తం అంటారు. ఉన్న వాటిట్లోనుంచి ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకోగలిగే లక్షణం కలిగిన ఐచ్ఛికలకు రేడియో బొత్తాలు వాడతారు. [ఉదా: మీ బ్లాగ్‌కు ఒకసారి ఒక్క మాదిరినే ఎంచుకోగలుగుతారు కదా !!]. ఒక్కో ఐచ్ఛికానికి ఒక రేడియో బొత్తం జోడించబడి వుంటుంది. ఎంచుకోబడిన ఐచ్ఛికకు సంబందించిన బొత్తం, మధ్యలో నల్లటి చుక్క కలిగివుంటుంది. • రేడియో!! అనేక బ్యాండ్లు [MW (Medium Wave), SW1 (Short Wave1), SW2, SW3, .. ] వున్న రేడియోలలో, బ్యాండ్ ఎంచుకోవడానికి ఒక్కొక్క బ్యాండ్‌కు ఒక బొత్తం వుంటుంది.
ఎంచుకోబడ్డ బ్యాండ్‌ను సూచిస్తూ దానికి సంబంధించిన బొత్తం నొక్కిపెట్టబడి వుంటుంది. వేరే బ్యాండ్‌ను ఎంచుకోవడానికి సంబంధిత బొత్తం నొక్కగానే ఇంతకు ముందు నొక్కి పెట్టబడివున్న బొత్తం రిలీస్ అవుతుంది. ఒకేసారి రెండు బొత్తాలు నొక్కిపెట్టి వుంచడం సాధ్యపడదు. అదే లక్షణం కలిగి వుంటుంది కాబట్టి దీనిని కూడా రేడియో బొత్తం అన్నారు. |
మాదిరి ప్రివ్యూ (Preview) | |
మీరు మాదిరి ఎంచుకునే వీలు కల్పించే వెబ్ పుటలో, వున్న కొద్దిపాటి మాదిరుల ప్రివ్యూ చూడవచ్చు. దాని వలన ఆ మాదిరి వాడితే మీ బ్లాగ్ ఎలా కనపడుతుంది అనే అవగాహన కలుగుతుంది. ప్రివ్యూ చూడటానికి మాదిరి లఘు ప్రతిమ (స్క్రీన్ షాట్) క్రింద వున్న Preview Template వెబ్ లంకె మీద క్లిక్ చేయండి.
ఆ మాదిరి జోడించబడి, ఒక నమూనా (sample) బ్లాగ్, వేరే గవాక్షము (window) లో ప్రదర్శిండబడుతుంది. మీ బ్లాగ్ కోసం, వున్న వాటిట్లోనుంచి, ఒక మాదిరి ఎంచుకుని continue లంకె మీద క్లిక్ చేయండి. బ్లాగ్ సృష్ఠించే ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత, నిర్ధారణ సందేశం కలిగిన ఒక పుట ప్రదర్శించబడుతుంది.
బ్లాగ్‌లో పోస్టింగ్‌ల ద్వారా సమాచారాన్ని చేరుస్తాము. ఇంత వరకు చేసిన పని, మీ బ్లాగ్ (డయిరీ) యొక్క ఆకృతిని నిర్మించడమే. అందులో మీరు మొట్టమొదటి పోస్టు చేసే వరకు ఏమీ లేనట్లే. ఇదే మీ తదుపరి అడుగు. మీ బ్లాగ్‌లో మొట్టమొదటి పోస్ట్‌ను వ్రాయడం/చెయ్యడం. |
బ్లాగ్ గుర్తింపు (ID) | |
http://www.blogger.com/post-create.g?blogID=30323079
మీ బ్లాగ్ కొరకు టెంప్లేట్‌ను ఎంచుకునే పుట బ్రౌజర్‌లో ప్రదర్శించబడి వున్నప్పుడు, మీ బ్రౌజర్ యొక్క చిరునామా పట్టిని గమనించండి. పైన యివ్వబడిన వెబ్ చిరునామా లాంటిది కనపడుతుంది. post-create.g అనేది ఒక ఫైల్ పేరు. ఇది మీకు టెంప్లేట్ ఏంచుకోవడానికి వుపయోగపడే ప్రోగ్రామ్ కోడ్ కలిగి వున్న బ్లాగర్.కామ్ వెబ్ సైట్‌లోని ఒక వెబ్ పుట. ?blogID = తరువాత వున్న సంఖ్య మీ బ్లాగ్ ను గుర్తించడం కోసం బ్లాగర్.కామ్ కేటాయించిన నిర్దిష్ట సంఖ్య. బ్లాగర్.కామ్ ప్రోగ్రామ్ మీ బ్లాగ్‌ను గుర్తించడానికి ఈ సంఖ్యనే వుపయోగిస్తుంది. ఆ కారణంగానే మీ బ్లాగ్ యెక్క చిరునామా, శీర్షిక ఎప్పుడంటే అప్పుడు మార్చుకునే వీలు కలుగుతుంది ఈ సంఖ్యను మీరు గుర్తుంచుకోనక్కరలేదు. మీరు మీ బ్లాగ్‌ను దాని యొక్క వెబ్ చిరునామా (URL) తో, మీ బ్లాగ్‌లో ఏమి రాశారు అనే విషయాన్ని మీ బ్లాగ్ శీర్షికతోనే గుర్తిస్తారు. |
శాస్త్రీయ మాదిరికి మారడం | |
సరికొత్త బ్లాగర్ ప్రోగ్రామ్‌లో మీరు ఎంచుకోవడానికి రెండు రకాల మాదిరిలు (templates) వున్నాయి. శాస్త్రీయ/పురాతన మాదిరులు (Classic Templates) మరియు ఆధునిక విడ్జెట్ ఆధారిత మాదిరులు (Modern Widget Based Templates). బ్లాగ్ అమరికల పుటలలో Template విభాగపు లంకెను క్లిక్ చేసినప్పుడు, మీ బ్లాగ్‌కు ఆధునిక మాదిరి అనువర్తించబడి వుంటే, ఉప విభాగాల లంకెలు ఈ క్రింది విధంగా కనబడతాయి.
• శాస్త్రీయ మాదిరికి మారడం Edit HTML లంకె మీద క్లిక్ చేయండి. HTML గుర్తులతో నిండివున్న అక్షర ప్రదేశము కలిగిన పుట ప్రదర్శించబడుతుంది. ఆ పుట పాద భాగంలో (చివరలో) Revert to classic template లంకె మీద క్లిక్ చేయండి.
ఒక హెచ్చరిక సందేశ పేటిక (Warning Message Box) ప్రదర్శించబడుతుంది. దాని మీద మీరు ok క్లిక్ చేస్తే మీ బ్లాగ్‌కు అనువర్తించబడిన మాదిరి, శాస్త్రీయ మాదిరికి మార్చబడి, పుట మొదట్లో ఒక నిర్ధారణ సందేశం ప్రదర్శించబడుతుంది. Template విభాగంలోని ఉపవిభాగపు లంకెలు మారడం గమనించవచ్చు.
|
ఆధునిక మాదిరికి మారడం | |
సరికొత్త బ్లాగర్ ప్రోగ్రామ్‌లో మీరు ఎంచుకోవడానికి రెండు రకాల మాదిరిలు (templates) వున్నాయి. శాస్త్రీయ/పురాతన మాదిరులు (Classic Templates) మరియు ఆధునిక విడ్జెట్ ఆధారిత మాదిరులు (Modern Widget Based Templates). బ్లాగ్ అమరికల పుటలలో Template విభాగపు లంకెను క్లిక్ చేసినప్పుడు, మీ బ్లాగ్‌కు శాస్త్రీయ మాదిరి అనువర్తించబడి వుంటే, ఉప విభాగాల లంకెలు ఈ క్రింది విధంగా కనబడతాయి.
• ఆధునిక మాదిరికి మారడం ఉపవిభాగపు లంకెలలో Customize Design లంకె మీద క్లిక్ చేయండి . ఒక సందేశం (Message) కలిగిన వెబ్ పుట ప్రదర్శింతబడుతుంది. ఆ పుట చివరలో వున్న Upgrade your template బొత్తం మీద క్లిక్ చేయండి.
Save template బొత్తం, దాని క్రింద ఒక మాదిరుల జాబితా ప్రదర్శించబడుతుంది. క్రొత్త మాదిరి కావాలంటే ఎంచుకొని, మీ ఎంపికను భధ్రపరచండి.
భధ్రపరచే ప్రక్రియ పూర్తయిన వెంటనే, పుట మొదట్లో ఒక నిర్ధారణ సందేశం ప్రదర్శించబడుతుంది. Template విభాగంలోని ఉపవిభాగపు లంకెలు మారడం గమనించవచ్చు.
మొత్తం మాదిరి, విడ్జెట్స్ అని పిలవబడే అనేక చిన్న అంశాలతో నిర్మంచబడి వుంటుంది. కొన్ని అంశాలను (విడ్జ్ట్లను) మీరు చేర్చవచ్చు, తీసి వేయవచ్చు, స్ధానం మార్చవచ్చు (అన్నింటినీ కాదు). కొన్ని అంశాలలో వుండే పాఠాన్ని కూడా సరిచేయవచ్చు.
|
శాస్త్రీయ మాదిరిని మార్చడం | |
మీ బ్లాగ్‌కు వున్న మాదిరి రకాన్ని (ఆధునిక/శాస్తీయ) మార్చకుండా మాదిరిని మార్చడం అంటే, పాత దాని స్థానంలో క్రొత్తదానిని ఎంచుకోవడమే. శాస్త్రీయ మాదిరులు అనువర్తించబడి వున్న బ్లాగ్‌లకు మాదిరిని మార్చుకోవడానికి సంబంధించిన ఐచ్చికము Template విభాగములోని Pick New ఉప విభాగపు పుటలో వుంటుంది.
అయితే మాదిరిని మార్చడం మీ బ్లాగ్ పోస్ట్ ప్రదర్శన (పాఠకులకు ఎలా కనబడుతుంది అనే విషయం) మీద ప్రభావం చూపుతుంది. మీరు మీ బ్లాగ్ వినూత్నంగా కనపడాలి అని అనుకోకపోతే, పోస్ట్ ప్రదర్శించబడే ప్రదేశానికి, మీ బ్లాగ్‌కు ఇప్పటికే అనువర్తించబడివున్న మాదిరిలో వున్న కొలతలకు దరిదాపు కొలతలు వున్న మాదిరులు ఎంచుకోండి. |
ఆధునిక మాదిరిని మార్చడం | |
మీ బ్లాగ్‌కు వున్న మాదిరి రకాన్ని (ఆధునిక/శాస్తీయ) మార్చకుండా మాదిరిని మార్చడం అంటే, పాత దాని స్థానంలో క్రొత్తదానిని ఎంచుకోవడమే.
ఆధునిక మాదిరులు అనువర్తించబడి వున్న బ్లాగ్‌లకు మాదిరిని మార్చుకోవడానికి సంబంధించిన ఐచ్చికము Template విభాగములోని Pick New Template ఉప విభాగపు పుటలో వుంటుంది.
|
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౬ (6) |