| ముందు పుట ... ౨ (2) |
| వినియోగ ఖాతాను సృష్టించడం | |
|
బ్లాగర్ వినియోగ ఖాతా అంటే గూగుల్ ఖాతానే. మీకు గూగుల్ ఖాతా లేకున్నట్లయితే, బ్లాగర్ మూల పుటలో క్రింది భాగాన వున్న Create your blog now లంకె (link) మీద క్లిక్ చేయడం ద్వారా సృష్టించుకునే ప్రక్రియ మొదలు పెట్టవచ్చు. ఈ ప్రక్రియలో గూగుల్ ఖాతా సృష్టించుకోవడానికి వుపయోగపడే వెబ్ పత్రం కలిగిన వెబ్ పుట (ఈ క్రింద చూపబడింది) ప్రదర్శించబడుతుంది. ఇది మీరు గూగుల్ ఖాతా పొందడానికి సమర్పించవలసిన కనీస సమాచారము.
|
| నింపవలసిన క్షేత్రములకు వివరణ | |
• ఈ-టపా చిరునామా/గుర్తింపు (E-mail Address/Id) ఇది ప్రస్తుతము వినియోగములో వున్నమీ ఈ-టపా గుర్తింపు (e-mail ID). ఇది జీమెయిల్ గుర్తింపు అవ్వాలనేమీ లేదు. గూగుల్ ఖాతాలో మీ ఈ-టపా గుర్తింపే మీ వినియోగ నామము (user name) అవుతుంది. గూగుల్ ఖాతాలో మీ వినియోగ నామముగా వాడే ఈ ఈ-టపా గుర్తింపును మార్చడానికి వుండదు. మీ వ్యక్తిగత సమాచారములో, వేరే ఈ-టపా చిరునామా పొందుపరచి లేకపోతే, బ్లాగర్ ప్రోగ్రామ్ మీతో సంపర్కించడానికి (communications), బయటివారికి చూపెట్టడానికి, ఈ ఈ-టపా గుర్తింపు/చిరునామానే వినియోగిస్తుంది. పొందుపరిస్తే దానినే వినియోగిస్తుంది. • ప్రవేశ పదము (Password) ప్రవేశ పదము బ్లాగర్.కామ్ వద్ద మీ ఖాతాకు అనుమతి లేని వారికి ప్రవేశం నిరోధించడానికి వుపయోగ పడుతుంది. ఒక వేళ ఎవరన్నా మీ వినియోగ నామము తెలుసుకున్నా, ఈ ప్రవేశ పదము తెలియనిదే మీ ఖాతాను వినియోగించలేరు.
గూగుల్ ఖాతాలో ప్రవేశ పదాన్ని (ఒక పదము మాత్రమే) అక్షరాలు, అంకెలు మరియు @, # వంటి కొన్ని ప్రత్యేక చిహ్నాలు వాడి నిర్మించుకోవచ్చు. ఈ పదము కనీసం 6 అక్షరాల/చిహ్నాల నిడివి కలిగి వుండాలి. ఇతరులు తేలికగా ఊహించలేనటువంటి ప్రవేశ పదమును ఎంచుకోండి. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు కలగలిసేటట్లు మీ ప్రవేశ పదాన్ని నిర్మించుకోండి. అలా అని ఆ పదం మీకే గుర్తురానంతటి గందరగోళంగా సృష్టించుకోకండి. ఖచ్చితంగా అది మీరు గుర్తుంచుకోగలిగింది అయి వుండాలి.
• ప్రదర్శిత నామము (Display Name) మీ బ్లాగ్ పాఠకులకు ప్రదర్శించబడే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలతో సృష్ఠించబడ్డ మీ పేరు. మీ సొంత పేరు, ముద్దుపేరు, కలంపేరు ఏదయినా వాడవచ్చు. ఈ పేరు మీ గురించి బ్లాగ్ పుటలలో చెప్పబడే చోటల్లా కనపడుతుంది. [మీ ప్రొఫైల్ (వ్యక్తిగత సమాచారము) లో, మీ పోస్టింగ్‌లలో మొదలగు చోట్ల]. ఇది కూడూ తదుపరి మీకెప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.
• షరతులు ఒప్పుకోవడం (Accepting Terms) మీరు బ్లాగర్.కామ్ యొక్క ఉచిత సేవలను వినియోగించుకోవడానికై, వారి షరతులను అంగీకరిస్తున్నట్లుగా తెలియచేయడానికి వెబ్ పత్రంలో "I accept the Terms of Service" గుర్తు ప్రక్కన వున్న ఆమోద గుర్తు పేటికలో ఆమోద గుర్తు పెట్టండి. |
| వెబ్ పత్రం (Web Form) | |
వెబ్ పత్రాలు ఒక వెబ్ పుటలో అదృశ్యంగా వుండే అంశాలు. ఒక వెబ్ పత్రం, సర్వర్‌కు సమాచారం సమర్పించడానికి వుపయోగపడే ఒకటి అంతకంటే ఎక్కువ వెబ్ పత్ర నియంత్రణలను కలిగి వుంటాయి. మనం ఒక వెబ్ పత్రంలో (webforms) సాధారణంగా చూసే నియంత్రణలు (controls)
మనం నింపిన సమాచారాన్ని సమర్పించడానికి క్లిక్ చేసే (వినియోగించే) ఆదేశ బొత్తం (command button) లేక వెబ్ లంకె (web link) లాంటివి కూడా వెబ్ పత్రంలో భాగాలే. గూగుల్ ఖాతా కోసం దరఖాస్తు చేస్తూ మీరు నింపే వెబ్ పత్రంలో మీరు నాలుగు రకముల నియంత్రణలు చూడవచ్చు. కొన్ని అక్షర పేటికలు, గుర్తులు, ఒక ఆమోద గుర్తు పేటిక, మరియు సమర్పణ లంకె (continue అనే అక్షరాలు కలిగినది). సాంకేతికముగా గుర్తులు కూడా వెబ్ పత్రంలో భాగాలే అయినప్పటికి, వాటికి యితర నియంత్రణలను గుర్తించేటట్లు చెయ్యడానికి వినియోగపడటం తప్ప వేరే విధి లేదు. • వెబ్ పత్రం (Form) లో వున్న నియంత్రణల (Controls) మధ్య సంచారం
ఇక్కడ మీరు సంచారం అంటే కర్సర్ కదలడం అని భావించాలి. వెబ్ పత్రంలో ఉన్న ఏ నియంత్రణ వద్దకయినా మౌస్‌ను ఉపయోగించి కదలాలంటే, కేవలం ఆ నియంత్రణ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. [ఉదా: అక్షర పేటిక వద్దకు కదలాలంటే, అక్షరపేటిక మధ్య/లోపల క్లిక్ చేయండి]. కుంచిక ఫలకం మీద TAB గుర్తు కలిగి వున్న కుంచికను ఉపయోగించి కూడా నియంత్రణల మధ్య సంచరించవచ్చు. TAB కుంచికను అనేక సార్లు వరుసగా నొక్కుతూ గమనించండి. కర్సర్ వెబ్ పత్రంలో ఉన్న నియంత్రణల మధ్య ఒక నిర్ధిష్ఠ క్రమంలో కదులుతూ కనపడుతుంది. Shift కుంచిక నొక్కి పెట్టివుంచి TAB కుంచికను అనేక సార్లు వరుసగా నొక్కుతూ గమనించండి. కేవలం TAB కుంచిక నొక్కినప్పుడు కదిలిన క్రమానికి ఖచ్చితంగా వ్యతిరేకమైన క్రమంలో కర్సర్ కదలడం గమనించవచ్చు. • Z-సూచి (Z-Index) ఒక వెబ్ పత్రంలో వున్న ప్రతి నియంత్రణకు Z- సూచి అనే పేరుతో ఒక విలువ కేటాయించబడి వుంటుంది. ఒక వెబ్ పత్రంలో వున్న నియంత్రణలకు కేటాయించబడిన Z- సూచి విలువ విలక్షణమైన ఒక పూర్ణసంఖ్య (Integer). మీరు TAB కుంచికను నొక్కితే కర్సర్ ఎటు కదలాలి అనే విషయాన్ని ఈ Z- సూచి నిర్ధారిస్తుంది. మీరు TAB కుంచికను నొక్కినప్పుడు కర్సర్ ప్రస్తుతం ఉన్న నియంత్రణ యొక్క Z- సూచి సంఖ్య కంటే తదుపరి పెద్ద Z- సూచి సంఖ్య వున్న నియంత్రణకి వెళుతుంది. అదే మీరు Shift + TAB కుంచిక నొక్కినపుడు ముందరి చిన్న Z- సూచి సంఖ్య వున్న నియంత్రణకు వెళుతుంది.
|
| అక్షర పేటిక : సంచారము, అక్షర పాఠం : ఎంపిక, సవరణ | |
• అక్షరపేటిక (Text box) ఒకే ఒక్క వరుస కలిగి, అక్షరపాఠం నింపడానికి అవకాశం వున్న పేటికను అక్షర పేటిక అంటారు. దీనిలో మనం ఒక వరుస/పంక్తి అక్షరపాఠాన్ని మాత్రమే నింపగలుగుతాము. • గుర్తు (Label) పేటికలకు ప్రక్కన (సాధారణంగా ఎడమ ప్రక్కన) వున్న మాటలను గుర్తులు అంటాము. ఇవి ఆ పేటికలలో నింపదగ్గ సమాచారము ఏమిటి అనేది తెలియ చేస్తాయి. గుర్తులు (Labels) వెబ్ పత్రంలో వున్న వివిధ నియంత్రణల గురించి తెలియచేయడానికి మాత్రమే పనికి వస్తాయి. వీటికి యింతకు మించి వేరే విధి లేదు. అక్షర పేటికలోని అక్షరపాఠం మధ్య సంచారం, ఎంచుకోవడం, సవరించడం» మౌస్ సహాయంతో
» కుంచిక ఫలకం సహాయంతో పై విధులు కుంచిక ఫలకం వుపయోగించి కూడా సాధించవచ్చు. కర్సర్ అక్షర పేటికలో వున్నప్పుడు, అక్షర పాఠం మధ్య సంచరించడానికి, పాఠాన్ని ఎంచుకోవడానికి, సవరించడానికి మీరు ఈ క్రింది ఐచ్ఛికలను వినియోగించవచ్చు.
|
| ప్రదర్శిత నామాన్ని తదుపరి మార్చుకోవడం | |
|
మీ ప్రదర్శిత నామమును మీ వ్యక్తిగత సమాచారము కలిగి వుండే పుటలనుండి తదుపరి ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ప్రదర్శిత నామము మీ వినియోగ ఖాతాలో సృష్టించబడ్డ అన్ని బ్లాగ్‌లకు వర్తిస్తుంది. ఒకే వినియోగ ఖాతాతో సృష్టించిన బ్లాగ్‌లకు వేరు వేరుగా దీనిని ఎంచుకోవడం కుదరదు. మీ బ్లాగ్ పుట ప్రదర్శించబడి వున్నప్పుడు మీరు మీ గూగుల్ ఖాతాలోకి లాగిన్ అయి వుంటే, మీరు ఈ నిర్దేశికలను మార్చుకోవడానికి బ్లాగ్ పుటలో లంకెలుగా పనిచేసే ప్రతిమలు (icons) వుంటాయి. ఈ లంకె వుపయోగించి మీ వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకునే అమరికలు వున్న పుటను తెరవవచ్చు. చేసిన మార్పులను భధ్రపరచడం (save) ఎప్పుడూ మర్చిపోవద్దు. |
| నిర్ధారణ | |
|
మీరు బ్లాగర్ వినియోగ ఖాతా కొరకు సమాచారము నింపిన వెబ్ పత్రాన్ని సమర్పించినప్పుడు, ఆ సమాచారము సక్రమంగా వున్నట్లయితే, బ్లాగర్ ప్రోగ్రామ్ మీకు ఒక కొత్త బ్లాగ్ సృష్టించుకోవడానికి సంబంధించిన వెబ్ పుటను పంపుతుంది.
ఈ పుట రావడము, మీరు సమర్పించిన సమాచారముతో మీ ఖాతా సృష్టించబడింది అనడానికి నిర్ధారణ. ఈ స్ధితిలో మీరు మీ మొదటి బ్లాగ్ సృష్టించకుండా బ్లాగర్ పుటలను మూసివేయడం, మీరు కేవలం వినియోగఖాతా సృష్టించుకోవడం అవుతుంది. మీ మొదటి బ్లాగ్ సృష్టించబడనట్లే. తదుపరి ఎప్పుడయినా మీరు మీ గూగుల్ ఖాతాతో బ్లాగర్ లోకి లాగిన్ అయ్యి బ్లాగ్‌ను సృష్టించుకోవాల్సి వుంటుంది. |
| అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౪ (4) |



