Bookmark and Share

పోస్ట్​లో చేర్చిన ప్రతిమల పరిమాణం,లీనం,స్థానం : కూర్పు/Html విధానాలు

 
ముందు పుట ... ౧౯ (19)
Add Image పరికరంతో చేర్చబడ్డ Html కోడ్‌లో బేధాలు  
 
పోస్ట్​ పాఠంలోకి ప్రతిమను చేర్చడానికి Add Image ప్రతిమ బొత్తాన్ని వుపయోగించినప్పుడు పోస్ట్​ పాఠం యొక్క కోడ్‌లో చేర్చబడే Html కోడ్‌ను చూడదలచినట్లయితే Html విధానములోకి మారండి.

• చేర్చబడ్డ కోడ్‌లో బేధాలు

ప్రతిమను ఎక్కించేటప్పుడు, ప్రతిమ లీనానికి, ప్రతిమ పరిమాణానికి సంబంధంగా మీరు ఎంచుకున్న ఐచ్చికలను బట్టి, చేర్చబడే Html కోడ్‌లో ఈ క్రింది బేధాలు కనబడతాయి.

<img> గుర్తులో పొందుపరచబడి వెడల్పు (width) గుణం యొక్క విలువలోను మరియు శైలి గుణంలో భాగమయిన float లక్షణం యొక్క విలువలోను బేధాలు కనబడతాయి. Html కోడ్‌ను సవరించడం మీకు తెలిస్తే, ఈ విలువలను, కోడ్ చేర్చబడ్డ తరువాత మార్చుకోవచ్చు.

ఇక్కడ మీరు ఎంచుకునే ప్రతిమ పరిమాణానికి సంబంధించిన ఐచ్ఛికము, మీ ప్రతిమ యొక్క అసలు పరిమాణాన్ని మార్చదు. మీరు వుపయోగిస్తున్న ప్రతిమ దాని అసలు పరిమాణంలోనే ఎక్కించి భద్రపరచబడుతుంది. బ్లాగ్ పోస్ట్​లో ఆ ప్రతిమ ప్రదర్శించబడేటప్పుడు, మీరు ఎంచుకున్న పరిమాణానికి సరిచేసి ప్రదర్శించబడుతుంది. ఇది ఈ ప్రతిమ ఫైల్ యొక్క పరిమాణం అసలు మీద ఎటువంటి ప్రభావము చూపించదు.

ప్రతిమ చుట్టూ చుట్టబడ్డ <a> గుర్తు, ఆ ప్రతిమను, ప్రతిమ అసలు ఫైల్‌కు లంకెగా పనిచేసేటట్లు చేస్తుంది. ఆ ప్రతిమ లంకెను ఉపయోగించి, ప్రతిమను ప్రదర్శించినట్లయితే, ఆ ప్రతిమ అసలు పరిమాణంలో ప్రదర్శించబడుతుంది.

• సాధారణ లీనం, పరిమాణ ఐచ్చికాన్ని అమర్చడం

Add. Image పరికరాన్ని వుపయోగిస్తూ ప్రతిమలను పోస్ట్​లో చేరుస్తున్నట్లయితే, మీరు ప్రతిమను ఎక్కించడానికి అవసరమైన సమాచారం చేరుస్తున్న గవాక్షములో ప్రస్తుతము ఎంచుకున్న ఐచ్ఛికలను, మీ వినియోగ ఖాతాకు సాధారణ ఐచ్చికలుగా అమర్చవచ్చు.

అలా అమర్చిన తరువాత మీరు ఈ ప్రతిమను ఎక్కించడానికి వుపయోగపడే పత్రాన్ని/గవాక్షాన్ని ఎప్పుడు తెరచినా, మీరు సాధారణ ఐచ్చికలుగా అమర్చిన ఐచ్ఛికలు ఎంచుకోబడి కనపడతాయి. మీరు అనుకున్న ఐచ్ఛికలను ఎంచుకుని, upload బొత్తాన్ని నొక్కబోయే ముందు "use----" గుర్తు ప్రక్కన వున్న ఆమోద గుర్తు పేటికలో ఆమోద గుర్తు వుంచండి.

పుట అంశాలు »  

ప్రతిమను ఎంచుకోవడం  
 

• కూర్పు విధానం

మీరు ప్రతిమ మీద క్లిక్ చెయ్యడం ద్వారా ప్రతిమను ఎంచుకోవచ్చు. ఎంచుకోబడి వున్న ప్రతిమ చుట్టూ ఒక పలుచటి అంచు ఏర్పడుతుంది. [ప్రతిమకు పట్టివుంచే పేటిక/చట్రం] ఆ అంచుల, మూలల మరియు మధ్య భాగంలో నలుచదరపు బాగా చిన్న ఖాళీ గడులు ప్రదర్శించబడతాయి.

HTML విధానంలో

Html విధానంలో ప్రతిమను ఎంచుకోవడం అనేది అర్ధరహితమయిన ఆలోచన. ప్రతిమ(సంబంధిత లక్షణాలు గుర్తు లోపల చేర్చబడి వున్న) <img> Html గుర్తుతో సూచించబడుతుంది.

ప్రతిమ స్ధానాన్ని మార్చడం  
 

• కూర్పు విధానంలో

ప్రతిమ మీద క్లిక్ చేసి, మౌస్ బొత్తాన్ని నొక్కి పెట్టి వుంచి, ప్రతిమను మీరు ఉంచదలచిన స్ధానానికి లాగండి..

ప్రతిమను లాగుతున్నప్పుడు మౌస్ సూచి యొక్క ఆకారము మారడం గమనించవచ్చు

  • ప్రతిమ మీద వున్నంతసేపు - ఆందుబాటులో లేదు అనే రూపం
  • ప్రతిమ బయటకు రాగానే, క్రింది భాగంలో ఒక దీర్ఘచతురస్రపు ఖాళీ పేటిక జోడించబడ్డ సూచి రూపం.

మీరు ప్రతిమను ఎక్కడ వుంచబోతున్నారు అనేది, మౌస్ సూచితో పాటు కదులుతున్న కర్సర్ సూచిస్తుంది. మీరు మౌస్ సూచిని ఎక్కడ వదులుతారు, మరియు ఆ ప్రతిమకు అంతకు ముందు అమర్చబడి వున్న లీనం ఐచ్చికం ఏమిటి అనేదానిబట్టి ప్రతిమ కొత్త స్ధానంలో చేరుతుంది. ప్రతిమ స్ధానాన్ని మార్చడానికి, ఈ క్రింది ఐచ్చికాన్ని కూడా వుపయోగించవచ్చు.
  • ప్రతిమను ఎంచుకోవడానికి ప్రతిమ మీద క్లిక్ చేయండి.
  • ప్రతిమను కత్తిరించి, విండోస్ క్లిప్ బోర్డ్ మీదకు చేర్చడానికి కుంచిక ఫలకం మీద "Ctrl + X" కుంచికలను నొక్కండి.
    [ప్రతిమను కత్తిరించడానికి బ్రౌసర్ జాబితా పట్టి ఐచ్చికము Edit | Cut కూడా వుపయోగించవచిచ్చు]
  • ప్రతిమను చేర్చదలుచుకున్న కొత్త స్ధానం వద్ద క్లిక్ చేసి కర్సర్‌ను అక్కడకు చేర్చండి.
  • విండోస్ క్లిప్ బోర్డ్ మీద వున్న ప్రతిమ నకలును కర్సర్ స్ధానం వద్ద అతికించడానికి కుంచిక ఫలకం మీద "Ctrl + V" నొక్కండి.
    [విండోస్ క్లిప్ బోర్డ్ మీద వున్న దానిని కర్సర్ స్ధానం వద్ద అతికించడానికి, బ్రౌసర్ జాబితా పట్టి ఐచ్చికము Edit | Paste కూడా వుపయోగించవచ్చు]

ప్రతిమ స్ధానాన్ని మార్చినప్పుడు ప్రతిమకు అప్పటికే అమర్చబడి వున్న లీనంకు సంబంధించిన ఐచ్చికము మారదు. [ ఉదా:- ఒక వేళ ప్రతిమ కుడివైపుకు లీనమయివుంటే, మీరు ప్రతిమను కుడి వైపుకు లీనమయిన ప్రతిమగానే కొత్త స్ధానంలో పెట్టగలుగుతారు].

Html విధానం

ప్రతిమ స్ధానం మార్చడానికి, ప్రతిమకు సంబంధించిన Html కోడ్‌ను కత్తిరించి, ప్రతిమ ఎక్కడ ప్రదర్శించబడాలనుకుంటారో అక్కడ అతికించండి.

Add Image పరికరం వుపయోగించి మీ పోస్ట్​లు చేర్చిన ప్రతిమ యొక్క స్ధానం మార్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవలసి వుంటుంది. ఆ కోడ్‌లో (ప్రతిమను లంకెగా పనిచేసేటట్లు చెయ్యడానికి) <img> Html గుర్తును చుట్టి వున్న <a> Html గుర్తు కూడా ఆ ప్రతిమ కోడ్‌లో భాగమే. మీరు కేవలం <img> గుర్తు స్ధానం మారుస్తున్నట్లయితే, ఆ <a> గుర్తులను అనవసరంగా పోస్ట్​లో వుంచుతున్నట్లే. ఆ <a> గుర్తులను కూడా <img> గుర్తుతో పాటు ఎంచుకుని ప్రతిమ కోడ్‌ను కత్తిరించండి.

పుట అంశాలు »  

ప్రతిమ లీనం మార్చడం  
 

• కూర్పు విధానం

కూర్పు విధానం నుండి ప్రతిమ లీనం మార్చడం కుదరదు. Html విధానంలోకి మారి లీనాన్ని సరిచేయాల్సిందే.

Html విధానం

ప్రతిమ లీనం మార్చాలంటే <img> గుర్తులోని align గుణం యొక్క విలువను మార్చడమో/అమర్చడమో (అప్పటికే అది లేనట్లయితే) చేయాల్సి వుంటుంది. [ఉదా: <img...align=right>] దీనితో ప్రతిమ తేలి వుండేటట్లు చెయ్యడానికి left/right విలువలు పంక్తి స్థాయి అంశం క్రింద కనబడటానికి top/middle/bottom విలువలు వుపయోగించవచ్చు.

లీనాన్ని శైలి గుణంలో float లక్షణం వుపయోగించి కూడా అమర్చవచ్చు. [ఉదా: <img ... style="float:right" .... >]. దీనికి ప్రతిమను తేలివుండేటట్లు చేయగల left/right విలువలు మాత్రమే వినియోగించవచ్చు.

ప్రతిమ పరిమాణాన్ని మార్చడం  
 

• కూర్పు విధానం

ప్రతిమ పరిమాణాన్ని మార్చడానికి, ప్రతిమ అంచుల వెంబడి వున్న ఖాళీ గడులను మౌస్ సూచితో పట్టుకుని లాగండి. ఆ ఖాళీ గడి వైపు మౌస్ సూచితో చూపగానే ఆ గడి నింపబడుతుంది.

ప్రతిమ కొత్త పరిమాణాన్న తెలియచేస్తూ ఒక చుక్కల హద్దును గమనించవచ్చు. ఆ చుక్కల హద్దుతో సూచించబడే పరిమాణం యొక్క కొలతలు మరియు అసలు కొలతలతో పోలిస్తే అవి ఎంత మారాయి అనే విషయం సూచనల పేటికలో ప్రదర్శించబడుతుంది.

పరిమాణాన్ని మార్చిన తరువాత ప్రతిమ యొక్క Html కోడ్ గమనించినట్లయితే, <img> గుర్తులో గల ఎత్తు (height), వెడల్పు (width) లక్షణాల విలువలు మారి వుండటాన్ని గమనించవచ్చు. ప్రతిమ యొక్క కొత్త కొలతలు ఈ లక్షణాల యొక్క విలువలుగా మార్చబడి కనపడతాయి.

Html విధానం.

ప్రతిమ యొక్క పరిమాణాన్ని మార్చడానికి <img> గుర్తు లోపల వున్న ఎత్తు (height) వెడల్పు (width) గుణాల యొక్క విలువలను మార్చవలసి వుంటుంది. [Eg: <img ... height = 200px width=400px .... >]. ఆ గుణాలు <img> గుర్తు లోపల లేనట్లయితే, అవి చేర్చవలసి వుంటుంది.

ప్రతిమ యొక్క ఎత్తు, వెడల్పు, శైలి గుణం యొక్క విలువలలో భాగంగా గల శైలి లక్షణాలను వుపయోగించి కూడా అమర్చవచ్చు అనే విషయం గమనంలో వుండాలి. [Eg: <img .... style="height:200px; width:400px" .... >]

శైలి గుణం యొక్క విలువలలో భాగంగా గల లక్షణాలకు, Html అంశ గుణాల కంటే అగ్రగామిత్వం వుంటుంది. కాబట్టి మీరు ప్రతిమ ఎత్తు, వెడల్పులను, Html అంశ గుణాలుగాను మరి శైలి గుణం యొక్క విలువలలో భాగంగా శైలి లక్షణాలలోను, రెండు చోట్లా నిర్వచించి వుంటే, శైలి లక్షణాలు అనువర్తించబడతాయి.

పుట అంశాలు »  

ప్రతిమ నకలు తీయడం  
 

• కూర్పు విధానం.

ప్రతిమ నకలు తియ్యడానికి,
  • ప్రతిమను ఎంచుకోవడానికి ప్రతిమ మీద క్లిక్ చెయ్యండి.
  • ప్రతిమ నకలు విండోస్ క్లిప్‌బోర్డ్ మీద చేర్చడానికి, కుంచిక ఫలకం మీద Ctrl +C కుంచికలను నొక్కండి.
    [దీనికి బ్రౌసర్ జాబితా పట్టి ఐచ్ఛికము Edit | Copy కూడా వుపయోగించవచ్చు]
  • ప్రతిమ నకలును చేర్చదలుచుకున్న చోటుకు కర్సర్‌ను చేర్చడానికి అక్కడ క్లిక్ చెయ్యండి
  • కర్సర్ స్ధానం వద్ద విండోస్ క్లిప్‌బోర్డ్ మీద వున్న దాని నకలును అతికించడానికి కుంచిక ఫలకం మీద "Ctrl + V" నొక్కండి.
    [దీనికి బ్రౌసర్ జాబితా పట్టి Edit | paste కూడా వుపయోగించవచ్చు]

ఈ ఐచ్ఛికను కూడా వుపయోగించవచ్చు.
  • కుంచిక ఫలకంపై Ctrl కుంచిక నొక్కిపెట్టి వుంచి, ప్రతిమ మీద క్లిక్ చెయ్యండి.
  • మౌస్ సూచిని అలాగే నొక్కి పెట్టి వుంచి, లాగి ప్రక్కన వదిలి పెట్టండి.
    మీరు మౌస్ సూచిని వదిలి పెట్టిన దగ్గర ప్రతిమ నకలు ఏర్పడుతుంది.

    మౌస్ సూచిని ప్రతిమ మీదనుండి బయటకు కదిలించినంతనే మౌస్ సూచి క్రింది భాగంలో ఒక దీర్ఘ చతురస్రపు పేటిక, దాని క్రింద (కూడిక గుర్తు కలిగిన చతురస్రము) జోడించబడటం గమనించవచ్చు.

Html విధానం

Html విధానంలో ప్రతిమ యొక్క నకలును తయారుచేయడమంటే, ప్రతిమకు సంబంధించిన Html కోడ్ నకలును తయారు చేయడము. ఆ కోడ్‌ను ఎంపిక చేసి దాని నకలును విండోస్ క్లిప్‌ బోర్డ్ మీదకు చేర్చి (Ctrl + C (or) Edit/copy), కర్సర్‌ను ప్రతిమ ఎక్కడ కనపడాలనుకుంటున్నారో అక్కడకు చేర్చి, విండోస్ క్లిప్‌ బోర్డ మీద వున్న ఆ కోడ్‌ను కర్సర్ స్ధానం వద్ద అతికించండి. [క్లిప్ బోర్డ్ మీది కోడ్‌ను అతికించడానికి కుంచిక ఫలక ఐచ్ఛిక (Ctrl + V) లేదా జాబితా పట్టి ఐచ్ఛికము Edit | Paste కూడా వుపయోగించవచ్చు

ఉపసంహరించడం/తిరిగి చెయ్యడం  
 
కూర్పు/Html విధానాలు రెండింటిలోను ఉపసంహరించడం (undo) మరియు తిరిగి చెయ్యడం (ఇంతక ముందు ఉపయోగించిన దానిని తిరిగి చెయ్యడం) వరుస క్రమములో వుపయోగించవచ్చు.

ఉపసంహరించడానికి - కుంచిక ఫలక ఐచ్చికము (Ctrl + Z) లేదా బ్రౌసర్ జాబితా పట్టి ఐచ్చికము (Edit | undo) మరియు తిరిగి చెయ్యడానికి - కుంచిక ఫలక ఐచ్చికము (Ctrl + y) లేదా బ్రౌసర్ జాబితా పట్టి ఐచ్చికము (Edit | Redo) వుపయోగించవచ్చు.

అనువాదం :: నేర్పు జట్టు ఈ పుటకు ఆంగ్ల మూలం ... తరువాతి పుట ౨౧ (21)

పుట అంశాలు »  
Bookmark and Share

© All rights reserved.

♣ Site optimized for ♣ Internet Explorer 7 ♣ Firefox 2.0 and above