ముందు పుట ... ౨౨ (22) |
వ్యక్తిగత సమాచార ప్రదర్శన | |
మీ బ్లాగ్ పాఠకుడికి కనపడే వ్యక్తిగత సమాచార పుట.
|
సమాచార సవరణ పుట | |
బ్లాగర్ కోసం మీరు వినియోగిస్తున్న గూగుల్ ఖాతాలోకి మీరు లాగిన్ అయి వున్నట్లయితే, వ్యక్తిగత సమాచార సవరణ పుట లేక విడ్జెట్ నుండి మీ వ్యక్తిగత సమాచారాన్ని సవరించవచ్చు.
|
వ్యక్తిగత సమాచార సవరణ విడ్జెట్ | |
వ్యక్తిగత సమాచార సవరణ విడ్జెట్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని సవరించగలిగినప్పటికీ, సవరణ పుటలో వున్న అన్ని ఐచ్చికలు విడ్జెట్‌లో వుండవు.
|
వ్యక్తిగత సమాచారాన్ని ప్రదర్శించు/దాచు | |
మీ వ్యక్తిగత సమాచారాన్ని అంతరంగికంగా వుంచుకోవచ్చు లేదా బహిర్గత పరచవచ్చు. మీ వ్యక్తిగత సమాచారాన్ని మీరు బహిర్గత పరచినట్లయితేనే, దానిని చూడదలచిన మీ బ్లాగ్ పాఠకులకు ప్రదర్శించబడుతుంది.
బహిర్గత పరచబడిన మీ వ్యక్తిగత సమాచారం, బ్లాగర్లకున్న ఆశక్తులను ఆధారం చేసుకుని వెదికే వారికి మిమ్ములను కనుగొనే అవకాశం కలుగచేస్తుంది.
మీరు మీ బ్లాగ్‌ను వ్యక్తిగతమైనదిగా లేదా కేవలం మీ జట్టువరకే అందుబాటులో వుండేదానిగా అమర్చదలచినట్లయితే, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికి ప్రదర్శించబడకుండా ఆంతరంగిక సమాచారంగా వుండేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. |
ప్రదర్శిత/అసలు నామము | |
• ప్రదర్శిత నామము
మీరు గూగుల్ ఖాతా వుపయోగించి బ్లాగర్‌లో ఖాతా సృష్టించుకునేటప్పుడు, ప్రదర్శిత నామాన్ని అమరుస్తారు. మీ బ్లాగ్ పోస్ట్‌లలో పాద భాగంలో రచయిత/గ్రంధకర్తగా ప్రదర్శించబడే నామం యిదే. ఇది మీ కలం పేరు లాంటిది. కావాలంటే మీ అసలు పేరును ఈ పేటికలో చేర్చి, అదే ప్రదర్శిత నామంగా వుపయోగించబడేటట్లు చెయ్యవచ్చు.
• అసలు పేరు/నామం
ఎడమ ప్రక్క first name, last name గుర్తులు కలిగిన అక్షర పేటికలో చేర్చే పదాలు మీ అసలు పేరుకు సంబంధించినవి.
మీ వ్యక్తిగత సమాచారం ప్రదర్శించబడే పుటలలో గాని, (బ్లాగ్) వెబ్ పుటలలో ప్రదర్శించబడే వ్యక్తిగత సమాచార విభాగంలో గాని మీ గుర్తింపుగా ప్రదర్శించబడే పేరుగా మీ ప్రదర్శిత నామాన్ని గాని, మీ అసలు పేరునుగాని, అమర్చవచ్చు. మీ అసలు పేరు First name + last name క్రమంలో ప్రదర్శించబడుతుంది. ప్రదర్శిత నామానికి, అసలు పేరుకు మీరు వుపయోగించి అక్షర పాఠం ఏ భాషదైనా అవ్వవచ్చు. |
మీ ఈ-టపా చిరునామా | |
మీతో సంపర్కించడానికి బ్లాగర్ మీరు లాగిన్ కోసం వుపయోగిస్తున్న గూగుల్ ఖాతాకు సంబంధించిన ఈ-టపా చిరునామా/గుర్తింపు వాడుతుంది. మీరు మీ వ్యక్తిగత సమాచార పుటలలో మీ ఈ-టపా చిరునామా ప్రదర్శించబడాలని ఎంచుకున్నట్లయితే, అదే చిరునామా/గుర్తింపు ప్రదర్శించబడుతుంది.
మీ వ్యక్తిగత సమాచార పుటలలో, ఎడమ ప్రక్క Email Address గుర్తు కలిగిన అక్షర పేటికలో మీరు ఏదయినా ఈ-టపా చిరునామా చేర్చినట్లయితే, ఆ చిరునామాను/గుర్తింపును మీతో సంపర్కించడానికి, మీ చిరునామాగా ప్రదర్శించడానికి వుపయోగిస్తుంది. గూగుల్ ఖాతాతో జోడించబడి వున్న ఈ-టపా చిరునామాను/గుర్తింపును మార్చుకోవడం కుదరదు. |
వ్యక్తిగత సమాచార పుటలో మీ బ్లాగ్‌ల జాబితా | |
ఒక గూగుల్ (బ్లాగర్) వినియోగ ఖాతాలో మీరు ఎన్ని బ్లాగ్‌లనయినా సృష్టించుకోవచ్చు. (మీ వినియోగ ఖాతాలో మీరు సృష్టించుకున్న బ్లాగ్‌ల జాబితా మీ వ్యక్తిగత సమాచార పుటలో ప్రదర్శించబడుతుంది. అయితే మీరు సృష్టించిన బ్లాగ్‌లన్నీ అందరికీ కనపడాలని అనుకోక పోవచ్చు. బ్లాగర్ మీరు కనపడకూడదు అనుకున్న బ్లాగ్‌లను మీ వ్యక్తిగత సమాచార పుటలలో ప్రదర్శించబడే బ్లాగ్‌ల జాబితాలో ప్రదర్శించబడకుండా చేసి సౌకర్యం కలుగ చేస్తుంది.
బ్లాగ్ సభ్యులు (సృష్టికర్త కాక) కూడా బ్లాక్‌లో పోస్టు చేయవచ్చు. మీ వ్యక్తిగత సమాచార పుటలో ప్రదర్శించబడే మీ బ్లాగ్‌ల జాబితాలో, వేరే వారు సృష్టించి, మీరు రచయితలుగా చేరిన బ్లాగ్‌లు కూడా చేర్చబడి వుంటాయి. బ్లాగ్‌ల జాబితా మీ బ్లాగ్‌లలో సభ్యులుగా వున్న యితరుల సమాచారాన్ని కూడా తెలియచేస్తుంది. వారి పేర్లు వారి వ్యక్తిగత సమాచార పుటలకు లంకెలుగా పని చేస్తాయి. జాబితాలో బ్లాగ్‌లు ప్రదర్శన సశక్త/నిరర్ధ పరచడానికి సంబంధించిన అమరిక, కేవలం మీ వ్యక్తిగత సమాచార పుటలలో ప్రదర్శించబడే జాబితాకు సంబంధించినది. బ్లాగ్ ప్రదర్శించబడకూడదు అని ఎంచుకోవడం, బ్లాగ్ అందుబాటు మీద ఎటువంటి ప్రభావం చూపదు. అది కేవలం నేను ఫలానా బ్లాగ్ సృష్టించాను అని అందరికీ చెప్పకపోవడం మాత్రమే. • జాబితాలో ప్రదర్శించబడని బ్లాగ్‌లను అందుకోవడంప్రతీ బ్లాగ్‌కు ఒక చిరునామా (యూఆర్‌ఎల్) వుంటుంది. అది ఇంటర్నెట్ ద్వారా అందుకోగలిగిన యితర వెబ్ పుటల వంటిదే. బ్లాగ్‌ల జాబితాలో ప్రదర్శించబడని మీ బ్లాగ్‌లను, బ్లాగ్ యూఆర్‌ఎల్ తెలిసిన వారు మాత్రమే అందుకోగలుగుతారు.
• సభ్యత్వం ద్వారా అందుబాటును నియంత్రించడంఆధునిక విడ్జెట్ ఆధారిత మాదిరులను వినియోగించే బ్లాగ్‌లకు, వేరే అమరిక అందుబాటులో వుంటుంది. దాని ద్వారా బ్లాగ్‌కు అందుబాటును నియంత్రించవచ్చు. ఆ అమరికను బ్లాగ్‌కు అందుబాటును నియంత్రించడానికి వినియోగిస్తున్నట్లయితే, మీ బ్లాగ్‌ను చదవాలంటే కేవలం యూఆర్‌ఎల్ తెలిస్తే చాలదు.
ఈ అమరికను మీ బ్లాగ్ అమరికల పుటలలో settings విభాగములోని permissions ఉపవిభాగపు పుటలో నుండి అందుకోవచ్చు. మీరు నియంత్రణను సశక్త పరచి, బ్లాగర్‌లను (వారి ఈ-టపా గుర్తింపులనుపయోగించి), సభ్యులుగా చేర్చవచ్చు. సభ్యులు మీ బ్లాగ్‌లో పోస్టింగ్ చేయగలిగే వారయ్యుంటారు లేదా కేవలం మీ బ్లాగ్‌ను చదవగలగడం వరకే అనుమతించబడ్డ వారయ్యుంటారు. |
వ్యక్తిగత ప్రతిమ/ఫోటో | |
మీ ప్రదర్శిత నామముతో జోడించి ప్రదర్శించబడటానికి, ఒక ఫోటో/ప్రతిమ వుపయోగించవచ్చు. ఇంటర్నెట్‌కు అనుసంధించబడ్డ ఏ కంప్యూటటర్‌లో (వెబ్ సైట్‌లో) నిక్షిప్తపరచబడి వున్న ప్రతిమనయినా వినియోగించవచ్చు.
మీరు ప్రతిమను వాడదలచినట్లయితే ముందుగా ప్రతిమను ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్‌కు ఎక్కించి, దాని యూఆర్‌ఎల్ పొంది, దానిని ఇక్కడ చేర్చండి |
మీకిష్టమైన ఆడియో/వీడియో | |
మీ అభిరుచిని ప్రతిభంబించే ఒక ఆడియో/వీడియో ఫైల్‌కు లంకె పెట్టవచ్చు. ఇది మీకిష్టమైన వేరే వారు సృష్టించిన ఆడియోనో/వీడియోనో అవ్వవచ్చు లేదా (మీ అభిరుచులు/అభిప్రాయాలు తెలియచేస్తూ) మీరు సృష్టించినదే అవ్వవచ్చు.
మీ వ్యక్తిగత సమాచారాన్ని చదువుతున్న పాఠకుడు, ఈ లంకె మీద క్లిక్ చేసినట్లయితే, మీరు ఆడియో/వీడియో ఫైలుకు లంకె పెట్టినట్లయితే, సంబంధిత ప్లేయర్ ప్రోగ్రామ్ తెరవబడి, ఆ ఫైల్ అందులో ఆడించడం మొదలవుతుంది. మీరు పెట్టిన లంకె ఆడియో/వీడియో అంతఃస్థాపన చెయ్యబడ్డ వెబ్ పుటకైతే, ఆ వెబ్‌పుట ప్రదర్శించబడుతుంది. ఆడియో ఫైళ్ళను బ్లాగర్.కామ్ వెబ్ సైట్‌కు ఎక్కించి భద్రపరచే అవకాశం లేదు. కాబట్టి మీరు ఒక ఆడియో ఫైల్‌ను రికార్టు చేసి దానిని యిక్కడ వుపయోగించదలచినట్లయితే మీ సొంత వెబ్ సైట్ వుంటే అందులో, లేదా ఆడియో ఫైళ్ళకు/ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్లకు ఎక్కించవలసి వుంటుంది. |
స్త్రీ/పురుషుడు | |
మీరు స్త్రీనా, పురుషులా అనే విషయాన్ని తెలియచేయాలా వద్దా అనేది మీరే ఎంచుకోవచ్చు.
పిల్లలు/యుక్త వయసు గలవారు వారి అసలు గుర్తింపును వెబ్ పుటలలో (ఇంటర్నెట్‌లో) తెలియపరచకుండా వుంటే మంచిది. మీరు స్త్రీనా/పురుషుడా అనే విషయాన్ని తెలియచేయదలచుకోపోతే, ఆ విషయాన్ని తెలియచేసే అంశం మీ వ్యక్తిగత సమాచార పుటలో ప్రదర్శించబడదు. |
మీ పుట్టిన రోజు | |
మీకు సంబంధిత గ్రహాన్ని (astrological sign) మీ పుట్టుక తేదీ, నెల ఆధారంగా నిర్ధారిస్తారు. మీ రాశిచక్ర/గ్రహమండలాన్ని (Zodiac), మీ పుట్టుక సంవత్సరము బట్టి మరియు మీ వయసు మీ పుట్టుక తేదీ, నెల, సంవత్సరము మొత్తాన్ని బట్టి నిర్ధారించబడుతుంది.
మీరు కేవలం పుట్టుక తేదీ నెల వరకే పొందుపరచినట్లయితే, కేవలం మీ గ్రహం మాత్రం మీ వ్వక్తిగత సమాచారంలో ప్రదర్శించబడుతుంది. |
మీ మూలపుట | |
మీ ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశయాలు మొదలగునవి ప్రతిభించిస్తున్న బ్లాగ్ లేదా ఏదన్నా వెబ్ పుట వున్నట్లయితే, దాని యూఆర్‌ఎల్‌ను యిక్కడ చేర్చవచ్చు.
ఇది ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో వుండే ఏ పుటైనా అవ్వొచ్చు. |
మీ కోరికల జాబితా | |
మీ కోరికల జాబితా మీరు ఏదో ఒకనాటికి కొనదలచిన/సంపాదించదలచిన వస్తువుల జాబితా. (బాల్ పెన్నులనుండి విమానాల వరకు). అది మీ ఆశలను, కలలను, కోరికలను ప్రతిభింబిస్తుంది. మీరు గూగుల్ వారి అన్‌లైన్ షాపింగ్ వెబ్ సైట్‌లో (ఫ్రూగుల్ - Froogle) ఒక కోరికల జాబితాను సృష్టించుకుని, దానిని యిక్కడ పొందుపరచవచ్చు.
గూగుల్ ఖాతా మీరు (ఫ్రూగుల్ - Froogle) వెబ్ సైట్‌లోకి లాగిన్ అవ్వడానికి కూడా వుపయోగపడుతుంది. బ్లాగర్‌లోకి లాగిన్ అవడము అంటే మీ గూగుల్ ఖాతాలోకి లాగిన్ అవ్వడమే. అందువలన బ్లాగర్‌లోకి లాగిన్ అయి వుంటే, ఫ్రూగుల్‌లోకి కూడా లాగిన్ అయినట్లే. ఫ్రూగూల్.కామ్ సేవలు వినియోగించుకోవడానికి, ఆ వెబ్ సైట్‌లో ప్రత్యేకంగా నమోదు చేసుకోనక్కరలేదు, గూగుల్ ఖాతాలోకి లాగ్-ఇన్ అయ్యి వుంటే చాలు.
|
మీ తక్షణ వార్తాహరుడి (Instant messenger) గుర్తింపు | |
తక్షణం వార్తలను చేరవెయ్యడం కోసం మీరు వుపయోగిస్తున్న తక్షణ వార్తాహరుడి ప్రోగ్రామ్ (Instant messenger) లో (యాహూ, గూగుల్ టాక్ మొదలగునవి) గుర్తింపును యిక్కడ చేరిస్తే అది మీ వ్యక్తిగత సమాచార పుటలలో, మిమ్ములను కలవడానికి వుపయోగపడే సమాచారము గల విభాగములో ప్రదర్శించబడుతుంది.
మీరు చేర్చిన గుర్తింపులో వున్న, తక్షణ వార్తాహరుడి సేవనందించే సంస్థను బట్టి, కొన్నింటికి మీ గుర్తింపు లంకెగా ప్రదర్శించబడుతుంది. మీ వ్యక్తిగత సమాచార పుటను వీక్షిస్తున్న పాఠకుడు ఆ లంకె మీద క్లిక్ చేసినట్లయితే, సంబంధిత పుట లేక ఆ వార్తాహరుడి ప్రోగ్రామ్ తెరవబడుతుంది. సంబంధిత వార్తాహరుడి ప్రోగ్రామ్ తెరవబడాలంటే, పాఠకుడి కంప్యూటర్లో బ్రౌజర్ నుండి అది తెరవబడేటట్లు అమర్చబడి వుండాలి. |
మీస్థానం | |
|
మీ పని/వృత్తి | |
మీ పని/వృత్తికి సంబంధించిన సమాచారం తెలియచేయడం వలన, బ్లాగర్ వినియోగదారులు, మీ రంగంలో పని చేసే వారి కోసం శోధిస్తున్నట్లయితే, వారికి మీ వ్యక్తిగత సమాచారం అందుకోవడానికి అవకాశం వుంటుంది. అక్కడ యివ్వబడ్డ రంగముల వర్గీకరణ చాలా విశాలమయినది. అక్కడ నిక్షిప్త పరచిన రంగములలో ఒక దానిని, మీకు సంబంధిత రంగముగా ఎంచుకోవచ్చు.
మీరు పని/వృత్తికి సంబంధించిన అవగాహన కలుగచేయుటకోరకు, మీ పని లక్షణం గురించి కొద్దిపాటి వర్ణనను occupation గుర్తు గల అక్షర పేటికలో చేర్చవచ్చు. మీ రంగాన్ని మీరు నిర్దేశించి వుంటే, మీ వ్యక్తిగత సమాచారమును ప్రదర్శించే పుట, దానిని ఒక లంకెలాగా ప్రదర్శిస్తుంది. ఆ లంకె మీ వ్యక్తిగత సమాచార పుటను వీక్షిస్తున్న వారు అదే రంగానికి చెందిన యితర బ్లాగర్లను, రంగము ఆధారంగా శోధించడం కోసం వుపయోగపడే పుటను అందుకోవడానికి వుపయోగపడుతుంది. |
మీ గురించి | |
|
మీ వ్యక్తిగత ఆశక్తులు | |
ఈ పొడిగించిన/విస్తరించిన సమాచారము, మీ వ్యక్తిత్వానికి అత్యుత్తమ వివరణ.
|
వ్యక్తిగత సమాచార శోధన | |
|
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౨౪(24) |