కొద్ది కాలం క్రితం, కిష్‌భవారాలో ముఖ్య పాత్ర పోషించే కొందరికి ఈ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ హడావుడిలో ఎక్కడో లోపం వుంది అని అనిపించి, అదేంటో తెలుసుకునే ఆలోచన చేయడం మొదలు పెట్టాము ఐటి మన జీవనాన్ని యింకా సౌకర్యవంతం చెయ్యాలి, మన పనులన్నీ యింకా తేలికగా ఐపోవాలి అని భావించాము ఐతే మరి లోపమెక్కడ? మనం పని చేసే విధానంలో అటువంటి సమూలమైన మార్పులు ఏమీ మనకు కనపడటంలేదే. మనం చూస్తున్న ఒకే సోకైన తేడా ఏమిటి అంటే కంప్యూటర్ల వాడకాన్ని చాలా చోట్ల చూస్తున్నాము (బహుశా ఉనికిని చూస్తున్నాము అంటే సబబేమో - అవి వున్నప్పటికి వాటిని వినియోగించుకోగలిగినంత మేర వినియోగించడం తక్కువగానే కనపడుతుంది)
ఈ ఐటి రాకతో విద్యార్జన ఖరీదైనదయిపోయింది, విద్యని అందించే ప్రక్రియలో ఖరీదైన సాంకేతిక సాధనాలను వినియోగిస్తున్నాము అనే ప్రచార ముసుగులో. కానీ అసలు నిజమేమిటంటే, విద్యనర్జించే ప్రక్రియలో దరిదాపు ఎటువంటి అభివృద్ది కనపడటం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం మనం కష్ఠమని భావించినవి యిప్పుడు, యింకా కష్ఠమైపోయాయి. మనం నేర్చుకునే విధానంలోకి ఒక విభిన్నమైన అర్జన (నేర్చుకునే) విధానం చొచ్చుకొచ్చింది. ప్రతిదానిని అది అంతే అని అనుకోవడం (ఒప్పుకోవడం) - మనకి కారణాలు తెలియవు, అది అంతే అని అనుకుని, నేర్చుకోవాల్సిందే. ఈ భావజాలానికి వేళ్ళు కంప్యూటర్ పరిఙ్ఞానం గడించడంలో వున్నాయి.
మేము ఒకే రకమైన ఆలోచనా విధానం కలిగి వున్న కొద్ది మందిమి, యిలా ఆలోచించాము
సమాచార శక్తికి ఉదాహరణకు:
అవును మనం ఒప్పుకోవలసిందే, విద్యనర్జించే ప్రక్రియలో కంప్యూటర్లను వినియోగించడం చాలా ఉపయోగకరంగా వుంటుంది. కంప్యూటర్లను ఉపయోగించడమంటే అర్ధం పాఠ్య పుస్తకాలలో వున్న పాఠాన్ని, కంప్యూటర్ సాఫ్ట్ వేర్ అని పేరు పెట్టి కంప్యూటర్ తెరల మీద చూడటం కాదు. అది నేర్చుకునే ప్రక్రియలో భాగంగా, కంప్యూటర్‌ను ఒక పరికరంగా/సాధనంగా విధ్యార్ధి, బోధకుడు/ఉపాధ్యయుడు, యిద్దరూ ఉపయోగించగలగడం. నేర్చుకునే/నేర్పే ప్రక్రియలో వినియోగించుకోవడానికి అసంఖ్యాకమైన అనుబంధ అంశాలను (చిత్రాలు, ప్రతిమలు, పటాలు, వీడియోలు, పరీక్షలు మొదలగునవి) సృష్ఠించుకోవడం కోసం కంప్యూటర్‌ను వినియోగించుకోవడం.
ఇంటర్న్ ట్ ఆగమనంతో, కొద్ది మంది చేసిన/సృష్ఠించిన పాఠాన్ని చాలా మంది ఉపయోగించుకోవడం సాధ్యమయ్యింది. మేము విఙ్ఞానాన్ని గడించడం కోసమ్ మనం ప్రస్తుతము అనుసరిస్తున్న విధానంలో లోపాలు చాలా వున్నాయి అని భావిస్తున్నాము. విద్యార్ధులు, వారి సిలబస్‌లో భాగంగా వున్న పాఠ్యాంశాలలో వున్న పరిఙ్ఞానాన్ని గడించడానికి, నిర్భందంగా యిన్నిన్ని గంటలు శ్రమ పడవలసిన అవసరం లేదని మా నమ్మకం యిక్కడ అవసరమైనదేమి అంటే, విద్యార్ధులకు వారి పాఠ్యాంశాలకు అనుబంధంగా, అర్ధిక భారం లేకుండా వుపయోగించుకోగలిగిన పాఠం
మేము కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగంలో వున్న ఉచిత, బహిర్గత మూలం (ఓపెన్ సోర్స్) ఉద్యమాలను గౌరవిస్తాము. అందుకని, ఇంటర్న్‌ట్ ద్వారా వుచితంగా అందుకోగలిగిన వనరులను నిర్మించే ప్రయత్నంలో వున్నాము. యివి భూగోళం మీద ఎక్కడెక్కడో వున్న, పనిని సృజనాత్మకంగా చేయగల అనేక మంది సమైఖ్యంగా వెచ్చించిన శ్రమను కూర్చి, నెర్చుకునే ప్రక్రియలో సరళతను తీసుకురావడం లక్ష్యంగా సృష్ఠిస్తున్న, వుచితంగా వినియోగించుకోదగ్గ వనరులు. ఇంటర్న్‌ట్‌ను వుపయోగించుకోవడానికి అయ్యే ఖర్చును యింకా తగ్గించగలమని ఆశిద్దాం.
యిక్కడ మేము ఫలవంతమైన పాత్ర పోషించగలమనుకున్నాము. దానిలో భాగమే మేము చేసే ఈ చిన్న ప్రయత్నం.
యింకా మమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోవాల్సిన అవసరం వుంటే, మా వ్యవహారాల అధికారిని సంప్రదించండి.
ఈ-టపా : nerputeam@gmail.com
భౌగోళిక టపా : క్రిష్‌భవారా, 04-54-94, నెహ్రూ రోడ్, తెనాలి - 522201, ఆంద్ర ప్రదేశ్, భారత దేశం.
దూరశ్రవణం : 91-8644-227472
© ప్రతి హక్కులు : క్రిష్‌భవారా అన్ని హక్కులు కలిగి వున్నది,