Bookmark and Share

సభ్యత్వం:బ్లాగ్‌కు రచయిత/పాఠకులను చేర్చుట, ఈ-టపా ద్వారా పోస్ట్ చేయుట

 
ముందు పుట ... ౨౪ (24)
ఆహ్వానం పంపడం : రచయితలను చేర్చడం/తొలగించడం  
 
ఒక బ్లాగ్ ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది రచయితల/గ్రంధకర్తలతో (బ్లాగర్లతో) ప్రచురించబడవచ్చు. బ్లాగ్‌లో పోస్ట్ చేయదగ్గ ప్రతీ వ్యక్తికి విడిగా ఒక గూగుల్ ఖాతా వుండాల్సిందే.

మీ బ్లాగ్‌కు రచయితలను చేర్చడానికి సంబంధించిన అమరికలన్నీ settings విభాగములోని, permissions ఉప విభాగపు పుటలో పొందుపరచబడి వున్నాయి. మీ బ్లాగ్‌లో ప్రచురణలు చేయమని మీరు ఆహ్వానించదలచిన వారి ఈ-టపా చిరునామాను యిక్కడ చేర్చిన వెంటనే, బ్లాగర్ ప్రోగ్రామ్, ఒక ఆహ్వాన సందేశం కలిగి వున్న, ఈ-టపాను ప్రతి ఒక్కరికి విడివిడిగా పంపుతుంది.

• రచయితలను తొలగించడం

రచయితలను తొలగించడానికి, రచయితల జాబితాలో, వారి పేరు ప్రక్కన వున్న remove లంకె మీద క్లిక్ చేయండి.

• యితర రచయితలకు బ్లాగ్ నిర్వాహకుడి స్థాయిని కల్పించడం

ఒక బ్లాగ్ సృష్టించిన వారు కాక, ఆహ్వానం మీద రచయితగా చేరిన బ్లాగ్ రచయితను కూడా, బ్లాగ్ నిర్వాహకుడిని చెయ్యవచ్చు. ఇలా నిర్వాహకుడి హోదా కల్పించబడ్డ బ్లాగర్‌కు ఆ బ్లాగ్‌ను సృష్టించిన వారికున్న అన్ని యాజమాన్య హక్కులు కల్పించబడతాయి. బ్లాగ్‌ను తొలగించే హక్కు తప్ప.

పుట అంశాలు »  

ఆహ్వానాన్ని మన్నించి రచయిత హోదా పొందడం  
 
ఆహ్వానించబడ్డ వారు, ఒక లంకె కలిగిన ఈ-టపా సందేశం అందుకుంటారు. లంకెకు సంబంధించిన ప్రదర్శిత అక్షర పాఠమే (display text) లంకె యూఆర్‌ఎల్. ఆహ్వానాన్ని అందుకున్న వారు, ఆహ్వానాన్ని మన్నించదలిస్తే, వారు ఆ లంకెనుపయోగించి గాని, లేదా ఆ లంకె యొక్క ప్రదర్శిత అక్షర పాఠాన్ని వెబ్ చిరునామాగా వుపయోగించడం ద్వారా గాని ఆ లంకె సూచిస్తున్న పుటను తెరవవలసి వుంటుంది.

• అతిధి హోదా కలిగిన రచయితల హక్కులు

పుట అంశాలు »  

బ్లాగ్‌ను అంతరంగిక బ్లాగ్‌ను చేయుట : పఠనాన్ని పరిమితం చెయ్యడం  
 
సాధారణంగా మీ బ్లాగ్‌ను మీ బ్లాగ్ యూఆర్‌ఎల్ తెలిసినవారెవ్వరైనా ఇంటర్నెట్ ద్వారా అందుకోవచ్చు.

మీరు మీ బ్లాగ్ పఠనం మీద పరిమితులు విధించి, కేవలం మీ బ్లాగ్ రచయితలు మాత్రమే దానిని పఠించగలిగేటట్లు చెయ్యవచ్చు.

మీరు మీ బ్లాగ్ పఠనం మీద పరిమితులు విధించి, మీ బ్లాగ్ రచయితలు కాక కేవలం మీరు ఆహ్వానించిన వారు (పఠనానికి) మాత్రమే మీ బ్లాగ్‌ను చదవగలిగేటట్లు చెయ్యవచ్చు.

పుట అంశాలు »  

ఈ-టపా ద్వారా బ్లాగ్‌కు పోస్ట్ చెయ్యడం  
 
మీరు బ్లాగర్ వెబ్‌ సైట్‌లోకి లాగిన్ అవ్వనవసరం లేకుండా, మీ బ్లాగ్‌లో పోస్ట్​లు ప్రచురించవచ్చు. దీనికి అవసరమైన అమరికలను మీరు అమర్చినట్లయితే.

బ్లాగ్‌లో పోస్ట్ చేయడానికి మీరు పంపిన ఈ పాలోని, విషయము (subject) బ్లాగ్ పోస్ట్ యొక్క శీర్షిక అవుతుంది మరియు ఈ-టపా యొక్క ముఖ్య భాగం బ్లాగ్ పోస్ట్ ముఖ్య భాగం అవుతుంది. ప్రతి రచయిత బ్లాగ్‌లో పోస్టు చేయుటకు సొంత చిరునామా వినియోగించుకోవచ్చు. కాబట్టి, పోస్ట్ ఏ చిరునామాకు వచ్చింది అన్న దాని బట్టి రచయిత పేరును అనువర్తించి, వారిని పోస్ట్ ప్రచురణ కర్తగా, పోస్ట్ పాద భాగంలో చేరుస్తుంది.

ఈ-టపా ద్వారా పంపబడ్డ పోస్ట్​ను నేరుగా ప్రచురించబడేటట్లు అమర్చవచ్చు. లేనిచో మీరు పంపిన ఈ-టపా సందేశం, పోస్టు చిత్తు ప్రతిగా భద్రపరచబడుతుంది. మీరు ఈ-టపాలో అంతఃస్థాపన చేసిన ప్రతిమలు ఏమన్నా వుంటే అవి ప్రదర్శించబడవు. పైపెచ్చు, సొగసుగా కనపడే రూపాలున్న అక్షర శైలిని ఎంచుకోకుండా వుంటే మంచిది. అవి వున్నవి వున్నట్లుగా వెబ్ పుటలలో ప్రదర్శించబడకపోవచ్చు.

అనువాదం :: నేర్పు జట్టు ఈ పుటకు ఆంగ్ల మూలం ... తరువాతి పుట ౨౬(26)

పుట అంశాలు »  
Bookmark and Share

© All rights reserved.

♣ Site optimized for ♣ Internet Explorer 7 ♣ Firefox 2.0 and above