గుణాలను ఎక్కడ చేర్చాలి | |
• <object>
<object> గుర్తుకు కొన్ని గుణాలను <object> గుర్తు లోపలే చేరుస్తాము.
మిగిలిన గుణాలన్నీ ఒక ప్రత్యకమైన గుర్తు (param) ని వుపయోగించి (object) అంశం యొక్క పాఠంగా చేరుస్తాము. అనగా మొదలు గుర్తు <object>, చివర గుర్తు </object> మధ్యలో. <param>, <param name="-" value="__"> రూపం కలిగిన ఒక ఖాళీ అంశం. ఇది <object> అంశానికి గుణాలను చేకూర్చడానికి వుపయోగపడుతుంది. • <embed>
<embed> గుర్తుకు అన్ని గుణాలు మొదలు గుర్తులోనే చేర్చాలి
|
వీడియోకు అవసరమైన గుణాలు | |
ప్లాష్ మూవీని వెబ్ పుటలలో అంతఃస్థాపన చేసేటప్పుడు ఈ క్రింది గుణాలను <object><embed> గుర్తులలో చేర్చవలసి వుంటుంది.
• ఫ్లాష్ మూవీ యొక్క వెడల్పు - ఎత్తు
ఈ విలువను పిక్సెల్స్‌లో కాని (object/embed) అంశాన్ని కలిగి వున్న HTML మాతృ అంశం యొక్క % గా గాని నిర్దేశించవచ్చు.
• బ్రౌసర్ వుపయోగించవలసిన ACTIVEX నియంత్రణ
ఈ గుణం బ్రౌజర్‌కు వీడియోను ఆడించడానికి అవసరమైన ACTIVEX నియంత్రణను గుర్తించడానకి వుపయోగపడుతుంది. ఈ గుణం నిర్వచించబడి లేనట్లయితే బ్రౌసర్ వీడియో ఫైల్ శీర్షంలో వున్న సమాచారాన్ని లేదా ఫైల్ పేరు పొడిగింపును బట్టి వుపయోగించవలసిన ACTIVEX నియంత్రణను నిర్ధారించుకుంటుంది.
• CODEBASE/PLUGINSPACE: అవసరమైతే దించుకోవలసిన ఫ్లాష్ ప్లేయర్ సాఫ్ట్వేర్ స్థానం
• చిత్రం యూఆర్‌ఐ
ఈ గుణం నింపవలసిన వీడియో యూఆర్‌ఐను నిర్దేశిస్తుంది
|
వీడియోకు ఐచ్చిక గుణాలు | |
• సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ కోడ్‌లో వుపయోగించడానికి HTML అంశానికి గుర్తింపు
ఈ గుణం ఫ్లాష్ మూవీ/వీడియో కలిగి వుండే HTML అంశాన్ని, స్క్రిప్ట్ కోడ్‌ను వుపయోగించి సంభాళించగలగడానికి అవసరమైన గుర్తింపును నిర్దేశింస్తుంది.
• నిండగానే స్వయంచాలకంగా ఆడటాన్ని - సశక్త/నిరర్ధ పరచడం
ఈ గుణం వీడియో ఫైల్ నింపబడగానే దానిని ఆడించడం మొదలు పెట్టమని బ్రౌసర్‌కు నిర్దేశించడానికి వుద్దేశించబడింది.
TRUE - ఆడించు, FALSE - ఆడించొద్దు. ఈ గుణం నిర్దేశించబడి లేకపోతే వుపయోగించబడే విలువ TRUE • వలయంలో (loop) : వీడియో/చిత్రాన్ని నిరంతరంగా ఆడిస్తూనే వుండటం.
ఈ గుణం వీడియోను చివరి చట్రం వరకు ఆడించబడ్డాక ఆపివేయాలా లేక నిరంతరంగా ఆడిస్తూనే వుండాలా అనే విషయాన్ని నిర్దేశిస్తుంది.
TRUE - నిరంతరంగా ఆడిస్తూవుండు, FALSE - చివరి చట్రం ఆడించిన తదుపరి ఆగిపో. ఈ గుణం నిర్దేశించబడలేకపోతే వుపయోగించబడే విలువ FALSE . • లీనం
సాధారణంగా వీడియో/మూవీ గవాక్షంలో కేంద్రీకరించబడి (centered) వుంటుంది. గవాక్షం పరిమాణం వీడియో మూవీ పరిమాణంకంటే తక్కువైతే వీడియో అంచులు కత్తిరించబడతాయి/సవరించబడతాయి.
ఈ గుణం మూవీ/వీడియోను సంబంధిత అంచుకు లీనం చేసి అవసరమైన విధంగా మిగిలిన అంచులను కత్తిరిస్తుంది/సవరిస్తుంది.
ఈ గుణానికి వినియోగించగలిగిన విలువలు - l, r, t, b (వరుసగా ఎడమ, కుడి, పైన, క్రింద అంచులను సూచిస్తాయి.)
ఈ గుణానికి వినియోగించగలిగిన విలువలు - l, t, r, b, tl, tr, bl, br (వరుసగా ఎడమ, పైన, కుడి, క్రింద, పైన ఎడమ వైపు, పైన కుడి వైపు, క్రింద ఎడమ వైపు, క్రింద కుడి వైపును సూచిస్తాయి.)
l, r, t, b లు అనువర్తిస్తే, మూవీ/వీడియో సంబంధిత అంచుకు లీనమయ్యి, అవసరమైన విధంగా అంచులు కత్తిరించబడాతాయి/సవరించబడతాయి. tl, tr లు అనువర్తిస్తే, మూవీ/వీడియో సంబంధిత మూలకు లీనమయ్యి, అవసరమైన విధంగా క్రింది భాగం, మిగిలిన కుడి/ఎడమ అంచులు కత్తిరించబడాతాయి/సవరించబడతాయి. bl, br లు అనువర్తిస్తే, మూవీ/వీడియో సంబంధిత మూలకు లీనమయ్యి, అవసరమైన విధంగా పై భాగం, మిగిలిన కుడి/ఎడమ అంచులు కత్తిరించబడాతాయి/సవరించబడతాయి. • సౌష్టవంగా పరిమాణ సవరణ
వుపయోగించదగ్గ విలువలు
• చిత్రానికి నేపధ్య వర్ణం
ఈ గుణం ఫ్లాష్ ప్లేయర్‌లో నిర్దేశించబడ్డ నేపధ్య వర్ణం అమరికను అధిగమించడానికి వినియోగిస్తాము. ఈ గుణం వెబ్ పుట నేపధ్య వర్ణాన్ని ప్రభావితం చెయ్యదు.
ఇక్కడ వుపయోగించదగ్గ విలువలు #RRGGBB నమూనాలో వుండే 6 అంకెల షడ్దశ (hexadecimal) విలువలు (ఉదా: #128A4F) • యూఆర్‌ఎళ్ళకు మూల డైరెక్టరీ
ఈ గుణం ఫ్లాష్ చిత్రంలో భాగంగా చేర్చబడ్డ, సంబంధంగా సంబోధన విధానంలో వ్రాయబడి వున్న యూఆర్‌ఎళ్ళకు వుపయోగించవలసిన మూల డైరెక్టరీ/ఫోల్డర్ యొక్క యూఆర్‌ఎల్‌ను నిర్దేశిస్తుంది.
ఇది ఫ్లాష్ చిత్రంలో చేర్చబడ్డ యూఆర్‌ఎళ్ళకు సంబంధించినంతవరకు Html డాక్యుమెంట్‌లో శీర్ష భాగంలో చేర్చబడే <Base href="__"> గుర్తు పనిచేసినట్లే పనిచేస్తుంది. సంబంధంగా సంబోధన విధానంలో వ్రాయబడ్డ యూఆర్‌ఎళ్ళకు సంబంధించినంతవరకు, ప్రస్తుతపు స్థానం అంటే యిక్కడ చేర్చబడ్డ యూఆర్‌ఎల్ సూచించే స్థానం అవుతుంది. ఆ ఫ్లాష్ ఫైల్ వున్న ఫోల్డరు కాదు. • ప్లేయర్ గవాక్ష విధం
ఈ లక్షణం ఫ్లాష్ చిత్రానికి బ్రౌసర్‌లో గవాక్ష విధం లక్షణాన్ని (పారదర్శకత, పొరలు వెయ్యడం, స్థితి నిర్ధారించడం వంటివి) అనువర్తించడానికి వుపయోగిస్తారు. వుపయోగించదగ్గ విలువలు -
• చిత్రాన్ని నింపేటప్పుడు జావాను మొదలుపెట్టు
ఈ గుణం బ్రౌసర్‌కు, ఫ్లాష్ ప్లేయర్‌ను మొట్ట మొదటి సారి పనిచేయించడం మొదలు పెట్టేటప్పుడు జావాను మొదలు పెట్టాలా వద్దా అనే విషయాన్ని తెలియచేస్తుంది.
వినియోగించదగ్గ విలువలు, True, False ఈ గుణం చేర్చకపోతే బ్రౌసర్ False విలువను అనువర్తించుకుంటుంది. • వీడియో ఆడించబడే వేగం, ప్రదర్శన శ్రేష్ఠత
ఈ గుణం బ్రౌసర్‌కు వీడియోను ఆడించవలసిన వేగం, ప్రదర్శించవలసిన శ్రేష్ఠత నిర్దేశించడానికి వుపయోగపడుతుంది. వినియోగించదగ్గ విలువలు
• సందర్భోచిత జాబితాలో ప్రదర్శించబడవలసిన ఐచ్చికలు
ఈ గుణం చిత్రానికి సంబంధంగా ప్రదర్శించబడే సందర్భోచిత జాబితాలో అన్ని ఐచ్చికలు ప్రదర్శించాలా వద్దా అనే విషయాన్ని బ్రౌసర్‌కు నిర్దేశిస్తుంది. సందర్భోచిత జాబితా చిత్రం వైపు మౌస్ పాయింటర్‌తో చూపుతూ, కుడి మౌస్ బటన్‌పై క్లిక్ చేసినట్లయితే ప్రదర్శించబడుతుంది.
వినియోగించదగ్గ విలువలు; TRUE - అన్ని ఐచ్చికలను ప్రదర్శించు, FALSE - కనిష్ట ఐచ్చికలను మాత్రమే ప్రదర్శించు. ఈ గుణాన్ని చేర్చనట్లయితే TRUE అన్వయించబడుతుంది.
|
ఆడియో అంతఃస్థాపనకు గుణాలు | |
• వెడల్పు - ఎత్తు
ఈ గుణం ఆడియో అదుపు మండలి (control panel) యొక్క వెడల్పును పిక్సెల్స్‌లో నిర్దేశిస్తుంది. వినియోగించదగ్గ అత్యంత అనుకూలమైన విలువ 144 px ఈ విలువతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఒక సహేతుకమైన, నెట్‌స్కేప్ నావిగేటర్ ఒక ప్రామాణికమైన అదుపు మండలిని ప్రదర్శిస్తాయి.
ఇంతకంటే తక్కువ విలువ వుపయోగించినట్లయితే అదుపు మండలి, నరికివేసినట్లు కనబడుతుంది. అసలు వెడల్పు నిర్దేశించకపోయినా యిలాంటి ప్రభావమే కనబడుతుంది. ఇంతకంటే ఎక్కువ విలువ వుపయోగించినట్లయితే అదుపు మండలికి కుడివైపున ఖాళీ ప్రదేశం చేర్చబడుతుంది.
ఈ గుణం ఆడియో అదుపు మండలి (control panel) యొక్క ఎత్తును పిక్సెల్స్‌లో నిర్దేశిస్తుంది. వినియోగించదగ్గ అత్యంత అనుకూలమైన విలువ 60 px. ఈ విలువతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఒక సహేతుకమైన నెట్‌స్కేప్ నావిగేటర్ ఒక ప్రామాణికమైన అదుపు మండలిని ప్రదర్శిస్తాయి.
ఇంతకంటే తక్కువ విలువ వుపయోగించినట్లయితే అదుపు మండలి, నరికివేసినట్లు కనబడుతుంది. అసలు ఎత్తు నిర్దేశించకపోయినా యిలాంటి ప్రభావమే కనబడుతుంది. ఇంతకంటే ఎక్కువ విలువ వుపయోగించినట్లయితే అదుపు మండలికి పైభాగంలో ఖాళీ ప్రదేశం చేర్చబడుతుంది. • ఆడియో ఫైల్ యూఆర్‌ఎల్/యూఆర్‌ఐ
ఈ గుణం దించుకోవలసిన ఆడియో ఫైల్ యూఆర్‌ఐను నిర్దేశిస్తుంది.
• లీనం
ఈ గుణం అదుపు మండలం ఎలా లీనమవ్వాలో నిర్దేశిస్తుంది. అదుపు మండలికి లీనం ఏర్పాటు చెయ్యడం ప్రతిమలకు యిటువంటి లక్షణం చేకూర్చడం లాంటిదే.
వుపయోగించదగ్గ విలువలు Left, Right, Top, Bottom, Center, Baseline, Texttop, Middle, Absmiddle, Absbottom. • సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ కోడ్‌లో వుపయోగించడానికి HTML అంశానికి గుర్తింపు
ఈ గుణం embed Html అంశాన్ని, స్క్రిప్ట్ కోడ్‌ను వుపయోగించి సంభాళించగలగడానికి అవసరమైన గుర్తింపును నిర్దేశింస్తుంది.
• అదుపు మండలిని చూపు/దాచు
ఈ గుణం అదుపు మండలిని, వెబ్ పుటలో ప్రదర్శించాలా లేక దాచిపెట్టాలా అని, బ్రౌసర్‌కు నిర్దేశించడానికి వుపయోగపడుతుంది.
వుపయోగించదగ్గ విలువలు TRUE - దాచు, FALSE - చూపు . ఈ గుర్తును చేర్చనట్లయితే, బ్రౌసర్ FALSE అనువర్తించుకుంటుంది • Enabling/Disabling AUTOSTART on Loading
ఈ గుణం బ్రౌసర్‌కు ఆడియో ట్రాక్‌ను, దించుకోవడం పూర్తవ్వగానే పాడించడం మొదలు పెట్టాలా వద్దా అనే దానిని నిర్దేశించడానికి వుపయోగపడుతుంది.
వుపయోగించదగ్గ విలువలు - TRUE పాడించు, FALSE - పాడించొద్దు ఈ గుణం చేర్చబడిలేనట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో వినియోగించబడే సాధారణ విలువ TRUE నావిగేటర్‌లో వినియోగించబడే సాధారణ విలువ FALSE మ్యాకింతోష్ మషీన్లపై రెండు బ్రౌసర్‌లకు సాధారణ విలువ FALSE. • వలయంలో ఆడియో ట్రాక్‌ను నిరంతరంగా పాడించడం
ఈ గుణం నావిగేటర్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఇది ఆడియో ట్రాక్‌ను నిరంతరంగా పాడించాలా లేక ఒక సారి పాడించిన తదుపరి ఆపెయ్యాలా లేక నిర్దేశించినన్నిసార్లు పాడించిన తదుపరి ఆపయ్యాలా అనే దానిని నిర్దేశిస్తుంది.
వుపయోగించదగ్గ విలువలు : TRUE - నిరంతరంగా పాడిస్తూనే వుండు. FALSE - ట్రాక్ చివరకు చేరగానే పాడించడం ఆపెయ్యి. ఒక సంఖ్య - యిన్ని సార్లు పాడించు. ఈ గుణాన్ని చేర్చనట్లయితే, అనువర్తించుకునే విలువ FALSE.
ఈ గుణం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే పనిచేస్తుంది. ఇది ఆడియో ట్రాక్‌ను ఎన్ని సార్లు పాడించాలన్నది నిర్దేశిస్తుంది. యిక్కడ వుపయోగించే విలువ ఒక సంఖ్య. ఆ సంఖ్య నిర్దేశించినన్ని సార్లు బ్రౌసర్ ఆడియో ట్రాక్‌ను పాడిస్తుంది.
ఈ గుణాన్ని చేర్చనట్లయితే, అనువర్తించుకునే విలువ అనంతమైన సార్లు అని. అంటే నిరంతరంగా పాడిస్తూనే వుండమని నిర్దేశించినట్లవుతుంది.
• ధ్వని స్థాయి
ఈ గుణం (నావిగేటర్‌లో మాత్రమే పనిచేస్తుంది) ఆడియో ట్రాక్ ఎంత ధ్వని స్థాయిలో పాడించబడాలో నిర్దేశిస్తుంది.
వుపయోగించదగ్గ విలువలు 0 నుండి 100 పరిధిలో వుండాలి. ఈ గుణం నిర్దేశించబడకపోతే అన్వయించబడే విలువ 50. • మొదలు ప్రదేశం
ఈ గుణం (నావిగేటర్‌లో మాత్రమే పనిచేస్తుంది) ఆడియో ట్రాక్ ఎక్కడ నుండి పాడించడం మొదలు పెట్టాలో నిర్దేశిస్తుంది. మొదలు ప్రదేశాన్ని ట్రాక్ మొదలు నుండి నిమిషాలు (నిమిషంలో భాగాన్ని సెకండ్లలో) నిర్దేశించవలసి వుంటుంది.
నిర్దేశించిన ప్రదేశం నుండి ఆడియో ట్రాక్ పాడించడం మొదలవుతుంది. బ్రౌసర్ దానిని దించుకోవడం పూర్తవ్వగానే స్వయంచాలకంగా (autostart ను True ఎంచుకున్నట్లయితే) లేదా వినియోగదారుడు ప్లే బొత్తాన్ని మొట్ట మొదటిసారి క్లిక్ చేసినప్పుడు.. ఆడియో ట్రాక్ పొడవుకు మించిన సమయాన్ని నిర్దేశించినట్లయితే ఒక దోష సందేశం ప్రదర్శంచబడుతుంది. • అంతం ప్రదేశం
ఈ గుణం (నావిగేటర్‌లో మాత్రమే పనిచేస్తుంది) ఆడియో ట్రాక్ ఎక్కడ పాడించడం ఆపెయ్యాలో నిర్దేశిస్తుంది. అంతం ప్రదేశాన్ని ట్రాక్ మొదలు నుండి నిమిషాలు (నిమిషంలో భాగాన్ని సెకండ్లలో) నిర్దేశించవలసి వుంటుంది.
ఆడియో ట్రాక్ పొడవుకు మించిన సమయాన్ని నిర్దేశించినట్లయితే ఒక దోష సందేశం ప్రదర్శంచబడుతుంది. • PLUGINSPACE/PLUGINURL : అవసరమైతే సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలిగే ప్రదేశం
ఈ గుణం (నావిగేటర్‌లో మాత్రమే పనిచేస్తుంది) , సౌండ్ ఫైల్‌ను పాడించడానికి అవసరమైన ప్లగిన్ సాఫ్ట్వేర్ స్థానాన్ని తెలియచేస్తుంది.
ఈ గుణం (నావిగేటర్‌లో మాత్రమే పనిచేస్తుంది) , అవసరమైన ప్లగిన్ స్థాపించడానికి అవసరమైన సాఫ్ట్వేర్ స్థానాన్ని తెలియచేస్తుంది.
• అదుపు మండలిలో ఒక యూఆర్‌ఎల్‌కు లంకె
ఈ గుణం (ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే పనిచేస్తుంది) ఆడియో అదుపు మండలికి సంబంధంగా వున్న లంకెలో వాడబడే యూఆర్‌ఎల్‌ను నిర్దేశిస్తుంది.
పాఠకుడు ఆడియో అదుపు మండలికి సంబంధంగా వున్న జాబితాలోని open this link ఐచ్ఛికాన్ని క్లిక్ చేసినట్లయితే, ఈ యూఆర్‌ఎల్ సూచించే వనరుకు తోడ్కొని పోబడతాడు.
|
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు అంగ్ల మూలం |