ముందు పుట ... ౨౭ (27) |
బ్లాగర్ జోడింపులు అనగా నేమి? బ్లాగ్‌లో వాటిని ఎలా చేరుస్తారు? | |
బ్లాగర్, బ్లాగర్.కామ్ వెబ్ సైట్‌లో వున్న సాఫ్ట్వేర్ ద్వారా మీకు అందుబాటులోకి తెచ్చిన అనేకమైన సదుపాయాలు మీరు బ్లాగ్ సృష్ఠించుకోవడానికి, వాటిలో పోస్ట్‌లు సృష్టించడానికి, నిర్వహించడానికి, పాఠకుకులు పోస్టులపై వ్యాఖ్యలు చేయడానికి మీరు వ్యాఖ్యలు మట్టుపరచడానికి వుపయోగపడతాయి.
మీరు మీ బ్లాగ్‌లో జోడించడానికి/చేర్చడానికి, బ్లాగర్ లేదా యితర సంస్థలు (వెబ్ సైట్లు) అందించే అనేక యితర సదుపాయాలు కూడా మనకు అందుబాటులో వున్నాయి. యితర సంస్థలుఅందించే సదుపాయాలను స్క్రిప్ట్‌గా (జావా స్క్రిప్ట్) పిలవబడే కొద్దపాటి సాఫ్ట్వేర్ కోడ్ ద్వారా బ్లాగ్‌లో చేర్చుకుంటాము. • బ్లాగ్ జోడింపులను బ్లాగ్‌కు అనుసంధించడం.• శాస్త్రీయ మాదిరిని వుపయోగిస్తున్న బ్లాగ్‌లలో
మీ బ్లాగ్‌కు శాస్త్రీయ మాదిరిని వినియోగిస్తున్నట్లయితే మీకు html కోడ్‌ను సంభాళించడం చేతకావాలి. బ్లాగ్ జోడింపును బ్లాగ్‌లో చేర్చడానికి మాదిరి యొక్క కోడ్‌ను సవరించవలసి వుంటుంది.
• ఆధునిక విడ్జెట్ ఆధారిత బ్లాగ్‌లలో
మీ బ్లాగ్‌కు ఆధునిక విడ్జెట్ ఆధారిత మాదిరిని వినియోగిస్తున్నట్లయితే, బ్లాగ్ జోడింపును బ్లాగ్‌లో చేర్చడం సంబంధిత కోడ్‌ను ఒక పేటికలో చేర్చి ఆ పేటికను మీరు బ్లాగ్‌లో అది ఎక్కడ కనపడాలనుకుంటున్నారో అక్కడకు లాగి వదిలేయడమంత తేలిక.
మీరు వుపయోగించగలిగిన కొన్ని బ్లాగ్ జోడింపులు క్రింద వివరించబడినవి. |
బ్లాగర్ జోడింపులు : విజ్జెట్ ఆధారిత మాదిరి | |
మీ బ్లాగ్‌కు ఆధునిక విజ్జెట్ ఆధారిత మాదిరిని వినియోగిస్తున్నట్లయితే, బ్లాగ్‌లో జోడింపులను చేర్చడానికి అవసరమైన ఐచ్చికలు settings విభాగములోని Page Elements ఉప విభాగపు పుటలో వుంటాయి.
జోడింపును మీ బ్లాగ్‌కు ఒక విజ్జెట్ రూపంలో జోడించడానికి, సంబంధిత గవాక్షం తెరవబడేటట్లు చేయండి. సంబంధిత ఐచ్చికలను ఎంచుకోండి, దానిని భద్రపరచండి. తదుపరి ఆ జోడింపు మీ బ్లాగ్ పుటలో ఎక్కడ ప్రదర్శించబడాలనుకుంటున్నారనేదాని బట్టి దాని స్థానాన్ని మార్చండి.
|
గుర్తుల జాబితా | |
మీ బ్లాగ్‌లో వున్న అన్ని పోస్టుల మీద కలిపి వున్న గుర్తుల జాబితాను మీ బ్లాగ్‌లో ఒక విజ్జెట్ రూపంలో జోడింపు క్రింద చేర్చవచ్చు.
ఈ జాబితాను ఎన్ని సార్లయినా చేర్చవచ్చు (అన్నిసార్లు అదే జాబితా యొక్క నకలు మీరెంచుకున్న ప్రదర్శిత రూపంలో ప్రదర్శించబడుతుంది) మీ బ్లాగ్‌లో వున్న అన్ని పోస్టుల గురించిన అవగాహన పాఠకుడికి తెలియచేయడానికి యిది వుపయోగించవచ్చు. |
వీడియో కమ్మి | |
మీరెంచుకున్న అంశాలకు సంబంధించిన నాలుగు వీడియోలకు సంబంధించిన లఘుప్రతిమలు కలిగిన కమ్మిని (వీడియో కమ్మి) మీ బ్లాగ్‌లో జోడింపుగా చేర్చవచ్చు. ఇవి youtube.com మరియు గూగుల్ వీడియోస్‌లో వున్న వీడియోల నుంచి ఎంచుకోబడతాయి.
బ్లాగర్‌లో వున్న బ్లాగ్ చేర్పునుపయోగించి ఈ వీడియో కమ్మిని సృష్టించినట్లయితే అది నిలువుగా ఏర్పడుతుంది. ఈ కమ్మిని మీ యిష్టానుసారం ఏర్పరచుకోడానికి అందుబాటులో వున్న ఐచ్చికలు బహు కొద్ది. మీరు అడ్డంగా ఏర్పడే వీడియో కమ్మి వుపయోగించదలచినా, కమ్మి ఏర్పరచడానికి మీకు యింకా ఎక్కువ అదుపు కావాలని అనుకున్నా గూగుల్ అజాక్స్ శోధన API వుపయోగించి మీ యిష్టానుసారం ఏర్పరచుకోదగ్గ వీడియో కమ్మి లేదా వీడియో నియంత్రణను సృష్టించుకోండి. |
గూగుల్ అజాక్స్ శోధన API తో యిష్టానుసార వీడియో కమ్మి | |
• మాదిరి వీడియో కమ్మి
Loading...
Loading...
పాఠకుడు లఘుప్రతిమ మీద క్లిక్ చేసినట్లయితే, మీరు ప్లేయర్‌ను ఎక్కడ ప్రదర్శించబడేటట్లు ఏర్పరచారో అక్కడ వీడియో ప్రదర్శించబడుతుంది.
వీడియో కమ్మి/ప్లేయర్ సృష్టించుకొని యిష్టానుసారం ఏర్పరచుకోండి.
వీడియో కమ్మిని ఏర్పరచుకోవడానికి తేలికపాటి మార్గాలు, అనేక వీడియో కమ్ములు, లఘుప్రతిమ పరిమాణాన్ని అదుపు చేయడం, వర్ణాలు మరియు ఉన్నతస్థాయి శైలి రూపకల్పన, ప్లేయర్ పరిమాణాన్ని అదుపు చేయడం, యిష్టానుసారం శోధన పాఠం, స్వయంచాలంగా నడిపించబడే జాబితా. |
గూగుల్ అజాక్స్ శోధన API తో యిష్టానుసార వీడియో శోధన నియంత్రణ | |
• మాదిరి శోధన నియంత్రణ
Loading...
పాఠకుడు లఘు ప్రతిమ మీద క్లిక్ చేసినట్లయితే, సంబంధిత వీడియో, లఘు ప్రతిమల జాబితా పైన ప్లేయర్‌లో ప్రదర్శించబడుతుంది.
వీడియో శోధన నియంత్రణను సృష్టించుకొని యిష్టానుసారం ఏర్పరచుకోండి.
అనేక వీడియో శోధన నియంత్రణలు, లఘు ప్రతిమ పరిమాణాన్ని అదుపు చేయడం, వర్ణాలు మరియు ఉన్నతస్థాయి శైలి రూపకల్పన, ప్లేయర్ పరిమాణాన్ని అదుపు చేయడం, యిష్టానుసారం ఏర్పరచిన అక్షర మాలలు, స్వయంచాలంగా నడిపించబడే జాబితా. |
ఫీడ్ రీడర్ | |
ఇది బ్లాగర్ జోడింపులలో భాగంగా వున్న తేలికపాటి ఫీడ్ రీడర్. ఇది ఫీడ్ శీర్షిక, లంకె, తేదీ వివరాలను ప్రదర్శించగలుగుతుంది. దీనిని బ్లాగ్‌లో విజ్జెట్ రూపంలో చేర్చవచ్చు.
ఇవి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని చేర్చుకోవచ్చు. అయితే ఒక్కొక్క జోడింపు ఒక్క ఫీడ్‌ను మాత్రమే సంభాళించగలదు. ఒక్కొక్క జోడింపు ఒక ఫీడ్‌లోని మొదటి 5 అంశాల వరకు ప్రదర్శిస్తుంది. పూర్తిస్థాయి సత్తా కలిగిన ఫీడ్ రీడర్ వుపయోగించదలుచుకున్నా లేక ప్రదర్శించబడే అంశాలపై ఎక్కువ అదుపు కావాలనుకున్నా, గూగుల్ అజాక్స్ ఫీడ్ API వుపయోగించి యిష్టానుసారం రూపకల్పన చేయగలిగే ఫీడ్ రీడర్‌ను సృష్టించుకోండి. |
గూగుల్ అజాక్స్ API తో: ఇష్టానుసారం ఏర్పరచుకోగలిగిన ఫీడ్ రీడర్ | |
ఫీడ్ రీడర్‌ను సృష్టించి, ఇష్టానుసారం రూపకల్పన చేయండి
అనేక ఫీడ్స్, ప్రదర్శించవలసిన అంశాలు, ఫీడ్ శోధన జోడించడం. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౨౯ (29) |