Bookmark and Share

సర్వర్ లాగ్, తట్టు - సమాచార పలక, వెబ్ గణాంకాలు

 
ముందు పుట ... ౨౯ (29)
సర్వర్ లాగ్ : పుట తగిలింపులు  
 
ఇంటర్నట్ (వెబ్) అభివృద్ది చెందుతున్న దశలలో, ఎక్కువగా ప్రాధాన్యమిచ్చి సమీకరించిన గణాంకం కక్షిదారు (client) కంప్యూటర్ సర్వర్‌కు పంపిన వినతులు ఎన్ని అనేది. దీనినే సర్వర్ కంప్యూటర్‌కు వచ్చిన తట్టుల (hits) సంఖ్య అంటారు. ఇది ఒక వెబ్ సైట్ యొక్క పనితీరును గురించిన సహేతుకమైన అవగాహన కలుగచేసేది. వెబ్ అభివృద్ది చెందుతున్న మొదటి దశలలో వెబ్ పుటలలో చిత్రాలు/ప్రతిమలు మరియు యితర అంశాలు (objects) వుండేవి కావు. వెబ్ పుటలు కేవలం అక్షర పాఠం మాత్రమే కలిగి వుండేవి. ఈ కారణంగా మొత్తం వెబ్ పుటను బ్రౌజర్ ఒక వినతితోనే తెచ్చుకోగలిగేది.

• తట్లు : పుట వీక్షణలు

వెబ్ పుటలలో వున్న పాఠం, ప్రతిమలు యితర వస్తువులు జోడించబడి యింకా సంపన్నమైనవిగా రూపాంతరం చెందిన కొలదీ, బ్రౌజర్ (కక్షిదారు కంప్యూటర్) ఒక పుటలోని పాఠం మొత్తాన్ని తెచ్చుకోవడానికై సర్వర్‌కు అనేక వినతులు చేయవలసిన అవసరం ఏర్పడింది.

అందువలన సర్వర్‌కు వచ్చిన వినతుల సంఖ్యను సర్వర్ నుండి కోరబడిన పుటల సంఖ్యతో సమానం అని అనుకోలేము. ఆ కారణంగా పుట దర్శనాలను, తట్లును విడదీసే ఆలోచన ఉద్భవించింది.

పుట వీక్షణలు, ఒక సర్వర్‌కు వెబ్ పుటల కొరకై ఎన్ని వినతులు వచ్చాయి అనే ఆలోచనను తెలియ చేస్తుంది. ఇవి లాగ్ విశ్లేషణలో వెబ్ పుటలుగా గుర్తించబడే ఫైళ్ళ కోసం సర్వర్ అందుకున్న వినతులు.

తట్లు, సర్వర్‌కు చేయబడ్డ మొత్తం వినతుల సంఖ్యను తెలియచేస్తాయి. ఇవి వెబ్ పుటగా పిలవబడే ఫైళ్ళు, ప్రతిమల ఫైళ్ళు, ధ్వని ఫైళ్ళు, css ఫైళ్ళు, స్క్రిప్ట్ ఫైళ్ళు, వీడియో ఫైళ్ళు మొదలగు వాటిలో వేటి కోసం చేసిన వినతులైనా అవ్వొచ్చు.

• సందర్శన/సందర్శకులు

ఒక వెబ్ సైట్‌ను సందర్శించిన వారు, అదే వెబ్ సైట్‌లోని అనేక పుటలను దర్శించవచ్చు. ఒక వెబ్ సైట్​ను సందర్శిస్తున్న సందర్శకుల సంఖ్యను లెక్కగట్టడానికి ఒక అదనపు విధానాన్ని సాధించారు.

ఒక కక్షిదారు కంప్యూటర్ నుండి ఒక క్రమంలో వెలువడుతున్న వినతులన్నింటిని ఒక సందర్శకుడు చేస్తున్న వినతులుగా పరిగణించబడతాయి. కొంత నిడివి (షుమారు 30 నిమిషాలు) క్రియా శూన్యతను (ఎటువంటి వినతులు లేకుండుట) బట్టి ఒక సందర్శకుడి సందర్శన పూర్తయినట్లు భావించబడుతుంది.

ఒక సర్వర్‌కు అదే రక్షిదారు కంప్యూటర్ నుండి 30 నిమిషములు నిడివి తరువాత యింకొక వినతి వచ్చినట్లయితే అది ఒక కొత్త సందర్శకుడు చేస్తున్న వినతిగా పరిగణించబడుతుంది.

• నిజం కాని వినతులు - శోధన యంత్ర సాలీడు సందర్శన

శోధన యంత్రాలలో (గూగుల్ శోధన ప్రోగ్రామ్ వంటివి) వుండే వెబ్ సాలీడు (spider) అని పిలవబడే ప్రోగ్రాములు, ఆ శోధన యంత్రాల సూచికలలో వున్న సమాచారాన్ని తాజాగా వుండేటట్లు చూసుకోవడం కోసం, వెబ్ సైట్లను సందర్శిస్తూ వుంటాయి. ఈ ప్రక్రియను శోధన యంత్రాలలోని వెబ్ సాలీడు [వెబ్ మరమనిషి (Robot)] వెబ్‌ సైట్లను పాకడం (crawling) అంటారు.

ఈ ప్రోగ్రామ్‌లకు సంబంధంగా సర్వర్‌కు వచ్చిన వినతులు/తట్లు సాధారణ మానవులు చేసిన వాటిని సూచించవు. ఒక వెబ్‌ సైట్‌కు వచ్చిన నిజమైన వినతులు తెలుసుకోవాలంటే, యిలాంటి వినతులు/తట్లు తీసివేయాల్సి వుంటుంది. ఇటువంటి తొలగింపు ప్రక్రియను వెబ్ విశ్లేషణ కొరకు వుపయోగించే సాఫ్ట్​వేర్, తెలిసివున్న శోధన యంత్రాల నుండి ఉద్భవించిన వినతులను/తట్లను తొలగించడం ద్వారా చెయ్యగలుగుతుంది.

• ముసుగులో వున్న వినతులు - ప్రతినిధులు, చలనశీల IP చిరునామాలు.

తొలుత ఒక కక్షిదారుని కంప్యూటర్ దాని IP చిరునామాతో గుర్తించబడేది. ప్రాతినిధిత్వ (proxy) పరిజ్ఞానం ఆగమనంతో చాలా కంప్యూటర్లు ఇంటర్నట్‌ను (ఇంటర్నెట్‌కు అనుసంధించబడివున్న సర్వర్లను) పరోక్షంగా ప్రాతినిధిత్వ సర్వర్ (Proxy server) అని పిలవబడే వెరే కంప్యూటర్ ద్వారా అందుకోవడం మొదలు పెట్టాయి. ఇటువంటి వ్యవస్థలో, అసలు సర్వర్‌కు చేయబడ్డ వినతులన్నీ ప్రాతినిధిత్వ సర్వర్ కంప్యూటర్ చేస్తున్నట్లుగా ముసుగు వేయబడ్ వుంటాయి. దీని వలన సందర్శకుల విలక్షణతను గుర్తించడం కష్టతరమైంది.

ఒక కక్షిదారు కంప్యూటర్ జాడ తెలుసుకోవడం, దాని నుండి వచ్చిన తరువాత వినతిని గుర్తించడం చలనశీల (dynamic) IP చిరునామాల వలన కూడా కష్టమైపోయింది. ఇంటర్నట్ సేవలనందించే సంస్థలు, కక్షిదారు కంప్యూటర్లర్లు వారి కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్‌కు అనుసంధానం ఏర్పరచుకునే సమయంలో వారికి IP చిరునామాలను చలనశీలంగా కేటాయిస్తారు. కక్షిదారు కంప్యూటర్ ఇంటర్నెట్ సేవా సంస్థ కంప్యూటర్ నుండి అసంగతమైనప్పుడు (disconnect) ఇలా కెటాయించబడ్డ IP చిరునామా వెనక్కి తీసుకోబడుతుంది. మరల అనుసంధానం ఏర్పరచుకున్నట్లయితే వున్న వాటిలో ప్రస్తుతము ఎవ్వరికీ కేటాయించబడనటువంటి చిరునామాను కేటాయిస్తుంది. (అదే IP చిరునామా కేటాయించబడాలని లేదు).

దీనివలన కక్షిదారు కంప్యూటర్ కొద్ది నిడివిలో అసంగతమై మళ్ళీ అనుసంధానం ఏర్పరచుకున్నట్లయితే. ఆ కంప్యూటర్‌కు వున్న IP చిరునామా ఒకటి కాకుండా వుండటానికి అవకాశం ఎక్కువగా వుంటుంది. తద్వారా సర్వర్ వారి నుండే వస్తున్న తదుపరి వినతులు సరికొత్త సందర్శకుడి నుండి వస్తున్నట్లుగా పరిగణించవలసి వస్తుంది.

ఈ సమస్యను అధిగమించడానికి, వెబ్ గణాంకాలను విశ్లేషించే సాఫ్ట్​వేర్, కక్షిదారు కంప్యూటర్లను గుర్తించడానికి కుకీలను వినియోగించడం మొదలు పెట్టింది.

• కోల్పోయిన సందర్శన - క్యాషింగ్

ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే వనరు (ఫైల్స్) దేనికోసమయినా సంబంధిత కంప్యూటర్‌కు వినతిని పంపమని ఒక బ్రౌసర్‌కు ఆదేశమిచ్చినప్పుడు (చిరునామా పట్టిలో సంబంధిత యూఆర్‌​ఎల్​ను చేర్చడం ద్వారా లేక లంకెను క్లిక్ చేయడం ద్వారా), అది వనరులను ఆ బ్రౌజర్ యింతకు ముందు తెచ్చి వుండి, అదే బ్రౌసర్ క్యాష్‌లో గనుక వున్నట్లయితే యిప్పుడు దానిని బ్రౌసర్ క్యాష్‌లో నుండి తెచ్చి ప్రదర్శిస్తుంది. వెబ్ సైట్‌కు వినతిని పంపదు. వినియోగదారుడు చేసిన వినతి వెబ్‌ సైట్‌కు చేరకపోవడం వలన వెబ్ సైట్ కొంత సందర్శన కోల్పోయినట్లే.

దీనివలన కొన్ని సార్లు సర్వర్ వినియోగదారుడు (కక్షిదారుడు) వెబ్ సైట్‌లోని వివిధ పుటలను సందర్శించడంలో, అతనిని అనుసరించడం (ఎక్కదినుండి ఎక్కడికి కదులుతున్నాడు అనే దానిని గమనించడం) ఆగిపోవచ్చు.

క్యాషింగ్‌ను సర్వర్‌లో తగిన అమరికలను ఎంచుకోవడం ద్వారా నిరోధించగలిగినప్పటికి, వినియోగదారుడి దృష్టిలో వెబ్ సైట్ యొక్క పనితీరు/సమర్ధత తగ్గిపోతుందనే వుద్దేశ్యంతో ఆ పని చెయ్యరు.

• సమాచారం గడించడానికి మార్గాలు

ఒక వెబ్‌సైట్ యొక్క పనితీరును విశ్లేషించేందుకు వుపయోగించే దత్తాన్ని రెండు మార్గాల ద్వారా గడిస్తారు. (1) సర్వర్ (కంప్యూటర్) లాగ్, మరియు (2) పుట తగిలింపు (page tagging) అనే ప్రక్రియలో (జావా) స్క్రిప్ట్​ను వుపయోగించడం ద్వారా.

• సర్వర్ లాగ్

బ్రౌసర్‌ వెబ్ సర్వర్‌ను అందుకున్నప్పుడల్లా, కక్షిదారు కంప్యూటర్‌కు, సర్వర్ కంప్యూటర్‌కు మధ్య చాలా వార్తాలాపం (సమాచార ప్రసరణ) జరుగుతుంది. ఇటువంటి వార్తాలాపాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సర్వర్ లాగ్ ఫైళ్ళ రూపంలో భద్రపరుస్తుంది. సర్వర్ స్క్రిప్ట్ వుపయోగించి ఈ లాగ్ ఫైళ్ళలోని సమాచారాన్ని సర్వర్‌పై భద్రపరచిన ఏ ఫైల్‌నుండయినా ప్రోగ్రామింగి కోడ్, పుపయోగించి అందుకోవచ్చు.

సర్వర్ లాగ్ నుండి గడించగలిగే సమాచారానికి ఉదాహరణ
సర్వర్ వేరియబుల్స్ నుండి ఆ సమాచారాన్ని గడించడానికి ఉపయోగపడే php కోడ్​కు వివరణతో

• పుట జోడింపు/తగిలింపు

సర్వర్ లాగ్ ఫైళ్ళను వుపయోగించి చేసే వెబ్ విశ్లేషణలో వున్న పరిమితులను, మరియు, ప్రాతినిధత్వం, వెబ్ పుట క్యాషింగ్, వెబ్ సైట్ పాకటం వంటి వాటివలన ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి (పుట తగిలింపు అనే) ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని సాధించారు.

ఈ విధానంలో వెబ్ సైట్‌లో వున్న ప్రతి పుట, ఒక సదృశ్య/అదృశ్య ప్రతిమతో పాటు కొంత (జావా) స్క్రిప్ట్ కోడ్‌ను కలిగి వుంటుంది. ప్రతిమ ఫైల్​కు వెబ్ పుటలను విశ్లేషిస్తున్న సాఫ్ట్​వేర్ కలిగిన సర్వర్ ఆతిధ్యమిస్తుంది. వెబ్ పుట కక్షిదారు కంప్యూటర్‌లో వున్న బ్రౌసర్‌లో నింపబడినప్పుడల్లా, బ్రౌసర్‌ ఆ ప్రతిమ కోసం (విశ్లేషణ అందజేస్తున్న సర్వర్‌కు) ఒక వినతిని పంపుతుంది.

ప్రతిమ కొరకు వినతితో పాటు, వెబ్ విశ్లేషణలో వుపయోగపడే సర్వర్ లాగ్‌లో దొరకని సమాచారాన్ని (రక్షిదారు తెర కొలతలు, వర్ణ సాంద్రత/లోతు, బ్రౌసర్‌ పేరు, మొదలగునవి) విశ్లేషణ సాఫ్ట్ వేర్ కలిగివున్న సర్వర్ కంప్యూటర్ గడిస్తుంది.

ఈ సమాచారం విశ్లేషించబడి, వెబ్ సైట్ సందర్శకుల గురించిన అవగాహన కలుగచేసే అనేక ప్రతిమలు, రేఖా పటాలు, సంఖ్యాత్మక విలువలు మొదలగు రూపాలలో ప్రదర్శించబడతాయి.

• సర్వర్ లాగ్ - పుట తగిలింపు

వెబ్ విశ్లేషణలో వుపయోగపడే సర్వర్ లాగ్, పుట తగిలింపు విధానాలు రెండింటికి కూడా ప్రయోజనాలు, ప్రతికూలాంశాలు రెండూ వున్నాయి.

సర్వర్ లాగ్ విశ్లేషణ అనాయాసంగా సర్వర్ లాగ్ ఫైళ్ళలో అందుబాటులో వున్న సమాచారాన్ని వుపయోగించుకుంటుంది.

పుట తగిలింపులు పని చేయాలంటే కక్షిదారు కంప్యూటర్ సమాచారం కొరకు చేయబడే వినతులకు బ్రౌసర్‌ స్పందించవలసి వుంటుంది. దీనికై బ్రౌసర్‌కు వున్న జావా స్క్రిప్ట్​ను నడిపే సత్తా సశక్త పరచబడి వుండాలి. (99%+ బ్రౌసర్‌లలో యిది సాధారణంగా సశక్త పరచబడే వుంటుంది).

పుట తగిలింపులు ఎక్కువ రకాలు/పరిమాణం గల సమాచారాన్ని గడించడానికి తద్వారా వెబ్ సైట్ సందర్శకుల గురించిన విశ్లేషణ చాలా రకాలుగా అందచేయడానికి వుపయోగపడుతుంది

పుట అంశాలు »  

తట్టు పలక  
 
తట్టు పలక, సంఖ్యాత్మక విలువలను ప్రదర్శించే ఒక పలక. ఇది వెబ్ సైట్‌ను ఎంతమంది సందర్శించారు అనే విలువను ప్రదర్శిస్తుంది. వెబ్ పుట విశ్లేషణను పుట తొలగింపు ద్వారా చేస్తున్నామనుకుంటే తట్టు పలకపై వున్న సంఖ్య పుటను సందర్శకులు ఎన్ని సార్లు వీక్షించారు/అందుకున్నారు అనేది తెలియచేస్తుంది. ఇది ఆ పుటలో చేర్చబడ్డ (సదృశ్య/అదృశ్య) ప్రతిమ కొరకు ప్రతిమకు ఆతిధ్యమిస్తున్న వెబ్‌సైట్‌కు వినతి ఎన్నిసార్లు పంపబడింది అనే దాని బట్టి లెక్క కట్ట గలుగుతుంది.

ఒక్కొక్క పుటకు లెక్కలు విడి విడిగా నిర్వహించనట్లయితే, ఆ సంఖ్య అన్ని పుటల మీద కలిపిన విలువను తెలియచేస్తుంది. దీనిని వెబ్ సైట్ మొత్తానికి ఎన్ని సందర్సనలు అని అర్ధం చేసుకోవాలి

వెబ్ సైట్ విశ్లేషణ కొరకు మీకు అందుబాటులో వున్న సరళమైన సాధనం యిదే.

వెబ్ గణాంకాలు  
 
సర్వర్ లాగ్ ఫైళ్ళలోని సమాచారాన్ని పుట తగిలింపు ద్వారా గడించిన సమాచారంతో జోడించి అనేక రకాలుగా విశ్లేషించవచ్చు. మీకు వెబ్ సైట్ యొక్క సందర్శకుల విశ్లేషణను అందించే వెబ్ సైట్లు చేసే పని యిదే. చాలా వెబ్ సైట్లు చిన్న వెబ్ సైట్లను విశ్లేషించడానికి సరిపడే ఉచిత ఖాతాను అందిస్తాయి. ఇది కొద్ది కాలానికి సంబంధించిన విశ్లేషణ మాత్రము కావాల్సిన వారికి కూడా వుపయోగపడుతుంది.

మీరు విశ్లేషణ ఎక్కువ కాలానికి కావాలనుకున్నట్లయితే, యిటువంటి విశ్లేషణ అందించే వెబ్ సైట్లలో వాణిజ్య ఖాతాను కొనుగోలు చేయవలసి వుంటుంది.

ఈ సేవలను పొందుదామనుకున్న వెబ్ సైట్​లో నమోదు చేసుకోండి. మీ వెబ్‌-సైట్/బ్లాగ్‌కు సంబంధించిన కొంత ప్రాధమిక సమాచారాన్ని సమర్పించి, మీ ప్రాధాన్యాలను ఎంచుకోండి. చివరకు ప్రదర్శించబడే కోడ్‌ నకలును తీసికొని, మీరు సందర్శకుల విశ్లేషణ కావాలనుకున్న పుటలో అతికించండి.

గణాంకం ఏమి తెలియచేస్తుంది
ఎక్కువ ఆదరణగల పుటలు అన్నింటికంటే ఎక్కువ సార్లు వీక్షించబడ్డ పుటలు
ప్రవేశ పుటలు సందర్శకులు సైట్​లో మొట్టమొదట వీక్షించిన పుట
నిష్క్రమణ పుటలు సందర్శకులు సైట్​లో వీక్షించిన చిట్ట చివరి పుట
ఎక్కడ నుండి సందర్శకులు మీ సైట్​లోని పుటకు ఏ పుట నుండి వచ్చారో ఆ పుట యూఆర్ ఎల్
ఇటీవల ఎక్కడ నుండి సందర్శకులు మీ సైట్​లోని పుటకు ఏ పుట నుండి వచ్చారో ఆ పుట యూఆర్ ఎల్ (ఇటీవలి సమాచారం)
కీలక పదాల విశ్లేషణ మీ సైట్ ను కనుగొనడంలో వుపయోగించబడ్డ కీలక పదాలు
ఇటీవలి కీలక పదాల కార్యకలాపం మీ సైట్ ను కనుగొనడంలో ఇటీవల వుపయోగించబడ్డ కీలక పదాలు
శోధన యంత్రాల యుద్ధం మీ సైట్​కు ఏ శోధన యంత్రం ఎంత % సందర్శకులను పంపుతుంది
సందర్శకుల మార్గం సందర్శకుల విశ్లేషణ

వెబ్ పుట రూపకల్పనకు మాదిరులను వుపయోగిస్తున్న వెబ్ సైట్లలో (బ్రౌసర్‌ బ్లాగ్‌లో లాగా) ఈ కోడ్‌ను మాదిరిలో చేరిస్తే ఆ మాదిరిని వుపయోగిస్తున్న పుటలలో చేర్చినట్లే.

గూగుల్ ఎనలిటిక్స్  
 
విశ్లేషణ కొరకు వినియోగించుకోగలిగిన యింకొక ఉచిత సాధనం గూగుల్ ఎనలిటిక్స్. ఇది అర్చిన్ అనే సంస్థ సృష్టించిన సాఫ్ట్ వేర్. ఈ సంస్థను గూగుల్ కొనుగోలు చేసింది. గూగుల్ ఈ సాధనాన్ని వారి ఆన్‌లైన్ ప్రకటనల ప్రోగ్రామ్ యాడ్‌​వోర్డ్స్​తో జోడించి ఎటువంటి పరిమితులు లేకుండా ఉచితంగా అందిస్తుంది.

గూగుల్ యాడ్‌​వోర్డ్స్​ ఖాతాదారులు కానటువంటివారు నెలకు 5 మిలియన్ల (50 లక్షల) పుట సందర్శనలవరకు విశ్లేషించవచ్చు. మీ వెబ్‌ సైట్‌కు యింతకంటే ఎక్కువ సందర్శనలు వున్నట్లయితే గూగుల్ యాడ్‌​వోర్డ్స్​ ఖాతా సృష్టించుకోండి. (కేవలం $5 = 200+ అవుతుంది).

గూగుల్ ఎనలిటిక్స్ మీ వెబ్‌ పుట మీద ప్రదర్శన కొరకు ఎటువంటి తట్టు పలకను అందించదు. ఇది మీ వెబ్‌ పుట (బ్లాగ్) సందర్శకుల ఆచూకీ తెలుసుకునేందుకు వుపయోగించే అదృశ్య కోడ్.

అనువాదం :: నేర్పు జట్టు ఈ పుటకు అంగ్ల మూలం ... తరువాతి పుట ౨౯ (31)

పుట అంశాలు »  
Bookmark and Share

© All rights reserved.

♣ Site optimized for ♣ Internet Explorer 7 ♣ Firefox 2.0 and above