Bookmark and Share

పోస్ట్ : శీర్షిక, లంకె, ముఖ్యభాగము, అక్షర పేటిక/ప్రదేశము, సాధనాలు, భాషలు

 
ముందు పుట ... ౭ (7)
శీర్షిక/లంకె క్షేత్రములను చూపు/దాచు  
 
మీ బ్లాగ్‌​లో మీరు చేర్చే పోస్ట్, మీరు మీ డైరీలో ఒకసారి రాసేదానితో సమానం.

• శీర్షిక

ప్రతి పోస్ట్​కు ఒక శీర్షికనుపయోగిస్తాము. ప్రతి పోస్ట్​ ఏదో ఒక విషయాన్ని/భావాన్ని వ్యక్తపరుస్తుంది. పోస్ట్ యొక్క శీర్షిక (Title) సంధర్బోచితంగా, ఆ పోస్ట్​లో వున్న విషయాన్ని ప్రతిభింబించే విధంగా వుండాలి.

కూర్చబడే పోస్ట్​కు శీర్షిక వుపయోగించదలచుకోనట్లయితే, బ్లాగ్ పోస్ట్ కూర్చే పుటలో శీర్షిక క్షేత్రం ప్రదర్శించబడకుండా చేయవచ్చు. పోస్ట్ కూర్పు పుట/గవాక్షములో పోస్ట్ శీర్షిక, లంకె (link) క్షేత్రములు చూపబడేటేట్లు ఎంచుకోవచ్చు.

• శీర్షిక లంకె

శీర్షికను లంకెగా పనిచేసేటట్లు చెయ్యడానికి, లంకె క్షేత్రంలో సంబంధిత యుఅర్​ఎల్‌​ను చేర్చవలసి వుంటుంది. సాధారణంగా లంకె క్షేత్ర ప్రదర్శన నిరర్ధ పరచబడి వుంటుంది. ఆ క్షేత్ర ప్రదర్శన సశక్త పరచి వినియోగించుకోవలసి వుంటుంది.

• శీర్షిక క్షేత్రమును ఖాళీగా వుంచడం

శీర్షిక క్షేత్రాన్ని ఖాళీగా వుంచి పోస్ట్​ను ప్రచురించినట్లయితే, పోస్ట్​కు శీర్షిక వుండదు కాని, శీర్షికలో భాగంగా ప్రచురించబడే తేది మాత్రం ప్రచురించబడుతుంది.

• కొత్త పోస్ట్​లు

శీర్షిక క్షేత్ర ప్రదర్శన నిరర్ధ పరచినట్లయితే, ఆ క్షేత్రము పోస్ట్ సృష్టించే/సవరించే పుటలన్నింటిలోనూ చూపబడదు. శీర్షిక క్షేత్రము లేని పుటల [పోస్ట్ సృష్టించే పుట (post-create.g) లేదా పోస్ట్ సవరించే పుట (post-edit.g)] నుండి ప్రచురించబడ్డ పోస్టులకు శీర్షిక వుండదు. (కేవలం లంకె క్షేత్రము వున్నప్పటికి కూడా).

• పోస్ట్​లను తిరిగి ప్రచురించడం

శీర్షిక క్షేత్ర ప్రదర్శన నిరర్ధ పరచిన తదుపరి అప్పటికే ప్రచురించిన, చిత్తు ప్రతిగా దాచిన పోస్ట్​ల విషయంలో జాగ్రత్త వహించవలసి వుంటుంది.

అప్పటికే ప్రచురించబడ్డ పోస్ట్​ను సవరించి తిరిగి ప్రచురిస్తున్నా, చిత్తు ప్రతిగా దాచబడ్డ పోస్ట్​ను ప్రచురిస్తున్నా, ప్రచురణ సమయంలో శీర్షిక క్షేత్రం వుందా లేదా అనే దానిని బట్టి, శీర్షిక ప్రచురించబడుతుందా, లేదా, అనేది నిర్ధారించబడుతుంది. అంతకు ముందు శీర్షిక వున్న పోస్ట్​ను తిరిగి ప్రచురించే సమయంలో శీర్షిక క్షేత్ర ప్రదర్శన నిరర్ధ పరచబడి వున్నట్లయితే, శీర్షిక ప్రచురించబడదు

అప్పటికే ప్రచురించబడ్డ పోస్ట్​లు మీరు వాటిని తిరిగి ప్రచురిస్తే తప్పితే ఏమీ కావు.

పుట అంశాలు »  

శీర్షిక క్షేత్రములో చేర్చదగ్గ పాఠం  
 
శీర్షిక పాఠం చేర్చడానికి వుపయోగించే అక్షర పేటికలో మీరు అక్షర పాఠం మరియు HTML గుర్తులు (tags) చేర్చవచ్చు.

మీకు HTML తెలిస్తే, పోస్ట్ శీర్షిక రూప కల్పనకు, శీర్షిక స్ధానంలో ప్రతిమలు/చిత్రాలు చేర్చడానికి, అవసరమైన HTML కోడ్‌‌ను చేర్చవచ్చు.

శీర్షిక స్ధానంలో ప్రతిమలు/చిత్రాలు, వీడియోలు ప్రదర్శించబడేటట్లు చెయ్యవచ్చు కాని, అవి మీ పోస్టులో వున్న పాఠానికి సంక్షిప్త సూచికలయితేనే, వాటి వినియోగం సమంజసంగా వుంటుంది.

శీర్షిక భాగంలో పెద్ద ప్రతిమ/వీడియో ప్రదర్శించబడటం అంత బాగుండదు.

• శీర్షిక ఎంత పొడవు వుండవచ్చు

పోస్ట్​కు సంబందించిన అక్షరాలను నింపే గడికి బ్లాగర్.కామ్ ప్రోగ్రామ్ నిర్ధేశించిన గరిష్ట పరిమితి 150 అక్షరాలు/చిహ్నాలు (ఖాళీలతో కలిపి). కాబట్టి మీరు శీర్షిక పాఠం నింపండి లేదా ప్రతిమలు చేర్చడానికి అవసరమైన HTML గుర్తులు నింపండి, ఏదయినా గాని మొత్తం అక్షరాలు/చిహ్నాలు 150కి మించకూడదు.

మీ పోస్ట్ శీర్షికకు అక్షర పాఠం వినియోగించేటప్పుడు, మీ బ్లాగ్‌‌కు మీరు అనువర్తించిన మాదిరి (template) ఏమిటి అనేది గమనంలో వుండాలి. పోస్ట్ పట్టే స్థానం వెడల్పు కంటే ఎక్కువ పొడవున్న శీర్షికను వాడినట్లయితే శీర్షిక పాఠం రెండవ వరుస/పంక్తి లోకి నెట్టబడుతుంది. అది అంత అందంగా కనపడకపోవచ్చు.

ఈ విషయాన్ని మీరు మీ పోస్ట్​కు ప్రివ్యూ చూసి నిర్ధారించుకోలేరు. పోస్ట్​ను ప్రచురించి మాత్రమే తెలుకోగలుగుతారు.

పుట అంశాలు »  

లంకె క్షేత్రములో చేర్చగలిగే పాఠం  
 
లంకె క్షేత్రములో చేర్చే అక్షర పాఠం ఇంటర్నెట్‌‌లో నిక్షిప్త పరచబడ్డ ఏదయినా వనరు యొక్క URL. ఇది ఒక వెబ్ పుట, ఒక ప్రతిమ ఫైల్‌, ఒక వీడియో ఫైల్‌, మొదలగు వాటిలో ఏదయినా అవ్వవచ్చు.

లంకె క్షేత్రములో పాఠం చేర్చేటప్పుడు http:// ఒడంబడిక (protocol) పేరును చేర్చడం తప్పనిసరి. ఒడంబడిక పేరును చేర్చనట్లయితే లంకె దోషపూరితంగా ఏర్పడుతుంది.

లంకె క్షేత్ర ప్రదర్శన సశక్త పరచబడి వున్నప్పుడు, ఆ క్షేత్రమును ఖాళీగా వదిలేసినట్లయితే, పోస్ట్ శీర్షిక, పోస్ట్ పుటకు లంకెగా పనిచేస్తుంది. ఆ లంకె మీద క్లిక్ చేసినట్లయితే కేవలం ఆ పోస్ట్ మాత్రమే కలిగివున్న బ్లాగ్ పుట ప్రదర్శించబడుతుంది [బ్లాగర్ అమరికలలో పోస్ట్ పుటల అమరిక సశక్త పరచబడి వున్నట్లయితే]

బ్లాగర్ అమరికలలో పోస్ట్ పుటల అమరిక నిరర్ధ పరచబడి వున్నట్లయితే, గవాక్షములో పాఠం ఆ పోస్ట్ శీర్షికతో మొదలు పెట్టబడి ప్రదర్శించబడుతుంది. ఒక బ్లాగ్ పుటలో ఎన్ని పోస్ట్​లు ప్రదర్శించబడేటట్లు అమర్చబడి వుంది అనే దాని బట్టి, అదే పుటలో ఇతర పోస్ట్​లు కూడా వుండవచ్చు

పుట అంశాలు »  

HTML మరియు కూర్పు విధానాలు  
 
మీరు బ్లాగ్ పోస్ట్ నిర్మించుకోవడం కొరకు మీకు రెండు విధానాలు(Modes) అందుబాటులో వుంటాయి. HTML మరియు కూర్పుCompose విధానాలు.

HTML తెలిసి HTML లో కోడ్ వ్రాయగలిగే వారి కోసం HTML విధానము. సాధారణంగా వాడే వోర్డ్ ప్రోసెసర్ ప్రోగ్రామ్ (మైక్రోసాఫ్ట్ వోర్డ్) లో లాగా వుండేది కూర్పు విధానం.

కూర్పు విధానంలో పోస్ట్ ముఖ్యభాగాన్ని నిర్మించడం మీరు వోర్డ్ డాక్యుమెంట్‌లో సమాచారం చేర్చి, ఆ డాక్యుమెంట్‌కు ఆకృతి కల్పన (Format) చేసినట్లే వుంటుంది.

HTML విధానము తెలిసి HTML కోడ్‌​ను సంభాళించగలిగిన వారికి వుపయోగపడటంతో పాటు కూర్పు విధానంలో పోస్ట్ ముఖ్యభాగాన్ని కూర్చినప్పుడు అప్రమేయంగా చొప్పించబడే HTML కోడ్‌​ను సుద్దపరచడానికి/సవరించడానికి కూడా HTML విధానము వుపయోగపడుతుంది.

• కూర్పు విధానాన్ని చూపు/దాచు

పోస్ట్ కూర్చడానికి అవసరమైన అన్ని పనులు మీరు HTML విధానంలో చేయగలమనే నమ్మకం వుంటే, కూర్పు విధానం ప్రదర్శించబడకుండా చెయ్యవచ్చు

• గమనించండి

కూర్పు విధానాన్ని దాచడం అనే అమరిక ఒక వినియోగ ఖాతాకు సంబంధించినది. అదే వినియోగ ఖాతాలో సృష్టించబడ్డ అన్ని బ్లాగ్‌లకు మీరు ఎంచుకున్న అమరిక అనువర్తించబడుతుంది.

అక్షర ప్రదేశములో అక్షర పాఠాన్ని చేర్చడం  
 
అక్షర ప్రదేశము అనేక పంక్తుల పాఠం చేర్చడానికి అవకాశం వున్న ఒక అక్షర పేటిక.

ఈ అక్షర ప్రదేశములో మీ బ్లాగ్ పోస్ట్ యొక్క ముఖ్య భాగములో ప్రదర్శించబడవలసిన పాఠం (అక్షరములు), ప్రతిమలు, ఆడియో, వీడియో చేర్చడానికి అవసరమైన HTML కోడ్, రూప కల్పన నిర్దేశించడానికి అవసరమైన HTML కోడ్ చేరుస్తాము.

• అక్షర ప్రదేశములో ముద్రణ

అక్షర ప్రదేశములో అక్షరాలు ముద్రించడం అనేది కుంచిక ఫలకం ద్వారా లేదా అతికించడం ద్వారా చేస్తాము, ఇలా ముద్రించడం/అతికించడం HTML విధానంలో కాని, కూర్పు విధానంలో కాని, మీరు కంప్యూటర్‌​లో ఏ యితర పత్రాలలో నయినా చేసినట్లే వుంటుంది.

పుట అంశాలు »  

పరికర/సాధన పట్టీ » దానిపై బొత్తాలు, ఐచ్ఛికలు  
 
మీరు పోస్టింగ్ చేయటం అనే పనిలో ఉపయోగించ గలిగిన అనేక సాధనాలు/పరికరాలు/పనిముట్లు, పరికర/సాధన పట్టీ అని పిలవబడే పట్టీపై ఒకదాని ప్రక్క ఒకటి అమర్చబడి వుంటాయి. ఇవి ప్రతిమలు గుర్తులుగా కలిగిన ప్రతిమ బొత్తాలుగాను (వీటిని టూల్ బటన్స్ అంటారు) అనేక ఐచ్ఛికలు కలిగివున్న డ్రాప్ర్డ్​డౌన్ లిస్ట్ బాక్స్ (క్రిందికి జార విడచబడే లక్షణం కలిగివున్న జాబితా పేటిక) గాను వుంటాయి.

పోస్ట్​ను కూర్చడానికి మీరు HTML వాడుతున్నట్లయితే, మీ పోస్ట్ రూప కల్పనకు (Formatting) HTML గుర్తులు (Tags) వాడుతారు. ఆ కారణంగా HTML విధానంలో మనం వుపయోగించుకోగలిగే పనిముట్లు (Tools) తక్కువగా వుంటాయి.

ఇతర భాషలలో శీర్షిక, ముఖ్యభాగం, గుర్తులు  
 
బ్లాగర్‌ సంకేతాలకు అక్షర రూపం క్రోడీకరించడానికి (encode) UTF-8 విధానాన్ని వుపయోగిస్తుంది. దీని వలన మీరు మీ బ్లాగ్ పోస్ట్ యొక్క శీర్షిక పాఠం, ముఖ్యభాగ పాఠం, మరియు పోస్ట్ గుర్తుల కొరకు దరిదాపుగా ఏ భాషలో పాఠాన్నయినా వినియోగించగలుగుతారు.

అయితే HTML గుర్తులను (శీర్షిక క్షేత్రములో కానివ్వండి, పోస్ట్ ముఖ్యభాగములో కానివ్వండి) మరియు లంకె క్షేత్రములో పాఠం మొత్తాన్ని ఆంగ్లములో మాత్రమే చేర్చాల్సి వుంటుంది.

• చిహ్నాల సంఖ్య

ఇంగ్లీషు భాషలో ఒక్కొక్క అక్షరం కంప్యుటర్లో ఒక్కొక్క చిహ్నంతో సూచించబడుతుంది.

చిక్కుగా/క్లిష్టంగా వుండే లిపి (ఆశియా దేశ భాషలన్ని ఇటువంటివే) కలిగిన భాషలకు సంబంధించిన అక్షర పాఠంలో చాలాసార్లు, ఒక అక్షరం, రెండు అంతకంటే ఎక్కువ చిహ్నాలతో (కుంచిక గుర్తులు) ఏర్పడుతుంది. అటువంటి లిపులలో వున్న పాఠంలోని చిహ్నాల సంఖ్యను పరిగణించేటప్పుడు ఈ విషయం గమనించవలసి వుంటుంది.

కావున ఎక్కడయితే ఒక క్షేత్రములో నింపదగిన చిహ్నాలకు గరిష్ట పరిమితి వుంటుందో. (శీర్షిక క్షేత్రం 150 చిహ్నాల గరిష్ట పరిమితి కలిగి వున్నట్లు), అక్కడ అక్షరం చిహ్నం మధ్య బేధాన్ని చూడగలగాలి. గరిష్ఠ పరిమితిని అక్షరాలుగా పరిగణిస్తే ఇంకా తక్కువ వుండొచ్చు.

అనువాదం :: నేర్పు జట్టు ఈ పుటకు ఆంగ్ల మూలం ... తరువాతి పుట ౯ (8)

పుట అంశాలు »  
Bookmark and Share

© All rights reserved.

♣ Site optimized for ♣ Internet Explorer 7 ♣ Firefox 2.0 and above