Bookmark and Share

బ్లాగ్ పోస్ట్ : రూపురేఖలు, తేదీ/సమయం, శీఘ్ర సవరణ, పోస్ట్ ఈ-టపా, గుర్తులు

 
ముందు పుట ... ౬ (6)

Configuring Post Display :: Show/Hide/Rearrange Header/Footer elements

పోస్ట్ ప్రదర్శన :: రూపురేఖల ఎంపిక  
 
Template విభాగములోని Page Elements ఉపవిభాగముపు పుటలోని రూపురేఖల ఐచ్ఛికలను వుపయోగించి బ్లాగ్ పోస్ట్ యొక్క రూపురేఖలు అమర్చవచ్చు.

ఈ ఐచ్ఛికలను వుపయోగించి పోస్ట్ శీర్షిక, పాద భాగాలలో వుండే అంశాలు ప్రదర్శించడం/దాయడం మరియు వాటి స్ధానాలను మార్చడం చెయ్యవచ్చు.

తేది/కాలము అమరికలను సరిచేసే (ప్రదర్శించడం/దాచడం) పుటల నుండి కూడా వ్యాఖ్యలు (comments), వెనుకకు లంకెలు (back links), శీఘ్ర సవరణ (quick edit) లకు సంబంధించిన ఐచ్ఛికలను ఎంచుకోవచ్చు. గుర్తులకు (lables) సంబంధించిన ఐచ్ఛికలు మాత్రం ఈ పుట నుండి మాత్రమే ఎంచుకోవచ్చు.

ఇక్కడ మీరు ఎంచుకున్న ఐచ్ఛికలు ఈ బ్లాగ్‌‌లో ప్రదర్శించబడే అన్ని బ్లాగ్ పోస్ట్​లకు వర్తిస్తాయి. ఇవన్నీ ఈ పుట మరియు తదుపరి పుటలలో వివరించబడ్డాయి.

• ఇతర భాషల అక్షర పాఠం

అక్షర పాఠం చేర్చదగ్గ అక్షర పేటికలు వున్న దగ్గరల్లా, వున్న అక్షర పాఠాన్ని మార్చి మీ సొంత పదాలతో నింపవచ్చు. ఈ అక్షర పేటికలలో ఏ భాష అక్షరాలనయినా వుపయోగించవచ్చు.

పుట అంశాలు »  

Date/Time :: Choosing Formats, Time Zone, Display Language

తేది, కాల అమరికలు  
 
తేది, కాలములకు సంబంధించిన అమరికలను రెండు చోట్ల నుండి ఎంచుకోవచ్చు. ఒకటి Configure Blog Posts పుట మరియు రెండు Settings విభాగములోని formatting ఉపవిభాగపు పుట.

• తేదీ రూపం

తేది ప్రదర్శించబడడానికి అందుబాటులో వున్న అనేక రూపాలలో నుంచి ఒక రూపాన్ని ఎంచుకోండి. కేవలం అంకెలతో వున్న రూపం, అంకెలు, పదాలు కలిపిన రూపం మొదలగునవి.

పోస్ట్ తేదీ, పోస్ట్ శీర్షిక పైన ప్రదర్శించబడుతుంది.

• కాల/సమయ రూపం

కాలాన్ని/సమయాన్ని ప్రదర్శించడానికి అందుబాటులో వున్న అనేక రూపాలలో నుంచి ఒక రూపాన్ని ఎంచుకోండి.

పోస్ట్ ప్రచురణ సమయం, పోస్ట్ పాద భాగంలో ప్రదర్శించబడుతుంది. దీనిని కాల ముద్ర అంటాము

• కాల మండలి

బ్లాగర్.కామ్ వెబ్ సైట్ ద్వారా, బ్లాగర్ ప్రోగ్రామ్‌‌ను, ప్రపంచంలో అన్ని భౌగోళిక ప్రదేశాలలో వుండేవారు అందుకుంటారు/వినియోగిస్తారు. సాధారణంగా బ్లాగర్ ప్రోగ్రామ్‌‌కు సంబంధించిన కాలమండలి అమరికలను (UTC -8 గంటలు, అమొరికా లాస్ ఏంజలిస్) మీ బ్లాగ్ పోస్ట్​లకు సంబంధించిన కాలము నమొదు చేయడానికి వుపయోగిస్తుంది.

నమోదు చేయబడే కాలము మీ కంప్యూటర్‌లో చూపబడే కాలము అయ్యేటట్లు నిర్ధారించుకోవడానికి, మీ బ్లాగ్ యొక్క కాలమండలిగా మీకు సంబంధించిన కాల మండలిని ఎంచుకోండి.

• తేది/కాలము ప్రదర్శించబడే భాష

తేదిని కాలాన్ని తెలియచేసే భాషను అందుబాటలో వున్న అనేక భాషలనుండి ఎంచుకోవచ్చు.

ఇక్కడ ఎంచుకున్న భాష యొక్క ప్రభావము, పోస్ట్ శీర్షికలో భాగంగా ప్రదర్శించబడే తేదీలో, పోస్ట్ పాదంలో భాగంగా చూపబడే పోస్ట్ చేయబడ్డ సమయము (కాల ముద్ర), ప్రాచీనీకరించబడ్డ పోస్ట్​ల జాబితాలో ప్రదర్శించబడే కాలము. మొదలగు అనేక చోట్ల కనబడుతుంది.

మీరు ఇక్కడ ఎంచుకునే భాష స్వయంచాలకంగా బ్లాగర్‌‌చే ముద్రించబడే తేదీ, సమయం తెలియచేసే అక్షరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇది మీ పోస్ట్ ముఖ్యభాగంలో మరియు యితర చోట్ల చేర్చే అక్షర పాఠం యొక్క భాషకు సంబంధించిన అమరిక కాదు.

పుట అంశాలు »  

Quick Edit :: What it is and how to enable/disable it?

శీఘ్ర సవరణ  
 
మీ బ్లాగ్‌​కు శీఘ్ర సవరణ ఐచ్ఛికాన్ని ఎంచుకుని వుండి, గూగుల్ ఖాతాలోకి లాగిన్ అయి వున్నట్లయితే, మీ బ్లాగ్ పుట బ్రౌజర్​లో ప్రదర్శించబడినప్పుడు, పోస్ట్ పాదంలో శీఘ్ర సవరణ లంకె (ప్రతిమ బొత్తం రూపంలో (icon)) ప్రదర్శించబడుతుంది. ఈ లంకె బ్లాగ్​ను సవరించే అనుమతి వున్న బ్లాగ్ సభ్యులందరికీ ప్రదర్శించబడుతుంది. (వారు వారి ఖాతాలోకి లాగిన్ అయి వున్నట్లయితే).

శీఘ్ర సవరణ లంకె మీద క్లిక్ చేస్తే, ఆ పోస్ట్ సత్వరమే పోస్ట్ సవరణ పుటలో (post-edit.g) తెరవబడుతుంది.

శీఘ్ర సవరణ లంకె ప్రదర్శించబడటం/దాచడం అనే ఐచ్ఛికాన్ని Configure blog posts పుట నుండి కాని Settings విభాగములోని Basic ఉపవిభాగపు పుట నుండి కాని ఎంచుకోవచ్చు.

Email Post :: How it works? Enabling/Disabling it.

పోస్ట్​ను పాఠకులకు ఈ-టపాలో పంపుట  
 
మీ బ్లాగ్‌ పాఠకులు, మీ బ్లాగ్‌‌​లోని, వారికి నచ్చిన, బ్లాగ్‌ పోస్ట్​కు లంకెను ఈ-టపా ద్వారా ఎవరికన్నా పంపించే సౌకర్యన్ని, సంబంధిత అమరికను ఎంచుకోవడం ద్వారా సశక్త పరచి (enable) వున్నట్లయితే, ప్రతి పోస్ట్ పాదంలో Email post లంకె, ప్రతిమ బొత్తం (icon) రూపంలో కనబడుతుంది.

బ్లాగ్‌ పాఠకుడు ఈ లంకె (ప్రతిమ బొత్తం) మీద క్లిక్ చేసినట్లయితే ఈ-టపా పంపుటకు వుపకరించే ఒక వెబ్ పత్రం కలిగిన పుట ప్రదర్శించబడుతుంది.

సంబంధిత వివరాలన్నీ నింపి, సందేశాన్ని పంపినట్లయితే, ఆ పోస్ట్​కు లంకె, ఆ లంకె పంపేవారు నింపిన వ్యక్తిగత సందేశం కలిపి ఈ-టపాలో వుద్దేశించిన ఈ-చిరునామాకు పంపబడుతుంది.

పుట అంశాలు »  

Lables :: Displaying posts with specified lables

నిర్ధిష్ట గుర్తులు జోడించబడి వున్న పోస్ట్​లను ప్రదర్శించడం  
 
బ్లాగ్‌లో పోస్ట్​లను వెదుక్కునేవారికి సహాయపడేందుకు వుపయోగపడే పదాలు (words) లేక పదబంధాలు/వచనాలు (phrases) లే గుర్తులు.

వీటిని బ్లాగ్ పోస్ట్ సృష్టించేటప్పుడు, లేదా తదుపరి ఎప్పుడైనా బ్లాగ్‌‌​కు జోడిస్టాము

Lables :: Adding/Removing Lables to/from posts

పోస్ట్​లకు గుర్తులు జోడించుట/తీసివేయుట  
 
పోస్ట్​లకు గుర్తులు పోస్ట్​ను సృష్టించేటప్పుడు/సవరించేటప్పుడు జోడించవచ్చు/తీసివేయవచ్చు.

పోస్ట్​లకు గుర్తులను పోస్ట్​ల జాబితా ప్రదర్శించబడే పుటలో వున్న ఐచ్ఛికలను వుపయోగించి కూడా జోడించవచ్చు/తీసివేయవచ్చు.

పోస్ట్​ల జాబితా ప్రదర్శించబడే పుటలో వున్న గుర్తుల జాబితాలోని గుర్తులు, నిర్ధిష్టమైన గుర్తులు జోడించబడ్డ పోస్ట్​లను వెదకటానికి కూడా వుపయోగపడతాయి.

పుట అంశాలు »  

List of Labels :: Where do we see it?

గుర్తుల జాబితా  
 
మీ బ్లాగ్‌‌‌లో వున్న పోస్ట్​లన్నింటి మీద కలిపి మీరు వుపయోగించిన గుర్తుల జాబితా మీకు అనేక చోట్ల తారసపడుతుంది.

అనువాదం :: నేర్పు జట్టు ఈ పుటకు ఆంగ్ల మూలం ... తరువాతి పుట ౮ (8)

పుట అంశాలు »  
Bookmark and Share

© All rights reserved.

♣ Site optimized for ♣ Internet Explorer 7 ♣ Firefox 2.0 and above