ముందు పుట ... ౧౮ (18) |
పోస్ట్‌లోకి ప్రతిమలను చేర్చడం/చొప్పించడం | |
ఈ పనిని మూడు విధాలుగా చెయ్యవచ్చు.
• Add image పరికరం వుపయోగించి
పోస్ట్ పాఠాన్ని చేర్చే అక్షర ప్రదేశము మీద వున్న పరికర పట్టిలో వున్న "Add image" ప్రతిమ బొత్తం వుపయోగించి, ప్రతిమను పోస్ట్‌లో చేర్చడానికి అవసరమైన Html కోడ్‌ను పోస్ట్‌లో చొప్పించవచ్చు.
• సంబంధిత Html కోడ్ చేర్చడం ద్వారా
మీకు Html కోడ్ గురించి తెలిసినట్లైతే, సంబంధిత Html కోడ్‌ను సృష్టించుకుని, బ్లాగ్ పోస్ట్ పాఠానికి సంబంధించిన Html కోడ్‌లో భాగంగా దానిని చేర్చడం ద్వారా ప్రతిమను పోస్ట్‌లో చేర్చవచ్చు.
• ప్రతిమలకు ఆతిధ్య సేవలనందిస్తున్న వెబ్ సైట్ నుండి
ప్రతిమలకు ఆతిధ్య సేవలనందిస్తున్నకొన్ని వెబ్ సైట్లు వారి వద్ద భద్రపరచబడ్డ ప్రతిమను నేరుగా అక్కడ నుండే, మీకు బ్లాగర్ వద్ద వున్న బ్లాగ్‌లోకి, పోస్ట్ చేసే సౌకర్యం అందిస్తాయి. (flickr.com అటువంటి సౌకర్యం అందిస్తుంది.)
ఇటువంటి సౌకర్యమును వుపయోగిస్తున్నట్లయితే అక్కడినుండే ఒక పోస్ట్‌ను సృష్టించి ప్రచురించడం అవుతుంది. ఈ పోస్ట్‌ను మీరు బ్లాగర్.కామ్‌లో సృష్టిస్తన్నట్లు అవదు. |
blogger.com కు ఎక్కించిన ప్రతిమలను చేర్చడం | |
• ఎక్కించినప్పుడు పోస్ట్‌లోకి చొప్పించడం/చేర్చడం
బ్లాగర్.కామ్ వెబ్ సైట్‌కు ప్రతిమలను కేవలం బ్లాగర్ పోస్ట్‌ను సృష్టించడానికి/సవరించడానికి వుపయోగించే పుటలనుండి మాత్రమే ఎక్కించగలుగుతాము. ప్రతిమను బ్లాగ్‌కు ఎక్కించే ప్రక్రియలో భాగంగా బ్లాగర్ ప్రతిమను పోస్ట్‌లో చేర్చడానికి అవసరమైన Html కోడ్‌ను పోస్ట్ పాఠం యొక్క Html కోడ్‌లో భాగంగా చేరుస్తుంది.
అయితే ఈ కోడ్ పోస్ట్ పాఠం మొదట్లో చేర్చబడుతుంది. అంటే ప్రతిమ పోస్ట్ మొదట్లో చేర్చబడుతుంది. దానిని ఎక్కడ కనపడాలనుకుంటే అక్కడకు మార్చుకోవాల్సి వుంటుంది.
• ఎక్కించిన తదుపరి ఎప్పుడయినా చొప్పించడం/చేర్చడం
మీరు బ్లాగ్‌లోకి ఎక్కించిన ప్రతిమ సంబంధించిన Html కోడ్ యొక్క నకలు దాచుకున్నట్లయితే, మీరు ఆ కోడ్ వుపయోగించి ఆ ప్రతిమను తదుపరి ఎప్పుడయినా, ఏ పోస్ట్లోనయినా చేర్చవచ్చు.
కేవలం ప్రతిమ ఫైల్‌కు సంబంధిత యూఆర్‌ఎల్ వరకే భద్రపరచినట్లయితే, తదుపరి పోస్ట్ పాఠాన్ని చేర్చే అక్షర ప్రదేశము యొక్క సాధన పట్టిలో వున్న "Add Image" పరికర బొత్తాన్ని వుపయోగించి, లేదా మీకు Html తెలిసినట్లయితే, ప్రతిమకు చేర్చడానికి అవసరమైన Html ను సృష్టించుకోవడం ద్వారా కాని ప్రతిమను పోస్ట్‌లో చేర్చవచ్చు. |
ఏ వెబ్‌సైట్‌లోని ప్రతిమనయినా Add-Image పరికరం వుపయోగించి చేర్చడం | |
ఏ వెబ్ సైట్‌లో వున్న ప్రతిమనైనా ఈ విధంగా చేర్చదలచినట్లయితే, ముందు ఆ ప్రతిమ ఫైల్ యూఆర్‌ఎల్ తెలిసి వుండాలి.
ప్రతిమ యూఆర్‌ఎల్ తెలిసి వుండి పోస్ట్ పాఠంలో చేర్చడానికి అవసరమైన Html కోడ్ సృష్టించుకోవడం తెలియకపోతే ఈ విధానం మీకు వుపయోగపడుతుంది.
మీరు చేర్చిన యూఆర్‌ఎళ్ళకు సంబంధించిన ప్రతిమలను పోస్ట్ పాఠంలో చేర్చడానికి అవసరమైన Html కోడ్ సృష్టించండి. పోస్ట్ పాఠానికి సంబంధించిన Html కోడ్‌తో చేర్చబడుతుంది. ప్రతిమలకు సంబంధించిన Html కోడ్ పోస్ట్ పాఠం మొదట్లో చేర్చబడుతుంది. మీరు కూర్పు విధానంలో వున్నట్లయితే, ప్రతిమలు మొదట్లో ఒకదాని తరువాత ఒకటి మీరు ఎంచుకున్న లీనం, పరిమాణం ఐచ్చికలను బట్టి ప్రదర్శించబడి వుండటం గమనించవచ్చు. మీరు Html విధానంలో వున్నట్లయితే ప్రతిమలకు, సంబంధించిన Html కోడ్ చూడవచ్చు. |
ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్లకు ఎక్కించిన ప్రతిమల యూఆర్‌ఎల్ | |
ప్రతిమలకు ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్లలో భద్రపరచిన ప్రతిమల యొక్క యూఆర్‌ఎళ్ళు
ఈ సైట్లలో ప్రతిమ యూఆర్‌ఎళ్ళు రకరకాల రూపాలలో అందుబాటులో వుంటాయి.
• flickr.comలో
ఈ వెబ్ సైట్‌లో ఏ ప్రతిమను క్లిక్ చేస్తే ఆ ప్రతిమ ఒక వెబ్‌పుటలో ప్రదర్శించబడుతుంది. ఆ ప్రతిమ శీర్షిక పైభాగాన ముఖ్యపాఠంగా కల ప్రతిమకు సంబంధించిన ఐచ్చికలు కలిగిన ఒక ద్వితీయశ్రేణి జాబితా పట్టి ప్రదర్శించబడుతుంది.
ఆ ద్వితీయశ్రేణి జాబితా పట్టిలో వున్న All sizes గుర్తు కలిగిన బొత్తాన్ని క్లిక్ చెయ్యండి. ప్రతిమ ఇంకొక వెబ్ పుటలో ప్రదర్శించబడుతుంది. ఈ పుటలో All sizes అనే గుర్తు వుండి ప్రక్కన రకరకాల పరిమాణాలను సూచిస్తున్న సంఖ్యలు వాటికి సంబంధిత లంకెలు కనబడతాయి. ఒక పరిమాణం ఎంచుకోబడి వుంటుంది. క్రింద ప్రతిమ ఆ పరిమాణంలో ప్రదర్శించబడి వుంటుంది. ప్రదర్శంచబడి వున్న పరిమాణంలో ప్రతిమను పోస్ట్‌లో చేర్చడానికి అవసరమైన Html కోడ్ మరియు కేవలం ప్రతిమ యూఆర్‌ఎల్ ప్రతిమ క్రింద రెండు వేరు వేరు అక్షర పేటిక/ప్రదేశములో ప్రదర్శించబడి వుంటాయి. వీటిలో క్లిక్ చేసి, Html కోడ్/యూఆర్‌ఎల్ నకలు పొందవచ్చు. పైన వున్న పరిమాణాన్ని సూచించే లంకెలను క్లిక్ చేస్తే, క్రింద ప్రదర్శించబడివున్న ప్రతిమ మీరు ఎంచుకున్న పరిమాణంలో ప్రదర్శించబడుతుంది, మరియు Html కోడ్‌లో పరిమాణాన్ని సూచించే విలువ మారతాయి.
Html కోడ్‌లో <img> గుర్తు మరియు దానిని చుట్టి వుంచే <a> గుర్తు వుంటాయి. ఈ Html కోడ్‌ను వుపయోగించి మీరు ఎక్కడయినా ప్రతిమను చేర్చినట్లయితే, ఆ <a> గుర్తు ఆ ప్రతిమను ఒక లంకెలాగా పని చేసేటట్లు చేస్తుంది. ఆ లంకె ప్రతిమకు ఆతిధ్యమిచ్చిన వెబ్ సైట్‌లో ఆ ప్రతిమ ప్రదర్శించే పుటకు/లేదా కేవలం ఆ ప్రతిమకు లంకె. మీరు ఎంచుకున్న పరిమాణంలో ప్రతిమను మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవచ్చు. ప్రతిమ మీరు ఎంచుకున్న పరిమాణంలో తిరిగి నిర్మించబడి తదుపరి డౌన్‌లోడ్ అవుతుంది. ప్రతిమను పోస్ట్‌లో (వెబ్ పుటలో) చేర్చడానికి మీరు ప్రతిమ క్రింది Html కోడ్‌ను వుపయోగిస్తున్నట్లయితే ఆ ప్రతిమ flickr.com వెబ్ సైట్‌లోనే అది ఎక్కించబడ్డ పరిమాణంలోనే వుంటుంది. అది మీరు ఆ Html కోడ్ చేర్చిన పుటలో ప్రదర్శించబడేటప్పుడు మాత్రం మీరు ఎంచుకున్న పరిమాణంలో ప్రదర్శించబడుతుంది. • photobucket.com
ప్రతి ప్రతిమకు సంబంధంగా మూడు అక్షర పేటికలు వుంటాయి.
|
HTML కోడ్ సృష్టించడం ద్వారా ప్రతిమలను చేర్చడం | |
మీకు html పరిఙానం వున్నట్లయితే పోస్ట్ పాఠం యొక్క html కోడ్‌లో భాగంగా <img> html గుర్తును సంబంధిత గుణాలతో కలిపి చేర్చి ప్రతిమను పోస్ట్‌లో చొప్పించవచ్చు. దీనికి మీకు కావలసింది మీరు పోస్ట్‌లో చేర్చదలుచుకున్న ప్రతిమ యొక్క యూఆర్‌ఎల్. • కూర్పు విధానంలో ప్రతిమను చేర్చినట్లయితే పోస్ట్ పాఠంలో చేర్చబడే Html కోడ్.
కూర్పు విధానం వుపయోగించి మీరు ప్రతిమను పోస్ట్ పాఠంలో చేర్చినప్పుడు స్వయంచాలకంగా చేర్చబడే Html కోడ్‌ను గమనించి, చేర్చవలసిన కోడ్ గురించిన అవగాహన కలుగచేసుకోవచ్చు.
Html విధానంలోకి మారినట్లయితే Html కోడ్‌ను గమనించవచ్చు.
• మీరు వుపయోగించవలసినది <img> గుర్తు మాత్రమే.
ఒక ప్రతిమను పోస్ట్ పాఠంలో (వెబ్ పుటలో) చేర్చడానికి మీరు కేవలం <img> Html గుర్తును సంబంధిత గుణాలను చేర్చి వాడితే సరిపోతుంది. ప్రతిమలను లంకెలుగా పనిచేయించదలచినట్లయితే <img> గుర్తును <a> గుర్తులు చుట్టి వుంటాయి.
• లంకె ఎందుకు?
ప్రతిమను ప్రతిమ ఫైల్‌కు లంకెగా చెయ్యడానికి రెండు కారణాలు వున్నాయి.
|
flickr.com వెబ్ సైట్ నుండి నేరుగా పోస్ట్ చెయ్యడం | |
బ్లాగర్ వెబ్ సైట్‌తో అంగీకారం ఏర్పరచుకున్న కొన్ని వెబ్ సైట్లు వారివద్ద వున్న ప్రతిమలను చేర్చిన పోస్ట్‌లను వారి వెబ్ సైట్‌ల నుండే నేరుగా బ్లాగర్ బ్లాగ్‌లోకి పోస్ట్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసి వుంటాయి. flickr.com అటువంటి ఒక వెబ్ సైటే.
ముందు మీరు మీ బ్లాగ్‌కు flickr.com నుండి నేరుగా పోస్టింగ్ చేయడానికి సన్నద్దపరచాలి. ఇది కూడా flickr.com వెబ్ సైట్‌లోనే చేస్తాము. • బ్లాగ్‌ను నేరుగా పోస్ట్ చేయడానికి సన్నద్దపరచడం
ప్రధమ శ్రేణి జాబితా పట్టిలోకి "your" గుర్తుగల జాబితా అంశం మీద క్లిక్ చెయ్యండి.
• ప్రతిమను పోస్ట్ చెయ్యడం.
ఒక నిర్ధారణ సందేశం, మీ బ్లాగ్ పోస్టుకు లంకెతో సహా ప్రదర్శించబడుతుంది. లంకె క్లిక్ చేసినట్లయితే మీ బ్లాగ్ పోస్ట్ ప్రదర్శించబడుతుంది. మీరు బ్లాగర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే ఆ పోస్టును తెరిచి సవరించవచ్చు.
మీరు యిక్కడ నుండి పోస్ట్ చేసిన ప్రతి ప్రతిమ ఒక నిర్ధిష్టమైన పోస్ట్‌లో ప్రచురించబడుతుంది. యిక్కడ నుండి ప్రతిమ ఏమి వుపయోగించకుండా పోస్ట్ చెయ్యడం కుదరదు. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౨౦ (20) |