Bookmark and Share

సర్వర్‌కు ప్రతిమలను ఎక్కించడం, భధ్రపరచడం :: ఉచిత ఆతిధ్య సేవలు

 
ముందు పుట ... ౧౭ (17)
ప్రతిమలను ఎక్కించడం/భధ్రపరచడం  
 
ఒక వెబ్‌ పుటలో మీకు కనపడే ప్రతి ప్రతిమ ఒక ఫైలే. ప్రతిమ యొక్క యూఆర్‌ఎల్ (వెబ్ చిరునామా) మీకు తెలిసినట్లయితే కేవలం ప్రతిమను బ్రౌసర్‌లో ప్రదర్శించబడేటట్లు చెయ్యవచ్చు.

మీ బ్లాగ్ పోస్ట్​లో పొందుపరచదలచిన ప్రతిమ, మొదట ఇంటర్నెట్‌కు అనుసంధించబడ్డ ఏదయినా కంప్యూటర్‌లో భధ్రపరచవలసి వుంటుంది.

• ప్రతిమలకు ఆతిధ్య సేవలు అందించే వెబ్‌సైట్.

ప్రతిమలకు ఉచిత ఆతిధ్య సేవలు అందించే అనేక వెబ్‌సైట్లు వున్నాయి. అందులో కొన్ని.

» _.blogger.com

ప్రతిమలకు బ్లాగర్ అందించే ఉచిత ఆతిధ్య సేవలు వుపయోగించుకుని భధ్రపరచిన ప్రతిమల యూఆర్‌ఎల్ _.blogger.com [Eg: photos.blogger.com] రూపంలో వుంటుంది.

ఇందులో ప్రతిమలలను బ్లాగర్ వెబ్‌ సైట్‌లోకి లాగిన్ (ఆ వెబ్ సైట్‌లోనుండి) మాత్రమే ఎక్కించవచ్చు. ఈ సైట్‌లోని సేవలను నేరుగా అందుకోవడానికి వీలవదు. ఒక వేళ మీరు photos blogger.com అనే యూఆర్‌ఎల్ ఉపయోగించి ఆ సైట్ పుటలను తెరచే ప్రయత్నం చేసినా మీ వినతి బ్లాగర్.కామ్ పుటలకు మళ్ళించబడుతుంది.

» flickr.com

మరొక బాగా ప్రాచుర్యం పొందిన ఉచిత ప్రతిమ ఆతిధ్య సేవలను అందించే వెబ్‌సైట్. ఇటీవలే ఈ కంపెనీని యాహూ కొనుగోలు చేసింది.

» photobucket.com

మరి యొక ప్రాచుర్యం పొందిన ఉచిత ప్రతిమ ఆతిధ్య సేవలను అందిచే వెబ్ సైట్.

ఈ సైట్లలో ఒక సారి భధ్రపరచిన ప్రతిమలను, ఇంటర్నేట్‌కు అనుసంధించబడ్డ ఏ పుటలోనేనా పొందుపరచవచ్చు.

పుట అంశాలు »  

__.blogger.com లో  
 

• మీ కంప్యూటర్ నుండి ఎక్కించవలసిందే

ఈ వెబ్ సైట్‌లో ప్రతిమలను, మీ కంప్యూటర్ నుండి సర్వర్‌కు ఎక్కించడం ద్వారా మాత్రమే భధ్రపరచగలుగుతారు.

అది కూడా మీరు మీ బ్లాగ్ పోస్ట్​ను సృష్టించడానికి లేదా సవరించడానికి వుపయోగించే బ్లాగర్ పుటల నుండి మాత్రమే ప్రతిమలను ఎక్కించగలుగుతారు.

• ప్రతిమలను సర్వర్‌కు ఎక్కించే ప్రక్రియ

  • బ్లాగ్ పోస్ట్​ను సృష్టించడానికి/సవరించడానికి వుపయోగించే వెబ్ పుటను తెరవండి.
  • Add Image పరికరం/(ప్రతిమ బొత్తం) మీద క్లిక్ చేయండి.

    ఈ పరికరం Html కూర్పు విధానాలలో రెండింటిలోనూ అందుబాటులో వుంటుంది. (పోస్ట్ పాఠాన్ని చేర్చడానికి వుపయోగించే అక్షర ప్రదేశానికి సంబంధించిన సాధన పట్టిపై ).

మీరు ప్రతిమను వెబ్ సర్వర్‌కు ఎక్కించడానికి వుపకరించే వెబ్ పుట ఒక సరికొత్త గవాక్షములో ప్రదర్శించబడుతుంది.

మీ కంప్యూటర్‌లో భద్రపరచబడ్డ ప్రతిమలను సర్వర్‌కు ఎక్కించడం:

  • File upload శీర్షికతో వున్న సంవాద పేటిక ప్రదర్శించబడటానికి Browse గుర్తు గల బొత్తాన్ని క్లిక్ చేయండి.
  • ఆ సంవాద పేటికలో మీరు సర్వర్‌కు ఎక్కించదలచుకున్న ప్రతిమను ఎంచుకొని "open" బొత్తాన్ని నొక్కండి
    [ఫైల్ పేరు, మీ కంప్యూటర్లో దాని స్థాన మార్గంతో సహా, వెబ్ పుటలోని అక్షర పేటికలో చేర్చబడటం గమనించగలుగుతారు.]
  • ప్రతిమకు రూపకల్పన ఐచ్చికలు (పరిమాణం, లీనం) ఎంచుకుని, "upload image" బొత్తాన్ని/లంకెను క్లిక్ చేయండి.

  • సర్వర్‌కు ఫైల్‌ను ఎక్కించే ప్రక్రియ పూర్తయిన వెంటనే, ఆ వెబ్ పుటలో ఒక నిర్ధారణ సందేశం ప్రదర్శించబడుతుంది. అదే పుటలో మీరు ఎక్కించిన ప్రతిమ నకలు (చిన్న పరిమాణంలో) ప్రదర్శించబడుతుంది.

    మీరు సర్వర్‌కు ఎక్కిస్తున్న ఫైల్ పరిమాణం చాలా ఎక్కువయినట్లయితే, ఫైల్ ఎక్కించబడుతున్నంత సేపు ఫైల్‌ను ఎక్కించే ప్రక్రియ ప్రగతిని తెలియచేసే పుట ప్రదర్శించబడుతుంది

  • "Done" గుర్తు గల బొత్తం/లంకె మీద క్లిక్ చెయ్యండి.

    ప్రతిమను చేర్చడానికి మరియు మీరు ఎంచుకున్న రూపకల్పన ఐచ్ఛికలను ప్రతిమకు అనువర్తించడానికి, అవసరమైన Html కోడ్, పోస్ట్ పాఠాన్ని చేర్చే అక్షర ప్రదేశము మొదట్లో చేర్చబడుతుంది.

సర్వర్‌కు ఎక్కించబడ్డ ప్రతిమ (అక్షర ప్రదేశము మొదట్లో చేర్చబడటం ద్వారా) మీ బ్లాగ్‌లోకి చేర్చబడుతుంది. కూర్పు విధానంలోనయితే మీరు ప్రతిమను చూడవచ్చు. Html విధానంలో ఆ ప్రతిమకు సంబంధించిన Html కోడ్‌ను చూడవచ్చు.

మీరు ప్రతిమను ప్రస్తుతము సర్వర్‌కు ఎక్కించి తదుపరి ఎప్పుడయినా ఆ ప్రతిమను మీ బ్లాగ్ పోస్ట్​లో కాని లేదా ఏ యితర వెబ్ సైట్‌లో కాని వుపయోగించదలచినట్లయితే, ఆ Html కోడ్‌ను తొలగించవచ్చు.

అయితే ఆ ప్రతిమ యొక్క యూఆర్‌ఎల్‌ను ఎక్కడయినా భధ్రపరచే జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది. [మీరు photos-blogger.com వెబ్ సైట్‌కు వెళ్ళి (ఆ వెబ్ సైట్ పుటలను తెరచి) మీరు ఎక్కించిన ప్రతిమలను చూసి నిర్వహించుకొనే వీలుండదు కాబట్టి.]

• ఎక్కించదగ్గ ఫైల్స్ రకాలు.

మీరు JPG, GIF, PNG, TIF, BPM రూపాలలో వున్న ప్రతిమలను ఎక్కించవచ్చు.

• ప్రతిమ పరిమాణాలు/పరిమితులు

ప్రతిమను సర్వర్‌కు ఎక్కించడానికి వుపకరించే పుటలో వున్నఐచ్చికలతో, మీరు ఎక్కించే ప్రతిమకు చిన్న (small) మధ్య (middle) లేక పెద్ద (large) పరిమాణాలను ఎంచుకోవచ్చు. ఈ ఐచ్చిక మీ ప్రతిమను బ్లాగ్ పోస్ట్​లో చేర్చేటప్పుడు అది ఎంత పరిమాణంలో ప్రదర్శించబడాలి అనే దానికి సంబంధించినది . ప్రదర్శనకు మీరు ఏ పరిమాణాన్ని ఎంచుకున్నా ప్రతిమలు వాటి పూర్తి పరిమాణంలో సర్వర్‌కు ఎక్కించబడతాయి.

ప్రతి ప్రతిమ గరిష్టముగా 8 MB పరిమాణము కలిగి వుండవచ్చు.

ప్రతి బ్లాగ్‌కు దానికి సంబంధంగా ప్రతిమలను భధ్రపరచుకోవడానికి 300MB ప్రదేశము కేటాయించబడి వుంటుంది.

ఇది మీ వినియోగ ఖాతాకు సంబంధించిన పరిమితి కాదు. ఒక వినియోగ ఖాతాతో ఎన్ని బ్లాగ్‌లయినా సృష్టించవచ్చు. ఒక బ్లాగ్‌లో నుండి ఎక్కించిన ప్రతిమలను వేరే బ్లాగ్‌లోనయినా వినియోగించుకోవచ్చు.

• ప్రతిమలు ఎక్కడ భధ్రపరచబడతాయి.

మేము యివి రాసే సమయానికి బ్లాగర్.కామ్ ప్రతిమలను భధ్రపరచడానికి "bp1.blogger.com" అనే వెబ్ సైట్‌ను వుపయోగిస్తుంది. ప్రతి బ్లాగ్‌కు ఒక నిర్ధిష్టమైన ఫోల్డర్ వుపయోగించబడి మీరు సర్వర్‌కు ఎక్కించిన ప్రతిమలన్నీ ఆ ఫోల్డర్‌లో దాచబడతాయి. ప్రతిమ ఫైళ్ళకు పేర్లు మీరు ఎక్కిస్తున్న ఫైల్ పేరులో వున్న పదాలను వుపయోగించి నిర్మిస్తుంది.

» http://bp1.blogger.com/_Fa4Wp8HcBwo/RXXJa8-bDmI/AAAAAAAAAAk/i6w5EllNBJg/s1600-h/anttutorial.gif

» ".../_Fa4Wp8HcBwo/RXXJa8-bDmI/AAAAAAAAAAk/i6w5EllNBJg/s1600-h/"
ఒక నిర్ధిష్ట బ్లాగ్‌కు సంబంధించిన ప్రతిమలను దాచిపెట్టబడే ఫోల్డర్.

పుట అంశాలు »  

flickr.com లో  
 

• మీ కంప్యూటర్ నుండి ఎక్కించవలసిందే.

flickr.com వెబ్‌లో ప్రతిమలను భధ్రపరచుకోవడానికి ఉచిత ఆతిధ్య సేవలను అందించే వెబ్ సైట్. ఈ సంస్థకు యిటీవలే యాహూ కొనుగోలు చేసింది. flickr.com లో ప్రతిమలను మన కంప్యూటర్ నుండి ఎక్కించి మాత్రమే భధ్రపరచగలుగుతాము.

flickr.com వెబ్‌ సైట్‌లోకి మీ యాహూ వినియోగ నామము, ప్రవేశ పదము వుపయోగించి లాగిన్ అవ్వవచ్చు. మీకు yahoo వినియోగ నామము లేకున్నట్లయితే yahoo వద్ద వినియోగ ఖాతా సృష్టించుకోండి. flickr.com వెబ్ సైట్ యొక్క ప్రతిమలను భధ్రపరచుకునే సేవలు అందుకోవాలంటే ఈ గుర్తింపు కావల్సి వుంటుంది. కేవలం ప్రతిమలను చూడటానికయితే అక్కర్లేదు.

flickr.com లో అన్ని పుటలలో పై భాగాన ప్రదర్శించబడే జాబితా పట్టి (menu bar), flickr.com లోని అన్ని వెబ్ పుటలకు లంకెలు కలిగి వుంటుంది. flickr.com లోకి లాగిన్ అయిన తరువాత, you గుర్తు గల లంకెను క్లిక్ చేస్తే ప్రదర్శించబడే జాబితాలో upload photos లంకె మీద క్లిక్ చేయడం ద్వారా ప్రతిమలను సర్వర్‌కు ఎక్కించే ప్రక్రియ మొదలుపెట్టవచ్చు.

  • ఫైల్ ఎక్కించడానికి ఉపకరించే వెబ్ పత్రం గల ఒక వెబ్ పుట ప్రదర్శించబడుతుంది.
    ఒకే సారి ఆరు ప్రతిమలను ఎక్కించవచ్చు.
  • మీ కంప్యూటర్ నుండి మీరు ఎక్కించదలచుకున్న ప్రతిమలను ఎంచుకోండి.
  • సంబంధిత ఐచ్చికాన్ని ఎంచుకోవడం ద్వారా, వాటిని మీరు అందరికి అందుబాటులో వుంచదలచుకున్నారా (public) లేక మీ వరకే అందుబాటులో వుంచదలుచుకున్నారా (private) అనేది నిర్ధారించండి.
  • మీరు ప్రతిమను వర్ణించే కొన్ని పదాలను మీ ప్రతిమకు గుర్తులుగా (tabs) సంబంధిత అక్షర పేటికలో చేర్చండి. ఈ పదాలు ప్రతిమల కోసం కీలక పదాలను (key word) వుపయోగించి వెతుక్కునే వారికి మీ ప్రతిమలు కనపడటానికి వుపయోగ పడతాయి.
  • ప్రతిమలను సర్వర్‌కు ఎక్కించే ప్రక్రియ మొదలు పెట్టడానికి upload గుర్తు గల బొత్తాన్ని/లంకెను క్లిక్ చేయండి.

ఎక్కువ ఫైళ్ళను ఎక్కించడానికి ఎంచుకున్నట్లయితే, ఎక్కించే ప్రక్రియ కొద్దిగా సమయం తీసుకుంటుంది. ప్రతిమలు సర్వర్‌కు ఎక్కించబడుతున్నంతసేపు ప్రగతి సందేశం ప్రదర్శించబడుతుంది.

ఎక్కించే ప్రక్రియ పూర్తవ్వగానే, మీరు ఎక్కించిన ప్రతిమలను ప్రదర్శిస్తూ ఒక వెబ్ పుట ప్రదర్శించబడుతుంది.

ఈ పుటలో మీరు ఎక్కించిన ప్రతిమలు ఒక్కొక్కదానికి వేరువేరుగా, శీర్షిక, వర్ణన, కీలక పదాలు చేర్చడానికి అవకాశం వుంటుంది. మార్పులు చేర్పులు అన్నీ పూర్తి చేసి "save" బొత్తాన్ని నొక్కండి. మీరు చేర్చిన శీర్షిక, వర్ణన, కీలక పదాలతో మీరు ఎక్కించిన ప్రతిమలు మీ ఖాతాలో భధ్రపరచబడతాయి.

photobucket.com లో  
 

• మీ కంప్యూటర్‌లో వున్న ప్రతిమను ఎక్కించవచ్చు
    వెబ్‌లో వున్న ఏ ప్రతిమ నకలునయినా భధ్రపరచవచ్చు.

bhotobucket.com ప్రతిమలను భధ్రపరచడానికి ఉచిత ఆతిధ్య సేవలను అందించే యింకొక వెబ్ సైట్. ఇక్కడ కూడా మీకు వినియోగ ఖాతా వుండాల్సిందే. ఒక వేళ యిప్పటికీ లేనట్లయితే ఒక ఉచిత ఖాతాను సృష్టించుకోండి.

ఈ వెబ్ సైట్‌లో వున్న ప్రత్యేకతలు:

  • మీరు ప్రతిమలను, వీడియోలను రెండింటిని ఎక్కించి మీ ఖాతాలో భధ్రపరచుకోవచ్చు.
  • ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న ఏ ప్రతిమ యొక్క నకలునయినా (copy) మీరు నేరుగా మీ ఖాతాలో భధ్రపరచుకోవచ్చు.

    flickr.com, blogger.com లో దాచడంలా, ప్రతిమను మీ కంప్యూటర్‌లోకి ముందు తెచ్చి భధ్రపరచి తరువాత ఎక్కించవలసిన అవసరం లేదు.

  • మీ ఖాతాలోకి లాగిన్ అయిన తరువాత పుట పైభాగాన వున్న జాబితా పట్టిలోని "my photos" లంకెను క్లిక్ చేయండి.

    పుట మొదట్లో ప్రతిమలు, వీడియోలు సర్వర్‌కు ఎక్కించడానికి పత్రం కలిగిన వెబ్ పుట ప్రదర్శించబడుతుంది.

    మీ ఖాతాలోని ప్రతిమలు, వీడియోలు యిదే పుటలో క్రింది భాగంలో ప్రదర్శించబడి వుంటాయి. పుటను క్రిందికి జార్చితే కనబడతాయి.

  • ఒకేసారి పది ప్రతిమల వరకు సర్వర్‌కు ఎక్కించవచ్చు.

    మీ కంప్యూటర్ నుండి కాని లేదా నేరుగా ఇంటర్నెట్‌లో వున్న ప్రతిమలను గాని ఏదో ఒకటి మాత్రమే ఒక్కసారి ఎక్కించగలము. కొన్ని అవి కొన్ని యివి ఒకే సారి ఎక్కించడం కుదరదు.

  • మీ కంప్యూటర్ నుండి ప్రతిమను ఎక్కించడానికి,
    • మీ కంప్యూటర్‌లో ఆ ప్రతిమను ఎంచుకోండి.

      ఎంచుకున్న ప్రతిమ ఫైల్ పేరు పూర్తి స్థాన మార్గంతో సహా సంబంధిత అక్షర పేటికలో చేరుతుంది.

      ఫైల్ పేరు మాత్రమే ప్రదర్శించబడుతూ, ఆ ప్రతిమకు వర్ణన జోడించడానికి యింకొక అక్షర పేటిక ప్రదర్శించబడుతుంది.

  • ఇంటర్నెట్‌లో వున్న ఏదయినా ప్రతిమకు నకలును దాచదలచినట్లయితే,
    • ప్రతిమలను ఎక్కించడానికి వుపయోగించే పత్రంలో "web url" లంకెను క్లక్ చేసి, తద్వారా ప్రదర్శించబడే వెబ్ పత్రంలో సంబంధిత అక్షర పేటికలో ఆ ప్రతిమ యూఆర్‌ఎల్‌ను చేర్చండి.

      యూఆర్‌ఎల్‌ను చేర్చిన వెంటనే మీరు ఆ ప్రతిమకు సంబంధంగా వర్ణన చేర్చడానికి ఒక అక్షర పేటిక ప్రదర్శించబడుతుంది.

  • అన్ని ప్రతిమలను ఎంచుకుని, సంబంధిత వర్ణనలను పూరించి (ఖాళీగా కూడా వదిలేయవచ్చు). "upload" బొత్తాన్ని/లంకెను క్లిక్ చేస్తే ప్రతిమలు మీ ఖాతాలోకి చేర్చబడతాయి.

    ఎక్కించడానికి కొంత సమయం పట్టేటట్లయితే ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు upload బొత్తం uploading గా మారి కనబడుతుంది.

పుట అంశాలు »  

వెబ్ పుటలోని ప్రతిమ యొక్క యూఆర్‌ఎల్‌ను కనుక్కోవడం  
 
కంప్యూటర్‌లో మనం చూసే ప్రతి ప్రతిమ ఒక ఫైలే. ఇంటర్నెట్ ద్వారా మనం అందుకునే వెబ్ పుటలో ప్రదర్శించబడే ప్రతిమలు బ్రౌసర్‌చే వెబ్ పుటలో అంతఃస్థాపన చేయబడినటువంటివి .

ఇంటర్నెట్‌లో అందుబాటులో వుండే ప్రతీ ఫైల్‌కు ఒక నిర్ధిష్ట యూఆర్‌ఐ/యూఆర్‌ఎల్ వుంటుంది. ప్రతి ప్రతిమ ఒక ఫైలే కాబట్టి, మనం వెబ్ పుటలో చూసే ప్రతి ప్రతిమకు ఒక నిర్ధిష్ట URL/URI వుండాలి.

వెబ్ పుటలో ప్రదర్శించబడుతున్న ఒక ప్రతిమ యొక్క యూఆర్‌ఎల్‌ను:

  • ప్రతిమ వైపు మౌస్ పాయింటర్‌ను చూపుతూ మౌస్ కుడి బొత్తాన్ని నొక్కితే ప్రదర్శించబడే లఘిష్టి జాబితా (shortcut menu) లో వున్న ఐచ్ఛికలను వుపయోగించి తెలుసుకోవచ్చు
    (లేదా)
  • ప్రతిమకు సంబంధించిన లక్షణాలను తెలియపరచే "Properties" శీర్షిక గల ఆ సంవాద పేటిక నుండి గ్రహించవచ్చు.

    ఈ సంవాద పేటికను ఆ లఘిష్టి జాబితాలో వున్న "Properties" జాబితా అంశాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రదర్శించవచ్చు.

ఒక ప్రతిమ ఇంటర్నట్‌లో వున్న ఏదయినా వనరుకు (ఫైల్‌కు) లంకెగా పనిచేస్తున్నట్లయితే, ఆ ప్రతిమకు సంబంధంగా రెండు యూఆర్‌ఎల్స్ వుంటాయి. ఒకటి ఆ ప్రతిమ ఫైల్ యొక్క యూఆర్‌ఎల్, రెండు ఆ లంకెకు సంబంధించిన యూఆర్‌ఎల్. మీకు కావలసిన ప్రతిమ యూఆర్‌ఎల్‌లో చివర ప్రతిమ ఫైల్ పేరు వుంటుంది.

ఒక ప్రతిమ వేరొక ప్రతిమ ఫైల్‌కు కూడా లంకె అవ్వొచ్చు. కాబట్టి ఒక వేళ ప్రతిమ లంకెకు సంబంధంగా వున్న రెండు యూఆర్‌ఎల్స్ ప్రతిమ ఫైళ్ళే అయితే, అక్కడ ప్రదర్శనలో వున్న ప్రతిమ యొక్క యూఆర్‌ఎల్ <img> గుర్తులోపల src="__" గుణం యొక్క విలువగా కనబడుతుంది. లంకెలుగా పనిచేసే ప్రతిమల యొక్క యూఆర్‌ఎళ్ళ నకలు తీసేటప్పుడు ఈ విషయం గమనంలో వుండాలి.

• ప్రతిమ యూఆర్‌ఎల్ ఎందుకు?

వేరే వెబ్ సైట్‌లో వున్న ప్రతిమను ఆ ప్రతిమ యూఆర్‌ఎల్ వుపయోగించి మీ బ్లాగ్ పోస్టులో ప్రదర్శించబడేటట్లు చెయ్యవచ్చు. మీరు చేయవలసిందల్లా ఆ ప్రతిమ యూఆర్‌ఎల్‌ను <img> గుర్తులో src="___" గుణం విలువ క్రింద చేర్చడమే.

అయితే అలా చేయడానికి మీరు ఆ వెబ్ సైట్ (ప్రతిమ సొంతదారుని) అనుమతి పొందవలసి వుటుంది. అది అందరూ వాడుకోదగ్గ ప్రతిమ అయి వుంటే (ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్లలో వుండే చాలా ప్రతిమల లాంటివి) అటువంటి అనుమతి అక్కర్లేదు.

మీరు ఆ యూఆర్‌ఎల్‌ను వుపయోగించి ఆ ప్రతిమ యొక్క నకలును, [యూఆర్‌ఎల్ వుపయోగించి నకలును తెచ్చియిచ్చే సౌకర్యమున్న (photobucket.com) వెబ్ సైట్లలో మీ ఖాతాలో భధ్రపరచుకోవచ్చు.

• మీ కంప్యూటర్‌లో దాచి తరువాత వెబ్ సర్వర్‌కు ఎక్కించండి.

మీరు ప్రతిమలను భధ్రపరచడానికి ఉచిత ఆతిధ్య సేవలు పొందుతున్న వెబ్ సైట్‌లో యూఆర్‌ఎల్‌ను వుపయోగించి నకలు తీసే సౌకర్యం (photobucket.com లో వున్న సౌకర్యంలాంటిది) లేనట్లయితే, ప్రతిమను ముందు మీ కంప్యూటర్లోకి తెచ్చి భధ్రపరచి, తదుపరి ఆ సర్వర్‌కు ఎక్కించవలసి వుంటుంది.

• ఏ ప్రతిమ నకలునైనా తీసి వాడుకోవచ్చా !

ఇంటర్నెట్ (వెబ్)లో వున్న ప్రతిమలన్నీ కూడా కాపీరైట్ రక్షణ కలిగినటువంటివే. అవి వాటి సొంతదారుల నుండి (వెబ్ సైట్ సొంతదారు లేదా ప్రతిమను వెబ్ సైట్‌లోకి ఎక్కించిన వారు) స్పష్టమైన అనుమతి పొంది వుంటే తప్ప వాడుకోకూడదు..

కాబట్టి ఏ యితర వెబ్ సైట్‌లో పున్న ప్రతిమనయినా, తగ్గ అనుమతి లేకుండా, మీ బ్లాగ్ పుటలలో చేర్చి ప్రదర్శిస్తున్నా, లేదా ఆ ప్రతిమ యొక్క నకలును మీ కంప్యూటర్లో, లేదా ఏదయినా ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్‌లో భధ్రపరచినా మీరు కాపీరైట్ చట్టాలను అతిక్రమించినట్లే.

ఇంటర్నట్‌లో పారుతున్న ప్రతిమల వరదలో, ఒక ప్రతిమ యొక్క సొంతదారుని గుర్తించి, వారి వద్ద నుండి అనుమతి పొందడం షుమారుగా దుస్సాధ్యమైన పనే. అయినప్పటికీ ఈ విషయానికి సంబంధించి ఎటువంటి సమాచారము మీ వద్ద లేకుండా ప్రతిమను మీరు వుపయోగిస్తున్నప్పుడల్లా మీరు కాపీపెట్ చట్టాన్ని అతిక్రమిస్తున్నవారవ్వవచ్చు

హాట్ లింకింగ్  
 
ప్రతిమ ప్రదర్శించబడుచున్న వెబ్ పుట (Html ఫైల్) మరియు ప్రతిమ ఫైల్, రెండు నిర్ధిష్టమైన యూఆర్‌ఎళ్ళను కలిగిన రెండు ఫైళ్ళు. అవి రెండూ కనుక వేరు వేరు సర్వర్‌లలో (వెబ్ సైట్) నిక్షిప్త పరచబడి వుంటే ఆ ప్రతిమ ఆ వెబ్ పుటకు హాట్ లింక్ చేయబడి వుంది అంటాము.

మీరు మీ ప్రతిమలను ఒక ఉచిత ఆతిధ్య సేవలను అందించే వెబ్ సైట్‌కు ఎక్కించి (భధ్రపరచి) (flickr.com, photobucket.com, photos-blogger.com మొదలగు వాటిలో) ఆ ప్రతిమను మీరు బ్లాగ్‌స్పాట్.కామ్ ఆతిధ్యంలో వున్న మీ బ్లాగ్‌లో ప్రదర్శిస్తున్నారు అంటే, మీరు ఆ ప్రతిమలను హాట్ లింక్ చేస్తున్నట్లే.

ఇతర వెబ్ సైట్లలో వున్న ప్రతిమలను హాట్ లింక్ చేసేటప్పుడు (ఆ వెబ్ సైట్ సొంతదారుల దగ్గర) తగ్గ అనుమతి పొందవలసి వుంటుంది. మీరు photos-blogger.com, flickr.com లో వున్న ప్రతిమలకు హాట్ లింక్ చేస్తున్నారంటే అది చట్టబద్దమే. ఎందుకంటే వారు అది అనుమతిస్తున్నారు కాబట్టి. అయితే అది కొన్ని షరతులతో కూడిన అనుమతి అవ్వవచ్చు. (ఎక్కువగా మీరు వుపయోగించే ప్రతిమను వారి వెబ్ సైట్‌లో ఆ ప్రతిమ ఫైల్‌కు లంకెగా పనిచేయించాలి అని వుంటుంది)

ఆ షరతును మీరు పాటించకపోతే మీరు వారి నియమావళికి విరుద్ధంగా ఆ ప్రతిమను హాట్ లింక్ చేసినట్టే.

• హాట్ లింకింగ్ - బ్యాండ్ విడ్త్ చౌర్యము.

ఒక వెబ్ పుటలోని ప్రతిమ బ్రౌసర్‌లో ప్రదర్శించబడినప్పుడల్లా బ్రౌసర్‌ ఆ ప్రతిమకు ఆతిధ్యసేవనందిస్తున్న వెబ్ సైట్ (సర్వర్) నుండి దానిని తీసుకొచ్చి ప్రదర్శిస్తుంది. బ్యాండ్ విడ్త్ అనగా వెబ్ సర్వర్ నుండి వాడుక దారుని కంప్యూటర్‌కు ప్రసరించే దత్తం/సమాచారం యొక్క పరిమాణం.

వెబ్ పుటను (Html ఫైల్‌ను) సర్వర్‌నుండి తీసుకురావడానికి, ప్రతిమ ఫైల్‌ను తీసుకురావడానికి, రెండింటికి కొంత బ్యాండ్ విడ్థ్ ఖర్చవుతుంది.

వెబ్ పుటకు, ప్రతిమలకు ఒకే వెబ్ సైట్ ఆతిధ్య సేవలను అందిస్తున్నట్లయితే, మొత్తం ఖర్చయ్యే బ్యాండ్ విడ్త్ ఆ వెబ్ సైట్‌దే అవుతుంది.

మీరు ఒక ప్రతిమను హాట్‌లింక్ చేసినట్లయితే, వెబ్ పుటకు సంబంధించిన దత్తం/సమాచారం వెబ్ పుటకు ఆతిధ్య సేవను అందించిన సర్వర్‌నుండి ప్రసారమవుతుంది. ప్రతిమకు సంబంధించిన దత్తం/సమాచారం ప్రతిమకు ఆతిధ్య సేవను అందించిన సర్వర్‌ నుండి ప్రసారమవుతుంది. తద్వారా ఖర్చయ్యే బ్యాండ్ విడ్త్ మొత్తం రెండు సర్వర్‌ల మీద వుంటుంది.

అనుమతి లేకుండా హాట్ లింక్ చేయబడ్డ ప్రతిమలు కలిగివున్న వెబ్ పుటలు బ్రౌసర్‌లో ప్రదర్శించబడినప్పుడల్లా, ప్రతిమలకు ఆతిధ్య సేవలు అందిస్తున్న వెబ్ సైట్ల యొక్క బ్యాండ్ విడ్త్ వారి అనుమతి లేకుండానే ఖర్చవుతుంది. దీనినే బ్యాండ్ విడ్త్ చౌర్యము అంటారు.

వెబ్ సైట్లకు ఆతిధ్య సేవలు అందించే సంస్థలు వారి ఆతిధ్యంలో వున్న ప్రతి వెబ్ సైట్‌కు నెలకు కొంత బ్యాండ్ విడ్త్ ఉచితముగా సమకూరుస్తాయి. ఒక వెబ్ సైట్‌కు సమకూర్చబడ్డ లేదా కేటాయించబడ్డ బ్యాండ్ విడ్త్ కనుక నెల చివరలోపు ఖర్చయినట్లయితే, ఆ వెబ్ సైట్ సొంతదారులు అదనపు బ్యాండ్ విడ్త్ కొనుగోలు చేయవలసివుంటుంది.

యిది ఆమోదించబడనటువంటి హాట్ లింక్‌ల వలన అయ్యే ఖర్చు వెబ్ సైట్ సొంతదారులే భరించడం అవుతుంది. ఆమోదం లేకుండా హాట్ లింకింగ్ చేసేవారికి, వేరే వెబ్ సైట్ల యొక్క బ్యాండ్ విడ్త్ ఆ సంబంధిత ఖర్చు భరించకుండా వినియోగించుకోవడం అవుతుంది.

మీ విద్యుత్ కనెక్షన్‌లో ప్లగ్‌ను గుచ్చి (మీకు తెలియకుండా) ఎవరో వాడుకున్న విద్యుత్తుకు మీరు బిల్లు కట్టవలసి వస్తే ఎట్లా వుంటుందో! బ్యాండ్ విడ్త్ చౌర్యం కూడా అటువంటి భావాన్నే కలుగచేస్తుంది. (ఎవరికి!!)

 

అనువాదం :: నేర్పు జట్టు ఈ పుటకు ఆంగ్ల మూలం ... తరువాతి పుట ౧౯ (19)

పుట అంశాలు »  
Bookmark and Share

© All rights reserved.

♣ Site optimized for ♣ Internet Explorer 7 ♣ Firefox 2.0 and above