ముందు పుట ... ౨౦ (20) |
వెబ్ పుటలలో వీడియోలు | |
మీ బ్లాగ్ పుటలకు వీడియోలు వుపయోగించి జీవం తేవచ్చు. మీ బ్లాగ్ పోస్ట్‌లో వీడియోలు చేర్చడానికి మీరు వీడియోగ్రఫీ నిపుణులవ్వక్కరలేదు. వీడియోలకు ఉచిత ఆతిధ్య సేవలందిస్తున్న వెబ్ సైట్లకు ఎక్కించబడుతున్న లక్షల సంఖ్యలో వీడియోలను మీరు ఉపయోగించవచ్చు.
మీ కంప్యూటర్‌లో వున్న వెబ్ క్యామ్ వుపయోగించి కూడా మీరు వీడియో చిత్రీకరించి, దానిని సర్వర్‌కు ఎక్కించి మీ వెబ్ పుటలో వుపయోగించవచ్చు. మీరు విండోస్ వాడుతున్నట్లయితే దానికి విండోస్ మూవీ మేకర్ అనే ప్రోగ్రామ్‌ను వుపయోగించవచ్చు. |
బ్లాగర్‌కు వీడియోలను ఎక్కించడం | |
• వీడియో పై ప్రక్రియ
వెబ్ పుటలలో ప్రదర్శించబడే వీడియోలు ఎక్కువగా ఫ్లాష్ రూపంలో యిష్టానుసారం ఏర్పరచబడ్డ సొంత ప్లేయర్లు కలిగి వుంటాయి. ఉచిత వీడియో ఆతిధ్య సేవలందిస్తున్న యూట్యూబ్, గూగుల్, యాహూ, బ్లాగర్ ఈ రూపాన్ని వినియోగిస్తాయి.
ఈ సర్వర్లకు మీరు ఎక్కించిన వీడియో ఫైల్ రూపం ఏదయినా కానివ్వండి (విండోస్ ఏవిఐ, యాపిల్ క్విక్ టైమ్, ... ), అవి వెబ్ పుటలలో ప్రదర్శించబడటానికి వీటిపై ఒక ప్రక్రియను చేపట్టబడి ఫ్లాష్ రూపంలోకి మార్చబడతాయి. .
మీ వీడియో బ్లాగర్ సర్వర్‌కు ఎక్కించబడ్డ తర్వాత దాని మీద ప్రక్రియ చేపట్టి, ఫ్లాష్ రూపంలోకి మార్చవలసి వుంటుంది. ఈ ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుంది. ఎంత సమయం తీసుకుంటుందనేది సర్వర్ ప్రక్రియ చేపట్టగలిగే సత్తా మీద, అప్పటికే ప్రక్రియ చేపట్టబడవలసిన వీడియోలు ఎన్ని, ఎంత పరిమాణం కలవి వున్నాయి అనే దాని మీద ఆధారపడి వుంటుంది. • చిత్తు ప్రతిగా భద్రపరచి సాగిపొండి
వీడియో ఫైల్ ఎక్కించబడుతున్న సమయంలో, మీరు పోస్ట్‌ను చిత్తు ప్రతిగా భద్రపరచి వేరే పనులు చేసుకోవచ్చు.
» గవాక్షము/ట్యాబ్ మూసివేయవద్దు
మీ పోస్ట్‌ను చిత్తుప్రతిగా భద్రపరచినప్పటికి, మీరు వీడియో ఎక్కించబడుతున్న పుట వున్న గవాక్షాన్ని/ట్యాబ్‌ను మూసివేయవద్దు. మూసివేయడం మీరు వీడియోను సర్వర్‌కు ఎక్కించే ప్రక్రియను రద్దు చేయడం అవుతుంది.
ఎక్కించబడ్డ వీడియో బ్లాగ్ పుటలో ప్రదర్శించబడటానికి, దానిపై ప్రక్రియ పూర్తవ్వవలసి వుంటుంది. వీడియో ఎక్కించడం పూర్తయి దానిపై ప్రక్రియ చేపట్టబడుతున్నప్పుడు, పోస్ట్‌ను చిత్తు ప్రతిగా భద్రపరచి మిగతా పనులు చేసుకోవచ్చు. కావాలంటే బ్లాగర్ నుండి లాగ్ - ఔట్ అయ్యి తదుపరి ఎప్పుడన్నా వచ్చి పోస్ట్‌ను ప్రచురించవచ్చు. ఎక్కించడం ప్రక్రియ పూర్తయితే వీడియో భద్రంగా వుంది అని మీరు అనుకోవచ్చు. • ప్రచురణ
మీరు బ్లాగర్‌కు ఎక్కించిన వీడియో బ్లాగ్ పోస్ట్‌లో/పుటలో ప్రదర్శించాలంటే, పోస్ట్‌ను ప్రచురించవలసి వుంటుంది. వీడియోపై ప్రక్రియ పూర్తయిన తదుపరి ఎప్పుడయినా మీరు పోస్ట్‌ను ప్రచురించవచ్చు.
|
యితర సర్వర్‌లపై భద్రపరచబడ్డ వీడియోలను బ్లాగ్ పోస్ట్‌లో చేర్చడం | |
వీడియోలకు ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్లలో ప్రదర్శించబడుతున్న వీడియోలను, ఆ వీడియోలకు సంబంధంగా వున్న Html కోడ్ వుపయోగించి మీ బ్లాగ్ పోస్ట్‌లలో చేర్చవచ్చు.
Embed గుర్తు కలిగిన అక్షర పేటిక/ప్రదేశములో వున్న Html కోడ్‌ని వుపయోగించి, వీడియోను ఏ వెబ్ పుటలోనయినా (బ్లాగ్‌లు, చర్చావేదికలు (ఫోరమ్‌లు), వెబ్ పుటలు) చేర్చవచ్చు. మీరు ప్రస్తుతము చూస్తున్న పుటలో వీడియోలు కూడా అలా చేర్చబడ్డవే. |
కోడ్‌ను ఎక్కడ చేర్చాలి | |
• కోడ్‌ను Html విధానంలో చేర్చండి
బ్లాగర్ సర్వర్లపై కాకుండా యితర సర్వర్ల ఆతిధ్యంలో వున్న వీడియోలను పోస్ట్‌లో embed/object HTML గుర్తులు వుపయోగించి చేరుస్తున్నట్లయితే సంబంధిత అంతఃస్థాపన కోడ్‌ను Html విధానంలో, పోస్ట్ పాఠాన్ని చేర్చే అక్షర ప్రదేశంలో చేర్చవలసి వుంటుంది.
• బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలు
బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలకు సంబంధించిన Html కోడ్ స్వయంచాలకంగా బ్లాగ్ పోస్ట్ పాఠంలోకి చేర్చబడుతుంది. బ్లాగర్‌కు ఎక్కించిన వీడియోలకు సంబంధించిన కోడ్ సాధరణంగా అంతఃస్థాపన చేయబడ్డ వీడియోల కోడ్‌తో పోలిస్తే తేడాగా వుంటుంది. దానిని మీరు ముసుకు వేయబడ్డ కోడ్‌గా భావించవచ్చు.
దీనివలన మీరు బ్లాగర్‌కు ఎక్కించిన వీడియోలను వేరే వెబ్ సైట్లలో వినియోగించే అవకాశం మీద నిరోధం ఏర్పడుతుంది. మీరు వీడియోను బ్లాగర్ బ్లాగ్ పుటలలో వీక్షించవచ్చు లేదా Enclosure గుర్తుగల అక్షర పేటికలో చేర్చబడ్డ కోడ్ (యూఆర్‌ఎల్) వుపయోగించి ఒక వీడియో ప్లేయర్‌లో వీక్షించవచ్చు. upload video బొత్తాన్ని క్లిక్ చేయగానే కొంత Html కోడ్ అక్షర పేటికలో చేర్చబడటం (మీరు Html విధానంలో వున్నట్లయితే) లేదా వీడియో ప్లేయర్ ప్రతిమ అక్షర పేటికలో చేర్చబడటం (మీరు కూర్పు విధానంలో వున్నట్లయితే) చూడవచ్చు. మీరు వీడియోను ఎక్కించే ప్రక్రయను మొదలు పెట్టినప్పుడు కర్సర్ స్థానం ఏదైనప్పటికి Html కోడ్, లేదా వీడియో ప్లేయర్ ప్రతిమ పోస్ట్ పాఠం చివరలో చేర్చబడుతుంది. Html విధానంలో నుండి కోడ్‌ను లేదా కూర్పు విధానంలో నుండి ప్లేయర్ ప్రతిమ స్థానాన్ని మార్చుకోవడం ద్వారా వీడియో స్థానాన్ని మార్చుకోవచ్చు. |
చేర్చబడ్డ వీడియో ప్రివ్యూ | |
• బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలు
బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలకు ప్రివ్యూ, కూర్పు విధానంలోనే చూడవచ్చు.
• అంతఃస్థాపన చేయబడ్డ వీడియోలు కూర్పువిధానంలో ప్రదర్శించబడవు
బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలలా కాక, అంతఃస్థాపన చేయబడుతున్న, యితర సర్వర్లపై వున్న వీడియోలు కూర్పు విధానంలో ప్రదర్శించబడవు. ఆ వీడియోలకు ప్రివ్యూ వీక్షించాలంటే, ప్రివ్యూ విధానంలోకి మారవలసిందే.
ప్రివ్యూ పోస్ట్ అంతిమ రూపానికి నకలు కాదు అనే విషయం గమనించాల్సి వుంటుంది. ప్రివ్యూ మీకు వీడియో పనిచేస్తుంది అని నిర్ధారించుకోవడానికి పనికొస్తుంది. |
చేర్చబడ్డ వీడియో లీనం | |
వీడియో లీనం అమర్చాలంటే, వీడియోకు సంబంధించిన కోడ్‌కు ముందు <div> చివరలో </div> గుర్తును చేర్చడం ద్వారా ఒక విభాగంలో చేర్చండి. ఆ విభాగానికి లీనం ఏర్పరచే గుణాన్ని/శైలి లక్షణాన్ని అనువర్తించడం ద్వారా (align=right/left/center; style="float; right/left" అమర్చడం ద్వారా) వీడియోకు లీనం ఏర్పరచండి.
• బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలు
బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలు కూర్పు విధానంలో ప్రదర్శించబడతాయి కాబట్టి, వీడియో ప్లేయర్ ప్రతిమ మీద మధ్యలో వున్న బొత్తం మీద కాక, యింక ఎక్కడైనా క్లిక్ చేసి ఎంచుకొని, పరికర/సాధన పట్టిపై వున్న లీనం ప్రతిమ బొత్తాలు వుపయోగించే లీనాన్ని అనువర్తింపచేయవచ్చు.
విభాగానికి css లక్షణాలను, వెబ్ పుటలోని యితర విభాగాలకు వుపయోగించగలిగినన్ని వుపయోగించవచ్చు. |
చేర్చబడ్డ వీడియోల లంకెలు | |
• యితర సర్వర్లలో ఆతిధ్యం పొందిన వీడియోలు
ఆయా సైట్లలో వీడియో ప్రదర్శించబడే పుటలో, వీడియో ప్రక్కన వున్న అక్షర పేటికలో వీడియోకు యూఆర్‌ఎల్ కనబడుతుంది. ఈ యూఆర్‌ఎల్‌ను వుపయోగించి ఆ వీడియో ప్రదర్శించబడే పుటకు లంకె సృష్టించుకోవచ్చు.
• వీడియో ఫైల్‌కు లంకె దొరకదు
వీడియోలకు ఉచిత ఆతిధ్య సేవలందించే వెబ్ సైట్‌కు ఎక్కించిన వీడియో ఫైళ్ళ లంకె దొరకదు. ఈ వీడియోలను వారి వెబ్ సైట్ పుటలలోనన్నా లేదా యితర వెబ్ పుటలలో అంతఃప్రతిష్టించన్నా వీక్షించవలసిందే.
వేరే ప్లేయర్లలో వీటిని వీక్షించడానికి వీలవదు (ఆ ఫైళ్ళను మీ కంప్యూటర్‌లోకి తెచ్చి భద్రపరచడాన్ని సశక్త పరచే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రాములు {మీరో} వుంటే తప్పితే). ఒకసారి మీ కంప్యూటర్‌లో వాటిని భద్రపరచిన తరువాత వాటిని వీక్షించడానికి అదే రూపంలో flV వాటిని ప్రదర్శించగలిగే ప్లేయర్లను వాడి లేదా వాటిని వేరే రూపాలలోకి మార్చి సంబంధిత ప్లేయర్లలో వీక్షించడానికి అవకాశం వుంటుంది. • బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలు
బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియోలను బ్లాగర్‌తో సృష్టించబడ్డ బ్లాగ్ పుటలలో మాత్రమే అంతఃస్థాపన చేయగలుగుతాము.
అయితే మీరు మీ బ్లాగ్‌కు పోస్ట్ సృష్టి/సవరణ పుటలో లంకెల క్షేత్రాన్ని సశక్త పరచి వున్నట్లయితే, ఆ క్షేత్రం క్రింది భాగంలో Enclosure గుర్తు కలిగిన ప్రత్యేకమైన విభాగం జతచేయబడి, దానిలో వీడియోకు లంకె చేర్చబడుతుంది.
|
పోడ్కాస్ట్లు, జతపరుపులు MIME రకం | |
• పోడ్‌కాస్టింగ్
క్లుప్తంగా పోడ్‌కాస్టింగ్ అంటే కంప్యూటర్లలో ఆడియో/వీడియో ప్లేయర్లలో వినియోగించే ఆటల/పాటల జాబితా (play list) వంటి దానిని ఫీడ్‌లు వుపయోగించి అందించడం (ప్రసారం చెయ్యడం)
పోడ్కాస్ట్లు కదల్చగల (ఎమ్మట తోడ్కొనిపోగల) ప్లేయర్లు (ఉదా:- ఐపోడ్, మల్టీ మీడియా ప్లేయర్లు కలిసి వున్న మొబైల్ ఫోన్ మొదలగునవి) మరియు కంప్యూటర్లలో ఆడించడానికి (వుపయోగించడానికి) వుద్దేశించబడినవి. దాని కోసం ఫీడ్‌లను సంభాళించి, వాటిలో వున్న మీడియా ఫైళ్ళ యొక్క యూఆర్‌ఎళ్ళను పోగుచేసుకోగల సత్తా వున్న ప్రోగ్రాములు వినియోగించబడతాయి.
పోడ్‌కాస్ట్ అనే పదం "pod", "broadcast" (ప్రసారం) కలిపి సృష్టించబడింది. » పోడ్‌కాస్ట్ : ఆట/పాటల జాబితా
పోడ్‌కాస్టింగ్ ఫీడ్‌లో పోడ్కాస్ట్లు వున్న మీడియా ఫైళ్ళ, యాఆర్‌ఎళ్ళ జాబితా, సంబంధిత సమాచారము, కలిపి వుంటుంది.
కోడ్ మూలంతో (open source) సహా అందించబడే మిరో (ఉచిత ప్రోగ్రామ్) వంటి ప్రోగ్రామ్‌ను ఉపయోగించి ఈ ఫీడ్‌లను సంభాళించి వాటిలో వున్న యూఆర్‌ఎళ్ళ నుండి ఆటల/పాటల జాబితా సిద్దం చేసుకోవచ్చు అర్ధం చేసుకోవడం కొరకు పోడ్‌కాస్ట్ ఫీడ్‌ను మీడియా ప్లేయర్లలో మనకు కనబడే ఆటల/పాటల జాబితాకు సమానం అనుకోవచ్చు. ఆటల/పాటల జాబితాలో వున్న మీడియాకు సంబంధించిన ఫైళ్ళు మీ కంప్యూటర్‌లోనే వుంటాయి. పోడ్‌కాస్ట్ (జాబితాలో) వున్న మీడియాకు సంబంధించిన ఫైళ్ళు ఇంటర్నెట్‌కు అనుసంధించబడి వున్న ఏ కంప్యూటర్‌లోనయినా వుండవచ్చు (సాధారణంగా). సాంకేతికంగా పోడ్‌కాస్టులు బిట్‌టొరెంట్ (Bittorrent) ఒడంబడికను అనుసరించి సమానుల అల్లికలో (peer to peer [p2p] networks) పంచుకోబడుతున్న మీడియా ఫైళ్ళ యూఆర్‌ఎళ్ళలు కూడా కలిగి వుండవచ్చు. BITTORRENT ఒడంబడిక P2P అల్లికలలో ఫైళ్ళు పంచుకోవడానికి వుద్దేశించబడినది. • జతపరుపులు (Enclosures)
Enclosures = జతచేయబడ్డవి, జోడించబడ్డవి, కలిపియివ్వబడ్డవి.
ఇది పోడ్‌కాస్టింగ్ కొరకు వుపయోగపడే లంకెలను పోస్ట్‌లో చేర్చడానికి వుద్దేశించబడినది. ఇక్కడ మీరు చేర్చే ఫైలు ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో వున్న ఏ ఫైలైనా అవ్వొచ్చు. మీరు ఫైల్ యొక్క యూఆర్‌ఐను తెలపవలసి వుంటుంది. (ఫైలు అందుకోవడానికి వుపయోగించవలసిన ఒడంబడికను ఫైల్ యూఆర్‌ఎల్‌ను ఉపసర్గంగా (prefix వాడుతూ)
పోడ్కాస్ట్లు ఫీడ్‌లు కాబట్టి వాటిలో అక్షర పాఠం, ప్రతిమ-ళ్ళకు/పిడిఎఫ్-ఫైళ్ళకు/ఇతర-ఫైళ్ళకు, యూఆర్‌ఎళ్ళు కూడా వుండవచ్చు. అయితే పోడ్కాస్ట్ను సంభాళించే ప్రోగ్రామ్‌కు యితర రూపాల యూఆర్‌ఎళ్ళను సంభాళించే సత్తా లేకున్నట్లయితే, పోడ్కాస్ట్లో వున్న యితర పాఠం వీక్షించడం కొరకు సాధారణ ఫీడ్ రీడర్లను వినియోగించుకోవలసి వుంటుంది. బ్లాగర్ జతచేయబడ్డ యూఆర్‌ఎళ్ళను బ్లాగ్ ఫీడ్‌లో భాగంగా మాత్రమే చేరుస్తుంది కాబట్టి, యివి మీ బ్లాగ్ పోస్ట్‌లో ప్రదర్శించబడవు. అవి మీరు ఒక ఫీడ్ రీడర్ ప్రోగ్రాములో మీ బ్లాగ్ ఫీడ్‌ను ప్రదర్ళిసించినట్లయితేనే కనబడతాయి.
మీరు మీ పోస్ట్‌కు సంబంధంగా ఫీడ్ ద్వారా మీ పోస్ట్‌ను అందుకునే వారికి వుపయోగపడతాయనుకున్న (ఇంటర్నెట్ ద్వారా అందుకోగలిగే) ఎ వనరుకైనా యూఆర్‌ఎల్‌ను జతపరచవచ్చు. ఫీడ్ రీడర్ ప్రోగ్రామ్ ఆ యూఆర్‌ఎల్‌ను లంకెగా రూపకల్పన చేసి మీ పోస్ట్‌కు జతపరుపు (attachment) గా ప్రదర్శిస్తుంది. ఒక అంశానికి (పోస్ట్‌కు) సంబంధించిన నమూనా RSS ఫీడ్ XML కోడ్. ఈ పోస్ట్‌లో బ్లాగర్‌కు ఎక్కించబడ్డ వీడియో, జతపరచబడ్డ వీడియో యూఆర్‌ఎల్ వున్నాయి.
<item> <guid isPermaLink='false'>tag:blogger.com,1999:blog-2312227617126399248.post-6249763531290422762</guid> <pubDate>Mon, 24 Sep 2007 15:42:00 +0000</pubDate> <atom:updated>2007-09-24T08:47:16.723-07:00</atom:updated> <title></title> <description> <object width="320" height="266" class="BLOG_video_class" id="BLOG_video-23d5f2428503ee70" classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"> <param name="movie" value="http://www.blogger.com/img/videoplayer.swf?videoUrl=http%3A%2F%2Fvp.video.google.com%2Fvideodownload%3Fversion%3D0%26secureurl%3DqgAAAO3T1daHheEeH3ZcEQIwEb9iuYBHTaK1H4WykNeyZ-At4a-eg7UJ_ruD2b2WhaHpk_WqeQVQtmziRBuQk0puWX61e1T0-QNKl3Jdt4luZTcMU9fQ6irtS-TUnahKXHVQi6CVXoAvjqyFhsZqAVFphUUX2ouV-eDKJ3Y1IrFVAEOZcpyN1lCPtBPsKh_PGnTZildCBs7X-puLrCRw2VaqiC0sO0SyAcVJdVH4LcWxJN80%26sigh%3D5rH-EfMTXqMXp6Wdb_XhPrBB8eA%26begin%3D0%26len%3D86400000%26docid%3D0&nogvlm=1&thumbnailUrl=http%3A%2F%2Fvideo.google.com%2FThumbnailServer2%3Fapp%3Dblogger%26contentid%3D23d5f2428503ee70%26offsetms%3D5000%26itag%3Dw320%26sigh%3DGyilpuaEOm-X1qve_6yd7OaKC9Y&messagesUrl=video.google.com%2FFlashUiStrings.xlb%3Fframe%3Dflashstrings%26hl%3Den"> <param name="bgcolor" value="#FFFFFF"> <embed width="320" height="266" src="http://www.blogger.com/img/videoplayer.swf?videoUrl=http%3A%2F%2Fvp.video.google.com%2Fvideodownload%3Fversion%3D0%26secureurl%3DqgAAAO3T1daHheEeH3ZcEQIwEb9iuYBHTaK1H4WykNeyZ-At4a-eg7UJ_ruD2b2WhaHpk_WqeQVQtmziRBuQk0puWX61e1T0-QNKl3Jdt4luZTcMU9fQ6irtS-TUnahKXHVQi6CVXoAvjqyFhsZqAVFphUUX2ouV-eDKJ3Y1IrFVAEOZcpyN1lCPtBPsKh_PGnTZildCBs7X-puLrCRw2VaqiC0sO0SyAcVJdVH4LcWxJN80%26sigh%3D5rH-EfMTXqMXp6Wdb_XhPrBB8eA%26begin%3D0%26len%3D86400000%26docid%3D0&nogvlm=1&thumbnailUrl=http%3A%2F%2Fvideo.google.com%2FThumbnailServer2%3Fapp%3Dblogger%26contentid%3D23d5f2428503ee70%26offsetms%3D5000%26itag%3Dw320%26sigh%3DGyilpuaEOm-X1qve_6yd7OaKC9Y&messagesUrl=video.google.com%2FFlashUiStrings.xlb%3Fframe%3Dflashstrings%26hl%3Den" type="application/x-shockwave-flash"> </embed> </object> </description> <link>http://chubby-chikky.blogspot.com/2007/09/blog-post_9974.html</link> <enclosure type='video/mp4' url='http://www.blogger.com/video-play.mp4?contentId=23d5f2428503ee70&type=video%2Fmp4' length='0'/> <author>आम आदमी</author> </item> • MIME రకం
MIME = బహుళ ప్రయోజక ఇంటర్నెట్ టపా విస్తరణ (Multi purpose internet mail extention)
MIME ఆదిలో ఈ-టపా రూపాన్ని, విస్తరించడానికి [అక్షర పాఠం, శీర్షికలో సమాచారాన్ని చేర్చడానికి ASCII కాక యితర చిహ్న వర్గాలకు (ఉదా: UTF-8 characterset) మద్దతు కలుగ చేయడానికి, అక్షర పాఠం కాక యితర రూపాలలో వున్న పాఠాన్ని జోడించడానికి (ప్రతిమలు మొదలగునవి)] కనుగొనబడ్డ/సృష్టించబడ్డ ప్రమాణము. దరిదాపు ఈ-టపా పాఠం మొత్తం ఇంటర్నెట్‌లో SMTP (simple mail transfer protocol - తేలికపాటి టపా బదిలీ ఒడంబడిక ) ద్వారా MIME రూపంలో ప్రసారం చెయ్యబడుతుంది. HTTP ఒడంబడికను పాఠించే బ్రౌజర్, ఇతర సాధనాలు, వెబ్ సర్వర్ అందించిన ఫైలులో వున్న పాఠం రూపాన్ని పంపబడ్డ ఫైలులో సర్వర్ "Content type:___" శీర్షికను చేర్చడం ద్వారా నిర్దేశించిన MIME రకం ఆధారంగా గుర్తిస్తాయి. యూఆర్‌ఎళ్ళలో వుండే ఫైల్ పేరు పొడిగింపు సర్వర్ పంపిన ఫైలులో వుండే పాఠం రూపాన్ని గుర్తించడానికి వుపయోగించవు. మారు పేర్ల వాడకం, ఫోల్డర్ కోసం అడిగినప్పుడు, అందులోని సాధారణ ఫైలును పంపడం (యూఆర్‌ఎల్‌లో పంపబడ్డ ఫైలు పేరు కనబడదు), యూఆర్‌ఎల్ నుండి బ్రౌజర్ పేరు పొడిగింపును అస్సలు అందులో లేకపోవడానికి ఉదాహరణలు. MIME రకాలు ఫైలు రకాలను వాటికి సంబంధిత ప్రోగ్రాములతో జత చేయడానికి కూడా బ్రౌజర్‌కు పనికొస్తాయి. మనం గుర్తించగలిగే కొన్ని సాధారణ MIME రకాలు.
ఇది మీకు అవగాహన కలుగ చేయడానికి జాబితా మాత్రమే. సంపూర్ణ జాబితా కాదు. దరిదాపుగా అన్ని ఫైల్ రకాలకు మైమ్ రకం నిర్వచించబడి వుపయోగిస్తాము |
వీడియోకు ఆతిధ్యమిచ్చే వెబ్ సైట్ నుండి నేరుగా పోస్ట్‌ను ప్రచురించడం | |
• మీ బ్లాగ్‌ను నేరుగా పోస్ట్ చేయడానికి అమర్చడం
|
వెబ్ పుటలలో అంతఃస్ధాపన చేయబడే వీడియోల HTML కోడ్ | |
బ్రౌసర్, ఒక ప్లగిన్ సహాయంతో మాత్రమే సంభాళించగలిగే ఫైల్‌ను, వెబ్ పుటలో <object> లేదా/మరియు <embed> Html గుర్తుల సహాయంతో చేరుస్తాము.
OBJECT గుర్తు విండోస్ 9x/2000/NT/CE/xp ల మీద ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 3.0 తదుపరి బ్రౌసర్ల కోసం లేదా Activex నియంత్రణల (controls) వినియోగానికి మద్దతిచ్చే యితర బ్రౌసర్ల కోసం. EMBED గుర్తు Netscape Navigator 2.0 తదుపరి బ్రౌసర్ల కోసం లేదా నెట్‌స్కేప్ సంగతమైన/అనుకూలమైన బ్రౌసర్ల కొరకు. మీకు అవగాహన కలుగచేయడానికి ఉదాహరణ కోడ్ ఈ క్రింద యివ్వబడింది. <object width="425" height="350"> <param name="movie" value="http://www.youtube.com/v/5P6UU6m3cqk"></param> <param name="wmode" value="window"></param> <embed src="http://www.youtube.com/v/5P6UU6m3cqk" type="application/x-shockwave-flash" wmode="window" width="425" height="350"> </embed> </object>
<object>, embed> Html గుర్తులు, యితర Html గుర్తులవంటివే. అవి అంతఃస్ధాపన చేయబడ్డ ఒక Html అంశాన్ని సృష్టించడానికి వుపయోగిస్తారు. వీటికి వుపయోగించే గుణాలు, ఆ ఫైల్‌ను సంభాళించాలంటే ఏ ప్రోగ్రామ్ అవసరమవుతుంది, వీడియో ప్రదర్శించబడి ప్రదేశ పరిమాణము మొదలగు సమాచారము కలిగి వుంటాయి. ఇతర Html అంశాలలాగానే వీటికి కూడా రూపలావణ్యం చేకూర్చడం కొరకు శైలి గుణాన్ని వినియోగించవచ్చు. • <OBJECT> లోపల <EMBED>ను గూడు కట్టడం
వెబ్ పుటలో అంతఃస్థాపన చేసిన ఫైళ్ళను మామూలుగా అన్ని బ్రౌసర్‌లు సక్రమంగా సంభాళించగలిగేటట్లు చెయ్యడానికి, <embed> </embed> HTML అంశాన్ని <object> </object> HTML అంశం లోపల గూడు కట్టాలి. Activex పరిఙానంతో పనిచేసే బ్రౌసర్‌లు <object> అంశం లోపల వున్న <embed> అంశాన్ని విస్మరిస్తాయి. ప్లగిన్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే బ్రౌసర్లు <object> అంశాన్ని అస్సలు గుర్తించవు. కేవలం <embed> అంశాన్ని మాత్రమే చదువుకుంటాయి.
వీడియోల అంతఃస్థాపనకు <embed>, <object>,గుర్తులకు గుణాలు |
వెబ్ పుటలలో ఆడియోను చేర్చడం | |
వెబ్ పుటలలో ఆడియో చేర్చడం దరిదాపుగా వీడియోను చేర్చడం లాంటిదే. ఆడియోను వెబ్ పుటలో చేర్చడానికి అదే <embed> Html అంశాన్ని వుపయోగిస్తాము.
మీకు అవగాహన కలుగచేయడానికి నమూనా కోడ్ <embed src="/media/sound/salaam.mp3" volume="40" height="60" width="120"> </embed>
ఆడియో చేర్చడానికి <embed> గుర్తుకు గుణాలు |
వీడియోలు ఎక్కించడం, భద్రపరచడం | |
మీరు మీ కంప్యూటర్‌లో భద్రపరచబడిన వీడియోను మీ బ్లాగ్ పోస్టులో వుపయోగించదలచినట్లయితే ఆ వీడియోను ఇంటర్నెట్‌కు అనుసంధించబడి వున్న ఏదైనా కంప్యూటర్‌లో (వెబ్ సైట్‌లో) భద్రపరచవలసి వుంటుంది. దీని కోసం వీడియో ఫైళ్ళకు ఉచిత ఆతిధ్య సేవలందిస్తున్న youtube.com, photobucket.com, videos.google.com వంటి వెబ్ సైట్ల సేవలు వినియోగించుకోవచ్చు.
మనం ఈ ప్రక్రియ అర్ధం చేసుకోవడానికి youtube.comను (గూగుల్ సంస్థ) ఉదాహరణగా తీసుకుందాము. మీరు ఈ వెబ్ సైట్‌లో మీ వీడియోలు భద్రపరచుకోవాలంటే ఒక వినియోగ ఖాతా కావాలి. మీ ఉచిత వినియోగ ఖాతా సృష్టించుకోండి. మీ వినియోగ ఖాతాలోకి లాగిన్ అయ్యి ఫైల్‌ను ఆ వెబ్ సైట్‌కు ఎక్కించే ప్రక్రియ మొదలు పెట్టవచ్చు. మీకవసరమైన లంకెలు అన్ని పుటలలో పై భాగంలో కనపడతాయి.
తదుపరి ప్రదర్శించబడే పుటలో
వీడియోను ఎక్కించే ప్రక్రియ మొదలవుతుంది. ఫైలు ఎక్కించే ప్రక్రియ సాగుతున్నంతసేపు ఒక ప్రగతి సూచిక వున్న పుట ప్రదర్శించబడుతుంది.
ఎక్కించే ప్రక్రియ పూర్తయిన తరువాత, ఎక్కించబడ్డ వీడియోకు సంబంధంగా యింకొన్ని ఐచ్ఛికలను ఎంచుకోవడానికి అవకాశమున్న ఒక పుట ప్రదర్శించబడుతుంది. మీకు సమంజసమనిపించిన యితర ఐచ్ఛికలను ఎంచుకుని ఆ సమాచారాన్ని భద్రపరచడానికి update video లంకె మీద క్లిక్ చెయ్యండి. ఈ పుటకు క్రింది భాగంలో, ఈ వీడియోను వెబ్‌పుటలలో అంతఃస్థాపన చెయ్యడానికి అవసరమైన Html కోడ్ కలిగి వున్న అక్షర ప్రదేశం గమనించవచ్చు.
|
మొబైల్ ఫోన్లనుండి వీడియోలను ఎక్కించడం | |
మొబైల్ ఫోన్ల నుండి వీడియోలను ఎక్కించడానికి, మీ ఖాతాను మీ మొబైల్ ఫోన్ నుండి వీడియోలు అందుకోవడానికి ఏర్పాటు చెయ్యవలసి వుంటుంది.
• youtube.com లో
youtube.com లో మీరు మీ ఖాతాకు సంబంధంగా ఒక ప్రొఫైల్ సృష్టించవలసి వుంటుంది. ప్రతి ప్రొఫైల్‌కు ఒక నిర్దిష్ట ఈ-టపా గుర్తింపు జారీ చేయబడుతుంది. మీ మొబైల్ ఫోన్ నుండి ఈ ఈ-టపా చిరునామాకు పంపబడిన వీడియోలన్నీ స్వయంచాలకంగా మీ ఖాతాలో భద్రపరచబడతాయి.
మీ వినియోగ ఖాతాలో మీరు రెండు ప్రొఫైల్స్ వరకు సృష్టించుకొని వినియోగించుకోవచ్చు.
|
బ్రౌసర్ ప్లగిన్‌లు - Activex నియంత్రణలు | |
మీ కంప్యూటర్‌లో భద్రపరచబడేదేదైనా ఫైళ్ళ రూపంలో వుంటుంది. ప్రధానంగా ఫైళ్ళు రెండు రకాలుగా వుంటాయి. ఒకటి వాటంతట అవే పని చేసే లక్షణం గల ప్రోగ్రాం ఫైళ్ళు, రెండు ఏదో ఒక ప్రోగ్రామ్ ఫైల్‌తో కలిసి మాత్రమే పనిచేసే దత్త/సమాచార ఫైళ్ళు.
వీడియో ఫైళ్ళు దత్త/సమాచార ఫైళ్ళే. ఈ వీడియో ఫైళ్ళను చదవగలిగే/సవరించగలిగే సత్తా వున్న ప్రోగ్రాములలో మాత్రమే తెరవగలుగుతాము. ఎక్కువ సార్లు మనం చూసేది వీడియో ఫైళ్ళ పఠన ప్రోగ్రాములనే. విండోస్ మీడియా ప్లేయర్, యాపిల్ క్విక్ టైమ్ మూవీ ప్లేయర్, ఫ్లాష్ ప్లేయర్, మొదలగునవి వీడియో వీక్షణ ప్రోగ్రాములకు ఉదాహరణలు. వెబ్ పుటలలో వీడియోలు రెండు రకాలుగా ప్రదర్శించబడటం గమనించి వుంటారు. ఒకటి సంబంధిత ప్రోగ్రామ్ వేరే గవాక్షంలో తెరవబడి దానిలో వీడియో ప్రదర్శించబడటం (ఫైలు సంభాళించబడటం), రెండు వెబ్ పుటలో అంతఃస్థాపన చేసిన చోటనే వీడియో ప్రదర్శించబడటం (ఫైలు సంభాళించబడటం). • బ్రౌసర్ సత్తా
బ్రౌసర్ ప్రోగ్రాము Html కోడ్ యొక్క శబ్దాలంకరణమును వివరించి చెప్పగలదు (Parsing), అక్షర పాఠానికి రూప లావణ్యం చేకూర్చి బ్రౌసర్ గవాక్షములో ప్రదర్శించగలదు, అక్షర పాఠంలో అంతఃస్థాపన చేయబడ్డ ప్రతిమల ఫైళ్ళ స్థాన మార్గాన్ని (సంబంధిత <img> గుర్తు గుణాల నుండి) గ్రహించి, ఆ ప్రతిమ ఫైల్‌ను తీసుకొచ్చి, (తగ్గ రూపకల్పన చేసి <img> గుర్తులోని గుణాలు, శైలి లక్షణాల కనుగుణంగా) ప్రతిమను అక్షర పాఠంలో అంతఃప్రతిష్టించి ప్రదర్శించగలదు. బ్రౌసర్ కేవలం ప్రతిమ ఫైళ్ళను కూడా ప్రదర్శించగలదు
మనం వెబ్ పుటలలో వీడియోలు, ఫ్లాష్ ప్లేయర్, షాక్ వేవ్ ప్లేయర్, జావా యాప్లెట్ల సహాయంతో పనిచేసే ఆటలు చూస్తూ వుంటాము. మరి వీటన్నింటినీ బ్రౌసర్ చేయటం లేదా! బ్రౌసర్ ఆ వీడియో, ఆడియో ఫ్లాష్ ఫైళ్ళను నిజంగానే పనిచేయించడం లేదా!! • బ్రౌసర్‌కు అదనపు పనితనం జోడించడం
బ్రౌసర్ తనకు అంతర్లీనంగా వున్న సత్తా వుపయోగించి సంభాళించలేని ఒక వెబ్ పుటలో వున్నది ఏదయినా, బ్రౌసర్‌కు ఒక వస్తు రూపకం (object) వంటిది. జావా యాప్లెట్లు, వీడియోలు, ఆడియో, ఫ్లాష్ ఫైళ్ళు ఇటువంటివే.
వస్తు రూపకాన్ని సంభాళించడానికి, బ్రౌసర్‌కు అదనపు సహాయం కావాల్సి వుంటుంది. ఈ సహాయం బ్రౌసర్‌కు ప్లగిన్ యాక్టివెక్స్ నియంత్రణల రూపంలో దొరుకుతుంది. • ప్లగిన్‌లు
ప్లగిన్ అనేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌కు ఒక నిర్ధిష్టమైన లక్షణం చేకూర్చే చిన్న సాఫ్ట్వేర్ మాడ్యూల్.
వెబ్ బ్రౌసర్‌లలో ప్లగిన్‌లు, బ్రౌసర్ లోపల నుండే అనేక రకాల ఫైళ్ళను సంబంధిత ప్రోగ్రాములు తెరవనవసరం లేకుండానే సంభాళించే అవకాశం కలుగచేస్తాయి.
బ్రౌసర్ ప్లగిన్‌లు పూర్తి స్థాయి ప్రోగ్రాములు కాదు. అవి పనిచేయడానికి బ్రౌసర్ ప్రోగ్రాము కావల్సిందే. పైపెచ్చు వాటికి విడి ప్రోగ్రాములకున్నంత పూర్తి స్థాయి సత్తా కూడా వుండకపోవచ్చు. ఉదా:- అడోబీ యాక్రోబాట్ రీడర్ ప్లగిన్‌కు అడోబీ రీడర్‌కు వున్నంత పనితనం వుండదు. ఎక్కువగా వుపయోగించబడే సాధారణ ప్లగిన్‌లన్నీ Netscape Navigator ప్రమాణాలకు అనుగుణంగా వుంటాయి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ నెట్‌స్కేప్ నావిగేటర్ ప్రమాణాలను సమర్దిస్తుంది కాబట్టి సామాన్యంగా వుపయోగించే ప్లగిన్‌లన్నీ రెండు బ్రౌసర్లతో పనిచేస్తాయి. (సాధారణముగా మనం రెండు బ్రౌసర్లకు విడివిడిగా ప్లగిన్‌లు స్థాపిస్తాము) ఎక్కువ సార్లు మీ కంప్యూటర్‌లో సంబంధిత ప్రోగ్రాముల స్థాపన చేసేటప్పుడు ప్లగిన్‌లు కూడా స్థాపించబడతాయి. • యాక్టివ్‌ఎక్స్ నియంత్రణలు
బ్రౌసర్‌లో వుపయోగించబడే యాక్టివ్‌ఎక్స్ నియంత్రణలు, ప్లగిన్‌లకు వున్న విధులే కలిగి వుంటాయి. అయితే ప్లగిన్‌లకు మల్లే కాక యాక్టివ్‌ఎక్స్ నియంత్రణలకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నేరుగా సంపర్కించే అవకాశం వుంటుంది. దీని వలన ఇవి అటువంటివే అయిన జావా యాప్లెట్ల కంటే ఎక్కువ శక్తివంతమైనవి. అయితే ఈ శక్తితో పాటు ప్రమాదము కూడా వుంది. ఈ యాక్టివ్‌ఎక్స్ నియంత్రణలు మీ కంప్యూటర్‌లోని సాఫ్ట్‌వేర్‌కు యితర సమాచారానికి నష్టం చేకూర్చగలగటానికి అవకాశం చాలా వుంది.
యాక్టివ్‌ఎక్స్ నియంత్రణ యొక్క వినియోగము కేవలము బ్రౌసర్ వరకే పరిమితమయి లేదు. అది ప్లగిన్ కంటే విస్తారమైన వినియోగము కలిగి వుంటుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు జోడింపుగా స్థాపించిన ఒక యాక్టివ్‌ఎక్స్ నియంత్రణ సేవలను, మైక్రోసాఫ్ట్ వారి అన్ని ఉత్పత్తులు (ప్రోగ్రాములు) (వోర్డ్, ఎక్సెల్ వంటివి.), వుపయోగించుకోగలుగుతాయి. |
వివరించుట Parsing : ప్రామాణీకరించుట | |
సమాచారాన్ని అవయవ భాగాలుగా విభజించే ప్రక్రియను వివరించుట (పార్సింగ్ - parsing) అంటారు.
భాషా వ్యాకరణం నేర్చుకోవడంలో ఈ ప్రక్రియను ఎక్కువగా వినియోగించేవారు. (4u, btw తరం వచ్చి ఈ విధానాన్ని మరపించేసింది)
రఘు ఫుట్‌బాల్ ఆడతాడు, ఈ విధంగా వివరించబడేది.
• పార్సర్
కంప్యూటర్ ప్రోగ్రాములలో, పార్సర్ అనేది ఒక ప్రోగ్రామ్ (లేక స్క్రిప్ట్/API) వంటిది. ఇది ఆ ప్రోగ్రామ్ సంభాళించే దత్త సమాచార ఫైల్‌ను విశ్లేషించి దాని అవయవ భాగాలను గుర్తిస్తుంది. వెబ్ కోసం పాఠాన్ని సృష్టించే వారు సాధారణంగా Html పార్సర్ (బ్రౌసర్ ప్రోగ్రాములతో కలిసి వుండేది), XML పార్సర్ వంటిది చూస్తారు.
» ఉదా:
XML సంభాళించే ప్రోగ్రాములు (ఫీడ్ పఠన ప్రోగ్రాముల వంటివి XML పాఠాన్ని చదవగలిగే పార్సర్ కలిగివుంటాయి. ఇది XML ఫైలులోని సమాచారాన్ని విశ్లేషించి, భాగాలుగా గుర్తించి ఒక్కొక్క భాగం యొక్క విధిని గమనించి ఆ సమాచారం మొత్తాన్ని ప్రోగ్రాముకు అందుబాటులో వుంచుతుంది.
XML ఫైల్‌ను చదివేటప్పుడు ఆ ఫైల్‌లోని సమాచారం సక్రమంగా ఏర్పరచబడిందా లేదా అని నిర్ధారించుకోవడానికి పార్సర్ వాక్య నిర్మాణాన్ని పరిశీలిస్తుంది. (బ్రాకెట్లు, సెమికోలన్ గుర్తులు మొదలగునవి.) XML వివరణని (Specification) ఆధారం చేసుకుని పార్సర్, పొరపాట్లను/ఉల్లంఘనలను నివేదిస్తుంది. • ఒక XML ఫైలు
<?xml version='1.0' encoding='UTF-8'?>
<course_list> <course> <name>Computer Applications</name> <fee>$25</fee> <description> Enables you to create a fundamental understanding on using computers </description> <duration>3 weeks</duration> </course> <course> <name>Basic Computer Programming</name> <fee>$50</fee> <description> Enables you to get an introductory understanding to computer prgramming using C Programming Language </description> <duration>5 weeks</duration> </course> ... ... </course_list> ఈ XML ఫైలును పార్సర్ ఈ క్రింది విధంగా వివరించవచ్చు
• ప్రతి అప్లికేషన్ ప్రోగ్రామ్ పార్సర్‌ను కలిగి వుంటుంది
దత్త/సమాచార ఫైళ్ళను సంభాళించే ప్రతీ ప్రోగ్రామ్ ఏదోఒక రకమైన పార్సర్‌ను కలిగి వుంటుంది. ఈ పార్సర్ ఆ ప్రోగ్రాముకు ఆ ఫైల్‌ను అర్ధం చేసుకోవడానికి వుపయోగపడుతుంది.
» ఉదా:
మీరు ఒక వోర్డ్ పత్రాన్ని (.doc పేరు పొడిగింపు కలిగిన ఫైల్) తెరచినప్పుడు, మైక్రోసాఫ్ట్ వోర్డ్ ప్రోగ్రాముతో కలసి వున్న పార్సర్ ఆ ఫైలులో అదృశ్యంగా వున్న కోడ్ మొత్తం గుర్తించదగ్గదే, సంబంధించినదే అని నిర్ధారించుకోవడానికి ఆ ఫైలును తనిఖీ చేస్తుంది.
ఆ పార్సర్ డాక్యుమెంట్‌ను/పత్రాన్ని వివరించలేకపోతే ఒక దోష సందేశం ప్రదర్శిస్తుంది. (చెడిపోయిన ఫైలులాగా) • ప్రమాణీకరించుట
కొన్ని ప్రోగ్రాములలో, ప్రమాణీకరణ కొరకై ఒక అదనపు పార్సర్ కూడా వుండొచ్చు. ప్రమాణీకరించే ప్రక్రియ మొదటి స్థాయి పార్శింగ్ పూర్తయి తదుపరి జరుగుతుంది.
ప్రమాణీకర చేసే పార్సర్, మొదటి స్థాయి పార్సర్ గుర్తించిన అవయవాంశాలన్నింటిని, సంబంధిచ నమూనాతో పోల్చి అవి ప్రమాణాలకనుగుణంగా వున్నాయో లేవో అనే దానిని నిర్ధారిస్తుంది. XML లో ఈ ప్రమాణాలను DTD (పత్ర తరహా నిర్వచనము) (Document Type Definitions) లేదా SCHEMA అంటారు. ప్రమాణీకరించే పార్సర్, ప్రమాణీకరణ సమయంలో, సాధారణ విలువలను జోడించవచ్చు. మొదటి స్థాయి పార్సర్ భద్రపరచిన దత్త/సమాచారమును, తదుపరి ప్రక్రియలు చేపట్టడానికి అప్లికేషన్ ప్రోగ్రాముకు అందచేసే ముందు దత్త తరహాలు వివరించబడి వుంటే వాటిని కూడా దత్తానికి జోడించి అందిస్తుంది. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు అంగ్ల మూలం | ... తరువాతి పుట ౨౨(22) |