ముందు పుట ... ౩(3) |
కొత్త బ్లాగ్‌ను సృష్టించడం | |
మీరు ఒక క్రొత్త బ్లాగ్‌ను సృష్టించడం ఎప్పుడు మొదలు పెట్టినా (అది మొదటిసారి గాని, తదుపరి ఎప్పుడయినా గాని) బ్లాగర్.కామ్ వెబ్ సైట్ ఈ క్రింద చూపబడిన వెబ్ పుటను పంపుతుంది. మీరు మీ రెండవ లేక తదుపరి బ్లాగ్‌ను సృష్ఠిస్తున్నప్పటికి ఇది రెండవ అడుగుగానే చూపబడుతుంది. మీరు మీ వినియోగ ఖాతా సృష్టించుకున్న వెంటనే మొదటి బ్లాగ్‌ను సృష్టిస్తునట్లయితే యిది మీ బ్లాగ్ సృష్టించే ప్రక్రియలో రెండవ అడుగే అవుతుంది. (మొదటి అడుగు మీరు వినియోగ ఖాతా సృష్టించుకోవడమే). • ఒక వినియోగ ఖాతాతో ఎన్ని బ్లాగ్‌లు సృష్టించవచ్చు? మీకు వున్న ఒక వినియోగ ఖాతాతో మీరు ఎన్ని బ్లాగ్లనయినా సృష్టించవచ్చు. • మీ కొత్త బ్లాగ్‌కు శీర్షిక, యూఆర్ఎల్ను ఎంచుకోవడానికి వెబ్ పత్రం క్రొత్త బ్లాగ్‌ను సృష్టించడానికి వినియోగపడే వెబ్ పుట ఒక వెబ్ పత్రాన్ని కలిగి వుంటుంది. ఈ వెబ్ పత్రంలో మూడు అక్షర పేటికలు, వాటికి ఎడమ ప్రక్కన వాటిలో నింపవలసిన సమాచారమేంటో తెలియచేసే గుర్తులు వుంటాయి.
ఆ పత్రం మీరు నింపిన సమాచారాన్ని సర్వర్‌కు సమర్పించడానికి అవసరమైన నియంత్రణగా Continue అక్షరాలతో ఏర్పరచబడ్డ లంకెను కలిగి వుంటుంది.
|
బ్లాగ్ గుర్తింపు » బ్లాగ్ శీర్షిక | |
బ్లాగర్‌తో సృష్టించబడ్డ బ్లాగ్ వెబ్ బ్రౌసర్లో ప్రదర్శించబడుచున్నప్పుడు, సాధారణంగా మొదట్లో (ఆ బ్లాగ్‌లో వున్న పాఠం ఏమిటి అని తెలియ చేసే), పెద్ద అక్షరాకృతి కలిగిన కొద్ది పదాలను చూస్తాము. ఇది మీ బ్లాగ్‌కు ప్రదర్శిత గుర్తింపు. దీనినే బ్లాగ్ శీర్షిక అంటాము. ఇది మీ బ్లాగ్‌లో వున్న పాఠం ఏమిటి అని క్లుప్తంగా తెలియచేస్తుంది.
మీ బ్లాగ్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా (బ్లాగర్.కామ్, బ్లాగ్‌స్పాట్.కామ్‌లలో), ఈ శీర్షిక (పాఠం) మీ బ్లాగ్‌కు గుర్తింపు అవుతుంది. బ్లాగ్ శీర్షిక మీ బ్లాగ్ మొత్తానికి గుర్తింపుగా వుపయోగించబడుతుంది. ఇంగ్లీషు భాషలో శీర్షికను పెట్టేటప్పుడు శీర్షిక Title case లో [ప్రతి పదం యొక్క మొదటి అక్షరం పెద్దక్షరం] వుండేటట్లు చూడండి. మీరు పై వెబ్ పత్రంలో Blog Title అనే గుర్తు (Label) కలిగిన అక్షర పేటికలో చేర్చిన పదాలు మీ బ్లాగ్ యొక్క శీర్షికగా పెద్ద అక్షరాలతో బ్లాగ్ మొదట్లో కనపడతాయి. • శీర్షిక ఎన్ని అక్షరాలు కలిగి వుండవచ్చు? వెబ్ పత్రంలో వున్న అక్షర పేటిక నియంత్రణ (text box control) లో మీరు చేర్చగలిగిన అక్షరాల సంఖ్య గరిష్ట పరిమితి కలిగి వుండవచ్చు. మరియు అందులో చేర్చగలిగిన అక్షరాలు/చిహ్నాలు ఫలానా మాత్రమే వుండాలి అనే పరిమితి కూడా కలిగి వుండవచ్చు. పై వెబ్ పత్రంలో శీర్షికకు సంబంధించిన అక్షరాలు చేర్చే అక్షర పేటికకు 50 అక్షరాల (ఖాళీలతో సహా) గరిష్ట పరిమితి నిర్దేశించబడి వుంది.
బ్లాగర్.కామ్ శీర్షిక సవరణ కొరకు అందించే వెబ్ పత్రంలో వున్న సంబంధిత అక్షర పేటికకు 90 అక్షరాల (ఖాళీలతో సహా) గరిష్ట పరిమితి నిర్దేశించబడి వుంది. మీరు 50 అక్షరాలకంటే ఎక్కువ అక్షరాలతో వున్న శీర్షికను వాడదలుచుకుంటే, ముందు ఇక్కడ 50 అక్షరాలలోపు శీర్షికను ఎంచుకొని, తదుపరి మార్చుకోండి. మీరు మీ బ్లాగ్‌కు శీర్షికను నిర్ణయించుకునేటప్పుడు అది మీ బ్లాగ్‌లో ఎలా కనపడుతుంది అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. |
బ్లాగ్ గుర్తింపు » బ్లాగ్ యూఆర్‌ఐ/యూఆర్‌ఎల్ | |
ప్రతి బ్లాగ్ ఒక వెబ్ పుటే. ఇంటర్నెట్ ద్వారా (ఇంటర్నెట్‌కు అనుసంధించబడ్డ కంప్యూటర్ ద్వారా) అందుకోగలిగే ప్రతి వెబ్ పుటకు URI/URL అని పిలవబడే ఒక నిర్ధిష్టమైన గుర్తింపు వుంటుంది. కావున బ్లాగ్ యొక్క URI/URL అనగా అది ఇంటర్నెట్ ద్వారా పొందడానికి వుద్దేశించబడిన నిర్ధిష్టమైన గుర్తింపు. ఏ రెండు వెబ్ పుటలు ఒకే గుర్తింపు కలిగి వుండవు. రెండు అంతకంటే ఎక్కువ బ్లాగ్‌లు ఒకే శీర్షిక కలిగి వుండవచ్చేమోగాని ఒకే URI/URL మాత్రం కలిగి వుండవు. ఒక వెబ్‌పుట యొక్క గుర్తింపునే దాని యూఆర్ఐ [URI - Universal resource indicator = విశ్వవ్యాపిత వనరు గుర్తు.]. URI మరియు URL (Universal Resource Locator = ఏకరీతి వనరును కనుగొనేది)లు ఖచ్చితంగా పర్యాయ పదాలు కానప్పటికి, చాలా సార్లు వాటిని పర్యాయ పదాలుగా వాడతాము.
ప్రస్తుతానికి అన్ని URL లు URI లు అవుతాయని అర్ధం చేసుకోండి. • యూఆర్‌ఎల్ » మీ బ్లాగ్ యొక్క వెబ్ చిరునామా మీ బ్లాగ్‌ను గురించి ఎవరికైనా చెప్పదలుచుకుంటే, వారికి మీ బ్లాగ్ యొక్క వెబ్ చిరునామా చెప్పాల్సి వుంటుంది. మీ బ్లాగ్‌ను చూడదలుచుకున్నవారు వారి బ్రౌసర్ యొక్క చిరునామా పట్టిలో (Address Bar) ముద్రించే చిరునామా యిదే అవుతుంది. మీ బ్లాగ్ యొక్క వెబ్ చిరునామా http://_______.blogspot.com రూపంలో వుంటుంది. " ______ " లో మీరు చేర్చేవి ఇంగ్లీషు అక్షరాలు (letters) అంకెలు, (numbers) క్రిందగీత (underscore), మరియు అడ్డగీత (hyphen) లతో కూడిన పదరూపం. URL ఒక అక్షరం లేదా అంకెతో మొదలవ్వాలి. బ్లాగ్‌స్పాట్.కామ్ ఆతిద్య మిస్తున్న (hosted) మీ కొత్త బ్లాగ్‌కు మీరు URL ఎంచుకోవడంలో, ఏ యితర బ్లాగ్, మీరు ఎంచుకున్న పద రూపాన్ని యిప్పటికే యూఆర్ఎల్గా పొంది వుండకూడదు అన్నది ఇంకొక పరిమితి.
వెబ్ చిరునామా సృజనాత్మకంగా, అర్ధవంతంగా, బాగుంది అనిపించే విధంగా, ఒకసారి చూసిన వారికి, విన్నవారికి గుర్తుండే విధంగా ఎంచుకోండి. మీకు కొంత అవగాహన కలిగించడం కోసం కొన్ని ఉదాహరణలు.
• యూఆర్ఎల్ ఎన్ని అక్షరాలు కలిగి వుండవచ్చు మీరు మీ బ్లాగ్‌కు ఎంచదలచిన URLను చేర్చే అక్షర పేటికకు, 37 అక్షరాల (ఖాళీలు లేకుండా) గరిష్ట పరిమితి విధించబడి వుంది. URL లో అక్షరాలకు మధ్య ఖాళీలు వుండరాదు. తదుపరి మీ బ్లాగ్ URL మార్చుకోవడానికి బ్లాగర్ మీకందించే వెబ్ పుటలో వున్న వెబ్ పత్రంలోని అక్షర పేటికకు ఎటువంటి పరిమితులు లేనప్పటికి బ్లాగర్ పరిమితి 37 అక్షరాలు యిక్కడ కూడా వర్తిస్తుంది. ఈ పరిమితి బ్లాగర్ సృష్టించినది మాత్రమే. అన్ని URLలకు ఈ పరిమితి వర్తించదు.
• ఇంగ్లీషు మాత్రమే URL లో భాగమయిన అక్షరాలు ఇంగ్లీషు భాషకు సంబంధించినవి మాత్రమే అయివుండాలి.
|
కాప్చా | |
బ్లాగ్‌లను సృష్ఠించడం, వాటిలో పోస్టింగ్‌లు చేయడం అనే ప్రక్రియలను స్వయంచాలకంగా (automatically) చేసే ప్రోగ్రామ్స్ వుంటాయి. వీటి వలన బ్లాగ్‌లు కుప్పలు తెప్పలుగా సృష్ఠించబడి, వాటిలో ఆమోదయోగ్యముకాని సమాచారము నమోదు చేయబడవచ్చు. దాని వలన బ్లాగ్‌స్పాట్.కామ్ వెబ్ సైట్లో అనవసరమైన పుటలు కోకొల్లలుగా సృష్ఠించబడటం జరగవచ్చు. మన అనుమతి లేకుండా, మనకు ఆమోద యోగ్యం కానటువంటివి, మనకు సంబంథించిన వాటిలోకి చేరితే, వాటిని స్పామ్ అంటారు. ఇలాంటి వాటితో నింపడాన్నే స్పామింగ్ అంటారు. స్పామింగ్ నిరోధించడానికి చాలా వెబ్ సైట్లు కాప్చా అనే ఉపకరణాన్ని వాడతాయి.
|
పూర్తి చేయడం | |
Advanced Blog setup అనే ప్రదర్శిత అక్షరాలు కలిగిన వెబ్ లంకెను వుపయోగించి బ్లాగర్.కామ్ యొక్క సేవలను వినియోగంచుకుని సృష్టించుకున్న బ్లాగ్‌ను, బ్లాగ్‌స్పాట్.కామ్ వెబ్ సైటు యొక్క సేవలు అవసరం లేకుండా, మన సొంత వెబ్ సైట్లో నిక్షిప్తపరచుకోవచ్చు. అయితే దీని కొరకు ఎదైనా సర్వర్‌లో మీకు సొంతంగా కొంత జాగా వుండాలి.
వెబ్ పత్రంలో నింపిన సమాచారాన్ని Submit లంకె మీద క్లిక్ చెయ్యడం ద్వారా సర్వర్‌కు సమర్పిస్తాము. మీరు సమర్పించిన సమాచారము సరిగ్గా వుంటే బ్లాగర్ ప్రోగ్రామ్ మీ బ్లాగ్ సృష్టించే ప్రక్రియలోని తదుపరి అడుగుకు (మీ బ్లాగ్‌కు మాదిరిని ఎంచుకోవడానికి) సంబంధించిన వెబ్ పుటను పంపుతుంది. ఆ పుట గనుక వచ్చినట్లయితే, మీరు ఎంచుకున్న URL తో మీరు పెట్టిన శీర్షిక కలిగిన బ్లాగ్ సృష్టించబడింది అనుకోవచ్చు. ఈ స్థితిలో కనుక మీరు, మీ బ్లాగ్ సృష్టించే ప్రక్రియను ఆపేసినా కూడా మీ బ్లాగ్ సృష్టించబడినట్లే. మీ వినియోగ ఖాతాలోకి లాగిన్ అయినట్లైతే, మీ ఖాతాకు సంబంధించిన డ్యాష్ బోర్డ్‌లో వున్న బ్లాగ్ల జాబితాలో ఆ బ్లాగ్ నమోదు కాబడి వుండటం గమనించవచ్చు. |
వర్ణన - చేర్చడం/మార్చడం | |
బ్లాగ్ యొక్క వర్ణన, బ్లాగ్ పుటలో, బ్లాగ్ శీర్షిక క్రింద ప్రదర్శించబడుతుంది. ఇది బ్లాగ్‌ను క్లుప్తంగా వర్ణిస్తుంది. మీ బ్లాగ్‌కు వర్ణనను, బ్లాగ్‌ను సృష్టించే సమయంలో జోడించే సదుపాయం లేదు. సాధారణంగా బ్లాగర్ అందించే అన్ని మాదిరులలోనూ బ్లాగ్ శీర్షిక, వర్ణన ఒకే పేటికలో ప్రదర్శించబడేటట్లు ఏర్పరచబడి వుంటాయి.
మీ బ్లాగ్‌కు వర్ణన చేర్చడానికి/మార్చడానికి బ్లాగ్ అమరికలను సవరించడానికి ఉపకరించే పుటలను తెరవవలసిందే. వర్ణన మార్చడానికి సంబంధించిన అమరిక Settings విభాగములోని basic ఉప విభాగపు పుటలో కనపడుతుంది. వర్ణన అక్షర పాఠంతో ఏర్పరచబడుతుంది. ఎక్కువగా ఇది బ్లాగ్‌లో వుండే పాఠం లక్షణాన్ని తెలియచేసే ఒక పరిచ్చేధము/కాలము. ఇందులో చేర్చే అక్షర పాఠంతో పాటు, ఆ అక్షర పాఠానికి రూపలావణ్యం చేకూర్చడం కోసం HTML గుర్తులను చేర్చడానికి అవకాశం లేదు. అయితే వర్ణనలో భాగంగా ప్రతిమలను చేర్చడానికి అవసరమైన HTML గుర్తులు మాత్రం యిందులో చేర్చవచ్చు. వర్ణనకు సంబంధించిన పాఠాన్ని చేర్చే అక్షర పేటికకు 500 చిహ్నాల/అక్షరాల గరిష్ట పరిమితి (HTML గుర్తులు, ఖాళీలతో సహా) అమర్చబడి వుంది.. • ఇతర భాషల అక్షర పాఠాన్ని వినియోగించడం బ్లాగ్ వివరణకు సంబంధించిన పాఠం చేర్చే అక్షర పేటికలో UTF-8 (Universal Transformation Format) చిహ్నాల వర్గము (character set) గుర్తించే ఏ భాష అక్షర పాఠాన్నయినా చేర్చవచ్చు. ఈ కారణంగా మీ బ్లాగ్ వివరణగా మన భారతీయ భాషలలో చాలా భాషల అక్షర పాఠం చేర్చుకోవచ్చు.
క్లిష్ఠంగా వుండే చిహ్నాలతో ఏర్పడే అక్షరాలు (complex fonts) [మన భారతీయ భాషల, ఆశియా దేశాల భాషల, అరబిక్ భాషల అక్షరాలు] వినియోగించేటప్పుడు ఒక అక్షరము రెండు అంతకంటే ఎక్కువ చిహ్నాలతో ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించవలసి వుంటుంది. కాబట్టి 500 అక్షరాల గరిష్ఠ పరిమితిని 500 చిహ్నాల గరిష్ఠ పరిమితిగా అర్ధం చేసుకోవలసి వుంటుంది. ఇంగ్లీషు భాషలో ఒక్కో అక్షరం ఒక చిహ్నంతో ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ అక్షరమన్నా చిహ్నమన్నా ఒకటే అవుతుంది. |
బ్లాగ్ అమరికలు : మార్చడం/భద్రపరచడం | |
ఒక బ్లాగ్‌కు సంబంధించి మీరు ఎంచుకోగలిగిన ఐచ్ఛికలన్నీPostings, Settings, Templates అని మూడు ముఖ్య విభాగాలలో చేర్చబడి వుంటాయి. ఒక్కొక్క విభాగంలో వున్న ఐచ్ఛికలన్నీ అనేక ఉపవిభాగాలలో చేర్చబడి వుంటాయి. పోస్ట్ - సృష్టించడం, సవరించడం, అమరికలు - అమర్చడం, మార్చడం, మొదలగు పనులకు వుపయోగించే వెబ్ పుటల మొదట్లో (పై వరుసలో), విభాగాలకు లంకెలు వుంటాయి.
ఒక విభాగానికి సంబంధించిన లంకె మీద క్లిక్ చేస్తే, ఆ విభాగంలో వున్న మొదటి ఉపభాగానికి సంబంధించిన వెబ్ పుట ప్రదర్శించబడుతుంది. దానితో పాటే (విభాగాల లంకెల క్రింద) రెండవ వరుసలో, ఆ విభాగంలోని ఉపవిభాగాలకు లంకెలు కూడా ప్రదర్శించబడతాయి.
• చేసిన మార్పులను భద్రపరచడంమీరు అమరికలను సరిచేసినప్పుడల్లా, వాటిని సవరించిన రూపంలో, మీ బ్లాగ్‌కు అనువర్తించడానికి, మార్పులను భద్రపరచవలసి వుంటుంది. దీని కొరకు ప్రతి ఉపవిభాగపు పుట చివరలో వున్న Save settings గుర్తు కలిగన బొత్తాన్ని వినియోగించండి. మీరు చేసిన మార్పులు భద్రపరచబడిన తరువాత, ఆ పుట మొదట్లో, ఆ విషయాన్ని తెలియచేసే, ఒక నిర్ధారణ సందేశం ప్రదర్శించబడుతుంది. |
శీర్షికను మార్చడం | |
బ్లాగ్‌కు శీర్షికను, బ్లాగ్ సృష్టించేటప్పుడు ఎంచుకుంటాము. దీనిని తదుపరి ఎప్పుడయినా మార్చుకోవచ్చు. శీర్షికను మార్చడానికి వుపకరించే వెబ్ పుటలోని (వెబ్ పత్రంలో భాగమయిన) అక్షర పేటిక, 90 అక్షరాల/చిహ్నాల గరిష్ఠ పరిమితి కలిగి వుంటుంది. కాబట్టి మీరు శీర్షికను మార్చుకునేటప్పుడు 90 అక్షరాల/చిహ్నాల నిడివి కలిగిన శీర్షికను మాత్రమే ఎంచుకోగలుగుతారు.
• ఇతర భాషలలో అక్షర పాఠం వుపయోగించడం బ్లాగ్ శీర్షికకు సంబంధించిన పాఠం చేర్చే అక్షర పేటికలో UTF-8 (Universal Transformation Format) చిహ్నాల వర్గము (character set) గుర్తించే ఏ భాష అక్షర పాఠాన్నయినా చేర్చవచ్చు. ఈ కారణంగా మీ బ్లాగ్ శీర్షికగా మన భారతీయ భాషలలో చాలా భాషల అక్షర పాఠం చేర్చుకోవచ్చు.
క్లిష్ఠంగా వుండే చిహ్నాలతో ఏర్పడే అక్షరాలు (complex fonts) [మన భారతీయ భాషల, ఆశియా దేశాల భాషల, అరబిక్ భాషల అక్షరాలు] వినియోగించేటప్పుడు ఒక అక్షరము రెండు అంతకంటే ఎక్కువ చిహ్నాలతో ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించవలసి వుంటుంది. కాబట్టి 90 అక్షరాల గరిష్ఠ పరిమితిని 90 చిహ్నాల గరిష్ఠ పరిమితిగా అర్ధం చేసుకోవలసి వుంటుంది. ఇంగ్లీషు భాషలో ఒక్కో అక్షరం ఒక చిహ్నంతో ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ అక్షరమన్నా చిహ్నమన్నా ఒకటే అవుతుంది. |
శీర్షిక/వర్ణనలను మార్చడానికి పుట అంశాలను సవరించడం | |
మీ బ్లాగ్‌కు ఆధునిక మాదిరి (Modern template) అనువర్తించబడి వున్నట్లయితే, మీ బ్లాగ్ మొత్తం అనేక చిన్న చిన్న భాగాల క్రింద విభజించబడి వుంటుంది. ఒక్కొక్క భాగాన్ని ఒక విడ్జెట్ అంటారు. ఒక్కొక్క విడ్జెట్ బ్లాగ్ మొత్తానికి సంబంధించిన పాఠంలో కొద్ది భాగాన్ని కలిగి వుంటుంది. కొన్ని విడ్జెట్లు ఎల్లప్పుడూ ప్రదర్శించబడే వుంటాయి (బ్లాగ్ శీర్షిక, పోస్ట్‌ల విడ్జెట్లు). మరి కొన్నింటి ప్రదర్శన సశక్త/నిరర్ధ పరచవచ్చు. కొన్ని విడ్జెట్లను బ్లాగ్‌లో కనపడేటట్లు, కనపడకుండా (వాటిని చూపడం/దాచడం ద్వారా) చెయ్యవచ్చు. కొన్ని విడ్జెట్ల స్థానాన్ని (అవి బ్లాగ్లొ ఎక్కడ ప్రద్ర్శించబడతాయి అనేదానిని) మార్చుకోవచ్చు. వాటిలో ప్రదర్శించబడే పాఠాన్ని కొంతవరకు సవరించవచ్చు కొన్ని విడ్జెట్లలో అనేకమైన ఉప విభాగాలుంటాయి (పోస్ట్ పాద భాగాన్ని కలిగివుండే విడ్జెట్). అంతర్గతంగా ఆ ఉప విభాగాలను సశక్త/నిరర్ధ పరచవచ్చు, వాటి స్థానాలను మార్చవచ్చు, వాటిలో ప్రదర్శించబడే పాఠాన్ని కొంతవరకు సవరించవచ్చు బ్లాగ్ శీర్షిక మరియు వర్ణన, బ్లాగ్ శిర్షిక ప్రక్కన (Header) అని వుండే విడ్జెట్‌లో భాగమయివుంటాయి. ఈ విడ్జెట్‌ను నిరర్ధ పరచడం, దాని స్థానం మార్చడం కుదరదు కాని, దానిలో వున్న పాఠాన్ని సవరించవచ్చు. మీ బ్లాగ్ మాదిరికి అమర్చబడి వున్న విడ్జెట్లను Template విభాగంలోని Page Elements ఉపవిభాగంలో వీక్షించవచ్చు.
ఆ విడ్జెట్‌కు కుడి వైపు చివరలో వున్నEdit లంకె మీద క్లిక్ చేస్తే Configure Header శీర్షికగా కలిగిన వెబ్ పుట, ఒక కొత్త గవాక్షములో తెరుచుకుంటుంది.
ఆ పుటలో బ్లాగ్ శీర్షిక కలిగిన అక్షర పేఠిక, వివరణ పాఠం కలిగిన అక్షర ప్రదేశం వుంటాయి. కావలసిన సవరణలు చేసి, ఆ పుట క్రింది భాగంలో వున్న Save Changes బొత్తం వుపయోగించి చేసిన సవరణలను భద్రపరచండి భద్రపరచడం పూర్తి అయిన వెంటనే, గవాక్షము స్వయంచాలకంగా మూసుకుపోతుంది. |
Creating a New Blog. Choosing/Modifying Title, Description, URL
blog create blogger description title url blog blogger templates blogger template blog templates blogger spot wordpress blogger blogger edit blogger rss blogger plugin blogger comments typepad blogger php url blogs url post post blogger radio blog pink is the new blog blogging blog search bad girls blog blogger com myspace blog sex blog weblog free blog celebrity baby blog baby blog radio blog club american idol blog create blog blog software what is a blog sex blogs video blog porn blog bloggers lost blog blog spot blog sites blog com spanking blog idol blog myspace blogs real world road rules blog create a blog music blog blog things blog layouts mp3 blog amateur blogs sopranos blog photo blog free blogs my blog amateur blogs com gay porn blog blog site road rules blog video blogs debonair blog travel blog make blog gay blog blog directory food blog blogging software www blogger com best blogs news blog best blog blogging project runway blogs com amateur blog web blog babe blog php blog what is blog
URL మార్చడం | |
బ్లాగ్‌ను సృష్టించే సమయంలో, బ్లాగ్‌కు URLను ఎంచుకుంటాము. ఇది కూడా తదుపరి మార్చుకోవచ్చు. ఇక్కడ చెప్పబడుతున్న URL మార్చడమనేది మీరు బ్లాగ్‌స్పాట్.కామ్ వెబ్ సైట్‌ను మీ బ్లాగ్‌కు ఆతిధ్యమివ్వడానికి వినియోగించుకున్నట్లయితేనే వర్తిస్తుంది. పై పెచ్చు మీరు మీ బ్లాగ్ URL లో కొంత భాగాన్నిమాత్రమే మార్చుకుంటారు. చివరలో బ్లాగ్‌స్పాట్.కామ్ అనేది అలాగే వుంటుంది. మీ బ్లాగ్ URL ఎల్లప్పుడూ, మీ ఎంపిక.బ్లాగ్‌స్పాట్.కామ్ అవుతుంది. URL మార్చడానికి అవసరమైన ఐచ్ఛికలు settings విభాగములోని publishing ఉప విభాగపు పుటలో వుంటాయి.
మీరు ఎంచుకున్నURL లభ్యమవుతుందో, లేదో తెలుసుకోవడానికి ఇక్కడ ప్రత్యేకమైన సదుపాయం ఏమీ లేదు. ఆ కారణంగా మీరు అనుకున్న URL ను సంబంధిత పేటికలో చేర్చి, చేసిన సవరణలను భద్రపరచే ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. మీరు ఎంచుకున్న క్రొత్త URL లభ్యత లేనట్లయితే బ్లాగర్ ప్రోగ్రామ్ ఒక దోష సందేశాన్ని జోడించి ఆ వెబ్ పుటను తిప్పి పంపుతుంది. మీరెంచుకున్న URL లభ్యత వున్నట్లయితే, క్రొత్త URL ను మీ బ్లాగ్‌కు అనువర్తించి, మార్పులు భద్రపరచబడ్డట్లు తెలియచేసే ఒక నిర్ధారణ సందేశాన్ని పుట మొదట్లో ప్రదర్శిస్తుంది. |
బ్లాగ్‌ను తొలగించడం | |
బ్లాగ్‌ను తొలగించడానికి అవసరమైన ఐచ్ఛికలు settings విభాగములోని Bssic ఉప విభాగపు పుటలో వుంటాయి.
• తొలగించకుండా వుండొచ్చేమో !! బ్లాగ్‌ను తొలగించడమంటే, ఆ బ్లాగ్‌లో వున్న మొత్తం పాఠాన్ని తొలగించడమే. బ్లాగ్ పుట, పోస్ట్‌లు, వ్యాఖ్యలు, వెనుకకు లంకెలు, సభ్యులకు అనుమతులు మొదలగునవి. అయితే మీరు మీ బ్లాగ్‌కు ఉన్నతస్థాయి ఎఫ్‌టిపి ఐచ్ఛికలు వుపయోగించి మీ సొంత వెబ్ సర్వర్ మీద ఆతిధ్యమిచ్చి వుంటే, ఆ వెబ్ సర్వర్లోకి అప్పటికే ఎక్కించి భద్రపరచబడ్డ పాఠం మాత్రం తొలగించబడదు. బ్లాగర్లో బ్లాగ్ పోస్ట్ సృష్ఠించే పుట నుండి ఎక్కించిన ప్రతిమలు, విడియోలు, ఏ బ్లాగ్‌లో నయినా వుపయోగించుకోదగిన లక్షణం కలిగి వుంటాయి. ప్రతిమలు ప్రస్తుతము వినియోగములో వున్న photos.blogger.com లాంటి సైట్ లోకి, విడియోలు videos.google.com లోకి ఎక్కించబడతాయి. కాబట్తి, ఇప్పుడు మీరు తొలగిస్తున్న బ్లాగ్‌లో మీరు వినియోగించిన ప్రతిమలు, విడియోలు వేరే ఎక్కడన్నా వినియోగించదలచినట్లయితే అవసరమైనప్పుడు అందుబాటులో వుండే విధంగా సంబధిత యూఆర్ఎల్లు అన్నీ పోగు చేసి భద్రపరచుకోవలసి వుంటుంది. బ్లాగ్ ఫీడ్లు ఆ యూఆర్ఎల్లు పోగు చేసుకోవడానికి వుపయోగపడతాయి • ప్రత్యామ్నాయం బ్లాగ్‌ను తొలగించడం కంటే మెరుగైన ప్రత్యామ్నాయం, బ్లాగ్ యొక్క యూఆర్ఎల్ను మార్చి మరియు/లేదా దాని అందుబాటుని నిరోధించడం
తూచ్కు (ఒకసారి తొలగించిన బ్లాగ్‌ను తిరిగి పొందడానికి) అవకాశం లేదు. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౫ (5) |