ముందు పుట ... ౧౩ (13) |
పోస్ట్లన్నింటికి వ్యాఖ్యలను సశక్త/నిరర్ధ పరచడం | |
వ్యాఖ్యలు మీ బ్లాగ్ పాఠకులు వ్యక్తపరచిన అభిప్రాయాలు. వ్యాఖ్యలు బ్లాగ్ పోస్ట్‌లతో కలిసి వుంటాయి. ప్రతి ఒక్క పోస్ట్ సొంత వ్యాఖ్యలను కలిగి వుంటుంది.
వ్యాఖ్యలు సాధారణంగా సశక్త పరచబడి వుంటాయి. వ్యాఖ్యలను సశక్త/నిరర్ధ పరచడానికి settings విభాగములోని comments ఉపవిభాగపు పుటలోని ఐచ్ఛికలను వుపయోగించవచ్చు. మీ బ్లాగ్‌కు ఆధునిక విడ్జెట్ మాదిరిని వినియోగిస్తున్నట్లయితే పోస్ట్ రూపు రేఖలు అమర్చే పుటలో వున్న ఐచ్ఛికలను వుపయోగించి కూడా ఈ అమరికను ఎంచుకోవచ్చు.
వ్యాఖ్యలు సశక్త పరచబడి వున్నట్లయితే పోస్ట్ పాదభాగంలో __ comments అనే ప్రదర్శిత అక్షర పాఠం కలిగిన వ్యాఖ్యల లంకె ప్రదర్శించబడుతుంది. ప్రదర్శిత అక్షర పాఠంలో, __ స్థానంలో ఆ పోస్ట్‌కు అప్పటివరకు ప్రచురించబడ్డ వ్యాఖ్యలు ఎన్ని అని తెలియచేసే సంఖ్య ప్రదర్శించబడుతుంది. బ్లాగ్‌కు వ్యాఖ్యలు నిరర్ధపరచబడినట్లయితే, అప్పటికే ప్రచురించబడ్డ వ్యాఖ్యలన్నీ అదృశ్యంగా వుండి బ్లాగ్ పాఠకులకు వ్యాఖ్యల లంకె ప్రదర్శించబడదు. అయితే అప్పటికే ప్రచురించబడ్డ వ్యాఖ్యలు బ్లాగ్ దత్తాంశములలో అలాగే వుంటాయి. దీని వలన మీరు వ్యాఖ్యల ప్రదర్శనను తదుపరి ఎప్పుడయినా సశక్త పరచడం ద్వారా ఆ వ్యాఖ్యలను బ్లాగ్ పాఠకులకు అందుబాటులోకి తేవచ్చు.
వ్యాఖ్యలను పోస్ట్ రూపురేఖలు అమర్చే పుటలో నుండి నిరర్ధపరచినట్లయితే, ఒక్కొక్క పోస్ట్‌కు విడివిడిగా వ్యాఖ్యలను సశక్త/నిరర్ధ పరచడానికి ఐచ్చికలు పోస్ట్ సృష్టించే పుటలో ప్రదర్శించబడతాయి. |
పోస్ట్‌లకు విడివిడిగా వ్యాఖ్యలను సశక్త/నిరర్ధ పరచడం | |
బ్లాగ్ మొత్తానికి వ్యాఖ్యలు సశక్త పరచబడి వున్నప్పుడు మీరు ఒక్కో పోస్ట్‌కు విడివిడిగా వ్యాఖ్యలను నిరర్ధ పరచవచ్చు.
ఒక్కొక్క పోస్ట్‌కు వ్యాఖ్యలను చూపడానికి/దాచడానికి సంబంధించిన ఐచ్చికలు అక్షర ప్రదేశము క్రింది భాగానికి జతచేయబడి వున్న మడిలో వుంటాయి. ఆ మడి సాధారణంగా మడతపెట్టబడి వుంటుంది.
మొత్తం బ్లాగ్‌నకు వ్యాఖ్యలు నిరర్ధ పరచబడివుంటే, ఒక్కొక్క పోస్ట్‌కు విడివిడిగా వ్యాఖ్యలను సశక్త/నిరర్ధ పరచడానికి సంబంధించిన ఐచ్ఛికము పోస్ట్ సృష్టించే/సవరించే పుటలో ప్రదర్శించబడదు.
|
ఒక్కొక్క పోస్ట్‌కు సాధారణ అమరిక | |
సరికొత్త పోస్ట్ సృష్టించడం మొదలు పెట్టినప్పుడల్లా, వ్యాఖ్యలను సశక్త/నిరర్ధ పరచడానికి సంబంధించిన ఐచ్చికలు మడత పెట్టబడి వున్న మడిలో భాగంగా దాచిపెట్టబడి వుండటం గమనించవచ్చు.
ప్రతి పోస్ట్‌కు మీరు ఏమీ ఎంచుకోనప్పుడు అమర్చబడి వుండవలసిన ఐచ్చికాన్ని మీరు అమర్చవచ్చు. తద్వారా మీరు ఆ ఐచ్ఛికను ఎంచుకోవడం మర్చిపోయినా మీరు ఆశించినదే అనువర్తింపబడుతుంది. |
వ్యాఖ్యలు చదవడం | |
మీ బ్లాగ్ పాఠకులు, వ్యాఖ్యల లంకె మీద క్లిక్ చేసినట్లయితే, ఆ పోస్ట్ మీద ప్రచురించబడ్డ/చేయబడ్డ వ్యాఖ్యలు వున్న పుట ప్రదర్శించబడుతుంది. వ్యాఖ్యలన్నీ ఒకదాని క్రింద ఒకటి సరికొత్త వ్యాఖ్యలు ముందుండేటట్లు ఏర్పరచబడివుంటాయి.
వ్యాఖ్యలు ప్రదర్శించబడివున్న పుట మొదట్లో బ్లాగ్ శీర్షిక, దాని క్రింద పోస్ట్ శీర్షిక, దాని క్రింద ఆ పోస్ట్‌పై ప్రచురించబడ్డ వ్యాఖ్యల సంఖ్య, దాని క్రింద పోస్ట్ ప్రదర్శించబడివున్న పుటకు కదలడానికి ఒక లంకె, దాని క్రింద ప్రదర్శించబడివున్న వ్యాఖ్యలు మడత పెట్టి దాచిపెట్టడానికి, collapse comment ప్రదర్శిత అక్షరాలు కలిగిన ఒక లంకె ప్రదర్శించబడివుంటాయి. లంకెను క్లిక్ చేసినట్లయితే అన్ని వ్యాఖ్యలు కేవలం వ్యాఖ్యాతల ప్రదర్శిత నామము మాత్రమే కనబడేటట్లు మడతపెట్టి దాచబడతాయి. అదే సమయంలో లంకె ప్రదర్శిత అక్షరాలు Show all comments గా మారతాయి. ప్రతి వ్యాఖ్య, వ్యాఖ్యాత ప్రదర్శిత నామాన్ని ప్రదర్శిత అక్షర పాఠంగా కలిగిన లంకెతో మొదలవుతుంది. వ్యాఖ్యాత బ్లాగర్ వినియోగదారుడయితే, ఆ లంకె మీద క్లిక్ చేస్తే వారి వ్యక్తిగత సమాచారము కలిగిన పుట ప్రదర్శించబడుతుంది. ఆ లంకె క్రింద వ్యాఖ్య ముఖ్యభాగ పాఠం వుంటుంది. వ్యాఖ్య కాల ముద్ర (చేయబడ్డ సమయం) చివరలో ప్రదర్శించబడుతుంది. |
వ్యాఖ్యాతల ఛాయాచిత్రాలు ప్రదర్శించడాన్ని సశక్త పరచడం | |
వ్యాఖ్యలు ప్రదర్శించబడే వెబ్ పుటలో, వ్యాఖ్యాతల ఛాయా చిత్రాలు ప్రదర్శించబడటాన్ని సశక్త/నిరర్ధ పరచవచ్చు.
ఛాయాచిత్రం వ్యాఖ్యాతలు వారి వ్యక్తిగత సమాచారము పుటలలో చేర్చి వుంటేనే ప్రదర్శించబడుతుంది. |
వ్యాఖ్యలను సరికొత్త గవాక్షంలో ప్రచురించబడేటట్లు చేయడం | |
బ్లాగ్ పాఠకుడు, వ్యాఖ్యలు ప్రదర్శించే వెబ్ పుటను పోస్ట్ పాదభాగంలో వున్న comments లంకెపై క్లిక్ చేయడంద్వారా తెరచినప్పుడు ఆ వెబ్‌పుట అకస్మికముగా ఎగసిపడే (pop up) సరిక్రొత్త గవాక్షములో (window) తెరవబడేటట్లు చేయవచ్చు. తద్వారా వారు చదువుచున్న పోస్ట్ అలాగే ప్రదర్శించబడుతూ వుంటుంది.
ఆకస్మికంగా ఎగిసిపడే లక్షణం కలది కాబట్టి దానిని PoP Up గవాక్షము అని పిలుస్తారు.
వ్యాఖ్యలు సరికొత్త గవాక్షంలో ప్రదర్శించబడుతున్నప్పుడు, చేయబడ్డ వ్యాఖ్యలు ముందు ప్రదర్శించబడతాయి. వాటిక్రింద సరికొత్త వ్యాఖ్య ప్రచురించడానికి అవసరమైన ఐచ్ఛికలు వుంటాయి. వ్యాఖ్యలు అదే గవాక్షములో తెరవబడినప్పుడు, మొత్తం వెబ్ పుట రెండు మడులుగా (panes) విభజింపబడి వుంటుంది. చేయబడ్డ వ్యాఖ్యలు ఎడమప్రక్క మడిలో ప్రదర్శించబడతాయి. సరికొత్త వ్యాఖ్య ప్రచురించడానికి అవసరమైన ఐచ్ఛికలు కుడివైపు మడిలో ప్రదర్శించబడతాయి. పైపెచ్చు, వ్యాఖ్యలు సరికొత్త గవాక్షంలో ప్రదర్శించబడినప్పుడు, బ్లాగ్ శీర్షిక, పోస్ట్ శీర్షిక ప్రదర్శించబడవు. |
కాలముద్ర రూపాన్ని ఎంచుకోవడం | |
ప్రతి వ్యాఖ్య చివరలో వ్యాఖ్య చేయబడ్డ తేదీ సమయం ముద్రించబడి వుంటుంది. ఆ ముద్రకు మీరు అందుబాటులో వున్న అనేక రూపాలలో ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు.
|
వ్యాఖ్యలు వ్రాయడం | |
ఒక పోస్ట్‌కు వ్యాఖ్యలు సశక్త పరచబడివున్నప్పుడు, comments లంకె మీద క్లిక్ చేయగా ప్రదర్శించబడే వెబ్ పుటలో వ్యాఖ్యను ముద్రించి ప్రచురించడానికి వుపకరించే ఒక వెబ్ పత్రం వుంటుంది.
వ్యాఖ్యానించదలుచుకున్నవారు, వ్యాఖ్యను ఆ పత్రంలోని అక్షర ప్రదేశములో మరియు తమ గుర్తింపునకు సంబంధించిన సమాచారమును సంబంధిత అక్షర పేటికలలో చేర్చి వ్యాఖ్యను సమర్పిస్తారు. వ్యాఖ్యలు ఎవ్వరైనా చేయొచ్చు అని అమర్చబడి వుంటే, పోస్ట్ పాఠకులు అనామక వ్యాఖ్య చేయవచ్చు, లేదా ఒక పేరు దానికి జోడింపుగా ఒక వెబ్ చిరునామాను (వ్యాఖ్య ప్రదర్శించబడే పుటలో వ్యాఖ్యాత పేరు ఈ వెబ్ చిరునామాకు లంకెగా పని చేస్తుంది) .చేర్చి సమర్పించవచ్చు వ్యాఖ్యలు బ్లాగర్ వినియోగదారులు మాత్రమే చేయొచ్చు అని అమర్చబడి వుంటే, బ్లాగర్ ప్రదర్శిత నామమే వ్యాఖ్యాత గుర్తింపు క్రింద పని చేస్తుంది. వ్యాఖ్యాత పేరు వారి వ్యక్తిగత వివరాలు ప్రదర్శించే పుటకు లంకెగా పని చేస్తుంది.
Preview బొత్తంపై క్లిక్ చేసి వ్యాఖ్య ప్రచురించబడ్డ తరువాత ఎలా కనపడుతుందో చూడవచ్చు. వ్యాఖ్యాత మొత్తం సమాచారం చేర్చిన తరువాత వ్యాఖ్యను సమర్పించడానికి login and publish బొత్తం మీద క్లిక్ చేస్తే వ్యాఖ్య సమర్పించినట్లవుతుంది. |
ఎవరిని వ్యాఖ్యానించవచ్చు? | |
మీ బ్లాగ్‌లో ఎవ్వరిని వ్యాఖ్యానించనివ్వవచ్చు అనేది ఎంచుకోవచ్చు. ఈ ఐచ్చికము మీ బ్లాగ్‌లో వున్న అన్ని పోస్ట్‌లకు అనువర్తించబడుతుంది.
మీరు మీ బ్లాగ్‌లో వ్యాఖ్యానాలు
బ్లాగర్ వినియోగదారులు వ్యాఖ్యను సమర్పించడానికి బ్లాగర్ (గూగుల్) ఖాతాలోకి లాగిన్ అయి వుండవలసి వుంటుంది. బ్లాగర్ వినియోగదారులు (అందరూ లేదా బ్లాగ్ సభ్యులు మాత్రమే) మాత్రమే వ్యాఖ్యలు చేయొచ్చని అమర్చబడి వుంటే, వ్యాఖ్యాల పుటలో బ్లాగర్ వెబ్ సైట్‌లోకి లాగిన్ అవ్వడానికి అవసరమైన ఐచ్ఛికలు కనపడతాయి (ఆ పాఠకుడు అప్పటికే తన గూగుల్ ఖాతాలోకి లాగిన్ అయ్యి లేనట్లయితే).
వ్యాఖ్యలు మీ బ్లాగ్‌లో సభ్యులు మాత్రమే చేయాలని అమర్చబడి వుండి, మీ బ్లాగ్ సభ్యులు కాని వారు వ్యాఖ్యల పుటలో వున్న ఐచ్ఛికలు వుపయోగించి బ్లాగర్ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయ్యే ప్రయత్నం చేస్తే పొరపాటు సందేశం (error message) ప్రదర్శించబడుతుంది. |
వ్యాఖ్యలు సమర్పించే పత్రంలో కాప్చా ప్రదర్శించడం | |
కంప్యూటర్ ప్రోగ్రాంల సహాయంతో వ్యాఖ్యలు స్వయంచాలకంగా సమర్పించబడటాన్ని అదుపు చేయడానికి వుపకరించే సాధనం క్యాప్చా. యిలా అనవసరమైన పాఠం వెబ్ సైట్లలో చేర్చబడే దానిని, ఈ-టపా ద్వారా అందుకునే దానిని స్పామ్ అంటారు.
వ్యాఖ్య సమర్పించే పుటలోని పత్రంతో పాటు ఒక క్యాప్చా ప్రదర్శించబడేటట్లు చేయడాన్ని ఎంచుకుని, తద్వారా మీ పోస్ట్‌లపై వ్యాఖ్యలు మనుషులు మాత్రమే చేయగలిగేటట్లు చేయ్యవచ్చు. ఇది ముఖ్యంగా మీరు ఎవ్వరైనా వ్యాఖ్యానించవచ్చు అనే ఐచ్ఛికను ఎంచుకున్నట్లయితే బాగా వుపయోగకరంగా వుంటుంది. |
వ్యాఖ్యలు మట్టుపరచడాన్ని సశక్త/నిరర్ధ పరచడం | |
మీ పోస్ట్‌లపై సమర్పించబడ్డ వ్యాఖ్యలను మీరు చూసి, వాటి ప్రచురణ ఆమోదించిన తరువాత మాత్రమే అవి బ్లాగ్ పుటలలో ప్రదర్శించబడటం కొరకు వున్నదే వ్యాఖ్యలు మట్టుపరచడం అనే ఏర్పాటు,
దీని వలన మీ యిష్టానుసారం వ్యాఖ్యల ప్రచురణ ఆమోదించవచ్చు/తిరస్కరించవచ్చు.
మీరు అప్పుడప్పుడు మీ బ్లాగర్ ఖాతాలోకి లాగిస్ అయ్యి వ్యాఖ్యలను posting విభాగములోని comment moderation ఉప విభాగవు పుటలోని ఐచ్ఛికలను వుపయోగించి మట్టుపరచవచ్చు. అదనంగా మీ పోస్ట్‌లపై పాఠకులు ఎవరన్నా వ్యాఖ్యలు సమర్పించినంతనే మీకు (బ్లాగర్ ప్రోగ్రామ్) ఈ-టపా ద్వారా తెలియ పరచబడే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఈ-టపా చిరునామాను మీరు వ్యాఖ్యలు మట్టుపరచడానికి (సంబంధించిన అమరికను) సశక్త పరచే సమయంలో, సంబంధిత అక్షర పేటికలో చేర్చవలసి వుంటుంది.
వ్యాఖ్యలు మట్టుపరచడం సశక్త పరచబడి వుంటే, వ్యాఖ్య ముఖ్య భాగం చేర్చే అక్షర ప్రదేశము క్రింద, వ్యాఖ్యను ముద్రిస్తున్న పాఠకుడికి వ్యాఖ్యలు మట్టుపరచబడతాయి అని తెలియచేసే సందేశం ప్రచురించబడుతుంది. పాఠకుడు వ్యాఖ్యను సమర్పించినంతనే, వ్యాఖ్య సమర్పించబడింది, వ్యాఖ్య మట్టుపరచే వారు ఆమోదించిన తరువాత వ్యాఖ్యల పుటలో కనపడుతుంది అని తెలియచేసే సందేశం ప్రదర్శించబడుతుంది. |
ఈ-టపా సందేశం నుండి మట్టు పరచడం | |
వ్యాఖ్యలను మట్టు పరచడం సశక్త పరచేటప్పుడు, మీ పోస్ట్ మీద వ్యాఖ్య సమర్పిచబడినప్పుడల్లా మీకు ఈ-టపా ద్వారా తెలియచేయబడాలని ఎంచుకున్నట్లయితే, మీ పోస్ట్ మీద వ్యాఖ్య సమర్పించబడ్డ వెంటనే బ్లాగర్ ప్రోగ్రామ్ మీకు ఈ-టపా సందేశం పంపుతుంది. ఆ ఈ-టపా సందేశంలో, బ్లాగ్ శీర్షిక, పోస్ట్ శీర్షిక, పోస్ట్ చేసిన పాఠకుడి గుర్తింపు, వ్యాఖ్య ముఖ్యభాగ పాఠం మరియు ఆ వ్యాఖ్యను ఆమోదించడానికి/తిరస్కరించడానికి లంకెలు వుంటాయి. వ్యాఖ్య మట్టు పరచడానికి సంబంధించిన పుట తెరవడానికి కూడా ఆ సందేశంలో లంకె వుంటుంది.
వ్యాఖ్య మట్టు పరచడానికి సంబంధించిన లంకెలలో ఏ లంకెనయినా క్లిక్ చేయగానే సంబంధిత బ్లాగర్ పుట కొత్త గవాక్షములో ప్రదర్శించబడుతుంది. అప్పటికే మీరు బ్లాగర్ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయి వున్నట్లయితే వ్యాఖ్య ఆమోదించే/తిరస్కరించే లంకెలలో దేనిమీద మీరు క్లిక్ చేశారు అనే దానిబట్టి వ్యాఖ్య ఆమోదించబడ్డట్లు/తిరస్కరించబడ్డట్లు సందేశం ప్రదర్శించబడుతుంది. ఈ-టపా సందేశంలోని Moderation ప్రదర్శిత అక్షర పాఠంగా కలిగిన లంకెను క్లిక్ చేసినట్లైతే, వ్యాఖ్య మట్టు పరచడానికి సంబంధించిన ఐచ్ఛికలు వున్న వెబ్ పుట ప్రదర్శించబడుతుంది. ఈ పుటలోనే మట్టుపరచవలసిన వ్యాఖ్యల జాబితా కూడా ప్రదర్శించబడుతుంది. మీరు లాగిన్ అయి లేకపోతే లాగిన్ అవ్వమనే సందేశంతో లాగిన్ పుట ప్రదర్శించబడుతుంది. లాగిన్ అవ్వగానే పైన చెప్పిన సందేశం కనబడుతుంది లేదా మట్టుపరచడానికి సంబంధించిన పుట ప్రదర్శించబడుతుంది. |
మట్టుపరచే పుట నుండి మట్టుపరచడం | |
వ్యాఖ్యలను మట్టుపరతడానికి సంబంధించిన ఐచ్ఛికలున్న పుటను మీకు బ్లాగర్ పంపిన వ్యాఖ్య సమర్పించబడిందన్న సమాచారము కలిగిన ఈ-టపా సందేశంలో వున్న Moderation లంకెను వుపయోగించి తెరవవచ్చు. ఈ ఐచ్ఛికలు posting విభాగములోని moderate comments ఉప విభాగపు పుటలో ప్రదర్శించబడతాయి.
ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యలను ఆమోదించడం చేయాలంటే ఆ వ్యాఖ్యలకు ముందువున్న ఆమోద గుర్తు పేటికలలో ఆమోద గుర్తు పెట్టి వుంచి publish లేదా reject గుర్తులున్న బొత్తాలు వుపయోగించి చెయ్యవచ్చు.
వ్యాఖ్యలను తేదీల పరంగా లేదా పోస్ట్‌ల పరంగా క్రమంలో ఏర్పరచి ప్రదర్శించబడేటట్లు చేయవచ్చు. పోస్ట్‌ల పరంగా క్రమం ఏర్పరచినట్లయితే ఒక పోస్ట్‌కు సంబంధించిన వ్యాఖ్యలన్నీ ఒక దగ్గర చేర్చబడతాయి. తేదీల పరంగా క్రమం ఏర్పరచినట్లయితే ఒక తేదీకి సంబంధించిన వ్యాఖ్యలన్నీ ఒక దగ్గర చేర్చబడతాయి. వ్యాఖ్య ముఖ్యభాగ పాఠం మొదట్లో వున్న కుడి వైపు గురి పెట్టబడి వున్న బాణం గుర్తు మీద క్లిక్ చేసినట్లయితే, ఆ వ్యాఖ్య ముఖ్యభాగ పాఠం మొత్తం ప్రదర్శించబడుతుంది. ఆ వ్యాఖ్య చివరలో వున్న లంకెలను వుపయోగించి వ్యాఖ్యను ఆమోదించి ప్రచురించడం లేదా తిరస్కరించడం చెయ్యవచ్చు. |
వ్యాఖ్య సమర్పించబడినట్లు తెలియచెయ్యడం | |
వ్యాఖ్యలు మట్టు పరచడాన్ని సశక్త పరచి, వ్యాఖ్యలు సమర్పించబడినప్పుడు మీకు తెలియచేయబడటానికి అనువుగా ఈ -టపా చిరునామా చేర్చవచ్చు. వ్యాఖ్యలు మట్టుపరచడాన్ని నిరర్ధ పరచినప్పుడు కూడా బ్లాగర్ ప్రోగ్రామ్ మీకు మీ పోస్ట్‌ల మీద వ్యాఖ్యలు చేయబడ్డప్పుడల్లా తెలియచేసేటట్లు చేయవచ్చు.
మీరు చేయవలసిందల్లా సంబంధిత అక్షర పేటికలో మీ ఈ-టపా చిరునామా చేర్చడమే. |
వెనుకకు లంకెలు :: అన్ని బ్లాగ్ పోస్టులకు సశక్త/నిరర్ధ పరచడం | |
వెనుకకు లంకెలు అనగా, మీ పోస్ట్‌కు లంకెలు కలిగిన యితర (బ్లాగర్‌తో సృష్టించబడ్డ) బ్లాగ్ పోస్ట్‌లకు లంకెలు. వెనుకకు లంకెలు కూడా బ్లాగ్ పోస్ట్‌లకు సంబంధించినవే.
ప్రతి పోస్ట్‌కు సంబంధంగా వెనుకకు లంకెలు వుంటాయి. వెనుకకు లంకెల అమరిక సాధారణంగా నిరర్ధ పరచబడి వుంటుంది. settings విభాగములోని comments ఉప విభాగపు పుటలో (లేదా మీరు ఆధునిక విజ్జెట్ మాదిరిని వుపయోగిస్తున్నట్లయితే, పోస్ట్ రూపు రేఖల అమరికకు సంబంధించిన పుటలో) వున్న ఐచ్ఛికల ఎంపిక ద్వారా వెనుకకు లంకెలను సశక్త/నిరర్ధ పరచవచ్చు. వెనుకకు లంకెలు సశక్త పరచబడి వున్నట్లయితే పోస్ట్ పాద భాగంలో links to this post అని ప్రదర్శిత అక్షర పాఠం కలిగిన వెనుకకు లంకెల లంకె ప్రదర్శించబడుతుంది.
బ్లాగ్ పాఠకులు links to this post లంకె మీద క్లిక్ చేసినప్పుడు, ఆ పోస్ట్ పాఠం, దాని క్రింద ఆ పోస్ట్‌పై చేయబడివున్న వ్యాఖ్యలు (అవి సశక్త పరచబడి వున్నట్లయితే), దాని క్రింద పోస్ట్‌కు సంబంధంగా వున్న వెనుకకు లంకెలు ప్రదర్శించబడతాయి. వెనుకకు లంకెలు, ఈ పోస్ట్‌కు లంకెలు ఏ పోస్ట్‌లో నయితే వున్నాయో ఆ పోస్ట్ శీర్షికను ప్రదర్శిత అక్షర పాఠంగా కలిగి వుంటాయి
ఈ వెనుకకు లంకెలలో దేనినయినా బ్లాగ్ పాఠకుడు క్లిక్ చేసినట్లయితే, ఆ పోస్ట్, దానిపై చేయబడ్డ వ్యాఖ్యలు, దానికి సంబంధించిన వెనుకకు లంకెలు, ఒక కొత్త పుటలో ప్రదర్శించబడతాయి. వెనుకకు లంకెలు ప్రదర్శించబడే పుటలో, వెనుకకు లంకెల జాబితా క్రింద Create a Link ప్రదర్శిత అక్షర పాఠంగా కలిగిన లంకె వుంటుంది. దీనిని వుపయోగించి పాఠకుడు (బ్లాగర్ వినియోగదారుడయితేనే), తన బ్లాగ్‌లో ప్రస్తుత పోస్ట్‌కు లంకె కలిగి వున్న పోస్ట్‌ను సృష్టించవచ్చు.
Create a Link లంకె మీద క్లిక్ చేసినంతనే, బ్లాగ్ పోస్ట్ సృష్ఠించడానికి ఉపకరించే పుట, ఒక ఎగిసి పడే గవాక్షములో ప్రదర్శించబడుతుంది. బ్లాగ్ పాఠకుడు అప్పటికే తన ఖాతాలోకి లాగిన్ అయ్యి లేనట్లయితే, లాగిన్ పుట ప్రదర్శించబడుతుంది. లాగిన్ అయివున్నట్లయితేనే పోస్ట్ సృష్ఠించడానికి ఉపకరించే పుట ప్రదర్శింపబడుతుంది. |
ఏ పోస్ట్కాపోస్ట్కు వెనుకకు లంకెలను సశక్త/నిరర్ధ పరచడం | |
పైన చెప్పిన వెనుకకు లంకెలను చూపు/దాచు అనే ఐచ్ఛికలు మొత్తం బ్లాగ్‌కు సంబంధించినవి. ఎంచుకోబడిన ఐచ్ఛికను బట్టి ప్రస్తుత బ్లాగ్ పోస్ట్‌లకు వున్న వెనుకకు లంకెలన్నీ చూపబడటమో లేక దాచబడటమో జరుగుతుంది.
వెనుకకు లంకెలను ప్రదర్శింతబడాలని ఎంచుకుని వున్నట్లయితే, ప్రతి పోస్ట్‌కు విడివిడిగా వీటిని సశక్త/నిరర్ధ పరచడానికి ఐచ్ఛికలను ఎంచుకోవచ్చు. పోస్ట్ పాఠాన్ని చేర్చే అక్షర ప్రదేశం క్రింది భాగంలో మడత పెట్టబడి వున్న మడిలో వున్న సంబంధిత ఐచ్చికను ఎంచుకోవడం ద్వారా వెనుకకు లంకెలను సశక్త/నిరర్ధ పరచవచ్చు.
వెనుకకు లంకెలు మొత్తం బ్లాగ్‌కు నిరర్ధ పరచబడి వున్నట్లయితే, విడివిడిగా ప్రతి పోస్ట్‌కు వెనుకకు లంకెలను సశక్త/నిరర్ధ పరచే ఐచ్ఛికము ప్రదర్శించబడదు. (కొత్తగా సృష్టించబడుతున్న పోస్ట్‌లు మరియు సరిచేయడానికి తెరవబడిన పోస్ట్లన్నింటిలోను).
|
విడి పోస్ట్‌లకు సాధారణ అమరిక | |
మీరు సరికొత్త పోస్ట్ సృష్టించడానికి పోస్ట్ సృష్టి పుటను తెరచినప్పుడు ఆ పోస్ట్‌కు వెనుకకు లంకెలను సశక్త/నిరర్ధ పరచడానికి సంబంధించిన ఐచ్చికలు కలిగిన మడి మడత పెట్టబడి వుండటం గమనించవచ్చు.
ప్రతి పోస్ట్‌కు మీరు ఏమీ ఎంచుకోనప్పుడు అమర్చబడి వుండవలసిన ఐచ్చికాన్ని మీరు అమర్చవచ్చు. తద్వారా మీరు ఆ ఐచ్ఛికను ఎంచుకోవడం మర్చిపోయినా మీరు ఆశించినదే అనువర్తింపబడుతుంది. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౧౫ (15) |