ముందు పుట ... ౧౦ (10) |
చిహ్నాలు/పరిచ్ఛేదములు : కూర్పు/HTML విధానము | |
బ్లాగ్ పోస్ట్‌లో చేర్చే పాఠం, బ్లాగ్ పుటలలో భాగమయి, ఒక వెబ్ పుటలో ప్రదర్శించబడుతుంది. కాబట్టి ఒక బ్లాగ్ పోస్ట్‌లోని పాఠానికి రూప కల్పన చేయడమంటే, ఒక వెబ్ పుటలో భాగమయిన పాఠానికి రూప లావణ్యం చేకూర్చడమే. ఒక వెబ్ పుటలోని పాఠానికి రూపలావణ్యం చేకూర్చడానికి HTML గుర్తులు (tags) వాడతాము. వెబ్ పుటలో ఒక నిర్ధిష్టమైన రూపలావణ్యం కలిగిన పాఠ భాగం, మొదలు, చివర్లలో, పాఠనికి ఆ రూప లావణ్యం చేకూరడానికి కారణమైన HTML గుర్తులు కలిగి వుంటుంది. రూప కల్పన కొరకు పోస్ట్ పాఠాన్ని సంభాళించడానికి, రెండు విధానాలున్నాయి. HTML విధానము. కూర్పు విధానము (Compose Mode). HTML విధానాన్ని వుపయోగించాలంటే, పాఠానికి రూప లావణ్యం చేకూర్చడానికి HTML గుర్తులు ఎలా వాడాలో తెలియాలి. కూర్పు విధానము వుపయోగించడం, వోర్డ్ ప్రోసెసింగ్ ప్రోగ్రామ్‌ను వుపయోగించడంలాంటిదే. అయితే యిక్కడ వోర్డ్ ప్రోసెసింగ్ ప్రోగ్రామ్‌లో వున్న ఐచ్ఛికలలో కొన్ని మాత్రమే వుంటాయి. ముందుగా కూర్పు విధానము వుపయోగించడం నేర్చుకుని, తదుపరి కూర్పు విధానము వుపయోగించగా పోస్ట్ పాఠంలో స్వయంచాలకంగా (automatically) చొప్పించబడే HTML గుర్తులను సరిచేయడం/సవరించడం నేర్చుకుంటాము. • చిహ్నాలు మరియు పరిచ్ఛేదములు
రూప కల్పన కొరకు ఎలక్ట్రానిక్ పత్రాలలో కనపడే చిహ్నాలన్నింటిని రెండుగా వర్గీకరిస్తాము. ఒకటి చిహ్నాలు/అక్షరాలు, రెండు పరిచ్ఛేదము. చిహ్నాలనేవి మొత్తం పాఠంలో అతి చిన్న అంశాలు. పాఠానికి రూపకల్పనకు వున్న మొత్తం ఐచ్ఛికలను ఈ రెండు శీర్షికల క్రింద చదవుకుంటాము.
చిహ్నాల రూపలావణ్య ఐచ్ఛికలను (Character formatting options), ఎంచుకోబడ్డ ఒకటి అంతకంటే ఎక్కువ చిహ్నాలకు అనువర్తించవచ్చు. పరిచ్చేద రూపలావణ్య ఐచ్ఛికలను (Paragraph formatting options) ఎంచుకోబడ్డ ఒకటి అంతకంటే ఎక్కువ పరిచ్చేదాలకు అనువర్తించవచ్చు. |
చిహ్నాలకు రూపకల్పన [కూర్పు విధానం] | |
కూర్పువిధానంలో మీరు చిహ్నాలకు రూపలావణ్యం అనువర్తించడానికి రెండు పద్దతులున్నాయి. • పాఠాన్ని ఎంచుకొని రూపవలావణ్యం అనువర్తించడం
• రూపలావణ్య ఐచ్ఛికాన్ని అనువర్తించి తరువాత అక్షర పాఠం ముద్రించుట
పాఠం ముద్రించడం మొదలు పెట్టండి.
కర్సర్ స్ధానం వద్ద చేర్చబడుతున్న అక్షర పాఠానికి మీరు ఎంచుకున్న రూపలావణ్య ఐచ్ఛికము అనువర్తించబడటం గమనించండి. • కుంచికఫలక లఘిష్టము
కుంచికఫలక లఘిష్టము (key board shortcut) వాడటానికి, రూపలావణ్యం చేకూర్చదలచిన పాఠాన్ని ఎంచుకొని, సంబంధిత లఘిష్టాన్ని నొక్కండి.
|
పరిచ్ఛేదానికి రూప కల్పన [కూర్పు విధానం] | |
పరిచ్ఛేదము ఒక పేటిక లాంటిది. అక్షర పాఠాన్నే కాక అది అనేక యితర రకములయిన అంశాలను కలిగి వుండగలదు. పరిచ్ఛేదములో బొమ్మలు, పట్టికలు మొదలగునవి కూడా వుండవచ్చు. పరిచ్ఛేద రూపలావణ్యం గురించి ఆలోచించేటప్పుడు మొత్తం పరిచ్ఛేదాన్ని ఒక అంశం క్రింద పరిగణిస్తాము. పరిచ్ఛేద రూప కల్పనకు రెండు మార్గాలున్నాయి. • పరిచ్ఛేదాన్ని ఎంచుకుని, రూపలావణ్య ఐచ్ఛికాన్ని అనువర్తించడం
• రూపలావణ్య ఐచ్ఛికాన్ని అనువర్తించి తరువాత అక్షర పాఠాన్ని ముద్రించడం
మీరు వోర్డ్ ప్రోప్రోసెసింగ్ ప్రోగ్రామ్ (మైక్రోసాఫ్ట్ వోర్డ్ వంటిది) లో చూసే అన్ని రకాల ఇచ్చాపూర్వకాలు వెబ్ పుటలలో రూపకల్పన కొరకు వుపయోగపడవు/కనపడవు. |
పరిచ్ఛేద లీనము (Paragraph alignment) | |
align = సమాంతరంగా వుండేటట్లు చేయడానికి ఒక వరుసలో పేర్చడం/పెట్టడం
పరిచ్చేద లీనమునకు సంబంధించి నాలుగు ఐచ్ఛికలు వుంటాయి
• గమనిక
ఫైర్ ఫాక్స్ బ్రౌసర్‌లో ఇంగ్లీషేతర భాషల అక్షర పాఠం వున్నప్పుడు సమర్ధించబడిన పరిచ్ఛేద లీనము సక్రమంగా పనిచేయక పోవచ్చు.
|
తూటాల/అంకెల జాబితాలు | |
ఎలక్ట్రానిక్ పత్రాలలో ఒక సమూహముగా ఏర్పరచబడిన పరిచ్ఛేదాలను జాబితాలంటాము. జాబితాలోని ప్రతి అంశము ఒక పరిచ్ఛేదము. ఈ కారణంగానే జాబితాల రూపలావణ్యం గురించిన ఆలోచనలు పరిచ్ఛేద రూపలావణ్యం గురించిన ఆలోచనలు చదువుకునేటప్పుడు తెలుసుకుంటాము. జాబితాలోని ప్రతి అంశము (list item) ఒక ప్రత్యేకమైన గుర్తుతో మొదలవుతుంది. ఈ గుర్తు పరిచ్ఛేదము యొక్క మొదటి అక్షరము (చిహ్నము) నకు ఎడమ వైపున కొంత నిడివితో కనపడుతుంది. జాబితా అంశాల గుర్తింపులన్నీ ఒకే నిలువు వరుసలో లీనమయి కనపడతాయి. వెబ్ పుటలలో జాబితాలను రెండుగా వర్గీకరిస్తారు. క్రమ జాబితా, అక్రమ జాబితా. • అక్రమ జాబితాలు
అక్రమ జాబితాంశములకు గుర్తులుగా చిహ్నాలు (పూర్ణ వృత్తం (filled circle), పూర్ణ చతురస్రం (filled square), ఖాళీ వృత్తం (unfilled circle) మొదలగునవి), చిత్రాలు కనపడతాయి.
వోర్డ్ ప్రోసెసింగ్ ప్రోగ్రాములలో వీటిని తూటాల జాబితాలు (bulleted lists) అని కూడా అంటారు. • క్రమ జాబితాలు
క్రమ జాబితాలకు గుర్తులుగా అక్షరాలు (ఇంగ్లీషు భాషలోని పెద్ద అక్షరాలు, చిన్నఅక్షరాలు), అంకెలు (అరబిక్, రోమన్ అంకెలు పెద్దవి/చిన్నవి) కనపడతాయి. జాబితా అంశాలకు గుర్తులుగా వుండే అక్షరాలు, సంఖ్యలు ఒక క్రమంలో ఏర్పరచబడి వుంటాయి (పై నుండి క్రిందకు). అన్నింటికంటే పైన అంశానికి మొదటి అంకె/అక్షరము, తరువాతి అంశమునకు తరువాతి అంకె/అక్షరము....
వోర్డ్ ప్రోసెసింగ్ ప్రోగ్రాములలో వీటిని సంఖ్యాత్మక జాబితాలు (numbered lists) అని కూడా అంటారు. ఇందులో జాబితా అంశాల క్రమాన్ని సూచించడానికి సంఖ్యలు వాడతాము. వోర్డ్ ప్రోసెసింగ్ ప్రోగ్రామ్ (మైక్రోసాఫ్ట్ వోర్డ్ ) లాంటి వాటిలో జాబితా గుర్తులకు చాలా ఐచ్ఛికలు కనపడతాయి కాని వెబ్ పుటలలో మనం వాడగలిగేవి కొన్ని మాత్రమే. బ్లాగర్.కామ్‌లో పోస్ట్ సృష్ఠించేటప్పుడు, జాబితాలు సృష్టించడానికి (కూర్పు విధానంలో) రెండే ఐచ్ఛికలు వుంటాయి.
మీకు HTML/CSS పరిజ్ఞానము వుంటే, జాబితాలు తయారు చేయడంలో యింకా ఎక్కువ ఎంపికలు అందుబాటులో వుంటాయి. |
జాబితాల సృష్ఠి, రూపకల్పన | |
బ్లాగర్‌లో (అక్షర ప్రదేశములో) పోస్ట్ కూర్పు విధానంలో జాబితాలను సృష్టించడానికి రెండు విధానాలు వున్నాయి. • ముందుగా జాబితా అంశాలన్నీ ముద్రించి.
మీరు ఎంచుకున్న పాఠం మొత్తం, జాబితా రూపంలో ఏర్పరచబడి కనబడుతుంది. చొప్పించబడ్డ/చేర్చబడ్డ HTML గుర్తులు కనపడాలంటే HTML విధానానికి మారండి.
• జాబితా లక్షణాన్ని ఎంచుకొన్న తదుపరి జాబితా అంశాలను ముద్రించడం
మీరు ఏ లక్షణం గల జాబితా కావాలనుకుంటారో ఎంచుకుని, తరువాత జాబితా అంశాలను ముద్రించడం ద్వారా కూడా జాబితాను తయారు చేయవచ్చు.
|
ఉల్లేఖన ఖండం (Block Quote) | |
ఒక వెబ్ పుటను (Web page) అనేక HTML అంశాల (Elements) తో నిర్మించబడ్డ, పెద్ద భాగం/వస్తువు (Object) గా అర్ధం చేసుకోవాలి. వెబ్ పుటలలో పరిచ్ఛేదములు (Paragraphs), పట్టికలు (Tables), ప్రతిమలు/చిత్రాలు (Images), అడ్డ గీతలు (Horizontal ruler) లాంటి మొదలగు అనేక అంశాలు వుంటాయి. వీటన్నింటి యొక్క సమూహమే వెబ్ పుట. వీటన్నింటిని HTML గుర్తులతో (Tags) నిర్వచిస్తాము. (ఉదా: <p> – పరిచ్ఛేదము; <table> – పట్టిక, <img> – చిత్రాలు మొదలైనవి). HTML గుర్తులను వాటి మధ్య వున్న పాఠంతో కలిపి HTML అంశాలు (Elements) అని అంటారు. వెబ్ పుటలో వుండే HTML అంశాలన్నీ వాటిని పుటలో బ్రౌసర్ ప్రదర్శన కొరకు సంభాళించే విధానం బట్టి పంక్తి స్ధాయి అంశాలు (Inline Elements), ఖండ స్ధాయి అంశాలు (Block level elements) గా వర్గీకరించబడ్డాయి. పంక్తి స్ధాయి అంశాలు అక్షర పాఠం మరియు యితర పంక్తి స్ధాయి అంశాలను కలిగి వుంటాయి. ప్రదర్శించబడేటప్పుడు సాధారణంగా పంక్తి స్ధాయి అంశాలు సరికొత్త పంక్తిలో మొదలవ్వడం కనపడదు. ఖండ స్ధాయి అంశాలు, పంక్తి స్ధాయి అంశాలను మరియు యితర ఖండ స్ధాయి అంశాలను కలిగి వుండవచ్చు. ప్రదర్శించబడేటప్పుడు యివి ఎప్పుడూ ఒక కొత్త పంక్తి నుండే మొదలవుతాయి. ఉల్లేఖన ఖండం పాఠాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడానికి వుపయోగించే ఒక HTML అంశము. ఉల్లేఖన ఖండం, ఖండ స్ధాయి అంశమయిన కారణంగా, అది పంక్తి స్ధాయి అంశాలు, యితర ఖండ స్ధాయి అంశాలను కలిగి వుండగలదు.
మీరు చేర్చిన పాఠంతో ఉల్లేఖన ఖండం చూడటానికి ఎలా వుంటుందో తెలుసుకోదలిస్తే, మీ బ్లాగ్‍లో ఒక పోస్టును ప్రచురించండి.
ప్రచురించబడ్డ పోస్టును ఎప్పుడయినా తెరిచి మీరు అవసరం అనుకున్న సవరణలు చేయవచ్చు. |
రూపలావణ్యం తొలగించడం | |
వెబ్ పుట (Web Page)లో పాఠానికి (అక్షరాలు, గుర్తులు, చిహ్నాలు మొదలైనవి) రూపలావణ్యం చేకూర్చడానికి HTML గుర్తులు Tags వాడతాము. కొంత పాఠానికి ఒక రూపలావణ్య ఐచ్ఛికము అనువర్తించబడి వుంది అంటే, ఆ పాఠానికి మొదలు, అంతాలలో ఆ రూపలావణ్యం చేకూర్చడానికి అవసరమైన/కారణమైన గుర్తులు వుంటాయి. కాబట్టి ఏదన్నా పాఠానికి రూపలావణ్యాన్ని తొలగించడం అంటే, ఆ పాఠానికి రూపలావణ్యం చేకూర్చడానికి కారణమైన/అవసరమైన HTML గుర్తులను Tags (ఆ పాఠం యొక్క మొదలు, అంతంలో వున్న వాటిని) తొలగించడమే.
• రూపలావణ్యం తొలగింపు సాధనం
అక్షర పాఠానికి రూపలావణ్యం తొలగించడానికి వుపయోగపడే సాధనం (Tool - Format eraser) కేవలం కూర్పు విధానం (Compose mode) లో మాత్రమే కనపడుతుంది. కొంత పాఠం యొక్క రూపలావణ్యం తొలగించడానికి, ఆ పాఠాన్ని ఎంచుకొని, సాధన పట్టి మీద ప్రతిమ బొత్తం రూపంలో వున్నRemove format from selection సాధనం మీద క్లిక్ చేయండి.
ఒక సాధనం పేరు, సాధనం పైన మౌస్ సూచికని వుంచినట్లయితే సాధన సూచికలో (Tool tip) ప్రదర్శించబడుతుంది.
బ్లాగర్ ప్రోగ్రామ్ మీరు రూపలావణ్యం తొలగించిన పాఠాన్ని సాధారణంగానూ, మిగతా పాఠాన్ని రూపలావణ్యం చేకూర్చబడినదానిగాను చూపడానికి అవసరమైన చోట HTML గుర్తులు (tags) చేరుస్తుంది.
పరిచ్ఛేదము (Paragraph) యొక్క రూపలావణ్యాన్ని తొలగించడానికి, మొత్తం పరిచ్ఛేదాన్ని ఎంచుకొని, రూపలావణ్య తొలగింపు సాధనాన్ని వుపయోగించండి. కొన్నిసార్లు మీరు పరిచ్ఛేదము యొక్క రూపలావణ్యం తొలగించడానికి చేసే ప్రయత్నం విఫలమైతే, రూపలావణ్యం తొలగించడానికి HTML విధానంలోకి మారి, పరిచ్ఛేదము మొదలు, అంతంలో, వున్న సంబంధిత HTML గుర్తులు (tags) తొలగించాల్సి వుంటుంది. • ఉపసంహరణ/తిరిగి చేయుట చేయలేము
రూపలావణ్య తొలగింపు సాధనంతో మీరు చేసే పనిని ఉపసంహరించడం (undo) కుదరదు. ఆ కారణంగా ఉపసంహరించిన దానిని తిరిగి చెయ్యడం (Redo) కూడా పనిచెయ్యదు. ఒకసారి తొలగించిన రూపలావణ్యాన్ని తిరిగి చేకూర్చాలంటే, కొత్త పాఠానికి రూపలావణ్యం చేకూర్చినట్లు చేకూర్చాల్సిందే.
• ప్రతిమల/చిత్రాల రూపలావణ్యం తొలగించడం
ప్రతిమలకు/చిత్రాలకు రూపలావణ్యం (అంచు, చిత్రం చుట్టూ ఎడం, మొదలైనవి) చేకూర్చడానికి కూడా HTML గుర్తులను (tags) వాడుతాము. అయితే చిత్రాలకు అనువర్తించబడ్డ రూపలావణ్యాన్ని మాత్రం రూపలావణ్య తొలగింపు సాధనంతో తొలగించడం సాధ్యపడదు.
ఒక వేళ మీరు కూర్పు విధానంలో చిత్రాన్ని ఎంచుకుని, ఈ రూప లావణ్య తొలగింపు సాధనాన్ని వినియోగిస్తే, అది పనిచేయదు. |
పోస్ట్ ప్రివ్యూ | |
మీ బ్లాగ్ పోస్ట్ యొక్క ప్రివ్యూ, ప్రచురించబడ్డ తరువాత అది ఎలా వుంటుంది అనడానికి ఖచ్ఛితమైన నకలు కాదు. ఇది మీకు కొంత అవగాహన కలుగ చేసుకోవడానికి పనికి వస్తుంది తప్పితే ఖచ్చితంగా పోస్ట్ ప్రచురణ తరువాత మీ బ్లాగ్‍లో ఎలా కనబడుతుందో అలాంటి రూపం కాదు. మీ బ్లాగ్‌కు వుపయోగించబడ్డ మాదిరి ఎమైన్నప్పటికి యిది తెలుపు నేపధ్యంతోనే చూపబడుతుంది.
ప్రివ్యూ నుండి మరల పోస్ట్‌ను కూర్చే అక్షర ప్రదేశానికి వెళ్ళడానికి Hide Preview లంకెను ఉపయోగించండి. ప్రివ్యూ, కూర్పు మద్య మారడానికి Ctrl + Shift + P కుంచిక ఫలక లఘిష్టము (key board shortcut) కూడా వుపయోగించవచ్చు.
• మీ బ్లాగ్‌కు వుపయోగిస్తున్న టెంప్లేట్‌ను గమనంలో వుంచుకోండి
పోస్ట్ పాఠాన్ని కూర్చే అక్షర ప్రదేశములో పాఠం తెలుపు నేపధ్యంలో ప్రదర్శించబడుతుంది. మీరు ఎంచుకున్న టంప్లేట్ వలన మీ బ్లాగ్‍లో నేపధ్యం వేరే రంగులో వుండవచ్చు. కాబట్టి మీరు చిహ్నాలకు రూపలావణ్య ఐచ్ఛికలను ఎంచుకునేటపప్పుడు అది మీ బ్లాగ్‍లో ఎలా చూపబడుతుంది అనేది గమనంలో పెట్టుకోవాలి.
ఖచ్ఛితమైన నిర్ధారణ కోసం, పోస్ట్‌ను ప్రచురించి, తదుపరి మీరు అవసరమనుకున్న మార్పులు చేర్పులు చేయడానికి దానిని తిరిగి సవరణకై (editing) తెరవండి. |
HTML/CSS | |
పోస్ట్ బ్లాగ్ యొక్క అంతర్భాగం. బ్లాగ్ ఒక వెబ్ పుట. కాబట్టి, పోస్ట్ వెబ్ పుటలో అంతర్భాగమవుతుంది. కాబట్టి పోస్ట్‌ను కూర్చడమంటే వెబ్ పుటలో కొంత భాగాన్ని కూర్చడమే. వెబ్ పుటలను సృష్టించడానికి, సవరించడానికి, రూప కల్పన చేయడానికి మీకు HTML మరియు CSS తెలియవలిసి వుంటుంది. HTML/CSS గనుక మీకు తెలిసినట్లైతే, మీ పోస్ట్ రూప కల్పనకు చాలా ఎక్కువ అవకాశాలు వుంటాయి. ఈ పుటలను మీరు వరుసగా చదవుకుంటూ పోతే, తదుపరి పుటలలో మీరు HTML, CSS అంటే ఏమిటి, కూర్పు విధానంలో పోస్ట్‌ను కూర్చినప్పుడు, చొప్పించబడిన HTML, CSS కోడ్‌ను ఎలా సవరించాలి లాంటి విషయాలు తెలుసుకోగలుగుతారు. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౧౨ (12) |